Political News

మంత్రి వ‌ర్గంలో ఆ ముగ్గురే కీల‌క‌మా?

ఆంధ్రావ‌నిలో మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌కు సంబంధించి లేదా పున‌ర్వ్య‌స్థీక‌ర‌ణ గురించి ఇప్ప‌టిదాకా నెల‌కొన్న అయోమ‌య లేదా సంకట స్థితి అన్న‌ది మ‌రికొద్ది సేప‌ట్లో తొల‌గి పోనుంది. ఈ రోజు సాయంత్రానికి సాధార‌ణ ప‌రిపాల‌న విభాగం ఇందుకు సంబంధించి ఓ స్ప‌ష్ట‌త ఇవ్వ‌నుంది అని తెలుస్తోంది. క్యాబినెట్ లోకి వచ్చే ఆశావ‌హులు ఎవ‌రు అన్న‌ది ఇప్ప‌టికే తేలిపోయింద‌ని, తుది రూపు అన్న‌ది సంబంధిత జాబితాకు ఇచ్చాక, కొత్త మంత్రులకు స‌మాచారం వెళ్తుంద‌ని …

Read More »

ఆ నాట‌కీయ‌త ఇక ప‌నికి రాదు జ‌గ‌న్‌

ప‌రిస్థితులు అనుకూలంగా ఉన్న‌పుడు ఏం చేసినా చెల్లుతుంది. కానీ ప్ర‌తికూల ప‌రిస్థితులు మొద‌ల‌య్యాక అతి చేస్తే తిర‌గ‌బ‌డుతుంది. ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి విష‌యంలో ఇదే జ‌రుగుతున్న‌ట్లుగా అనిపిస్తోంది. ఆయ‌న మామూలుగా ఎంత నాట‌కీయంగా మాట్లాడ‌తారో తెలిసిందే. మిగతా రాజ‌కీయ నాయ‌కుల్లా ఆయ‌న ప్ర‌జ‌లు, జ‌నాలు అనే మాట‌లు వాడ‌రు. అక్క చెల్లెమ్మ‌లు..  ఆడ‌బిడ్డ‌లు.. అన్న‌ద‌మ్ములు..  పేద‌వాడు.. చిన్నారులు.. ఇలాంటి ప‌దాల‌తోనే క‌నిక‌ట్టు చేసే ప్ర‌య‌త్నం చేస్తుంటారు. …

Read More »

వైసీపీ హ‌యాంలో ఇలా కూడా చేస్తారా?

ఏపీలో వైసీపీ పాల‌న ప్రారంభించిన త‌ర్వాత‌.. దేవాల‌యాల‌పై దాడులు పెరిగిపోయాయ‌ని.. విగ్ర‌హాల‌ను ధ్వంసం చేయ‌డం.. ఆల‌యాల కూల్చివేత‌లు స‌ర్వ‌సాధార‌ణంగా మారిపోయాయ‌ని.. రాష్ట్ర బీజేపీ నేత‌లు తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శిస్తున్న విష‌యం తెలిసిందే. ఇక‌, విజ‌య‌న‌గ‌రం జిల్లా రామ‌తీర్థంలో ఏకంగా.. రాముడి శిర‌చ్ఛేద‌న రాష్ట్రాన్నే కాదు.. దేశాన్ని సైతం ఉలిక్కి ప‌డేలా చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ నిందుతులు ఎవ‌రో.. ప‌ట్టుకోలేక పోవ‌డం.. ఏపీ స‌ర్కారుకే చెల్లింద‌నే విమ‌ర్శ‌లు సామాన్యుల నుంచి కూడా …

Read More »

నా వెంట్రుక కూడా పీక‌లేరు.. జ‌గ‌న్ తీవ్ర ఆగ్ర‌హం

ఏపీ సీఎం జ‌గ‌న్ ఆగ్ర‌హం క‌ట్ట‌లు తెగింది. విప‌క్ష టీడీపీ, జ‌న‌సేన స‌హా ఒక వ‌ర్గం మీడియాపై ఆయ‌న తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. “వీళ్లెవ‌రూ నా వెంట్రుక కూడా పీక‌లేరు“ అని వ్యాఖ్యానించారు.  “దేవుడి దయ, ప్రజల దీవెనలు ఉన్నంతకాలం.. ఎంతగా బురదచల్లినా ఎవరూ నన్నేమీ చేయలేరు. వెంట్రుక కూడా పీక‌లేరు” అని జగన్ అన్నారు. తాము సంక్షేమం కోసం పాటుపడుతుంటే.. ప్రతిపక్షాలు, మీడియా దుష్ప్రచారం చేస్తున్నాయని తీవ్ర వ్యాఖ్యలు …

