Political News

మూగ‌బోయిన బీజేపీ కంచు కంఠం

అస‌లే ఎన్నికల స‌మ‌యం.. ఏ పుట్ట‌లో ఏ పాముందో అన్న‌ట్టుగా అన్ని పార్టీల‌కు చోటా నుంచి మోటా వ‌ర‌కు నేత‌లంద‌రితోనూ ప‌ని ఉంటుంది. ఇక‌, నోరేసుకుని ప్ర‌తిప‌క్షాల‌పై ప్ర‌తాపం చూపించేవారితో అయితే.. మ‌రింత ప‌నిఖాయం. ఎన్నిక‌ల స‌మ‌యంలో పార్టీలకు కావాల్సింది కూడా ఇదే. అయితే.. అనూహ్యంగా బీజేపీ ఒక కీల‌క నేత‌ను ప‌క్క‌న పెట్టేసింది. ఆయ‌న నోరు విప్పితే విమ‌ర్శ‌ల వ‌ర్షం.. మాట్లాడితే తూటాలు.. అన్న‌ట్టుగా పేరొందిన నాయ‌కుడే ఘోషామ‌హ‌ల్ …

Read More »

డే-2.. 47 ప్ర‌శ్న‌లు.. నా టైం వేస్ట్‌: నారా లోకేష్

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి ఇన్న‌ర్ రింగ్ రోడ్ ఎలైన్ మెంట్‌లో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయంటూ.. టీడీపీ యువ నాయ‌కుడు నారా లోకేష్‌పై కేసు న‌మోదు చేసిన ఏపీ సీఐడీ అధికారులు ఆయ‌న‌ను విచారిస్తున్న విష‌యం తెలిసిందే. వాస్త‌వానికి ఒక్క రోజు విచార ణ‌కు హైకోర్టు అనుమ‌తించినా.. అధికారులు మాత్రం వ‌రుస‌గా రెండో రోజు కూడా నారా లోకేష్‌ను విచారించారు. అయితే, రెండో రోజైన బుధ‌వారం కూడా ఉద‌యం 10 గంట‌ల నుంచి …

Read More »

బ్రేకింగ్: చంద్రబాబుకు ముందస్తు బెయిల్

స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గత నెల రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ పై ఉన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత అమరావతి ఇన్నర్ రింగురోడ్డు అలైన్మెంట్ మార్పు, ఏపీ ఫైబర్ నెట్ కేసు, అంగళ్లు అల్లర్ల కేసులలో కూడా చంద్రబాబు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ఆ కేసులలో బెయిల్, ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు తరఫు లాయర్లు …

Read More »

‘ఏం పీకుతాడంటే.. రెండు పీకి సెంట్ర‌ల్ జైల్లో పెట్టాం’

టీడీపీ అధినేత‌, మాజీ సీఎం చంద్ర‌బాబు ప్ర‌స్తుతం రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న విష‌యం తెలిసిందే. స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ ప్రాజెక్టులో 341 కోట్ల రూపాయల అవినీతికి పాల్ప‌డ్డారంటూ ఆయ‌న‌ను ఏపీ సీఐడీ జైలుకు పంపించింది. అయితే.. ఇదంతా రాజ‌కీయ కుట్ర‌లో భాగ‌మేన‌ని టీడీపీ నేత‌లు అనేక రూపాల్లో ఆందోళ‌న నిర్వ‌హిస్తూనే ఉన్నారు. కానీ, అధికార పార్టీ వైసీపీ మాత్రం అదేం లేదు.. అస‌లు కుట్ర అనే మాటే …

Read More »

బీఆర్ఎస్ ఆక‌ర్ష్ మంత్రం.. పార్టీలు విల‌విల‌

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల ముంగిట అస‌లు సిస‌లు రాజ‌కీయానికి అధికార పార్టీ బీఆర్ ఎస్ తెర‌తీసింది. ముచ్చ‌ట‌గా మూడోసారి అధికారం ద‌ఖ‌లు ప‌రుచుకోవ‌డం ద్వారా.. తెలంగాణ‌లో అధికారం త‌మ‌కు త‌ప్ప.. అన్న వాదాన్ని బ‌లంగా ముందుకు తీసుకువెళ్లాల‌ని భావిస్తోంది. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే త‌నపై ఎన్నిక‌ల ప్ర‌జ‌ర్ లేకుండా చేసుకున్న పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌.. ఎన్నిక‌ల ప్ర‌క‌టన ద‌రిమిలా.. ఇత‌ర పార్టీల‌ను టెన్ష‌న్‌లోకి నెట్టే రాజ‌కీయాల‌కు చాప‌లెత్తారు. రాష్ట్రంలోని …

Read More »

తెలంగాణ ప్ర‌జ‌ల మొగ్గు దేనికి!?

