Political News

వైసీపీ స‌ర్కారుకు షాక్‌: ఇన్‌సైడర్ ట్రేడింగ్ తూచ్.. కేసు కొట్టేసిన హైకోర్ట్‌

రాష్ట్ర ప్ర‌భుత్వం భారీ ఎత్తున ప్ర‌చారం చేసిన రాజ‌ధాని భూముల ఇన్‌సైడెర్ ట్రేడింగ్ తూచ్ యేనా? ఈ ఆరోప‌ణ‌లు కేవ‌లం రాజ‌కీయ‌మేనా? ముఖ్య‌మంత్రి నుంచి మంత్రుల వ‌ర‌కు, ఎంపీల నుంచి ఎమ్మెల్యేల వ‌రకు చేసిన ఆరోప‌ణ‌లన్నీ డొల్లేనా? అన్నీ నిరాధారాలేనా? అంటే.. తాజా ప‌రిణామాలు ఔన‌నే అంటున్నా యి. ప్ర‌పంచంలో అతి పెద్ద‌న‌గ‌రంగా. అత్యంత ప్ర‌భావిత‌మైన రాజ‌ధానిగా ఉంటుంద‌ని భావించి గ‌త ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు దూర‌దృష్టితో నిర్ణ‌యించి.. శంకుస్థాప‌న చేసిన …

Read More »

మమత వ్యూహాత్మక నిర్ణయం..నందిగ్రామ్ లో టెన్షన్

పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ తీసుకున్న ఓ నిర్ణయం సంలచనంగా మారింది. తొందరలోనే జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేయాలని మమత నిర్ణయించారు. ఇపుడు సీఎం జాదవ్ పూర్ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నందిగ్రామ్ నుండి తాను పోటీ చేయబోతున్నట్లు మమత చేసిన ప్రకటన రాజకీయాల్లో ఓ రకంగా సంచలనంగా మారిందనే చెప్పాలి. మమత నిర్ణయం సంచలనం ఎందుకంటే ఉద్యమాలకు నందిగ్రామ్ పుట్టిల్లులాంటిది. వామపక్ష …

Read More »

సంచ‌ల‌నం రేపుతున్న జ‌నసైనికుడి ఆత్మ‌హ‌త్య‌

ప్ర‌కాశం జిల్లా గిద్ద‌లూరులో బండ్ల వెంగ‌య్య నాయుడు అనే జ‌న‌సేన కార్య‌క‌ర్త అనుమానాస్ప‌ద స్థితిలో మృతి చెంద‌డం సంచ‌ల‌నం రేపుతోంది. ఈ యువ‌కుడు మూడు రోజుల కింద‌టే వార్త‌ల్లో నిలిచాడు. త‌మ నియోజ‌క‌వ‌ర్గ వైకాపా ఎమ్మెల్యే వెంక‌ట రాంబాబును గ్రామంలోని ఓ స‌మ‌స్య మీద నిల‌దీసిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. త‌మ ఊరిలో పారిశుద్ధ్య స‌మ‌స్య తీవ్రంగా ఉంద‌ని.. రోడ్ల మీద నీళ్లు నిలుస్తున్నాయ‌ని.. రోడ్డు వేయ‌మ‌ని …

Read More »

షాకింగ్‌: భార‌త భూభాగంలో చైనా గ్రామం

చైనా దౌర్జ‌న్యాల‌కు, దురాక్ర‌మ‌ణ‌ల‌కు ఇది మ‌రో నిద‌ర్శ‌నం. స‌రిహ‌ద్దు వెంబ‌డి ఏదో ఒక నీతి మాలిన ప‌ని చేస్తూ భార‌త్‌ను నిరంత‌రం క‌వ్విస్తూ ఉండే డ్రాగన్ కంట్రీ.. మ‌రోసారి త‌న కుటిల బుద్ధిని బ‌య‌ట‌పెట్టుకుంది. భార‌త భూభాగంలో ఆ దేశం ఏకంగా ఒక గ్రామాన్నే నిర్మించి మ‌న దేశానికి స‌వాలు విసిరింది. అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్ర భూభాగం త‌మ‌దే అని వాదించే చైనా.. తాజాగా అక్క‌డ‌ ఓ గ్రామాన్నే నిర్మించిన‌ట్లు …

