Political News

రేవంత్ కోసం షబ్బీర్ అలీ త్యాగం

మొదటి నుంచి కాంగ్రెస్ తోనే రాజకీయ ప్రయాణం సాగిస్తున్న సీనియర్ నాయకుడు ఆయన. 1989 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి.. చెన్నారెడ్డి మంత్రివర్గంలో రాష్ట్ర తొలి మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. 2004లో మరోసారి వైఎస్సార్ ప్రభుత్వంలోనూ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. కానీ వరుసగా ఓటములు ఆయన రాజకీయ జీవితానికి బ్రేకులేశాయి. కానీ పట్టు వదలకుండా ఆయన ముందుకు సాగుతూనే ఉన్నారు. ఈ సారి తెలంగాణలో …

Read More »

పవన్ అక్కడి నుంచే.. జెండా ఊపిన బాబు

వచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ పోటీ చేసే స్థానం ఖాయమైందా? మరోసారి ఆయన భీమవరం నుంచి బరిలో దిగబోతున్నారా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. తాజాగా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో చర్చల సందర్భంగా పవన్ పోటీ చేసే స్థానం ఖరారైందని తెలిసింది. మరోసారి భీమవరం నుంచే లక్ పరీక్షించుకోవాలని పవన్ భావించగా.. అందుకు బాబు సరేనన్నారని …

Read More »

ప్రచార పంథాలో కేటీఆర్ మార్కు

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించేందుకు అధినేత కేసీఆర్ కష్టపడుతున్నారు. మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పార్టీ అభ్యర్థుల విజయానికి పాటుపడుతున్నారు. వివిధ నియోజకవర్గాల్లో ప్రచారంలో పాల్గొంటూ ప్రజల ఓట్లను మరోసారి సాధించే దిశగా సాగుతున్నారు. తన సొంత నియోజకవర్గంలో సిరిసిల్లాలో పరిస్థితిని సమన్వయం చేసుకుంటూనే.. మరోవైపు ఇతర అభ్యర్థుల విజయం కోసం వ్యూహాల్లో కేటీఆర్ మునిగిపోయారు. ఈ నేపథ్యంలో ప్రచారంలో కేటీఆర్ కొత్త ట్రెండు క్రియేట్ …

Read More »

ఇప్పుడంత ఈజీకాదు.. చెమ‌టోడ్చ‌క త‌ప్ప‌దు నాయ‌కా!

ఇన్నిచ్చాం.. అన్నిచ్చాం.. ఏదేదో చేసేశాం.. అని చెప్పుకొని మెప్పుపొంది గాలివాటంగా ప్ర‌చారం చేసుకు నే ప‌రిస్థితి ఇప్పుడు క‌నిపించ‌డం లేదు. మా నేతే అని ఓట్లు గుద్దేసే ప‌రిస్థితి కూడా ఇప్పుడు ప్ర‌జ‌ల్లో క‌నిపించ‌డం లేదు. మొత్తంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో నాయ‌కుల జాత‌కాలు మార్చేది.. మారేదీ.. చెమ‌టోడిస్తేనే అని అంటున్నారు ప‌రిశీల‌కులు. నిజానికి 2018లో సెంటిమెంటు రాజేసి విజ‌య తీరం చేరిన బీఆర్ ఎస్‌కు.. ఇప్పుడు పెద్ద‌గా సెంటిమెంటు …

Read More »

బొల్లా వ‌ద్దే వ‌ద్దు… సుధ ముద్దు.. వైసీపీలో కొత్త రాగం…!

“నాకు తిరుగులేదు.. నేను చెప్పిందే వేదం” అంటూ.. ప‌దే ప‌దే చెప్పుకొనే వైసీపీ నాయ‌కుడు, ఉమ్మ‌డి గుంటూరు జిల్లా వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్ర‌హ్మ‌నాయుడుకు ఆయ‌న వ్య‌వ‌హార శైలే ఇప్పుడు పెద్ద క‌ష్టంగా మారింది. మ‌రో ఐదు మాసాల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఇప్ప‌టి నుంచే బొల్లాకు వ్య‌తిరేకంగా.. సొంత పార్టీ నాయ‌కులే చ‌క్రం తిప్పుతున్నారు. బొల్లా వ‌ద్దు.. సుధ ముద్దు! అంటూ.. నాయ‌కులు ప్ర‌చారం చేస్తున్నారు. 2019 ఎన్నిక‌ల్లో …

Read More »

ప‌న్నుల వ‌సూళ్ల‌లో ఏపీ టాప్.. 12 శాతం వృద్ధి.. క‌ర్ణాట‌క‌కు పోటీ!

ప‌న్నుల వ‌సూళ్లు.. ఇది ఏ దేశానికైనా.. రాష్ట్రానికైనా కీల‌క అంశం. ప‌న్నుల రాబ‌డిని బ‌ట్టి ఆయా దేశాలు, రాష్ట్రాల అభివృద్ధి పురోగ‌త‌ని ఆర్థిక వేత్త‌లు అంచ‌నా వేస్తారు. ఇక‌, దేశంలో గూడ్స్ అండ్ స‌ర్వీస్ ట్యాక్స్ (జీఎస్టీ) అమ‌ల్లోకి వ‌చ్చిన త‌ర్వాత ప్ర‌తి పైసా కూడా ఖ‌చ్చితంగా లెక్కించే ప‌రిస్థితి అందుబాటులోకి వ‌చ్చింది. దీంతో ఇప్పుడు ఆయా జీఎస్టీ ఆదాయాల ఆధారంగా రాష్ట్రాల పురోగ‌తిని, ప్ర‌జ‌ల వ్యాపార లావాదేవీలు.. వ‌స్తు …

Read More »

కేసీయార్ లెక్క తప్పుతోందా ?

రాబోయే ఎన్నికల్లో ఓట్ల పోలరైజేషన్ విషయంలో కేసీఆర్ లెక్క తప్పుతోందా ? క్షేత్ర స్ధాయిలో జరగుతున్నది చూస్తుంటే ఇదే అనుమానం పెరిగిపోతోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలితే బీఆర్ఎస్ కే లాభమని కేసీయార్ తో పాటు అధికారపార్టీ నేతలంతా అంచనా వేశారు. అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా కాంగ్రెస్ పార్టీ చక్రం తిప్పుతోంది. దాంతో ముందు టీడీపీ తరువాత వైఎస్సార్టీపీ పోటీ నుండి విరమించుకున్నాయి. టేజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ …

Read More »

సుప్రీంకోర్టుకు ఎందుకు లేఖ రాశారు ?

బీజేపీ ఏపీ అధ్యక్షురాలు సుప్రీంకోర్టుకు లేఖ రాయటంపై ఇఫుడు పెద్ద చర్చ మొదలైంది. జగన్మోహన్ రెడ్డి, విజయసాయి బెయిల్ వెంటనే రద్దు చేయాలని పురందేశ్వరి సుప్రింకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ కు లేఖ రాసిన విషయం తెలిసిందే. న్యాయవ్యవస్ధలోని లోపాలను అడ్డుపెట్టుకుని విజయసాయి అరాచకాలకు పాల్పడుతున్నట్లు లేఖలో ఆమె ఆరోపణలు చేశారు. కాబట్టి జగన్, విజయసాయి బెయిల్ ను వెంటనే రద్దు చేయాలని ఆమె కోరారు. సరే ఆమె …

Read More »

దళిత బంధు ముంచేస్తుందా ?

రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్ధులను దళితబంధు పథకమే ముంచేస్తుందేమో అనే ప్రచారం పెరిగిపోతోంది. ఎందుకంటే ప్రతి బహిరంగసభలోను కేసీయార్ ఈ పథకం గురించి పదేపదే ప్రస్తావిస్తున్నారు. దళితబంధు పథకం సృష్టికర్తను తానే అని ఈ పథకాన్ని బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉందా అని చాలెంజ్ చేస్తున్నారు. నిజానికి కేసీయార్ చాలెంజులో అర్ధమేలేదు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి పెట్టిన పథకం మరో ముఖ్యమంత్రి ఎలా ప్రవేశపెట్టగలరు ? ఒక్కొక్కళ్ళకి …

Read More »

మేనిఫెస్టోపై బాబుతో పవన్ కీలక భేటీ

స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 52 రోజులపాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ పై ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాదులో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి గురించి పవన్ ఆరా తీశారు. చంద్రబాబును …

Read More »

ఏబీపీ-సీఓట‌రు స‌ర్వే.. తెలంగాణ నాడి దొరికిన‌ట్టేనా?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఎవ‌రు గెలుస్తారు?  ఎవ‌రు ఓడతారు? ఏ పార్టీకి ఎన్ని సీట్లు వ‌స్తాయి? ఏ పార్టీ మెజారిటీ ద‌క్కించుకుని అధికారంలోకి వ‌స్తుంది?  ఓట్ల షేరింగ్‌.. ఓటు బ్యాంకు పాలిటిక్స్ ఎలా న‌డుస్తాయి?  ఇవ‌న్నీ.. న‌రాలు తెగే ఉత్కంఠ‌ను రేపుతూనే ఉన్నాయి. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే అనేక సంస్థ‌లు త‌మ తమ స‌ర్వేల‌ను ప్ర‌క‌టించాయి. కొన్ని కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉంటే.. మెజారిటీ స‌ర్వేలు మాత్రం బొటాబొటిగా ఫ‌లితం …

Read More »

విజయసాయిరెడ్డిపై సుప్రీం కోర్టులో పురందేశ్వరి ఫిర్యాదు

వైసీపీ అధినేత జగన్ తోపాటు ఎంపీ విజయసాయిరెడ్డిలు అక్రమాస్తుల కేసులో బెయిల్ పై ఉన్న సంగతి తెలిసిందే. దాదాపు పదేళ్లుగా సీబీఐ, ఈడీ కేసుల విచారణను ఎదుర్కొంటున్న ఈ ఇద్దరు బెయిల్ పై ఉండి అధికార పార్టీ తరఫున అధికారం చలాయిస్తున్నారని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే విజయసాయిరెడ్డిపై బీజేపీ ఏపీ అధ్యక్షురాలు విమర్శలు గుప్పించారు. విజయసాయిరెడ్డిపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ …

Read More »