Political News

మేనిఫెస్టోపై బాబుతో పవన్ కీలక భేటీ

స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 52 రోజులపాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ పై ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాదులో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి గురించి పవన్ ఆరా తీశారు. చంద్రబాబును …

Read More »

ఏబీపీ-సీఓట‌రు స‌ర్వే.. తెలంగాణ నాడి దొరికిన‌ట్టేనా?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఎవ‌రు గెలుస్తారు?  ఎవ‌రు ఓడతారు? ఏ పార్టీకి ఎన్ని సీట్లు వ‌స్తాయి? ఏ పార్టీ మెజారిటీ ద‌క్కించుకుని అధికారంలోకి వ‌స్తుంది?  ఓట్ల షేరింగ్‌.. ఓటు బ్యాంకు పాలిటిక్స్ ఎలా న‌డుస్తాయి?  ఇవ‌న్నీ.. న‌రాలు తెగే ఉత్కంఠ‌ను రేపుతూనే ఉన్నాయి. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే అనేక సంస్థ‌లు త‌మ తమ స‌ర్వేల‌ను ప్ర‌క‌టించాయి. కొన్ని కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉంటే.. మెజారిటీ స‌ర్వేలు మాత్రం బొటాబొటిగా ఫ‌లితం …

Read More »

విజయసాయిరెడ్డిపై సుప్రీం కోర్టులో పురందేశ్వరి ఫిర్యాదు

వైసీపీ అధినేత జగన్ తోపాటు ఎంపీ విజయసాయిరెడ్డిలు అక్రమాస్తుల కేసులో బెయిల్ పై ఉన్న సంగతి తెలిసిందే. దాదాపు పదేళ్లుగా సీబీఐ, ఈడీ కేసుల విచారణను ఎదుర్కొంటున్న ఈ ఇద్దరు బెయిల్ పై ఉండి అధికార పార్టీ తరఫున అధికారం చలాయిస్తున్నారని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే విజయసాయిరెడ్డిపై బీజేపీ ఏపీ అధ్యక్షురాలు విమర్శలు గుప్పించారు. విజయసాయిరెడ్డిపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ …

Read More »

త్వ‌ర‌లోనే ప‌వ‌న్‌-నారా లోకేష్‌లు ఉమ్మ‌డి బ‌హిరంగ స‌భ‌

టీడీపీ అధినేత‌, మాజీ సీఎం చంద్ర‌బాబు ఇంటికి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆ పార్టీ రాజ‌కీయ వ్య‌వ‌హారాల ఇంచార్జ్ నాదెండ్ల మ‌నోహ‌ర్ వెళ్లి ఆయ‌న‌ను ప‌రామ‌ర్శించారు. చంద్ర‌బాబు జైలు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన స‌మ‌యంలో ప‌వ‌న్ కుటుంబ కార్య‌క్ర‌మా ల నేప‌థ్యంలో ఇట‌లీ వెళ్లారు. ఈ క్ర‌మంలో బాబును ప‌రామ‌ర్శించ‌లేక పోయారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఇట‌లీ నుంచి తిరిగి వ‌చ్చిన మ‌ర్నాడే ప‌వ‌న్‌, చంద్ర‌బాబుతో ఆయ‌న నివాసంలో …

Read More »

హైటెక్ సిటీ కట్టింది చంద్రబాబే.. కానీ పునాది వేసింది కాంగ్రెస్!

తెలంగాణలో కేసీఆర్ ను గద్దె దించడమే లక్ష్యంగా కాంగ్రెస్ సాగుతోంది. ఆ దిశగా దొరికిన ఏ చిన్న అవకాశాన్ని కూడా కాంగ్రెస్ వదులుకోవడం లేదు. విమర్శలు, ఆరోపణలతో ముప్పేట దాడి చేస్తూ బీఆర్ఎస్ ను ఓడించాలనే సంకల్పంతో కదులుతోంది. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో హైదరాబాద్ డెవలప్మెంట్ గురించి బీఆర్ఎస్ నేతలు గొప్పగా చెబుతున్నారు. హైదరాబాద్ ను తామే డెవలప్ చేశామని చెప్పుకుంటున్నారు. ఇప్పుడీ విషయంలో కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. హైదరాబాద్ …

Read More »

లోకేష్ బాధలో న్యాయముంది: కేటీఆర్

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టు వ్యవహారంపై తెలంగాణ సీఎం కేసీఆర్ తనయుడు మంత్రి కేటీఆర్ మరోసారి స్పందించారు. చంద్రబాబు అరెస్టు మానవీయ కోణంలో సరికాదని కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగతంగా చూసిన 73 ఏళ్ల వయస్సున్న చంద్రబాబును అరెస్టు చేయడం సరికాదని, ఈ విషయం తెలిసిన ఎవరైనా అయ్యో పాపం అని అంటారని కేటీఆర్ చెప్పారు. ఇక, చంద్రబాబు భద్రతపై లోకేష్ ఆందోళన వ్యక్తం చేయడం …

