రాజకీయాల్లోను మెరిసిన తారలు ఎవరో తెలుసా ?

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2014లో పార్టీ పెట్టినా 2024 వరకు విజయం దక్కలేదు. చివరకు ఈ ఎన్నికల్లో తొలిసారి తను పిఠాపురం శాసనసభ్యుడిగా 70 వేల పైచిలుకు ఓట్లతో విజయం సాధించడమే కాకుండా పోటీ చేసిన 21 శాసనసభ, 2 లోక్ సభ స్థానాల్లో జనసేన అభ్యర్థులను గెలిపించుకున్నారు. పవన్ కళ్యాణ్ మాదిరిగానే దేశంలో అనేక మంది సినీతారలు ఎన్నికల్లో పోటీ చేసి విజేతలు పరాజితులుగా నిలిచారు.

ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ హిందూపురం నుంచి 32,597 ఓట్ల భారీ మెజారిటీతో
హ్యాట్రిక్ విజయం సాధించారు.

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ హిమాచల్ ప్రదేశ్‌లోని మండి లోక్ సభ నియోజకవర్గం నుంచి 74,755 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్ పై గెలుపొందింది.

మలయాళ నటుడు సురేష్ గోపీ త్రిసూర్ లోక్ సభ స్థానం నుండి బీజేపీ తరపున పోటీ చేసి 74,686 ఓట్లతో గెలిచి కేరళలో చరిత్ర సృష్టించారు. ఇది కేరళలో బీజేపీకి మొదటి విజయం.

ప్రముఖ భోజ్‌పురి నటుడు, రేసు గుర్రం విలన్ రవి కిషన్ ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి 103526 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. ఎంపీగా విజయం సాధించడం ఆయనకు ఇది రెండోసారి.

భోజ్‌పురి చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు, గాయకుడు మనోజ్ తివారీ ఈశాన్య ఢిల్లీ నియోజకవర్గం నుండి బిజెపి అభ్యర్థిగా ఎన్నికలలో పోటీ చేశారు. ఆయన తన ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి కన్హయ్య కుమార్‌పై 138778 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు.

బుల్లితెర శ్రీరాముడు అరుణ్ గోవిల్‌ మీరట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అరుణ్ గోవిల్‌ 10585 ఓట్లతో ఎస్పీ అభ్యర్థి సునిత వర్మపై విజయం సాధించాడు.

పలు తెలుగు సినిమాల్లో నటించిన రచనా బెనర్జీ పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ స్థానం నుంచి టీఎంసీ తరఫున బీజేపీకి చెందిన లాకెట్ ఛటర్జీ పై సుమారు 76853 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది.

బీజేపీని వీడిన ప్రముఖ నటుడు శత్రుజ్ఞ సిన్హా లో పశ్చిమ బెంగాల్‌లోని అసన్‌సోల్ నియోజకవర్గం నుంచి టీఎంసీ అభ్యర్థిగా పోటీ చేసి 59564 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

యూపీలోని మధుర నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన హేమమాలిని 293407 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. గతంలో కూడా ఇదే నియోజకవర్గం నుంచి ఆమె గెలుపొందారు.

ఇక కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ భార్య, నిర్మాత గీతా శివరాజ్ కుమార్ షిమోగా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆమెపై బీజేపీ అభ్యర్థి బీవై రాఘవేంద్ర భారీ మెజార్టీతో గెలుపొందారు. ఏపీ శాసనసభ ఎన్నికల్లో నగరి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన హీరోయిన్ రోజా, టాలీవుడ్ హీరోయిన్ నవనీత్ కౌర్ కూడా ఓటమి చెందారు.