“తెల్లారే సరికి పింఛన్లు పంచకపోతే ప్రపంచం తలకిందులు అవుతుందా? ఇది ఉద్యోగులను క్షోభ పెట్టినట్టు కాదా? మహిళా ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. వారిని కనీసం పట్టించుకోకుండా.. ఉదయం 5 గంటలకే ఇళ్లకు తోలుతున్నారు. ఇదేం పద్ధతి“- ఇదీ.. వైసీపీ సానుభూతి పరుడుగా పేరొందిన ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి… (రామిరెడ్డి) చేసిన వ్యాఖ్యలు. అయితే.. ఈ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు నిప్పులు చెరుగుతున్నారు. ఉద్యోగులు ఉన్నది ప్రజలకు …
Read More »రేవంత్ కోరికల చిట్టా.. ప్రధాని చిరునవ్వులు.. ఏం జరిగింది?
ఏ రాష్ట్రమైనా కేంద్రం ముందు ఒకప్పుడు తల ఎగరేసిన పరిస్థితి ఉండేది. పట్టుబట్టి సాధించుకునే ప్రాజెక్టులు కూడా కనిపించేవి. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఎవరూ కేంద్రం ముందు గట్టిగా మాట్లాడే పరిస్థితి లేకుండా పోయింది. రాష్ట్ర శ్రేయస్సు కోసం ఒక మెట్టు తగ్గాల్సిందే. రాజకీయంగా ఫైర్ అయినా.. కేంద్రం వద్దకు వచ్చేసరికి ఫ్లవర్లుగా మారుతున్న పరిస్థితి దాదాపు అన్ని రాష్ట్రాల దగ్గర కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా …
Read More »పేపర్ మిల్లు మూత… ఏం జరిగింది?
ఏపీలో కూటమి సర్కారుకు పెద్ద చిక్కే వచ్చింది. ఒకవైపు ఉపాధి, ఉద్యోగాల కల్పనతో ముందుకు సాగు తున్న సర్కారుకు.. ఇప్పుడు `లాకౌట్` రూపంలో పెను సవాల్ ఎదురైంది. రాజమండ్రిలోని `అంతర్జాతీయ ఏపీ పేపర్ మిల్స్`కు యాజమాన్యం తాళం వేసింది. ఎలాంటి ముందస్తు ప్రకటనలు చేయకుండానే లాకౌట్ చేయడంతో ప్రత్యక్షంగా 52 వేల మంది , పరోక్షంగా 4 లక్షల మందిపై ప్రభావం చూపుతోంది. దీనిపై యాజమాన్యం మౌనంగా ఉంది. మరోవైపు …
Read More »లాయర్ లేకుంటే విచారణకు నో అన్న కేటీఆర్
ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. అయితే, తన లాయర్ ను పోలీసులు, ఏసీబీ అధికారులు అనుమతించకపోవడంపై కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దాదాపు 40 నిమిషాల పాటు పోలీసులు, అధికారులకు..కేటీఆర్, ఆయన లాయర్లకు మధ్య వాగ్వాదం జరిగింది. లాయర్ ను …
Read More »కమ్మ వారిని జగన్ వేధించారు: మాజీ ఐపీఎస్ ఫైర్
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్పై ఐపీఎస్ మాజీ అధికారి.. జగన్ ప్రభుత్వంలో పూర్తిగా సస్పెన్షన్కు గురైన ఆలూరి బాల వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కమ్మ వారిపై గత ప్రభుత్వం బహిరంగ యుద్ధం చేసిందన్నారు. అయినా.. కొందరు తట్టుకుని నిలబడితే.. మరికొందరు.. కనుమరుగయ్యారని చెప్పారు. కమ్మ సమాజం తన అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు ఎప్పటికప్పుడు పోరాడాల్సిన దుస్థితి వచ్చిందని చెప్పారు. ఇక, ముందు ఇలాంటి పోరాటాలకు అవకాశం లేకుండా.. కమ్మ …
Read More »భక్తులకు చేరువగా చైర్మన్.. టీటీడీ ప్రక్షాళన!
తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రక్షాళన కొనసాగుతూనే ఉంది. అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. భక్తులకు-భగవంతుడికి మధ్య టీటీడీ బోర్డు ఉంటుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే.. బోర్డు చైర్మన్గా ఉన్న వ్యక్తి భక్తులకు కనిపించడం చాలా చాలా అరుదు. ఏదైనా ఉత్సవాల సమయంలో మాత్రమే ఆయన బయటకు వచ్చి.. వాహనసేవలో పాల్గొని అలా వెళ్లిపోతారు. సాధారణ భక్తులకు కనిపించడం కూడా చాలా కష్టం. వారు వీరు అని తేడా …
Read More »జేసీ నోట `క్షమా` మాట.. సర్దుకున్నట్టేనా?