Read More »

కాంగ్రెస్ లో కొత్త స్ట్రాటజిస్టు

తెలంగాణా కాంగ్రెస్ లో సరికొత్త స్ట్రాటజిస్టు కుమ్మరి శ్రీకాంత్ జోరు మొదలైంది. ఇప్పటికే సునీల్ కనుగోలు చాలాకాలంగా వ్యూహకర్తగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. కర్నాటకలో కాంగ్రెస్ గెలవటానికి ముందునుండే తెలంగాణా కాంగ్రెస్ కు సునీల్ వ్యూహకర్తగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. అయితే సునీల్ వ్యవహారంపై కాంగ్రెస్ సీనియర్లలోనే వివాదాలున్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులపై జరుగుతున్న దుష్ప్రచారానికి వ్యూహకర్త బృందమే కారణమని ఆరోపణలున్నాయి. కారణాలు ఏవైనా, వివాదాలు ఎలాగున్నా కాంగ్రెస్ …

Read More »

19 వేల కోట్ల పెట్టుబడులకు ఏపీ కేబినెట్ ఆమోదం

వైసీపీ పాలనలో రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం లేదని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. జగన్ ను చూసి వ్యాపారవేత్తలు భయపడుతున్నారని, అందుకే, ఏపీకి రావాల్సిన పలు పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయని విమర్శిస్తున్న విషయం విదితమే. విశాఖ పెట్టుబడుల సదస్సులో అంతర్జాతీయ స్థాయి పారిశ్రామికవేత్తలు పాల్గొని దాదాపు రూ. 13 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు ప్రభుత్వం ముందు ఉంచారు. కడప స్టీల్ …

Read More »

ఇప్పుడు మద్దతు.. ఎన్నికల తర్వాత విలీనం..

కాంగ్రెస్ లో తన పార్టీని విలీనం చేయడం తప్ప షర్మిలకు మరో మార్గం లేదా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఇందుకోసం చాలా రోజులుగా షర్మిల చేసిన ప్రయత్నాలు ఇప్పుడు ఫలించలేదు. కానీ తెలంగాణ ఎన్నికల తర్వాత మాత్రం షర్మిల స్థాపించిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ లో విలీనం ఖాయమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న షర్మిల.. కాంగ్రెస్ …

Read More »

కేసీయార్ కు కమీషన్ షాక్

ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న కేసీయార్ కు ఎన్నికల కమీషన్ పెద్ద షాకే ఇచ్చింది. ఎన్నికల ప్రచారంలో రైతుబంధు స్కీమ్ కీలకంగా మారుతోంది. అందుకనే ఇదే పథకంపై కేసీయార్ ఎక్కడ మాట్లాడినా రైతు రుణమాఫీ చేయటానికి ప్రభుత్వానికి ఎన్నికల కోడ్ అడ్డు వచ్చిందని చెబుతున్నారు. పథకం వర్తింప చేయడానికి అనుమతి ఇవ్వాలంటు కేంద్ర ఎన్నికల కమీషన్ కు లేఖ రాసామని చెబుతున్నారు. కమీషన్ నుండి వచ్చే స్పందనను బట్టి నిర్ణయం …

Read More »

ఎంఐఎం ఎందుకు పోటీచేస్తోంది ?

తాజాగా ఎంఐఎం పోటీపై రాజకీయాపార్టీల్లో రకరకాల విశ్లేషణలు మొదలయ్యాయి. మామూలుగా అయితే ఓల్డ్ సిటీలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రమే ఎంఐఎం పోటీచేస్తుంటుంది. విస్తరణ విషయమై ఎన్నిసార్లు ఎన్ని ప్రతిపాదనలు వచ్చినా, ఒత్తిళ్ళు వచ్చినా ఓల్డ్ సిటీ దాటి ఎంఐఎం పోటీచేసింది లేదు. రాష్ట్రంలోని 20 నియోజకవర్గాల్లో అంటే ముస్లింల ప్రాబల్యమున్న కొన్ని నియోజకవర్గాల్లో ఎంఐఎం పోటీచేస్తుందని అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ గతంలో ప్రకటించారు. అయితే మళ్ళీ ఆ విషయమై …

Read More »

ష‌ర్మిల‌ పై స‌జ్జ‌ల ఫైర్‌

మాకు సంబంధం లేదు.. ఆమె పార్టీ ఏపీకి చెందింది కాదు.. అంటూనే వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ ష‌ర్మిల‌పై ఏపీ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు, వైసీపీ నాయ‌కుడు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ఓ రేంజ్‌లో వ్యాఖ్య‌లు గుప్పించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ష‌ర్మిల పార్టీ పోటీకి దూరంగా ఉంటూ.. కాంగ్రెస్‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే.. ఈ ప‌రిణామం ఏపీ అధికార పార్టీకి మింగుడు ప‌డ‌డం లేదు. ముఖ్యంగా ష‌ర్మిల‌ జ‌గ‌న్‌కు …

Read More »