Political News

త‌గ్గేదేలా… స‌ర్కారుకు దీటుగా కేసీఆర్ తెలంగాణ ఉత్స‌వాలు

తెలంగాణ ఆవిర్భావ దినోత్స‌వం జూన్ 2న జ‌ర‌గ‌నుంది. దీనికి సంబంధించి.. రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం స‌క‌ల ఏర్పాట్లు చేస్తోంది. ఇప్ప‌టికే ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కూడా.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని క‌లెక్ట‌రేట్ల ద‌గ్గ‌ర పండుగ వాతావ‌ర‌ణంలో ఈ ఉత్స‌వాల‌ను నిర్వ‌హించాల‌ని ఆదేశించారు. ఇక‌, రాష్ట్ర స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి కూడా.. ఈ ఉత్స‌వాల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న తెలంగాణ గీతం, అధికారిక ముద్ర‌, తెలంగాణ త‌ల్లి …

Read More »

‘తీన్మార్‌’.. విజ‌యం ఖాయ‌మేనా?

తెలంగాణ‌లో మ‌రో ఎన్నిక‌కు ముహూర్తం స‌మీపించింది. సోమ‌వారం ఉదయం నుంచి సాయంత్రం వ‌ర‌కు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక‌ పోలింగ్ జ‌ర‌గ‌నుంది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌తో బిజీగా ఉన్నప్ప‌టికీ.. ఎమ్మెల్సీ ఎన్నిక అనివార్యంగా మారింది. దీంతో ఈ హ‌డావుడి క‌నిపిస్తోంది. ఖ‌మ్మం-వ‌రంగ‌ల్‌-న‌ల్ల‌గొండ‌.. ప‌ట్ట‌భ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. మొత్తంగా 4.63 ల‌క్ష‌ల మంది ప‌ట్ట భ‌ద్రులు త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకోనున్నారు. ఉమ్మ‌డి ఖ‌మ్మం-వ‌రంగ‌ల్‌-న‌ల్ల‌గొండ‌.. …

Read More »

జమ్మలమడుగులో కమలం వికసిస్తుందా ?

కడప జిల్లా జమ్మలమడుగులో ఈసారి గెలుపు ఎవరిది ? అన్న చర్చ జోరుగా నడుస్తుంది. ఇక్కడి ఫలితాల మీద అంచనాలు అందక బెట్టింగ్ రాయుళ్లు కూడా భయపడి వెనక్కు తగ్గుతున్నారంటే ఇక్కడ పోటీ ఎలా జరిగిందో అంచనా వేయవచ్చు. వైసీపీ నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే మూలె సుధీర్ రెడ్డి, కూటమి పొత్తులో భాగంగా బీజేపీ నుండి మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డిలు పోటీకి దిగారు. ఆదినారాయణ రెడ్డి 2004, 2009 …

Read More »

అలా జ‌రిగితే.. ప‌వ‌న్ కు తిరుగులేదుగా!

ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీ 21 స్థానాల్లో పోటీ చేసిన విష‌యం తెలిసిందే. వీటిలో ఎన్ని గెలుస్తార‌నే విష‌యంపై ఇంకా చ‌ర్చ సాగుతూనే ఉంది. కొంద‌రు నాలుగు అంటుంటే.. మ‌రికొంద‌రు.. స‌గం ఖాయ‌మ‌ని లెక్క‌లు వేస్తున్నారు. స‌రే… ఈ వాద‌న ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. పోటీలో ఉన్న‌వారు మాత్రం బ‌ల‌మైన నాయ‌కు లే.. దీంతో మొత్తంగా గెలిచినా ఆశ్చ‌ర్యంలేద‌ని మ‌రికొంద‌రు చెబుతున్నారు. క్షేత్ర‌స్థాయిలో వాస్త‌వాలు గ‌మ‌నిస్తే… 19-20 స్థానాలు ద‌క్కించుకున్నా ఆశ్చ‌ర్యం …

Read More »

టార్గెట్ కేసీఆర్‌.. మూలాలు మారుతున్నాయా?

