Political News

ద‌త్త‌పుత్రుడుపై ప‌వ‌న్ హాట్ కామెంట్స్

2014 ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూట‌మికి మ‌ద్ద‌తుగా నిలిచి ఆ పార్టీ అధికారంలోకి రావ‌డానికి తోడ్పాటు అందించాడు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. ఐతే ఇందుకు గాను ప‌వ‌న్ ఎలాంటి ప్ర‌తిఫ‌లం అందుకోలేద‌న్న‌ది స్ప‌ష్టంగానే క‌నిపిస్తుంటుంది. ప్ర‌భుత్వంలో భాగస్వామి కాలేదు. త‌న‌కో, త‌న పార్టీ వాళ్ల‌కో ఎమ్మెల్సీలు, రాజ్య‌స‌భ ప‌ద‌వో ఇప్పించుకోలేదు. ఇక తెర వెనుక డ‌బ్బులు పుచ్చుకునే వాడే అయితే పార్టీ న‌డ‌ప‌డం కోసం ఆస‌క్తి లేకున్నా, …

Read More »

ఇంకా జ‌గ‌న్ పాటే.. మాజీ మంత్రిపై ఆ సామాజిక వ‌ర్గం గుర్రు!

తాజాగా ఏపీలో ఏర్ప‌డిన జ‌గ‌న్ 2.0 కేబినెట్‌లో కీల‌క‌మైన వైశ్య సామాజిక వ‌ర్గానికి స్థానం ద‌క్క‌లేదు. గ‌త కేబినెట్‌లో మాత్రం విజ‌య‌వాడ ప‌శ్చిమ ఎమ్మెల్యే వెలంప‌ల్లి శ్రీనివాస్‌కు అవ‌కాశం క‌ల్పించారు. కానీ, తాజాగా మంత్రి వ‌ర్గంలో ఎవ‌రికీ అవ‌కాశం ఇవ్వ‌లేదు. పోనీ..ఎమ్మెల్యేలు లేరా..అంటే.. కీల‌క‌మైన అన్నా రాంబాబు(గిద్ద‌లూరు), కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి(విజ‌య‌న‌గ‌రం) ఉన్నారు. అయినా.. వీరికి ప్రాధాన్యం లేకుండా పోయింది. దీంతో వైశ్య సామాజిక వ‌ర్గం.. స్వ‌చ్ఛందంగా నిర‌స‌న వ్య‌క్తం చేస్తోంది. …

Read More »

జ‌గ‌న్ ను ఆరాధించండి అన్ని ప‌నులు అవుతాయి మంత్రిగారి భ‌జ‌న‌

జ‌గ‌న్ 2.0 కేబినెట్‌లో చోటు ద‌క్కించుకున్న మంత్రులు త‌లకో ర‌కంగా స్పందిస్తున్నారు. మంత్రి వ‌ర్గ ప్ర‌మాణ స్వీకార స‌మ‌యంలోనే స్వామి భ‌క్తిని, భ‌జ‌న‌ను ప్ర‌ద‌ర్శించిన నాయ‌కులు.. మంత్రులుగా బాధ్య‌త‌లు తీసుకున్నాక‌.. త‌మ విశ్వ‌రూపం చూపిస్తున్నారు. తాము చేస్తున్న భ‌జ‌న చాల‌ద‌న్న‌ట్టుగా.. మీడియాను కూడా భ‌జ‌న చేయాల‌ని.. ప్రోత్స‌హిస్తున్నారు. అంతేకాదు.. జ‌గ‌న్ గురించి.. ఆయ‌న లోపాల గురించి కూడా ఆరా తీయొద్ద‌ని సూటిగా చెబుతున్నారు. అంతేనా.. ఇలా చేస్తే.. మీకు ప‌నులు …

Read More »

మొదలుకానున్న భరోసా యాత్ర

ఈ మద్యనే చెప్పినట్లు జనసేన అధినేత కౌలు రైతుల కోసం భరోసా యాత్ర మొదలు పెడుతున్నారు. తన యాత్రను పవన్ అనంతపురం జిల్లాలోని కొత్తచెరువు నుంచి మంగళవారం ప్రారంభిస్తున్నారు. తన యాత్రలో ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు పవన్ ఆర్థిక సాయం అందించబోతున్నారు. అలాగే కొత్త చెరువులోని కౌలు రైతులతో గ్రామ సభ కూడా నిర్వహిస్తారు. ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు తలా లక్ష రూపాయల ఆర్ధిక …

Read More »

ప్రతిపక్షాల గోలేమిటో అర్థం కావటం లేదే ?

జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గం పై ప్రతిపక్షాల గోలేమిటో అర్థం కావటం లేదు. మంత్రివర్గంలో ఎవరుండాలి ? ఎవరిని తీసేయాలనేది పూర్తిగా జగన్ ఇష్టం. మంత్రివర్గం మార్పులు, చేర్పులనేది నూరుశాతం అధికార పార్టీ అంతర్గత విషయం. సమస్యలు, అసంతృప్తులుంటే అది జగన్, మిగిలిన వాళ్ళు చూసుకుంటారు. ఇందులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఇతర పార్టీలకు ఏ మాత్రం లేదు. కానీ ఈ విషయంలో ప్రతిపక్షాలు రెచ్చిపోతున్నాయి. టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు …

Read More »

రోజా 2.0 చూస్తామా

అనూహ్యంగా మంత్రివర్గంలో ఆర్కే రోజా చోటు దక్కించుకున్నారు. మంత్రివర్గం ఆశావహుల జాబితాలో రోజా పేరు కొన్నిసార్లు కనబడి మరికొన్నిసార్లు మాయమైపోయింది. దాంతో తనకు ఇక మంత్రిపదవి యోగం లేదని నిర్ధారించుకున్న నగిరి ఎంఎల్ఏ వెళ్ళి హైదరాబాద్ లో కూర్చున్నారు. అయితే తెరవెనుక ఏమి మార్పులు జరిగిందో ఏమోకానీ చివరి నిముషంలో మంత్రివర్గంలోకి రోజా కూడా చేరిపోయారు. దాంతో రోజా అభిమానులు, రాజకీయాలకు సంబంధం లేని కొంతమంది కూడా హ్యాపీగా ఉన్నారు. …

Read More »

పృథ్వీకో న్యాయం.. అంబటికో న్యాయమా?

ఈ రోజుల్లో అవినీతి ఆరోపణల కంటే కూడా లైంగిక వేధింపుల ఆరోపణలు రాజకీయ నాయకుల ఇమేజ్‌ను ఎక్కువ డ్యామేజ్ చేస్తుంటాయి. మహిళల్ని లైంగికంగా వేధించినా, శృంగారం జరిపినా.. లేక సరస సంభాషణలు చేసినా.. వాటి తాలూకు ఆడియోలు, వీడియోలు రిలీజయ్యాయంటే అంతే సంగతులు. ఇమేజ్ ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. జనాల్లో ఏహ్య భావం కలుగుతుంది. సోషల్ మీడియాకు ఇలాంటి కంటెంట్ దొరికితే పరువు గంగలో కలిసిపోతుంది. సాధారణంగా ఏ రాజకీయ పార్టీ …

Read More »

సజ్జలే టార్గెట్ అవుతున్నారా ?

అధికార పార్టీలో నేతల దృష్టిలో పాపాల భైరవుడు ఎవరయ్యా అంటే సజ్జల రామకృష్ణారెడ్డి పేరే వినబడుతోంది. నెగిటివ్ గా ఎవరు టార్గెట్ చేయాలన్నా ముందుగా సజ్జలే టార్గెట్ అవుతున్నారు. మంత్రి పదవుల్లో తమ పేర్లు లేకుండా పోవటానికి సజ్జలే కారణమని కొందరు సీనియర్లు తీవ్ర అసంతృప్తిగా ఉండటమే ఉదాహరణ. గతంలో పీఆర్సీ విషయంలో కూడా ఉద్యోగ సంఘాల నేతలు డైరెక్టుగా సజ్జలపైనే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం గుర్తుండే …

Read More »

మ‌ళ్లీ సీన్లోకి పెద్దిరెడ్డి..కోటంరెడ్డి ఏం పాపం చేశారో ?

