Political News

మా దెబ్బ ఇంకా బలంగా ఉంటుంది: సజ్జల

ఆంధ్రప్రదేశ్‌ను ఐదేళ్ల పాటు పాలించిన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన నేతల్లో సజ్జల రామకృష్ణారెడ్డి ఒకరు. వైసీపీ అధికారంలోకి రావడానికి ముందు వరకు సజ్జల పెద్దగా వార్తల్లో ఉండేవారు కాదు. పార్టీలో ఆయన ప్రాధాన్యం కూడా పెద్దగా కనిపించేది కాదు. కానీ ప్రభుత్వ ఏర్పాటు తర్వాత ఆయన చాలా కీలకంగా మారిపోయారు. పేరుకు ప్రభుత్వ సలహాదారు అయినా.. కీలక మంత్రిత్వ శాఖల కార్యకలాపాలన్నీ ఆయన కనుసన్నల్లోనే జరిగేవి. …

Read More »

ప్రభుత్వానికి, ఇండస్ట్రీకి మధ్య వారధి అవుతా: దిల్ రాజు

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ రోజు అల్లు అర్జున్ పోలీసుల విచారణకు కూడా హాజరయ్యారు. ఈ ఇష్యూ నేపథ్యంలో ప్రభుత్వానికి, సినీ పరిశ్రమకు మధ్య గ్యాప్ పెరుగుతోందని చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటు ప్రభుత్వానికి, అటు ఇండస్ట్రీకి మధ్య వారధిలా ఉంటానని ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్, …

Read More »

శాలువాలతో డ్రెస్సులు..చింతమనేని ఐడియా అదిరింది

రాజకీయ నాయకులకు సన్మానాలు, సత్కారాలు కామన్. అభిమానులు..కార్యకర్తలు తమ నేతను కలిసినపుడు మర్యాదపూర్వకంగా శాలువాలు కప్పుతుంటారు. తమకు గౌరవార్థం ఇచ్చారు కాబట్టి ఈ శాలువాలను వేరే వారికి ఇవ్వాలన్న ఆలోచన రాదు. దీంతో, ఆ శాలువాలలో చాలా బీరువాలలో నిరుపయోగంగా పడుంటాయి. ఇటువంటి నేపథ్యంలోనే ఆ శాలువాలతో చిన్న పిల్లలకు డ్రెస్సులు కుట్టించే వినూత్న ఆలోచనకు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ శ్రీకారం చుట్టారు. అప్పుడపుడు వివాదాలలో పేరు వినిపించినప్పటికీ …

Read More »

కేసీఆర్‌, హ‌రీష్ రావుకు ఊర‌ట‌!

తెలంగాణ మాజీ ముఖ్య‌మంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌, ఆయ‌న మేన‌ల్లుడు, అప్ప‌టి ఆర్థిక మంత్రి హ‌రీష్‌రావుల‌కు తెలంగాణ హైకోర్టులో భారీ ఊర‌ట ల‌భించింది. వారిపై న‌మోదు చేసిన కేసు, భూపాల‌ప‌ల్లి జిల్లా సెష‌న్సు కోర్టు ఇచ్చిన ఆదేశాల‌ను హైకోర్టు ధ‌ర్మాస‌నం స‌స్పెండ్ చేసింది. దీంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులకు హైకోర్టులో ఊరట లభించిన‌ట్ట‌యింది. ఈ సంద‌ర్భంగా ధ‌ర్మాసనం స్పందిస్తూ.. జిల్లా కోర్టు ఇచ్చిన ఆర్డర్స్ …

Read More »

ప్ర‌తి రోజూ అటెండెన్స్‌.. చంద్ర‌బాబు మ‌రో నిర్ణ‌యం

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. త‌న కేబినెట్ మంత్రుల‌కు ప‌క్కా నిబంధన అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించారు. జ‌న‌వ‌రి 1వ తేదీ నుంచి అమ‌లు చేసే ఈ నిబంధ‌న‌ను అంద‌రూ త‌ప్ప‌నిస‌రిగా పాటించాల‌ని ఆదేశించారు. ప్ర‌స్తుతం అధికారుల‌కు, ఉద్యోగుల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైన అటెండెన్సును.. ఆయ‌న మంత్రుల‌కు కూడా విస్త‌రించారు. జ‌న‌వ‌రి 1వ తేదీ నుంచి నూత‌నంగా అందు బాటులోకి తీసుకువ‌చ్చే ప్ర‌త్యేక యాప్‌లో అటెండెన్స్ వేయ‌నున్నారు. ప్ర‌త్యేక …

Read More »

అమ‌రావ‌తి ప్ర‌మోష‌న్ .. ధూం ధాంగా.. !

రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణానికి రాష్ట్ర ప్ర‌భుత్వం పెద్ద ఎత్తున ప్రాధాన్యం ఇస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే నిధుల స‌మీక‌ర‌ణ‌కు కూడా.. ప్రాధాన్యం ఇచ్చారు. అప్పు రూపంలోనో.. మ‌రో విధంగానో.. ఇప్పుడు అమ‌రావ‌తికి నిధులు అయితే వ‌స్తున్నాయి. దీంతో జ‌న‌వ‌రి నుంచి ప‌నులు కూడా ప‌రుగులు పెట్ట‌నున్నాయి. వ‌చ్చే రెండున్న‌ర లేదా.. మూడు సంవ‌త్స‌రాల్లో అమ‌రావ‌తిని ప‌రుగులు పెట్టించ‌నున్నారు. టెండ‌ర్ల‌ను కూడా.. ఈ నెల ఆఖ‌రులో ఖ‌రారు చేయ‌నున్నారు. అయితే.. నిర్మాణాల …

Read More »

చంద్ర‌బాబుకు కొన్ని ఆర్థిక ఇబ్బందులు ..!

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌ళ్లీ పాత పాటే పాడారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో ఉన్న ఆర్థిక స‌మ‌స్య‌లు చూస్తే.. తన క‌డుపు త‌రుక్కుపోతోంద‌న్నారు. త‌న‌కు నిద్ర కూడా ప‌ట్ట‌డం లేద‌ని చెప్పారు. వైసీపీ పాల‌న‌లో ధ్వంసమైన ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ఎలా గాడిలో పెట్టాలో కూడా.. త‌న‌కు అర్థం కావ‌డం లేద‌న్నారు. వాస్త‌వానికి చంద్రబాబు ప‌గ్గాలు చేప‌ట్టిన త‌ర్వాత‌.. అనేక సంద‌ర్భాల్లో ఇది చెబుతూనే ఉన్నారు. రాష్ట్రంలో వ్య‌వ‌స్థ‌ల‌ను గాడిలో పెడుతున్నామ‌న్నారు. ఆర్థిక …

Read More »

రేవంత్ ది ప్రతీకార పాలన: కవిత

సంధ్య థియేటర్ తొక్కిసలాట వ్యవహారం నేపథ్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం రాజకీయ రంగు పులుముకున్న సంగతి తెలిసిందే. ఈ ఇష్యూపై డైరెక్ట్ గా సీఎం రేవంత్ రెడ్డి జాతీయ మీడియాతో పాటు తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడడం సంచలనం రేపింది. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. ప్రతీకార పాలనకు రేవంత్ రెడ్డి తెరలేపారని, హామీలు, ప్రజా సమస్యల …

Read More »

అల్లు అర్జున్ కు మరోసారి లీగల్ నోటీసులు!

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో షాకిచ్చారు. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని అల్లు అర్జున్ కు చిక్కడపల్లి పోలీసులు నోటీసులిచ్చారు. ఆ తొక్కిసలాట ఘటనపై విచారణ జరిపేందుకు అల్లు అర్జున్ కు నోటీసులిచ్చినట్లు తెలుస్తోంది. అయితే, అల్లు అర్జున్ మీడియా సమావేశం ఏర్పాటు చేసిన విషయం, అందులో చేసిన వ్యాఖ్యలపై …

Read More »

పుష్ప కాదు జై భీమ్ హీరో అంటోన్న సీతక్క!

తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు అల్లు అర్జున్ స్పందించడంతో వ్యవహారం ముదిరింది. ఆ తర్వాత అల్లు అర్జున్ పై, పుష్ప చిత్రంపై కాంగ్రెస్ నేతలు మరిన్ని విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పుష్ప చిత్రంపై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. జై భీమ్ వంటి సందేశాత్మక …

Read More »

రేవంత్ దగ్గరికి సినీ పెద్దలు?

పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని అనుకున్నా ఇబ్బంది లేని పరిస్థితి.. ఇలా తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారు అధికారంలోకి వచ్చాక తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి అంతా అనుకూలంగానే కనిపించింది. కానీ సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన తర్వాత అంతా మారిపోయింది. అల్లు అర్జున్ అరెస్ట్, తదనంతర పరిణామాలతో తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా స్పందించి.. ఇకపై …

Read More »

బన్నీ గొడవ.. నేషనల్ మీడియాకు సీపీ క్షమాపణ!

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల మీడియాలో ఇదే అతి పెద్ద చర్చనీయాంశం. ఈ వ్యవహారంపై నేషనల్ మీడియాలో సైతం చర్చ జరుగుతోంది. గత రెండు రోజుల పరిణామాలతో ఈ గొడవ ఇంకా పెద్దది అయిపోయింది. మొన్న అల్లు అర్జున్ ప్రెస్ మీట్ సందర్భంగా.. తనపై వస్తున్న ఆరోపణలన్నింటినీ తిప్పికొట్టడం, పోలీసులు చేసిన వ్యాఖ్యలను …

Read More »