ఒక‌వైపు ఈటెల వంటి మాట‌లు. మ‌రో వైపు.. అన్ని వ‌ర్గాలకు మేలు చేస్తున్నామ‌నే చేతలు. అంటే అటు మాట‌లు-ఇటు చేత‌లు.. రెండు కూడా ఒక్కుమ్మ‌డిగా తెలంగాణ ప్ర‌జ‌ల‌పై అన్ని ప్ర‌ధాన పార్టీలు సంధిస్తు న్న ఎన్నిక‌ల ప్ర‌చారాస్త్రాలు. ఈ నేప‌థ్యంలో తెలంగాణ ప్ర‌జ‌లు ఎటు మొగ్గుతారు? ఏ పార్టీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తారు? అనే చ‌ర్చ రాజ‌కీయ వ‌ర్గాల్లో జోరుగా సాగుతోంది. ఈ విష‌యంలో అటు అధికార పార్టీ బీఆర్ ఎస్‌, …

Read More »

‘చంద్ర‌బాబు ఉన్న‌ది ప్ర‌కృతి వ‌నంలో కాదు.. జైల్లో’

టీడీపీ అధినేత, మాజీ మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌స్తుతం రాజ‌మండ్రి కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న విష‌యం తెలిసిందే. గ‌త 30 రోజుల‌కు పైగానే ఆయ‌న జైల్లో ఉండ‌డం, స‌రైన వెంటిలేష‌న్ లేక‌పోవ‌డం(టీడీపీ నేత‌ల ఆరోప‌ణ‌), బ‌య‌టి ఉష్ణోగ్ర‌త‌లు పెర‌గ‌డం, జైలు గ‌దిలో చంద్ర‌బాబుకు ఏసీ సౌక‌ర్యాన్ని క‌ల్పించ‌క‌పోవడం వంటి కార‌ణాల‌తో మంగ‌ళ‌వారం సాయంత్రం త‌ర్వాత చంద్ర‌బాబు స్వ‌ల్ప అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యార‌ని స్వ‌యంగా జైలు అధికారులే తెలిపారు. …

Read More »

తెలంగాణలో పక్కా ప్లాన్ తో రాహుల్, ప్రియాంక

కాంగ్రెస్ అగ్రనేతలు తెలంగాణ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లే ఉన్నారు. గట్టి ఎఫర్టుపెడితే పార్టీ అధికారంలోకి వచ్చేయటం ఖాయమనే సర్వే రిపోర్టులతో పార్టీ సీనియర్లతో పాటు అగ్రనేతల్లో కూడా మంచి ఊపు కనబడుతోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపధ్యంలో ఈనెల 15వ తేదీనుండి రాష్ట్రంలో బస్సుయాత్ర మొదలుపెట్టాలని పార్టీ డిసైడ్ చేసింది. మొత్తం 119 నియోజకవర్గాల్లో బస్సుయాత్ర చేయాలని, అందులో సీనియర్లతో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ నేతలుండేట్లుగా …

Read More »

పయ్యావులతో చంద్రబాబు ఏం చెప్పారు?

సీఎం జగన్ పై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ సంచలన వ్యాఖ్యలు చేశారు. మైలవరంలో చంద్రబాబు అరెస్టుకు నిరసనగా కళ్లకు గంతలు కట్టుకొని చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఉమ….జగన్ పై విమర్శలు గుప్పించారు. 151 సీట్ల అధికార మదం, రెండున్నర లక్షల కోట్ల ధన మదం కలగలిసిన జగన్ ఎగతాళిగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. జగన్ రెడ్డీ…మిడిసిపడమాకు త్వరలో ప్రజలు ఓటు అనే ఆయుధంతో గద్దె …

Read More »

చంద్ర శేఖర్ రావుజీ…అమిత్ షా సెటైర్లు

తెలంగాణ శాసన సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో ఎన్నికల వేడి రాజుకుంది. ఎన్నికలకు మరో 50 రోజుల గడువు మాత్రమే ఉండడంతో అన్ని ప్రధాన పార్టీలు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా తెలంగాణలోని ఆదిలాబాద్ లో నిర్వహించిన బీజేపీ జన గర్జన సభకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పై అమిత్ షా విమర్శలతో విరుచుకుపడ్డారు. “చంద్రశేఖర్ …

Read More »

లోకేష్ విచారణ..హఠాత్తుగా అధికారి మార్పు

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పు కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈరోజు సిఐడి విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. తాడేపల్లి సిట్ కార్యాలయంలో లొకేషన్ సిఐడి అధికారులు ప్రశ్నిస్తున్నారు. అయితే, ఓవైపు విచారణ జరుగుతుండగానే ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. లోకేష్ ను విచారణ జరుపుతున్న దర్యాప్తు అధికారిని హఠాత్తుగా మారుస్తున్నట్లుగా జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం షాకింగ్ గా మారింది. …

Read More »

కేసీయార్ రెడీ అవుతున్నారా ?

ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వెంటనే కేసీయార్ యాక్టివ్ అయిపోతున్నారు. ఈనెల 15వ తేదీ నుంచి తన షెడ్యూల్ రెడీ చేసుకున్నారు. పార్టీ ఆఫీస్ లో 15వ తేదీన అభ్యర్ధులందరితో భేటీ పెట్టుకున్నారు. ఈలోగానే మ్యానిఫెస్టోకి రూపకల్పన చేయబోతున్నారు. అదే రోజు అందరికీ బీఫారాలు అందించాలని డిసైడ్ అయ్యారు. ఎక్కడైనా అభ్యర్ధుల మార్పులు చేర్పులు చేయాలంటే ఈలోపే చేసేయాలని కూడా అనుకున్నారు. 16వ తేదీన హుస్నాబాద్ లో ప్రచారాన్ని లాంఛనంగా మొదలుపెట్టి …

Read More »