తెలంగాణ‌లో అధికారంలోకి వ‌చ్చిన కాంగ్రెస్ పార్టీ.. పార్ల‌మెంటు ఎన్నిక‌ల వ‌ర‌కు చాలా మౌనంగా ఉంది. ఎన్నిక‌ల‌ను మాత్రమే రాజ‌కీయంగా చూసింది. విమ‌ర్శ‌లు-ప్ర‌తివిమ‌ర్శ‌లు.. స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు రువ్వుకుంది. ఇది ముగిసిపోయింది. అయితే.. ఇప్పుడు అస‌లు క‌థ మొద‌లు  పెట్టిందా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. దీనికి కార‌ణం.. మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ఎంపిక చేసిన‌.. తెలంగాణ త‌ల్లి విగ్ర‌హం నుంచి రాష్ట్ర అధికారిక చిహ్నం వ‌ర‌కు.. స‌మూలంగా మార్పులు …

Read More »

ఏపీలో ఏ పార్టీ గెలుస్తుంది? .. ‘ఏఐ’ సంచ‌ల‌న స‌మాధానం!

సాంకేతిక యుగంలో ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌.. ఏఐ పాత్ర పెరుగుతున్న విష‌యం తెలిసిందే. దీంతో త‌మ‌కు తెలిసిన‌, తెలియని అనేక ప్ర‌శ్న‌ల‌ను నెటిజ‌న్లు ఏఐని అడుగుతున్నారు. వీటి జెమినీ ఏఐ, మాయ ఏఐ అనేవి స‌మాధానాలు చెబుతున్నాయి. ఒక్కొక్క‌సారి వివాదం కూడా అవుతున్నాయి. ఈ క్ర‌మంలో తాజాగా ఓ విష‌యం వెలుగు చూసింది. ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఏ పార్టీ విజ‌యం ద‌క్కించుకుంటుంది? ఎవ‌రు ముఖ్య‌మంత్రి అవుతార‌నే ప్ర‌శ్న‌లు.. తాజాగా ఉత్కంఠ …

Read More »

జ‌గ‌న్ ప్ర‌మాదంలో ఉన్నారు

ఏపీ సీఎం జ‌గ‌న్ ప్ర‌మాదంలో ఉన్నారు. ఆయ‌న‌ను కాపాడుకోవాల్సిన  బాధ్య‌త మ‌నంద‌రిపైనా ఉంది. అస‌లు ఎవ‌రిని న‌మ్మాలో న‌మ్మ‌కూడదో కూడా అర్ధం కావ‌డం లేదు. ఈ స‌మ‌యంలో మ‌న‌మే జ‌గ‌న్‌ను కాపాడుకోవాలి.. అని ఏపీ ప్ర‌భుత్వ అద‌న‌పు అడ్వొకేట్ జ‌న‌ర‌ల్‌(ఏఏజీ)  పొన్న‌వోలు సుధాక‌ర్ రెడ్డి వ్యాఖ్యానించారు. తాజాగా ఆయ‌న బ్రిట‌న్‌లో పర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డి ఎన్నారై వైసీపీ నాయ‌కుల‌తో ఓ హోట‌ల్‌లో భేటీ అయ్యారు. ఏపీలో జ‌రిగిన పోలింగ్‌, …

Read More »

ఉరవకొండ ఈసారి లెక్క మారుతుందా ?

ఉరవకొండ. అన్ని నియోజకవర్గాలది ఒక ఎత్తు అయితే ఈ నియోజకవర్గానిది ఒక ఎత్తు. గత రెండు దశాబ్దాలుగా ఇక్కడ శాసనసభ ఎన్నికల ఫలితాలు అంటే అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తారు. చివరి వరకు గెలుపు ఎవరిది ? నువ్వా ? నేనా ? అన్నట్లు ఫలితాలు ఉంటాయి. అందుకే అనంతపురం జిల్లాలో ఈ నియోజకవర్గం ప్రత్యేక స్థానం. గతంలో ఉన్న అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అధికారులు ప్రతి నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపు కోసం 14 టేబుళ్ల చొప్పున …

Read More »

కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే.. జ‌గ‌న్ ప‌రిస్థితేంటి?