Read More »

వెన్నుపోటులో చంద్రబాబుకు ‘ప్రపంచ రత్న’ ఇవ్వాలి: కొడాలి నాని

ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని విమర్శలు గుప్పించారు. సాధారణ కుటుంబంలో పుట్టి ఉన్నత స్థానానికి చేరుకున్న మహా వ్యక్తి నందమూరి తారక రామారావు అని ఏపీ మంత్రి కొడాలి నాని కొనియాడారు. ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా ఆయనకు తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘన నివాళి అర్పించిన నాని…చంద్రబాబును వెన్నుపోటుదారుడు, కుట్రదారుడు అని తీవ్రంగా విమర్శించారు. పిల్లనిచ్చిన మామను మెడపట్టి గెంటేసి పార్టీని …

Read More »

‘అన్న’కు మూడు తరాల నివాళి

జనవరి 18.. తెలుగవారు మరిచిపోలేని తేదీ. నటుడిగా, రాజకీయ నాయకుడిగా ఎనలేని పేరు ప్రఖ్యాతులు సంపాదించి.. తెలుగువారి ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన నందమూరి తారక రామారావు మరణించిన రోజిది. ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్లి అప్పుడే 25 ఏళ్లు అయిపోయింది. ఈ సందర్భంగా తెలుగు వారంతా ఆయన్ని తలుచుకుంటున్నారు. నివాళి అర్పిస్తున్నారు. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ కూడా 25వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తోంది. …

Read More »

మౌనికా రెడ్డి నోరు ఎందుకని లేవటం లేదు ?

‘ఆడపిల్లని అని కూడా చూడకుండా దారుణంగా అరెస్టు చేశారు.. తెలంగాణా, ఏపి ప్రభుత్వాలు తమపై కుట్రచేసి కేసుల్లో ఇరుకిస్తున్నాయి..ఒక టెర్రరిస్టును అరెస్టు చేసినట్లుగా మా అక్కను అరెస్టు చేశారు పోలీసులు’ … ఇది మాజీమంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియ అరెస్టు అయినపుడు ఆమె సోదరి భూమా మౌనికారెడ్డి చేసిన గోల. తన అక్క అరెస్టుకు వ్యతిరేకంగా మూడు రోజుల పాటు మౌనిక నానా రచ్చ చేసింది మీడియాలో. తల్లి, …

Read More »

భావోద్వేగాలు రెచ్చగొట్టడమే వ్యూహమా ?

రాజకీయాల్లోకి మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టడమే టార్గెట్ గా బీజేపీ పావులు కదుపుతున్నట్లు అనుమానంగా ఉంది. ఫిబ్రవరి 4వ తేదీ నుండి వారంరోజుల పాటు కపిలతీర్ధం టు రామతీర్ధం యాత్ర వివరాలను చూసిన తర్వాత అందరికీ ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులను హైందవమతానికి వ్యతిరేకంగా జరుగుతున్న దాడులుగా గమనించాలని కమలంపార్టీ అధ్యక్షుడు సోమువీర్రాజు ప్రకటించారు. విశాఖపట్నంకు సమీపాన ఉన్న రుషికొండలో పార్టీ ముఖ్యనేతల సమావేశం జరిగింది. ఈ …

Read More »