Read More »

ఏపీ స‌ర్కారుపై ప‌వ‌న్ ఫైర్‌

రాష్ట్రంలోని వైసీపీ స‌ర్కారుపై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వైసీపీ అనాలోచిత విధానాలే.. రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభానికి కారణమని దుయ్యబట్టారు. అనధికార విద్యుత్‌ కోతలతో ప్రజలు అల్లాడిపోతున్నారన్న పవన్.. ‘పవర్ హాలిడే’ అనేది పారిశ్రామిక అభివృద్ధికి విఘాతమ న్నారు. పల్లెల్లో 11 నుంచి 14 గంటలు, పట్టణాల్లో 5 నుంచి 8 గంటలు, నగరాల్లో 4 నుంచి 6 గంటలు చొప్పున విద్యుత్ కోతలతో …

Read More »

ఏపీ విభ‌జ‌న‌పై సుప్రీం కోర్టులో కేసు

ఆంధ్ర ప్ర‌దేశ్ విభ‌జ‌న అంశంపై.. కొన్నేళ్లుగా అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్న ప్ర‌ముఖుల్లో మాజీ ఎంపీ ఉండవ‌ల్లి అరుణ్‌కుమార్ ఒక‌రు. త‌ర‌చుగా ఆయ‌న ఈ విష‌యాన్ని ప్రస్తావిస్తున్నారు. అప్ప‌ట్లో ఇలా జ‌రిగింది.. త‌లుపులు మూసేశారు.. మిరియాల కారం క‌ళ్ల‌లో కొట్టారు.. చీక‌ట్లో విభ‌జ‌న చేశారు. ఎవ‌రినీ మాట్లాడనివ్వ‌లేదు.. ఇది పూర్తిగా అశాస్త్రీయం.. అంటూ.. కొన్నాల్లుగా ఉండ‌వ‌ల్లి మీడియా ముందుకు వ‌చ్చి ప్ర‌స్తావిస్తున్నారు. దీనిపై ఆధారాలు.. వివ‌ర‌ణ‌లు.. పార్ల‌మెంటులో జ‌రిగిన చ‌ర్చ వంటివికూడా …

Read More »

మ‌ళ్లీ ఎన్నిక‌ల వ‌ర‌కు జ‌గ‌న్ జ‌పం ఇదేనా?

ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వం కీల‌కమైన‌.. అత్యంత ముఖ్య‌మైన అంశాల్లో చాలా నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని.. నెటిజ‌న్లు వ్యాఖ్యానిస్తున్నారు. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు.. ప్ర‌జ‌ల‌కు చూపించిన రాజ‌న్న రాజ్యం.. ఇప్పు డు అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. ఆచ‌ర‌ణ‌లో పెట్ట‌లేక పోతున్నార‌ని వారు విమ‌ర్శిస్తున్నారు. తాజాగా సీఎం జ‌గ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌పై నెటిజ‌న్లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు  చేస్తున్నారు. ఆయ‌న ఢిల్లీకి వెళ్లి.. రాష్ట్రానికి సంబంధించిన అనేక కీల‌క అంశాల‌పై ప్లీజ్ .. ప్లీజ్.. అంటూ.. ప్ర‌ధాని …

Read More »

జ‌గ‌న్ `బాదుడు` ఎఫెక్ట్‌.. ఏపీలో మ‌ళ్లీ అప్పు?

ఇప్ప‌టికే అప్పుల కుప్ప‌గా మారిన న‌వ్యాంధ్ర.. మ‌ళ్లీ మ‌ళ్లీ అప్పులు చేసుకునేందుకు ఉబ‌లాట‌ప‌డుతున్న విష‌యం తెలిసిందే. ఇచ్చ‌వాడుంటే.. ఎంతైనా తీసుకుంటాన‌ని.. బ‌హిరంగంగానే చెబుతోంది. ఈ నేపథ్యంలో ఏపీలో అప్పులకు సంబంధించి ఆచితూచి అనుమ‌తులు ఇవ్వాల్సిన కేంద్ర ప్ర‌భుత్వం.. ఎడా పెడా అప్పులు చేసేందుకు అనుమ‌తులు ఇస్తోంది.  కొన్నాళ్ల కింద‌ట‌.. రైతులు వాడే విద్యుత్‌కు మీట‌ర్లు పెట్టినందుకు అప్పులు చేసుకునే వెసులు బాటు ఇచ్చింది. త‌ర్వాత‌.. జ‌నాల‌పై చెత్త‌ప‌న్నులు వేసినందుకు.. మ‌రికొంత …

Read More »

AP: ప‌రిశ్ర‌మ‌ల‌కు ప‌వ‌ర్ ఆఫ్ …దేవుడా! 