ఓడ‌లు బ‌ళ్లు కావొచ్చు.. బ‌ళ్లు ఓడ‌లు కూడా కావొచ్చు. కాబ‌ట్టి ప్ర‌జాస్వామ్యంలో ఏమైనా జ‌ర‌గొచ్చు. అలానే కేంద్రంలో రేపు మోడీ స్థానంలో కాంగ్రెస్ రాకూడ‌ద‌ని ఏమీ లేదు. ఇంత‌క‌న్నా ఎక్కువ‌గానే త‌మ పాల‌న బాగుంద‌ని ప్ర‌చారం చేసుకున్న స‌మ‌యంలోనే బీజేపీ ఘోరంగా ఓడిపోయింది. 2004 కు ముందు. అప్పటి ప్ర‌ధాని వాజ‌పేయి.. ఉప ప్ర‌ధాని ఎల్ కే అద్వానీలు దేశ‌వ్యాప్తంగా తిరిగి ప్ర‌చారం చేసుకున్నారు. దేశం వెలిగిపోతోంద‌ని  కూడా అన్నారు. …

Read More »

జూన్ 4 కాదు.. జూన్ 1పైనే ఉత్కంఠ

దేశంలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల పోలింగ్ ఇప్ప‌టి వ‌రకు ఆరు ద‌శ‌ల్లో పూర్త‌యింది. మ‌రో ద‌శ పోలింగ్ జ‌ర‌గాల్సి ఉంది. అది జూన్ 1న జ‌ర‌గ‌నుంది. ఇక‌, ఎన్నిక‌ల ఫ‌లితాలు.. జూన్ 4న తేలిపోనున్నాయి. ప్ర‌జ‌లు ఎవ‌రికి ప‌ట్టం గ‌ట్టారు..? ఎవ‌రిని అంద‌లం ఎక్కించారు? ఎవ‌రిని దించేశారు? అనేది జూన్ 4న తెలిసిపోతుంది. దీంతో జూన్ 4 పై స‌హ‌జంగానే చ‌ర్చ ఉంది. అయితే.. దీనికి మించి ఇప్పుడు జూన్ 1 …

Read More »

చివ‌రి ఎన్నికల సెంటిమెంటు వ‌ర్క‌వుట్ అయ్యేనా?

ఏపీలో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌రంలో కొంద‌రు నాయ‌కులు ఓట‌ర్ల‌ను మ‌చ్చిక చేసుకునేందుకు చివ‌రి ఎన్నిక‌లంటూ.. చెప్పుకొచ్చారు. వీరిలో వైసీపీ, టీడీపీకి  చెందిన హేమా హేమీ నాయ‌కులు వున్నారు. మ‌రి వారు ఈ ఎన్నిక‌ల్లో స‌క్సెస్ అవుతారా?  వారు ప్లే చేసిన సెంటిమెంటు వ‌ర్క‌వుట్ అవుతుందా? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. వారు చివ‌రి ఎన్నిక‌లు అన్నా.. ఓట‌రు దేవుడు ఎలా క‌రుణించాడ‌నేది.. ఇప్పుడు ఆస‌క్తిగా మారింది. కొడాలి నాని: …

Read More »

ఏపీలో కూట‌మిదే అధికారం: అమిత్ షా ధీమా

ఏపీలో ఎన్డీయే కూట‌మి(టీడీపీ+జ‌న‌సేన‌+బీజేపీ) అధికారంలోకి వ‌స్తుంద‌ని బీజేపీ అగ్ర‌నేత‌, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్ప‌ష్టం చేశారు. తాజాగా ఆయ‌న పీటీఐకి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. ఏపీలో కూట‌మి బాగా ప‌నిచేసింద‌ని తెలిపారు. రాష్ట్రం అభివృద్దిలో సాగాలంటే.. ఏపీలో కూట‌మి అధికారంలోకి రావాల‌ని ప్ర‌జ‌లు బ‌లంగా విశ్వ‌సించార‌ని తెలిపారు. అందుకే రాష్ట్రంలో కూట‌మి వ‌స్తుంద‌ని బ‌లంగా న‌మ్ముతున్న‌ట్టు తెలిపారు. అదేవిదంగా పార్ల‌మెంటు స్థానాల్లోనూ మెజారిటీ సీట్లు ద‌క్కించుకుంటామ‌ని …

Read More »