బైడెన్ ప్రమాణం : పెరిగిపోతున్న టెన్షన్

అగ్రరాజ్యం అమెరికా 46వ అధ్యక్షునిగా జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్న తేదీ దగ్గర పడుతున్న కొద్దీ వాషింగ్టన్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఈనెల 20వ తేదీన బైడెన్ వైట్ హౌస్ లో ప్రమాణస్వీకారం చేయబోతున్న విషయం అందరికి తెలిసిందే. సుమారు 10 రోజుల క్రితం అమెరికా పార్లమెంటు క్యాపిటల్ బిల్డింగ్ పై కొన్ని వందలమంది ఒక్కసారిగా దాడులు చేసిన బీభత్సం అందరికీ తెలిసిందే. తర్వాత వారిలో అత్యధికులను అవుట్ గోయింగ్ …

Read More »

కన్నీళ్లు పెట్టుకున్న టీ మంత్రి.. వారిద్దరిని దత్తత తీసుకుంటారట

తెలంగాణ రాష్ట్ర గిరిజన.. మహిళా శిశు సంక్షేమ మంత్రి సత్యవతి రాథోడ్ తీసుకున్న నిర్ణయాన్ని పలువురు అభినందిస్తున్నారు. మానత్వంతో ఆమె స్పందించిన తీరుతో అందరి మనసుల్ని దోచేస్తున్నారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో డోర్నకల్ కు చెందిన 28 ఏళ్ల రషీద్ పాషా మరణించటం తెలిసిందే. దీంతో.. పాషా ఇద్దరు కుమార్తెలు అనాథలైనట్లుగా తెలుసుకున్న మంత్రి.. ఆదివారం డోర్నకల్ కు వచ్చారు. వారి ఇద్దరు పిల్లల్ని అక్కున చేర్చుకున్నారు. తానురాష్ట్రానికి …

Read More »

ఐఏఎస్, ఐపీఎస్‌ల‌పై జ‌గ‌న్ మార్కు దూకుడు.. ఏం జ‌రుగుతుంది!

ఇటీవ‌ల జ‌రిగిన ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. జ‌గ‌న్ స‌ర్కారుకు ఉద్యోగులు అంద‌రూ సానుకూలంగా ఉన్న ప‌రిస్థితి క‌ళ్ల‌కు క‌ట్టింది. నిజానికి ఒక‌ప్పుడు ఉద్యోగుల‌కు, ప్ర‌భుత్వాల‌కు మ‌ధ్య స‌యోధ్య ఉండేది కాదు. త‌మ హక్కుల విష‌యంలో ప్ర‌భుత్వం ఉదాశీనంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌నే వాద‌న ఉద్యోగ వర్గాల్లో ప్ర‌ముఖంగా క‌నిపించేది. చంద్ర‌బాబు గ‌త పాల‌న‌ను తీసుకుంటే.. త‌మ‌పై భారం మోపేశారంటూ.. కొన్ని ఉద్యోగ సంఘాలు భారీగానే గ‌ళం వినిపించాయి. నిజానికి రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత‌.. ఉద్యోగుల‌కు …

Read More »

మొత్తం కుటుంబం అంతా ఇన్వాల్వయ్యిందా ?

బోయినపల్లి కిడ్నాప్ గా సంచలనం సృష్టించిన ముగ్గురు సోదరుల కిడ్నాప్ ఘటనలో మాజీమంత్రి , టీడీపీ నేత భూమా అఖిలప్రియ అత్తగారి కుటుంబం మొత్తం ఇన్వాల్వయినట్లు పోలీసులు నిర్ధారించారు. ముగ్గురు సోదరుల కిడ్నాప్ కు ముందు భూమా అఖిలప్రియ, ఆమ భర్త భార్గవరామ్, మరిది చంద్రహాస్, అత్తగారు కిరణ్మయి, మామగారు మురళిని నిందితులుగా పోలీసులు ఎఫ్ఐఆర్ లో చేర్చటం సంచలనంగా మారింది. ఓ కిడ్నాప్ ఘటనలో మొత్తం కుటుంబం కుటుంబమంతా …

Read More »