ఆంధ్రాలో క‌రెంట్ కోత‌లు మ‌రింత తీవ్ర‌త‌రం అవుతున్నాయి. దీంతో సామాన్యుల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్తం అవుతోంది. టీడీపీ స‌ర్కారులో  విద్యుత్ కోత‌ల‌కు తావే లేద‌ని వారంతా ఆధారాల‌తో స‌హా ప్ర‌భుత్వాన్ని ఇర‌కాటంలో పెడుతున్నారు. పోనీ రాజ‌కీయం ఎలా ఉన్నా నాణ్య‌త‌తో కూడిన విద్యుత్ అందిస్తామ‌ని చెప్పిన సీఎం జ‌గ‌న్ ఎందుక‌నో ఆ మాట మ‌రిచిపోతున్నార‌న్న సందేహాలువినియోగ‌దారుల నుంచి వ్యక్తం అవుతున్నాయి. రానున్న‌ది ప‌రీక్ష‌ల స‌మ‌యం క‌నుక టెన్త్, ఇంట‌ర్ …

Read More »

పేరుకే పీసీసీ.. అంతా అతని చేతిలోనే?

ఇన్ని రోజుల పార్టీలో అంత‌ర్గ‌త క‌ల‌హాలు.. విభేధాలు.. క్ర‌మ‌శిక్ష‌ణ ఉల్లంఘ‌న‌.. ఇలా అస్త‌వ్య‌స్తంగా సాగుతున్న తెలంగాణ కాంగ్రెస్‌పై అధిష్ఠానం తాజాగా దృష్టి సారించింది. తెలంగాణలోని కీల‌క నేత‌ల‌తో కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు రాహుల్ గాంధీ స‌మావేశం కావ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. రాష్ట్రంలో రాజ‌కీయ ప‌రిస్థితులు.. పార్టీ బ‌లోపేతంపై ఆయ‌న చ‌ర్చించిన‌ట్లు స‌మాచారం. తెలంగాణ‌లో పుంజుకునేందుకు కాంగ్రెస్‌కు మంచి అవ‌కాశాలున్నాయ‌ని భావించిన ఆయ‌న‌.. పార్టీని అధికారంలోకి తీసుకు రావ‌డం కోసం క‌లిసిక‌ట్టుగా …

Read More »

ఏపీ క్యాబినెట్: జగనన్నకు కొత్త తలనొప్పులు

మంత్రి ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేయాల్సిన వారంతా ఏడుస్తున్నారు. కానీ వారి ఏడుపు జ‌గ‌న్ కు అన‌వ‌సరం అని తేలిపోయింది. వ‌స్తున్న వారంతా న‌వ్వుతున్నారు. ఈ ఇన్ అండ్ ఔట్ డ్రామాలో గెలుపు జ‌గ‌న్ దే! కానీ బొత్స లాంటి వారు తిరుగుబాటు చేస్తే కొత్త త‌ల‌నొప్పులు త‌ప్ప‌వు వైసీపీ అధినాయ‌క‌త్వానికి! ఏదేమ‌యినా ఎప్ప‌టి నుంచో వేచి చూస్తున్న ఉద‌యం మ‌రికొద్ది రోజుల్లో ప‌ల‌క‌రించ‌నుంది. అందుకు ముహూర్తం కూడా ఖ‌రారు కావ‌డం …

Read More »

జ‌గ‌న్ వార్నింగ్‌.. స‌జ్జ‌ల వ‌ద్ద‌కు క్యూ!

Sajjala

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌కు ముహూర్తం ఖ‌రారైంది. కొత్త మంత్రుల జాబితాను సీఎం జ‌గ‌న్ ఇప్ప‌టికే సిద్ధం చేశారు. ఈ నెల 11న త‌న నూత‌న మంత్రివ‌ర్గాన్ని ప్ర‌క‌టించ‌నున్నారు. వచ్చే ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని ఆయ‌న మంత్రివ‌ర్గ కూర్పును సిద్ధం చేశార‌నే టాక్ వినిపిస్తోంది. 2024లో గెలిచి అధికారాన్ని కాపాడుకోవాల‌నే ప‌ట్టుద‌ల‌తో జ‌గ‌న్ ఉన్నారు. అందుకే ఆ మేర‌కు మంత్రివ‌ర్గాన్ని సిద్ధం చేస్తున్నారు. ఇక మ‌రోవైపు దీనికంటే ముందుగానే ఆయ‌న ఎమ్మెల్యేల …

Read More »