ఉమ్మ‌డి చిత్తూరు జిల్లా చాలా పుణ్యం చేసుకుని ఉండాలి అందుకే ఆ జిల్లాకు మూడు మంత్రి ప‌ద‌వులు ఇచ్చి జ‌గ‌న్ స‌ర్ గౌర‌వించారు. ఇదే స‌మ‌యంలో నెల్లూరుకు అన్యాయం జ‌రిగిపోయింది. అనిల్ యాద‌వ్ ను త‌ప్పించారు. రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన కోటంరెడ్డి కి ఛాన్స్ లేకుండా పోయింది. దీంతో కోటం రెడ్డి చాలా భావోద్వేగానికి లోనయ్యారు. వైఎస్సార్ నాన్న పులివెందుల బిడ్డ రాజారెడ్డి మొద‌లుకుని, వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి …

Read More »

జగన్ మీద ఒత్తిడి పెడుతున్నారా ?

మంత్రివర్గంలో చోటు దక్కలేదని ఖాయమవ్వగానే కొందరు ఎంఎల్ఏల మద్దతుదారులు గోల మొదలుపెట్టారు. జగ్గయ్యపేట, మాచెర్ల, చోడవరం, శ్రీశైలం ఎంఎల్ఏలు సామినేని ఉదయభాను, కరణం ధర్మశ్రీ, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి మద్దతుదారులు రచ్చ చేస్తున్నారు. గెలిచిన ఎంఎల్ఏలందరు క్యాబినెట్లో అవకాశం ఆశించటం చాలా సహజం. కానీ ఉన్న పరిమితుల కారణంగా అందరికీ మంత్రులుగా అవకాశం ఇవ్వటం ఎవరివల్లా సాధ్యం కాదు. అసెంబ్లీ స్ధానాల సంఖ్యలో 15 శాతానికి మించకుండా …

Read More »

ఫెయిల్ అయిన జగన్ ఆలోచనలు

మంత్రివర్గం కూర్పులో జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు నూరుశాతం సక్సెస్ కాలేదనే చెప్పాలి. వివిధ కారణాల వల్ల కొందరి విషయంలో రాజీపడాల్సొచ్చింది. మూడేళ్ళ క్రితం మంత్రివర్గం ఏర్పడినపుడు రెండున్నరేళ్ళ తర్వాత 90 శాతం మందిని మార్చేస్తానని ప్రకటించారు. సరే తర్వాత జరిగిన అనేక పరిణామాల కారణంగా మూడేళ్ళవుతున్న సమయంలో కొత్త క్యాబినెట్ ఏర్పాటు కాబోతోంది. పాత+కొత్త మంత్రుల కాంబినేషన్ తో జగన్ క్యాబినెట్-2 సోమవారం ఉదయం కొలువు తీరబోతోంది. జగన్ మొదట్లోనే …

Read More »

ఈ ఆరుగురు అదృష్టవంతులే

ఈరోజు ప్రమాణస్వీకారం చేయబోతున్న జగన్ క్యాబినెట్-2 లో ఆరుగురిని అదృష్ట వంతులనే చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఎంఎల్ఏగా గెలిచిన మొదటి సారే మంత్రి పదవి వరించటం అంటే మామూలు విషయంకాదు. వారి జిల్లాల్లో సీనియర్లున్నారు, సామాజికవర్గం ఎంఎల్ఏలు కూడా ఉన్నారు. అయినా మంత్రిపదవులను దక్కించుకున్నారంటే నూరుశాతం సుడి బలంగా ఉండటమే కారణమనే సెటైర్లు పడుతున్నాయి. గుడివాడ అమర్నాథ్ అనకాపల్లి నియోజకవర్గం నుండి 2019 ఎన్నికల్లో మొదటిసారి గెలిచారు. విడదల రజని గుంటూరు …

Read More »