Political News

కవిత హడావుడి.. ఫోన్లన్నీ తీసుకొచ్చి మీడియా ముందు ప్రదర్శన

కల్వకుంట్ల కవిత ఈడీ విచారణకు హాజరయ్యే ముందు తాను గతంలో వాడిన ఫోన్లను మీడియాకు చూపించారు. ఈడీ ఆరోపించినట్టు తాను ఫోన్లు ధ్వంసం చేయలేదంటూ మీడియా ముందు ఆ ఫోన్లను ప్రదర్శించారు. ఈడీ కార్యాలయంలో విచారణకు వెళ్లే ముందు కార్యాలయం బయట కారులోంచి బయటకు నిల్చున్న ఆమె రెండు పాలిథీన్ కవర్లలో తన పాత ఫోన్లన్నీ ఉంచి వాటిని చూపించారు. వీటిని తాను ధ్వంసం చేసినట్లు ఈడీ ఆరోపిస్తోంది… కానీ, …

Read More »

తెలంగాణా ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్

తెలంగాణా ప్రభుత్వానికి సుప్రింకోర్టు పెద్ద షాకిచ్చింది. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన పదిబిల్లుల పై సంతకాలు చేయకుండా గవర్నర్ తన వద్దే ఫైళ్ళన్నింటినీ ఉంచేసుకున్నారనే ఆరోపణతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సుప్రింకోర్టులో ఒక కేసు వేశారు. పదిబిల్లులపై సంతకాలు పెట్టి వెంటనే ఆమోదం తెలిపేట్లుగా గవర్నర్ ను ఆమోదించాలని చీఫ్ సెక్రటరీ తన పిటిషన్లో సుప్రీంకోర్టును రిక్వెస్ట్ చేశారు. అయితే కేసును విచారించిన సుప్రింకోర్టు అలా ఆదేశాలు ఇవ్వటం కుదరదని స్పష్టంగా …

Read More »

కవిత ఇప్పుడు నేషనల్ ఫిగర్..

kavitha

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత మూడో సారి విచారణకు హాజరయ్యారు. వరుసగా రెండో రోజున ఆమె ఈడీ కార్యాలయానికి వెళ్లారు. ఇంటి నుంచి బయలుదేరే ముందు , ఈడీ కార్యాలయం లోపలికి వెళ్తున్నప్పుడు ఆమె ప్లాస్టిక్ కవర్లో ఉంచిన ఫోన్లను మీడియాకు చూపించారు. రెండో చేతుల్లోని రెండు కవర్లలో ఫోన్లు ఉండగా నవ్వుతూ వాటిని ఆమె మీడియాకు చూపించారు. కవిత వెంట భర్త అనిల్ కూడా ఈడీ కార్యాలయం వరకు …

Read More »

బాబు నోటి నుంచి 1984 సంక్షోభంపై కీలక వ్యాఖ్యలు

టీడీపీ ఎమ్మెల్యేలపై ఏపీ అసెంబ్లీలో దాడి జరిగిన ఉదంతంపై పార్టీ అధినేత చంద్రబాబు స్పందించారు. గతంలో ఎప్పుడు.. ఎలాంటి సందర్భంలోనూ ఆయన నోటి నుంచి బయటకు రాని 1984 ఆగస్టు సంక్షోభం ప్రస్తావన తాజాగా బయటకు వచ్చింది. తమ ఎమ్మెల్యేలపై నిండు సభలో దాడి చేయటమే కాదు.. అనంతరం సిగ్గు లేకుండా సభ నుంచి సస్పెండ్ చేస్తారా? అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తన …

Read More »

పార్టనర్స్ ఇన్ క్రైమ్

ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత రాజకీయ వాతావరణమే మారిపోయింది. తెలుగుదేశం పార్టీ దూకుడు పెంచింది. జగన్ సర్కారుపై ఆరోపణాస్త్రాలు సంధిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పుడు కొత్త వ్యూహాలతో ముందుకెళ్తున్నారు. ఈ నెల 25 నుంచి జనంలోకి వెళ్లేందుకు కొత్త కార్యక్రమం సిద్ధం చేస్తున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయాన్ని ప్రస్తావిస్తూ.. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపిస్తే ఏం చేయబోతున్నామో వివరిస్తారు… జగన్మోహన్ రెడ్డి ఒక నేరగాడని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. అందరినీ …

Read More »

కౌశిక్ రెడ్డి: కేసీఆర్ వెనకేసుకొచ్చినా కార్యకర్తలు వెంట రాలేదు

బీఆర్ఎస్‌లో పాడి కౌశిక్ రెడ్డి పరిస్థితి అధిష్టానానికి దగ్గర, నియోజకవర్గానికి దూరం అన్నట్లుగా ఉంది. ఈటల రాజేందర్ బీఆర్ఎస్‌ను వీడడంతో హుజూరాబాద్ ఉప ఎన్నికలలో ఎలాగైనా ఈటలను ఓడించాలన్న లక్ష్యంతో కేసీఆర్ పాడి కౌశిక్ రెడ్డిని కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లోకి తీసుకొచ్చారు. ఆయనకు హుజూరాబాద్ టికెట్ ఇవ్వనప్పటికీ ఎమ్మెల్సీని చేశారు. దాంతో ఎమ్మెల్యేగా గెలవలేని కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. కేసీఆర్ తనను అసెంబ్లీలో అడుగుపెట్టిందచినందుకు కృతజ్ఞతగా ఆయన …

Read More »

యువగళం: ఒక్క పాదయాత్ర వేల ప్రశ్నలకు సమాధానం

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తాను చేపట్టిన పాదయాత్రతో తానేంటో నిరూపించుకున్నారా అంటే అవుననే అంటున్నారు పరిశీలకులు. ముఖ్యంగా లోకేశ్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఆయన ఎదుర్కొన్న అన్ని రకాల విమర్శలకు ఈ పాదయాత్రతో సమాధానం చెప్పారనే అంటున్నారు. లోకేశ్ విషయంలో రాజకీయ ప్రత్యర్థులు నిర్దయగా బాడీ షేమింగ్ చేసిన సందర్భాలు, ఆయన భాషను ఎగతాళి చేసిన సందర్భాలు, ఆయన మానసిక పరిణతిని ప్రశ్నించిన సందర్భాలు కోకొల్లలు. …

Read More »

వ‌చ్చేది సునామీ.. వైసీపీ అడ్ర‌స్ గ‌ల్లంతే: చంద్ర‌బాబు

ఏపీ అధికార పార్టీ వైసీపీపై టీడీపీ అధినేత చంద్ర‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం వ‌చ్చిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక‌లు ఒక చిన్న గాలి వాన మాత్ర‌మేన‌ని, కానీ, రాబోయే ఎన్నిక‌ల్లో మాత్రం సునామీ త‌ప్ప‌ద‌ని.. అప్పుడు వైసీపీ అడ్ర‌స్ గ‌ల్లంతవ‌డం ఖాయ‌మ‌ని వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో దళిత ఎమ్మెల్యేపై దాడి చీకటి రోజు అని అభివర్ణించారు. ఈ విషయమై ఈ నెల 25 నుంచి మూడ్రోజుల పాటు ప్రజాక్షేత్రంలోకి వెళ్తామని …

Read More »

జగన్ మరిచిపోతున్న లాజిక్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అభిమానులు ఇచ్చే ఎలివేషన్లకు.. ఆయన మాట్లాడే మాటలు, చేసే చేతలకు అసలు పొంతన ఉండట్లేదు. మాటకు ముందు వీరుడు శూరుడు.. మొనగాడు.. పులి.. సింహం.. లాంటి ఉపమానాలతో ఆయనకు ఎలివేషన్ ఇస్తుంటారు ఫ్యాన్స్. కానీ వాస్తవం చూస్తే మాత్రం వేరుగా కనిపిస్తుంది. ఆయన పర్యటనల సమయంలో పరదాలు కట్టడం.. బారికేడ్లు కట్టించడం.. చెట్లు కొట్టించడం లాంటివి చూసి అవాక్కవ్వని వారు లేరు. భద్రత …

Read More »

నేను గౌత‌మ బుద్ధిడుని కాదు.. : స్పీక‌ర్ త‌మ్మినేని

ఏపీ అసెంబ్లీ స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం.. త‌నేంటో చెప్పేశారు. తానేమీ గౌత‌మ బుద్ధిడిని కాద‌ని అన్నారు. అదేస‌మ‌యంలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు ఆయ‌న “శ్రీరామచంద్రుడు” అని స‌ర్టిఫికెట్ ఇచ్చేశారు. సోమ‌వారం నాటి స‌భ‌లో టీడీపీ నేత‌లు.. వైసీపీ స‌భ్యుల వివాదాల‌తో అట్టుడికిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో టీడీపీ స‌భ్యుల‌ను స‌స్పెండ్ చేసిన త‌ర్వాత‌.. స్పీక‌ర్ మాట్లాడారు. టీడీపీ సభ్యులు తనను సీటు నుంచి తోసేందుకు ప్రయత్నించారని స్పీక‌ర్ త‌మ్మినేని చెప్పారు. …

Read More »

టీడీపీ పని మొదలెట్టేసింది..

తెలుగుదేశం పార్టీ తెలివిగా వ్యవహరిస్తోంది. తీవ్రంగా ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ము చేసుకుంటూ వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో ఆ పార్టీ నియోజకవర్గాలలో బలం పుంజుకొంటోంది. ఈ క్రమంలో పార్టీ అధినేత కూడా గతంలో తనపై ఉన్న నాన్చుడు ముద్ర నుంచి బయటపడి పలు చోట్ల టికెట్లు కన్ఫర్మ్ చేసినట్లు చెప్తున్నారు. అధికారికంగా ప్రకటిస్తే వైసీపీ నుంచి కౌంటర్ అటాక్స్ ఉంటాయి కాబట్టి అఫీషియల్‌గా వెల్లడించకుండా అభ్యర్థులను …

Read More »

వ్య‌క్తిగ‌త క‌క్ష‌లు.. ఏపీ అసెంబ్లీని కుదిపేస్తున్నాయా?

ఏపీ అసెంబ్లీలో ప్ర‌జాస‌మ‌స్య‌లు ప్ర‌స్తావించి.. వాటిని ప‌రిష్క‌రించేందుకు మార్గాలు వెత‌కాల్సిన అధికార వైసీపీ, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ స‌భ్యుల మ‌ధ్య వ్య‌క్తిగ‌త క‌క్ష‌లు చోటు చేసుకుంటున్నాయా? త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో గ‌తంలో జ‌రిగిన గొడ‌వ‌ల‌ను.. వారి మ‌ధ్య ఉన్న ప‌గ, క‌క్ష‌, కార్ప‌ణ్యం వంటివాటిని స‌భ‌లో ప్ర‌స్ఫుటీక‌రిస్తున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. శాస‌న స‌భ ఉన్న‌ది మీ వ్య‌క్తిగ‌త వ్య‌వ‌హారాలు చ‌ర్చించుకునేందుకు కాదు. ప్ర‌జలు మిమ్మ‌ల్ని ఎన్నుకున్న ది …

Read More »