ఏపీలో కూటమిగా ఉన్న టీడీపీ-బీజేపీ మధ్య సఖ్యత బాగానే ఉన్నా.. క్షేత్రస్థాయిలో కొన్ని కొన్ని నియోజక వర్గాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు మాత్రం కూటమికి కుంపటి పెట్టేలా నాయకులు వ్యవహరిస్తున్నారు. దీనిలో ప్రధానంగా అనంతపురం జిల్లాకు చెందిన తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, టీడీపీనాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డి ఒకరు. తాజాగా ఆయన బీజేపీ నేతలపై విరుచుకుపడ్డారు. మహిళా నాయకుల విమర్శలపై ప్రతి విమర్శలు చేశారు. దీనిపై తీవ్ర రగడ చోటు …
Read More »ప్రగతి రథం రైలు బండి… రేవంత్ జమానాలో మెరుపులు!
ప్రగతి రథం రైలు బండి పోతున్నాది.. అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాడుకుంటున్నారు. ఏడాది పాలనలో తెలంగాణలో సీఎం రేవంత్ సర్కారు అనేక మెరుపులు మెరిపించింది. ఉద్యోగాలు, ఉపాధి, రైతు రుణమాఫీ, బస్సు ప్రయాణాలు వంటివి అందిస్తూనే.. మరోవైపు.. అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. తాజాగా ఈ విషయాలనే సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. దేశంలో ఏ ప్రభుత్వమూ ఇప్పటి వరకు చేయని విధంగా ఏడాది పాటు తాము ప్రజలపై వరాల …
Read More »జనం… జగన్ను మరిచిపోతున్నారు: నారా లోకేష్
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్పై టీడీపీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ను జనం మరిచిపోతున్నారని వ్యాఖ్యానించారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 80 శాతం మంది ప్రజలు `జగన్ అంటే ఎవరు?` అని ప్రశ్నిస్తున్నారని.. మరో 20 శాతం మంది కూడా త్వరలోనే మరిచిపోయే రోజు రానుందని చెప్పుకొచ్చారు. తాజాగా విశాఖలో పర్యటించిన నారా లోకేష్.. ప్రధాన మంత్రి రాక నేపథ్యంలో ఏర్పాట్లను …
Read More »హైడ్రా ఎఫెక్ట్: ఇలా చూశారు… అలా కూల్చారు
తెలంగాణలో హైడ్రా దూకుడు కొనసాగుతోంది. కొన్నాళ్ల పాటు మందగించినా.. ఇప్పుడు మళ్లీ పుంజుకుంది. తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్.. మాదాపూర్లోని అయ్యప్ప సొసైటీలో శనివారం పర్యటించారు. ఇక్కడ అక్రమంగా కడుతున్న ఐదు అంతస్థుల భవనంపై ఆయన దృష్టి పెట్టారు. ఇది అక్రమ నిర్మాణం అంటూ.. కొన్ని ఫిర్యాదులు కూడా వచ్చాయి. అయితే.. అయ్యప్ప సొసైటీ కీలకనేతకు చెందింది కావడం తో చాలా వరకు తాత్సారం జరిగింది. అయినప్పటికీ.. ఒత్తిళ్లు పెరుగుతున్న …
Read More »విద్యా వ్యవస్థలో రాజకీయాలొద్దు: లోకేశ్!
వైసీపీ హయాంలో జగన్ విద్యార్థులకు గోరుముద్ద నుంచి అమ్మఒడి వరకు అన్నీ ఇచ్చారని వైసీపీ నేతలు గొప్పలు చెప్పుకున్న సంగతి తెలిసిందే. కానీ, ఇంటర్ విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకాన్ని జగన్ ఆపేసారని ఎంతమందికి తెలుసు? 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులకూ మధ్యాహ్న భోజన పథకం అమలు చేసింది. అయితే, జగన్ అధికారంలోకి రాగానే అమ్మఒడి ఇస్తున్నాం కదా..ఇక, మధ్యాహ్న భోజనం ఎందుకు అని ఆ పథకాన్ని …
Read More »జేసీ కామెంట్లపై తగ్గేదేలే అంటోన్న మాధవీ లత
మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తన బస్సులను బీజేపీ నేతలు తగులబెట్టారని, వారి కంటే జగన్ చాలా నయమని జేసీ చేసిన కామెంట్లు రాజకీయ కాక రేపాయి. ఇక, టాలీవుడ్ నటి, బీజేపీ నేత మాధవీ లతను జేసీ అసభ్య పదజాలంతో దూషించడాన్ని మంత్రి సత్యకుమార్ తో పాటు బీజేపీ నేతలు …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates