రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానంటూ శుక్రవారం సాయంత్రం బాంబు లాంటి నిర్ణయాన్ని ప్రకటించిన వైసీపీ కీలక నేత వేణుంబాక విజయసాయిరెడ్డి శనివారం ఉదయం తాను చెప్పినట్లుగానే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అనంతరం ఢిల్లీలో మీడియా ముందుకు వచ్చిన సాయిరెడ్డి… తన రాజకీయ నిష్క్రమణకు సంబంధించి దారి తీసిన కారణాలను వెల్లడించారు. ఈ నిర్ణయం పూర్తిగా తన వ్యక్తిగతమేనని, ఇందులో ఎలాంటి ఇతరత్రా కారణాలు లేవని కూడా ఆయన చెప్పారు. స్పీకర్ …
Read More »దిగ్గజ కంపెనీలు వస్తున్నాయి.. గెట్ రెడీ: చంద్రబాబు
రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టే దిశగా వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులకు హాజరయ్యే నిమిత్తం స్విట్జర్లాండ్ నగరం దావోస్ వెళ్లిన ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తన పర్యటనను ముగించుకుని శుక్రవారం సాయంత్రానికి అమరావతి చేరుకున్నారు. వచ్చీ రాగానే… కార్యరంగంలోకి దిగిపోయిన చంద్రబాబు… శుక్రవారం సాయంత్రమే ఉండవల్లిలోని తన అధికారిక నివాసంలో ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ తో పాటుగా ఆయా శాఖల ఉన్నతాధికారులు …
Read More »శేషం సంపూర్ణం… ఎంపీ పదవికి సాయిరెడ్డి రాజీనామా
రాజకీయాలకు స్వస్తి పలుకుతున్నానంటూ వైసీపీ కీలక నేత వేణుంబాక విజయసాయిరెడ్డి.. తన నిష్క్రమణ పర్వంలో మిగిలి ఉన్న కార్యాన్ని కూడా శనివారం ఉదయం పూర్తి చేసేశారు. శనివారం ఉదయం ఎంచక్కా ఢిల్లీలోని తన అధికారిక నివాసం నుంచి బయలుదేరి… రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ కడ్ నివాసానికి చేరుకున్నారు. అప్పటికే సిద్ధం చేసుకున్న తన రాజీనామా పత్రాన్ని ఆయన ధన్ కడ్ చేతిలో పెట్టేశారు. స్పీకర్ ఫార్మాట్ లోనే …
Read More »చేయాల్సినంత డ్యామేజ్ చేసేసి పక్కకు తప్పుకున్న సాయి రెడ్డి
గడిచిన రెండు దశాబ్దాల్లో తెలుగు రాజకీయాల్ని తీవ్రంగా ప్రభావితం చేసిన రాజకీయ నాయకుడు ఎవరన్న ప్రశ్నను అడిగితే.. ఏ ఒక్కరు కూడా విజయసాయిరెడ్డి పేరు చెప్పరు. ఒకవేళ.. ఎవరైనా చెబితే.. ఆశ్చర్యాన్ని ప్రదర్శిస్తారు? విజయసాయి ఎందుకు అవుతారు? అని ప్రశ్నిస్తారు.కానీ.. తరచి చూస్తే.. విజయసాయికి మించి తెలుగు రాజకీయాల్ని మాత్రమే కాదు.. తెలుగు ప్రజల్ని సైతం తీవ్రంగా ప్రభావితం చేశారని చెప్పాలి. ఇవాల్టి రోజున సోషల్ మీడియాలో ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు …
Read More »జగన్ కు ట్రబుల్ షూటర్ల కొరత.. భర్తీ చేసే వారెవరు?
గడిచిన రెండు దశాబ్దాల్లో తెలుగు రాజకీయాల ధోరణి పూర్తిగా మారింది. గతంలో ఇందుకు భిన్నమైన రాజకీయ వాతావరణం ఉండేది. ఫలానా నేత.. ఫలానా పార్టీకి మాత్రమే పరిమితం అన్నట్లుగా ఉండే తీరుకు భిన్నంగా అధికారం ఎటువైపు ఉంటే అటువైపు వంగిపోయే తత్త్వం ఎక్కువైంది. సిద్ధాంతాలతో పని లేకుండా కేవలం అధికారం చుట్టూనే తిరిగే నేతల సంఖ్య ఎక్కువైపోతోంది. ఏపీ రాజకీయానికి వస్తే.. చంద్రబాబుతో పోలిస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట …
Read More »పార్టీ కోసం సాయిరెడ్డి ఇల్లు, ఆఫీస్ అమ్ముకున్నారా..?
వైసీపీకి బిగ్ షాక్… ఇతర పార్టీలకు ఆశ్యర్చాన్ని కలగజేస్తూ రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి వ్యవహారంపై పెద్ద చర్చే నడుస్తోంది. రాజకీయాలకు ముందు చేయి తిరిగిన ఆడిటర్ గా వ్యాపారవేత్తలతో చేత ప్రశంసలు అందుకున్న సాయిరెడ్డి… వైఎస్ ఫ్యామిలీ ఆర్థిక లావాదేవీలన్నీ చక్కబెట్టారు. రాజారెడ్డితో మొదలుపెట్టుకుంటే… జగన్ దాకా… వైఎస్ ఫ్యామిలీలో మూడు తరాలకు ఆయన తన ఆడిటింగ్ సేవలను అందించారు. ఇదే విషయాన్ని నిన్నటి నిష్క్రమణ సందేశంలోనూ సాయిరెడ్డి …
Read More »పబ్లిక్ గా లేడీ కలెక్టర్ పై పొంగులేటి చిందులు!
తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీలో మంచి జోష్ కనిపించింది. రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు రాబట్టేందుకు దావోస్ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి… అంచనాలకు మించి భారీ స్థాయిలో పెట్టుబడులు సాధించి తిరిగి వచ్చారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో దిగిన ఆయనకు పార్టీ శ్రేణులు భారీ ఎత్తున వెల్కమ్ చెప్పాయి. ఈ వీడియో అలా ట్రెండ్ అవుతున్న సమయంలోనే… అదే పార్టీకి చెందిన మరో వీడియో ఎంట్రీ ఇచ్చి… …
Read More »రంగంలోకి పవన్.. ఆ ఎమ్మెల్యేలకు ‘క్లాసే’?
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఏదైనా చెబితే అది జరిగేలా పక్కా ప్లాన్ చేసుకుంటున్నారు. కానీ, ఎందుకో కానీ.. ఆయన చెప్పిన వాటిలో కొన్ని మాత్రమే జరుగుతున్నాయి. వీటిలో కీలకమైంది.. కాకినాడ సీపోర్టులో అప్పట్లో నిలిపి ఉంచిన విదేశీ షిప్పు. ‘సీజ్ ది షిప్’ అని పవన్ ఆదేశించినా.. సీజ్ చేయలేకపోయారు. ఇది ఇప్పటికీ సోషల్ మీడియాలో చర్చగానే ఉంది. ఇక, మరో కీలకమైన ఆదేశం.. రహదారుల బాగుచేత. రాష్ట్ర …
Read More »జగన్ రాయబారానికి సాయిరెడ్డి లొంగుతారా…?
వైసీపీలోనే కాకుండా దాదాపుగా తెలుగు నేలకు చెందిన అన్ని రాజకీయ పార్టీల్లో ఇప్పుడు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసంపైనే చర్చ సాగుతోంది. ఉరుము లేని పిడుగులా అలా సోషల్ మీడియాలోకి వచ్చేసి.. తన రాజకీయ నిష్క్రమణను ప్రకటించిన సాయిరెడ్డి అందరినీ షాక్ కు గురి చేశారు. శనివారం తన రాజ్యసభ సదవికి రాజీనామా చేస్తానని సాయిరెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ప్రస్తుతం ఆయన ఢిల్లీలోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. రాజకీయ రంగాన్ని …
Read More »“ఏపీలో కాంగ్రెస్ ఉందా?.. ఉంటే ఉన్నట్టు.. లేదంటే లేనట్టు!”
“ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఉందా? అంటే.. ఉంటే ఉన్నట్టు.. లేదంటే లేనట్టు!”- జాతీయ స్థాయి నాయకుడు, మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ రెండు మూడు రోజుల కిందట ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలు ఇవి. కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన.. ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. దిగ్వి జయ్‌కు తెలుగు రాష్ట్రాలకు మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. గతంలో ఆయన ఇక్కడ ఇంచార్జ్‌గా పనిచేశారు. సో.. ఆయనకు …
Read More »జనసేనలోకి ఆమంచి.. చర్చలు సఫలమేనా..!
ఆమంచి కృష్ణమోహన్. చీరాల మాజీ ఎమ్మెల్యే.. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కానీ, ఆయన పరిస్థితి డోలాయమానంలో ఉంది. గత ఏడాది ఎన్నికలకు ముందు.. వైసీపీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. ఆ పార్టీ టికెట్‌పై చీరాల నుంచి బరిలో నిలిచారు. వ్యక్తిగత హవాతో నెగ్గుకు రావాలని భావించారు. నిజానికి 2014లో ఇలానే జరిగింది. వ్యక్తిగత ఇమేజ్‌ను ఆయన ఎన్నికల్లో ఓట్లు రాబట్టుకునేందుకు వినియోగించుకున్నారు. విజయం సాధించారు. ఆ తర్వాత.. …
Read More »రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా: విజయసాయిరెడ్డి
వైసీపీ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటులో ఆ పార్టీ నేత వేణుంబాక విజయసాయిరెడ్డి శుక్రవారం సాయంత్రం సంచలన ప్రకటన చేశారు. రాజకీయాల నుంచి తాను తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. అంతేకాకుండా రాజ్యసభ సభ్యత్వానికి శనవారం రాజీనామా చేయనున్నట్లుగా ఆయన చెప్పుకొచ్చారు. ఈ నిర్ణయం తన వ్యక్తిగతమైనదని కూడా సాయిరెడ్డి పేర్కొన్నారు. ఇందులో ఏ ఒక్కరి ప్రమేయం గానీ, ప్రభావం గానీ లేదని కూడా ఆయన తెలిపారు. వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత తాను ఏ రాజకీయ పార్టీలోనూ చేరడం లేదని …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates