Political News

ఐటీ కపుల్స్ లైఫ్ స్టైల్ పై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

ఏపీలో జాతీయ విద్యాదినోత్సవం ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విజయవాడలో రాష్ట్ర ఉత్తమ అధ్యాపక, ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిని సీఎం చంద్రబాబు, విద్యాశాఖా మంత్రి నారా లోకేష్, మంత్రులు సన్మానించారు. ఈ నేపథ్యంలోనే ఉపాధ్యాయుల గురించి సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి శిరస్సు వంచి‌ పాదాభివందనం చేస్తున్నానని చంద్రబాబు అన్నారు. విద్యార్ధుల భవిష్యత్తును తీర్చిదిద్దే గురుతర బాధ్యత గురువులదని, తల్లిదండ్రులు …

Read More »

ఏపీలో టాటా పెట్టుబ‌డులు ఇవే..

ఏపీలో అభివృద్ధిని ప‌రుగులు పెట్టించేలా.. సీఎం చంద్ర‌బాబు విజ‌న్‌-2047 మంత్రాన్ని జ‌పిస్తున్న విష‌యం తెలిసిందే. దీనిలో భాగంగా ఆయ‌న విజ‌న్‌-2047 టాస్క్‌ఫోర్స్‌ను రెండు వారాల కిందటే ఏర్పాటు చేశారు. ఈ క‌మిటీకి సీఎం చంద్ర‌బాబు చైర్మ‌న్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. స‌హ చైర్మ‌న్‌గా టాటాగ్రూప్ చైర్మ‌న్ చంద్ర‌శేఖ‌ర‌న్ వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తాజాగా ఈ క‌మిటీ.. సోమ‌వారం సాయంత్రి అమ‌రావ‌తిలో భేటీ అయింది. ఈ భేటీకి ప‌లువురు పారిశ్రామిక దిగ్గ‌జాలు కూడా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా …

Read More »

‘గత CM ఆత్మలతో మాట్లాడి అడ్డగోలు నిర్ణయాలు తీసుకున్నారు’

జాతీయ విద్యాదినోత్సవాన్ని విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ఉత్తమ అధ్యాపక, ఉపాధ్యాయులను ప్రభుత్వం సన్మానించింది. అవార్డు గ్రహీతలకు రూ. 20 వేల నగదు, షీల్డ్స్‌, శాలువాతో సత్కరించింది. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, విద్యా శాఖా మంత్రి లోకేష్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన లోకేష్ తన శాఖ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు విద్యాశాఖ అప్పగించగానే …

Read More »

అల‌గ‌డం ప్ర‌జాస్వామ్యంలో స‌రికాదు – చంద్ర‌బాబు

ఏపీ అసెంబ్లీ స‌మావేశాల‌కు సంబంధించి సీఎం చంద్ర‌బాబు తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా ప్రారంభ‌మైన బ‌డ్జెట్ స‌మావేశాలు తొలిరోజు బ‌డ్జెట్ ప్ర‌సంగంతో ప్ర‌శాంతంగా సాగిపోయాయి. అయితే.. ఈసమావేశాల‌కు ప్ర‌తిప‌క్ష వైసీపీ అధినేత జ‌గ‌న్ స‌హా ఇత‌ర స‌భ్యులు ఎవ‌రూ హాజ‌రు కాలేదు. ఈ ప‌రిణామంపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు, వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. దీనిపై తాజాగా మీడియా ప్ర‌తినిధులు చంద్ర‌బాబు దృష్టికి తీసుకువెళ్లారు. ఈ స‌మ‌యంలో ఆయ‌న స్పందిస్తూ.. ఎవ‌రి కోస‌మూ …

Read More »

‘జ‌గ‌న్ ఒక్క‌డు ఒక‌వైపు.. ప్ర‌జ‌లంతా మావైపు’

ఏపీ అసెంబ్లీ స‌మావేశాల‌ను స‌జావుగా న‌డిపించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని స్పీక‌ర్ అయ్య‌న్న పాత్రుడు తెలిపారు. స‌భ‌కు రాని వారి సంగ‌తి ఏం చేయాల‌నే విష‌యాన్ని చ‌ట్టానికి వ‌దిలి పెట్ట‌నున్న‌ట్టు తెలిపారు. జ‌గ‌న్ ఒక్క‌డు ఒక‌వైపు.. ప్ర‌జ‌లంతా మావైపు ఉన్నారు. దీనిని బ‌ట్టి.. ఏం చేయాల‌నే విష‌యాన్ని చ‌ట్టం ప్ర‌కారం ఆలోచించి నిర్ణ‌యిస్తాం అని స‌భ‌కు రాకుండా ఉన్న వైసీపీ ఎమ్మెల్యేల విష‌యంపై స్పీక‌ర్ అయ్య‌న్న పాత్రుడు న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేశారు. స‌భ‌లో …

Read More »

నేత‌ల భార్య‌లే టార్గెట్‌: విర్ర‌వీగిన‌ వ‌ర్రా

వైసీపీ సోష‌ల్ మీడియాలో విర్ర‌వీగి.. అస‌భ్య ప‌ద‌జాలంతో దూకుడు ప్ర‌ద‌ర్శించి.. అదే గొప్ప‌గాఫీలైన వారి భ‌ర‌తం ప‌ట్టేందుకు ఏపీ ప్ర‌భుత్వం సిద్ధ‌మైంది. ఈ క్ర‌మంలో వైసీపీ సోష‌ల్ మీడియాలో బూతులను మించిన స్థాయిలో ప‌చ్చి కారుకూత‌ల‌తో రెచ్చిపోయిన వ‌ర్రా ర‌వీంద్రారెడ్డి స‌హా సుబ్బారెడ్డి, ఉద‌య్‌ల‌ను తాజాగా క‌ర్నూలు జిల్లా పోలీసులు, క‌డ‌ప జిల్లా అధికారులు సంయుక్తంగా ప‌ట్టుకున్నారు. ఈ క్ర‌మంలో అస‌లు వీరి టార్గెట్ ఎవ‌రు? ఏంటి? అనే విష‌యాల‌ను …

Read More »

40 రోజుల్లో ఏపీలో మహిళలకు బస్సు ప్రయాణం ఉచితం

ఏపీలో సూపర్ సిక్స్ పథకాలను ఒక్కొక్కటిగా ప్రభుత్వం అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే. పెన్షన్ ల పెంపు, దీపం పథకం వంటివి అమలు చేసిన కూటమి సర్కార్ మిగతా పథకాల అమలు కోసం కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా ఏపీలో మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం పథకంపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆ పథకంపై మంత్రి పార్థ సారధి కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాదిలోనే ఉచిత …

Read More »

జ‌గ‌న్ కు భారీషాక్‌.. 11 మంది స‌భ్య‌త్వాల ర‌ద్దు?

వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు భారీ షాక్ త‌గ‌ల‌నుందా? ఆయ‌నతోపాటు.. వైసీపీ త‌ర‌ఫున ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్న 11 మంది ఎమ్మెల్యేల స‌భ్య‌త్వాల‌ను ర‌ద్దు చేసే దిశ‌గా కూట‌మి ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుందా? అంటే.. తాజా ప‌రిణామాల‌ను బ‌ట్టి ఔన‌నే చెప్పాలి. కూట‌మి స‌ర్కారు తాజాగా గ‌వ‌ర్న‌ర్ ఎస్. అబ్దుల్ న‌జీర్‌కు లేఖ రాసింది. దీనిలో వైసీపీ ఎమ్మెల్యేల స‌భ్య‌త్వాల‌ను ర‌ద్దు చేయాల‌ని కోరింది. అసెంబ్లీ స‌మావేశాల‌కు …

Read More »

వికారాబాద్ విధ్వంసం: క‌లెక్ట‌ర్‌ను కొట్టిన మ‌హిళ‌

తెలంగాణ‌లోని వికారాబాద్‌లో విధ్వంసం చోటు చేసుకుంది. సాక్షాత్తూ జిల్లా క‌లెక్ట‌ర్‌ను ఓ మ‌హిళ చిత్తు చిత్తుగా కొట్టేసింది. దీంతో తీవ్ర అల‌జ‌డి నెల‌కొంది. జిల్లాలోని ల‌గిచ‌ర్ల‌లో ఫార్మా సిటీని ఏర్పాటు చేయాల‌ని సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం నిర్ణ‌యించుకుంది. అయితే.. ఫార్మాసిటీతో ఇక్క‌డి వ్య‌వ‌సాయ భూములు, పొలాలు దెబ్బ‌తింటాయ‌న్న‌ది స్థానికులు ఆవేద‌న‌. అయిన‌ప్ప‌టికీ.. రైతుల‌ను గ్రామ‌స్థుల‌ను ఒప్పించి అయినా.. ఫార్మాసిటీని నిర్మిస్తామ‌ని ప్ర‌భుత్వం తెలిపింది. ఈ క్ర‌మంలోనే తాజాగా వికారాబాద్ …

Read More »

డ్రోన్ల తో గంజాయి పై యుద్ధం.. బాబు సక్సెస్

కొద్ది రోజుల క్రితం అమరావతి డ్రోన్ సమ్మిట్ 2024ను ఏపీ ప్రభుత్వం ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. డ్రోన్ల టెక్నాలజీ ఓ గేమ్‌ ఛేంజర్‌ అని, డ్రోన్ల సాయంతో రౌడీ షీటర్లకు, అసాంఘిక శక్తులకు చంద్రబాబు ఛాలెంజ్ విసిరారు. డ్రోన్ల ద్వారా విజిబుల్ పోలీసింగ్ తగ్గిస్తామని, ఇన్విజిబుల్ పోలీసింగ్ ద్వారా అసాంఘిక శక్తులు, రౌడీ షీటర్ల ఆట కట్టిస్తామని అన్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు విజన్ ను ఏపీ పోలీసులు …

Read More »

చాగంటి జగన్‌కు నో చెప్పారు తెలుసా?

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పోస్టుల భర్తీకి కొంచెం ఎక్కువ సమయమే తీసుకుంది. ఎట్టకేలకు వాటిని ప్రకటిస్తున్నారు. దీంతో టీడీపీ, జనసేన, బీజేపీ వర్గాల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఆయా పార్టీల కోసం కష్టపడ్డ చాలామందికి పదవులు దక్కాయి. ఈ జాబితాలో కొన్ని ఊహించని పేర్లు కూడా ఉన్నాయి. అలా ఎక్కువమంది దృష్టిని ఆకర్షించి, ఆమోదం పొందిన పేరు.. చాగంటి కోటేశ్వరరావుదే. ప్రవచనాల ద్వారా ఆయన కోట్లాదిమందికి చేరువ అయ్యారు. …

Read More »

జ‌గ‌న్‌ది అవివేకం.. అజ్ఞానం: ష‌ర్మిల

వైసీపీ అధినేత, త‌న సోద‌రుడు జ‌గ‌న్‌పై కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ష‌ర్మిల మ‌రోసారి విమ‌ర్శ‌లు గుప్పించారు. తాజాగా ప్రారంభ‌మైన అసెంబ్లీ స‌మావేశాల‌కు జ‌గ‌న్ ఆయ‌న ఎమ్మెల్యేలు హాజ‌రు కాక‌పోవ‌డాన్ని ఆమె నిశితంగా ప్ర‌శ్నించారు. “అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లుంది జగన్ తీరు” అని వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. అంతేకాదు, అసెంబ్లీ మీద అలగడానికో.. మైకు ఇస్తేనే పోతానని మారాం చేయడానికో కాదు ప్రజలు ఓట్లేసిందన్నారు. తాజాగా ప్రారంభమైన …

Read More »