బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా పిలిచి.. చాలించి.. బుజ్జగించారు. టికెట్ ఇస్తామని కూడా చెప్పా రు. అయినా… ఆయన వినిపించుకోలేదు. రావడమైతే వచ్చారు. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదంటూ.. ఈ క్రమంలో చోటు చేసుకున్న హైడ్రామాకు తెర కూడా దించారు. కానీ, మనసు మాత్రం మార్చుకోలేక పోయారు. చివరకు తాను చేయాలని అనుకున్నదే చేస్తున్నారు. ఆయనే ఆరూరి రమేష్. బీఆర్ఎస్ నేత, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే. తాజాగా ఆయన బీజేపీలో …
Read More »పవన్ పిఠాపురం.. వర్మ వెటకారం
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికలలో తాను పోటీ చేస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించిన మరుక్షణమే మరో సంచలన ప్రకటన రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. అదే.. పిఠాపురం నియోజకవర్గం నుంచితాను కూడా పోటీ చేస్తున్నట్టు సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. “మీకో బ్రేకింగ్ న్యూస్.. నేను పిఠాపురం నుంచి పోటీ …
Read More »పవన్ పోటీ చేసేది ఇక్కడి నుంచే..అఫీషియల్
టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య పొత్తు కుదిరిన నేపథ్యంలో తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు తమ పార్టీ తరఫున పోటీ అభ్యర్థుల రెండో విడత జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించిన 21 సీట్లలో కేవలం ఐదుగురు అభ్యర్థుల పేర్లు మాత్రమే పవన్ కళ్యాణ్ ప్రకటించారు. దీంతో, మిగతా 16 మంది అభ్యర్థులు ఎవరు, పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు అన్న …
Read More »ఆ సీట్లపై కొనసాగుతున్న సస్పెన్స్!
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తాజాగా ప్రకటించిన రెండో అభ్యర్థుల జాబితాలో 34 స్థానాలను ప్రకటించారు. వీటిలో కొన్ని స్థానాలు.. కొన్నాళ్లుగా వివాదంలో ఉన్నవే. అయితే, వాటికి పరిష్కారం చూపించారు. ఉదాహరణకు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని ఎస్సీ నియోజకవర్గం గోపాలపురంలో యువ నాయుకుడు, మాదిగ వర్గానికి చెందిన మద్దిపాటి వెంకట రాజును ఇంచార్జ్‌గా నియమించారు. కానీ, ఆయనకు వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ధ్వజమెత్తారు. తనకే టికెట్ …
Read More »టీడీపీలో చేరిన వైసీపీ బీసీ ఎంపీ!
వైసీపీ కీలక నాయకుడు, బీసీ సామాజిక వర్గానికి చెందిన కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ తాజాగా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. చంద్రబాబు సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. అయితే, ఈయనకు మరలా క ర్నూలు ఎంపీ సీటునే ఇస్తారా? లేక వేరే ఏదైనా ఇస్తారా? అనేది తేలాల్సి ఉంది. వైసీపీలో 2019లో కర్నూలు నుంచివిజయం దక్కించుకున్న సంజీవ్‌కుమార్ సౌమ్యుడిగా ముద్రపడ్డారు. ఉన్నత విద్యావంతుడు, నిగర్వి కూడా కావడంతో ప్రజలకు ఆయనంటే …
Read More »తెరపైకి మూడో సమన్వయకర్త ?
ముచ్చటగా మూడో అభ్యర్థి పేరు పరిశీలనలో ఉందట. విషయం ఏమిటంటే గుంటూరు పార్లమెంట్ సీటును గెలుచుకోవాలన్నది జగన్మోహన్ రెడ్డి టార్గెట్. గడచిన రెండు ఎన్నికల్లో ఎంత ప్రయత్నించినా సీటులో గెలుపు తృటిలో తప్పిపోయింది. రెండుసార్లు కూడా టీడీపీ నేత గల్లా జయదేవే గెలిచారు. రాబోయే ఎన్నికల్లో జయదేవ్ పోటీచేయటం లేదు. అందుకనే టీడీపీ కొత్త అభ్యర్థి కోసం వెతుకుతోంది. ఇదే సమయంలో ఈ సీటులో గెలిచేందుకు జగన్ ఇప్పటికి ఇద్దరు …
Read More »ఇంతకీ భీమవరంలో పోటీచేసేదెవరు ?
ఇపుడిదే అంశంపై జనసేనలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ఈ చర్చకు ప్రధాన కారణం ఎవరంటే జనసేన అధినేత పవన్ కల్యాణ్ అనే చెప్పాలి. రాబోయే ఎన్నికల్లో భీమవరంలో పోటీచేయబోయేది పవనే అని పార్టీ నేతలు లీకులిచ్చారు. సర్వేలు చేయించుకుంటున్నారంటు ఊదరగొట్టారు. తీరాచూస్తే సీన్ అంతా మారిపోయింది. దీనికి కారణం ఏమిటంటే జనసేనలో చేరిన టీడీపీ మాజీ ఎంఎల్ఏ పులపర్తి రామాంజనేయులనే చెప్పాలి. పవన్ స్వయంగా మాజీ ఎంఎల్ఏ ఇంటికి వెళ్ళి …
Read More »వైఎస్ షర్మిల మౌనం దేనికి సంకేతం.?
ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లోకి అనూహ్యంగా దూసుకొచ్చారు వైఎస్ షర్మిల. వస్తూనే, ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ విభాగం అధ్యక్షురాలిగా అవకాశమూ దక్కించుకున్నారు. అంతకు ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి స్టార్ క్యాంపెయినర్‌గా ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో పని చేశారామె. ఓ దశలో వైసీపీ తెలంగాణ పగ్గాలు ఆమె చేపడతారనే ప్రచారమూ జరిగింది. అయితే, తెలంగాణలో వైసీపీ జెండా పీకేసిన తర్వాత.. కాస్త గ్యాప్ తీసుకుని, తెలంగాణలో కొత్త జెండా, ఎజెండాతో కొత్త …
Read More »జనసేన – టీడీపీ అర్థం చేసుకునే టైం ఇది!
అవును.. ఇది అర్ధం చేసుకోవాల్సిన సమయం..!- ఒక్క జనసేన మాత్రమే కాదు.. టీడీపీ నేతలే కాదు.. రాష్ట్ర ప్రజలు కూడా! ఒకవైపు వైసీపీ, మరోవైపు టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి. ఈ రెండింటి మధ్యే ఎన్నికలు జరగనున్నాయి. అయితే.. ఒక్కడిని చేసి జగన్‌పై ఇంత మంది యుద్ధం ప్రకటించారంటూ.. వైసీపీ నుంచి సహజంగానే సెంటిమెంటుతో కూడిన కామెంట్లు వస్తున్నాయి. ఇక, ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు ఒంటరిగా రాలేకపోతున్నారంటూ విమర్శలూ కామన్‌గానే వినిపిస్తున్నాయి. …
Read More »15 మంది జనసేన అభ్యర్థులు ఖరారు
పొత్తులో భాగంగా జనసేన పోటీ చేస్తానని భావించిన 24 స్థానాలకు 21 స్థానాలకు కుదించుకోవటం తెలిసిందే. ఇందులో అధికారికంగా ఆరు స్థానాలకు చెందిన అభ్యర్థుల పేర్లను ప్రకటించటం తెలిసిందే. బుధవారం రాత్రి వేళలో మరో తొమ్మిది మంది అభ్యర్థులకు పచ్చజెండా ఊపుతూ నిర్ణయం తీసుకున్నారు. అభ్యర్థులను వ్యక్తిగతంగా పిలిపించుకున్న జనసేనాని పవన్ కల్యాణ్.. అభ్యర్థులుగా ఖరారు చేసిన వారితో ప్రత్యేకంగా మాట్లాడి.. ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించాలన్న విషయాన్ని చెప్పి …
Read More »జేజమ్మకు జై!.. బీజేపీ తాజా లిస్ట్‌లో చోటు!
గద్వాల్ జేజమ్మగా పేరొందిన మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ నాయకురాలు డీకే అరుణకు బీజేపీ అధిష్టానం టికెట్ ఇచ్చింది. తాజాగా విడుదల చేసిన జాబితాలో ఆమెను మహబూబ్‌నగర్ స్థానం నుంచి ఎంపిక చేసింది. ఆమె ఇక్కడ నుంచి పోటీ చేయనున్నారు. ఇక, ఈమెతోపాటు మరో ఆరుగురికి కూడా కమల నాథులు టికెట్లు కేటాయించారు. వీరిలో మెదక్ స్థానానికి ఎం. రఘునందన్ రావు, ఎస్టీ నియోజకవర్గమైన ఆదిలాబాద్ నుంచి గోదామ్ నాగేశ్, …
Read More »ఈ ముగ్గురిలో ఎవరికి వస్తాదో
మూడు పార్టీల కూటమి మధ్య కొన్ని సీట్లలో పంచాయితీలు పెరిగిపోతున్నాయి. సీట్ల సర్దుబాటులో ఏ పార్టీ ఎన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయాలో డిసైడ్ అయ్యింది. అలాగే మూడు పార్టీలు పోటీ చేయబోయే నియోజకవర్గాలు కూడా చాలావరకు నిర్ణయమైపోయాయి. కొన్ని నియోజకవర్గాల విషయంలో మూడు పార్టీల మధ్య పంచాయితి నడుస్తోంది. ఆ జాబితా అధినేతల దగ్గరే ఉన్న కారణంగా పార్టీ నేతలకు చేరలేదు. అయితే లీకుల రూపంలో సీట్ల వివరాలు బయటకు …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates