ప్రతిపక్షంలో ఉండగా.. అధికార పార్టీ మీద నిందలు మోపడం.. ప్రతి విషయాన్నీ రాజకీయంగా మార్చడం.. బాగానే ఉంటుంది. కానీ అధికారంలోకి వచ్చాక కూడా అదే ఒరవడిని కొనసాగిస్తే చూసే జనాల్లోకి వేరే సంకేతాలు వెళ్తాయి. అధికారంలో ఉన్న వాళ్లు ఏం సాధించారా అని చూస్తారే తప్ప.. నిత్యం ప్రతిపక్షాన్ని టార్గెట్ చేస్తూ వాళ్లను ఏడిపించుకు తింటుంటే.. వాళ్లను ఇబ్బంది పెడుతుంటే.. వారి మీద బురదజల్లుతుంటే.. సున్నితమైన విషయాల మీద వివాదాలు …
Read More »ఫస్ట్ టైం.. మోడీకి షాక్.. ఏం జరిగిందంటే!
ప్రధాని నరేంద్ర మోడీ అంటే.. దేశానికి అధినేత. ఆయన ఎక్కడకు వెళ్లినా రెడ్ కార్పెట్ స్వాగతాలు.. శుభాకాంక్షలు.. అభినందనలు .. ఆయన దర్శనం అయితే చాలు.. అనుకునే నాయకులు అబ్బో.. అనిపించే అతిథి మర్యాదలు. ఇక, ఆయన కోరితే అనుమతు లేం ఖర్మ ఏపీ వంటి రాష్ట్రాల్లో అయితే.. రాజ్యసభ టికెట్లు, ఆయన మిత్రులకు పోర్టులు, కార్పెట్లు వగైరా వగైనా ఇచ్చేస్తున్న పరిస్థితి తెలిసిందే. అయితే.. తొలిసారి నరేంద్ర మోడీని …
Read More »గెలిచిన గల్లా.. ఏపీ నిర్ణయంపై సుప్రీం కోర్టు స్టే
టీడీపీ ఎంపీ, ప్రముఖ పారిశ్రామిక వేత్త గల్లా జయదేవ్ న్యాయ పోరాటంలో ఒకింత తెరిపిన పడ్డారు. చిత్తూరు శివారులోని గల్లా కుటుంబానికి చెందిన అమరరాజా బ్యాటరీస్ కంపెనీని మూసివేయాలంటూ.. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన నోటీసులను సుప్రీం కోర్టు పక్కన పెట్టింది. సదరు నోటీసులపై స్టే విధించింది. ఏపీ పీసీబీ షోకాజ్ నోటీసులపై గతంలో ఇచ్చిన స్టే ఎత్తేసిన సుప్రీంకోర్టు.. కంపెనీ మూసివేతపై హైకోర్టు స్టే ఆర్డర్ కొనసాగుతుందని స్పష్టం చేసింది. …
Read More »గన్నవరం టీడీపీ కార్యాలయంపై వైసీపీ దాడి!
ఉమ్మడి కృష్ణాజిల్లాలోని గన్నవరం నియోజకవర్గంలో రాజకీయ కక్షలు శ్రుతి మించాయి. టీడీపీ కార్యాలయంపై వైసీపీ నేతలు, కార్యకర్తలు విరుచుకుపడ్డారు. చేతికి అందిన రాళ్లతో దాడులకు పాల్పడ్డారు. దీంతో గన్నవరం నియోజకవర్గంలోని టీడీపీ కార్యాలయానికి ఉన్న అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇంతటితో కూడా ఊరుకోని కార్యకర్తలు.. కార్యాలయంలో పార్కింగ్ చేసిన రెండు కార్లు, నాలుగు బైకులకు కూడా నిప్పు పెట్టారు. అదేసమయంలో కార్యాలయంలో ఎవరైనా ఉన్నారేమో.. అనిలోపలకు చొచ్చుకు వెళ్తే ప్రయత్నం …
Read More »ఆ నియోజకవర్గాన్నిటీడీపీ రాసిపెట్టుకోవచ్చు
రాష్ట్రంలోని ఎస్టీ నియోజకవర్గాల్లో కీలకమైంది.. పోలవరం. మొత్తం 7 ఎస్టీ నియోజకవర్గాలు ఉంటే.. వాటిలో దేనికీ లేని డిమాండ్ పోలవరం నియోజకవర్గానికి ఉంది. దీనికి కారణం.. కీలకమైన పోలవరం ప్రాజెక్టు నిర్మా ణం.. నిత్యం మీడియాలో ఉండే అవకాశం.. అదేసమయంలో కేంద్రం నుంచి అందుతున్న నిధులు. కారణం ఏదైనా.. పోలవరం నియోజకవర్గం డిమాండే వేరు. అధికారంలో ఉన్న పార్టీ కూడా ఇక్కడ గెలుపు గుర్రం ఎక్కాలని భావిస్తుంది. ఇక, ఇప్పుడు …
Read More »అలీ ఉబలాటం బాగున్నా.. నిలిచి గెలిచే సత్తా ఎంత?!
సినీ నటుడు, ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు మహ్మద్ అలీకి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని .. గెలుపు గుర్రం ఎక్కి.. చట్ట సభల్లోకి ప్రవేశించాలని..చాలా ఉబలాటంగా ఉంది. దీనికి సంబంధించి ఖర్చు చేసేందుకు ఆయన ఏకంగా 10 కోట్ల రూపాయలు కూడా రెడీ చేసుకున్నట్టు ఆయనకు అనుకూలంగా ఉన్న వైసీపీ నాయకులు చెబుతున్నారు. కానీ, అలీ గెలుపు ఈజీనా? అంటే.. కాదనే సంకేతాలు వస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీ …
Read More »వంశీకి అన్ని వైపులా సమస్యలేనా..
గన్నవరం ఎమ్మెల్యేల వల్లభనేని వంశీ తన రాజకీయ జీవితంలో ఎన్నడూ ఎదుర్కోని సమస్యలను ఎదుర్కొంటున్నారు. స్వపక్షం వైసీపీలోనూ, వివక్షం టీడీపీలోనూ నేతలు వంశీపై దుమ్మెత్తి పోస్తున్నారు. నువ్వెంత, నీ బతుకెంత అన్నట్లుగా ప్రత్యర్థులు డైలాగ్స్ విసరడంతో వంశీ ఉక్కిరిబిక్కిరవుతున్నారు… వంశీ వైసీపీలో చేరినప్పటి నుంచి ఆధికార పార్టీలో ఒక వర్గం ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ప్రకటనలు ఇస్తోంది. జగన్ మోహన్ రెడ్డి పిలిస్తేనే వైసీపీలోకి వచ్చారని, ఆయన ఆదేశం మేరకే …
Read More »ఇప్పుడు ఓపీ షీట్ల మీదా జగన్?
రాజకీయాలన్న తర్వాత ప్రచారం కీలకం. కానీ.. అదే ఒక ధోరణిగా మారకూడదు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విషయంలో ఇలాంటి తీరు పీక్స్ కు చేరుకుంది. మొదట ప్రభుత్వ కార్యాలయాలకు.. సర్కారీ స్కూళ్లకు పార్టీ జెండా రంగుల్ని అద్దేసి వివాదానికి తెర తీసిన ఆయన.. ఈ మధ్యన ఇళ్లకు స్టిక్కర్లు అంటించటం వరకు దాన్ని తీసుకెళ్లారు. సర్లే అనుకుంటున్న వేళ.. మొబైల్ ఫోన్లకు స్టిక్కర్లు అతికించాలన్న ఏపీ అధికారుల …
Read More »టీడీపీలో మనసు.. వైసీపీలో మనుషులు.. జంపింగ్ ఖాయం!
కొందరు నేతలు.. గత 2019 ఎన్నికలు ముగిసిన తర్వాత.. వివిధ కారణాలతో టీడీపీని విడిచి పెట్టి వైసీపీ లోకి చేరిపోయారు. గతంలో వీరిపై ఉన్న కేసులు కావొచ్చు.. ఆర్థిక పరమైన కారణాలు కావొచ్చు. ఏవైనా కూడా అప్పట్లో బలంగా ప్రభావం చూపించాయి. దీంతో వారంతా కూడా పార్టీ మారిపోయి.. వైసీపీకి జై కొట్టారు. ఇలాంటివారిలో చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, దర్శి మాజీ ఎమ్మెల్యే కమ్ మాజీ మంత్రి శిద్దా …
Read More »కైకలూరు టికెట్‌కు టీడీపీ నేత రెడీ..!
ఉమ్మడి కృష్ణా జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం కైకలూరు. ఇటీవల కాలంలో ఈ నియోజకవర్గం రాజకీయంగా ప్రచారంలోకి వచ్చింది. దీనికి కారణం.. ఇక్కడ టీడీపీ ఇంచార్జ్‌గా ఉన్న జయమంగళ వెంకటరమణ అనూహ్యంగా వైసీపీలోకి జంప్ చేశారు. వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ ఇస్తారో లేదో .. అనే సందేహంతోనే తాను పార్టీ మారినట్టు ఆయన చెప్పారు. ఇక, ఈ పరిణామంతో టీడీపీకి ఇక్కడ నాయకుడు అవసరమయ్యారు. ఈ క్రమంలోనే కీలక నేత …
Read More »నోటి దూల – సీరియస్ చిక్కుల్లో పడిన ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి జాతీయ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో కమిషన్ దీన్ని తీవ్రంగా పరిగణించింది. ఈ వ్యవహారాన్ని సుమోటోగా తీసుకుని కౌశిక్ రెడ్డిని విచారణకు రావాలని ఆదేశించింది. దిల్లీలోని జాతీయ కమిషన్ కార్యాలయానికి వ్యక్తిగతంగా హాజరు కావాలని.. ఫిబ్రవరి 21న వచ్చి స్వయంగా వివరణ ఇవ్వాలని చెప్పింది. విచారణకు హాజరు కాకపోతే తీవ్ర చర్యలు …
Read More »సీఎస్‌నే తిడతా.. నువ్వెంత?
తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకుల దూకుడుకు అడ్డుకట్టే ఉండడం లేదు. అధికారులంటే వారికి లెక్కే ఉండడం లేదు. అధికార పార్టీ ఎమ్మెల్యేలకు చాలామంది దాసోహం అంటుండడంతో ప్రతి అధికారీ అలాగే ఉండాలని నేతలు కోరుకుంటున్నారు. కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలెక్టర్లతో వివాదాలు పెట్టుకోగా.. మరికొందు ఎమ్మెల్యేలు టోల్ గేట్ సిబ్బందిపైనా చేయిచేసుకున్న ఉదంతాలున్నాయి. తాజాగా అచ్చంపేట ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత గువ్వల బాలరాజు దేవాదాయ శాఖకు చెందని ఓ అధికారిని …
Read More »