ఏపీలో సర్కారు మారింది. ప్రభుత్వ విధానాలతోపాటు.. ఆలోచనలు కూడా మారాయి. సంపద సృష్టి.. ఆదాయ వనరుల పెంపు దిశగా సీఎం చంద్రబాబు చేస్తున్న ప్రయత్నం సక్సెస్ అవుతోందన్న చర్చ సాగుతోంది. తాజాగా ఏపీ పర్యాటక రంగాన్ని కొత్త పుంతలు తొక్కించేలా.. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కారు.. వినూత్న ప్రయోగాన్ని ఆవిష్కరించింది. అదే సీ ప్లేన్ టూరిజం అంటే.. నదులలో ప్రయాణించే విమానంతో రాష్ట్రంలో పర్యాటకానికి బూస్ట్ ఇచ్చే కార్యక్రమం. …
Read More »డిప్యూటీ సీఎంతో డీజీపీ భేటీ.. విషయం సీరియస్సేనా?
సాధారణంగా ఏ రాష్ట్రంలో అయినా.. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ) ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని మాత్రమే కలుసుకుంటారు. వారితోనే నిరంతరం టచ్‌లో ఉంటారు. ఇక, హోం మంత్రిగా ఎవరున్నా.. శాంతి భద్రతల విభాగం ముఖ్యమంత్రు ల చేతుల్లోనే ఉంటున్న నేపథ్యంలో డీజీపీలకు హోం మంత్రులకు మధ్య పెద్దగా యాక్సస్ ఉండడం లేదు. దీంతో ముఖ్యమంత్రి తోనే పోలీస్ బాస్‌కు ప్రత్యక్ష సంబంధాలు ఉంటున్నాయి. అది ఏపీ అయినా.. తెలంగాణ …
Read More »బోరుగడ్డ అనిల్.. దిండు దుప్పటి ఇచ్చి మరీ పడుకోబెట్టారు
జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బోరుగడ్డ అనిల్ ఏ రేంజ్ లో హైలెట్ అయ్యారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జగన్ అండతో హద్దులు దాటిన వారిలో బోరుగడ్డ టాప్ లిస్టులో ఉన్నాడని, అతనికి తగిన గుణపాఠం చెప్పాలని టీడీపీ, జనసేన శ్రేణులు గట్టిగానే కోరుకున్నారు. అతను మాట్లాడిన మాటలకు చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కూడా ఆశించారు. అయితే, ప్రస్తుతం ఊహించని సీన్స్ దర్శనమిస్తున్నాయి. అనీల్ కస్టడీలో ఉన్న …
Read More »చాగంటి కి అదిరిపోయే పోస్ట్ ఇచ్చిన చంద్రబాబు
ఏపీ కూటమి ప్రభుత్వం మళ్లీ నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తూ రెండో జాబితాను ప్రకటించింది. ఇప్పటికే కొన్ని నెలల క్రితం తొలి జాబితా విడుదల చేసిన ప్రభుత్వం, ఇప్పుడు కొత్తగా 59 మంది నామినేటెడ్ సభ్యులను నియమించింది. ఈ జాబితాలో ప్రభుత్వం సామాజిక సమీకరణాల దృష్టితో పాటు విధేయతకు పెద్దపీట వేసినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ జాబితాలో రాష్ట్ర సలహాదారులు, ఆర్టీసీ రీజనల్ బోర్డు ఛైర్మన్లు, డెవలప్మెంట్ కార్పొరేషన్లు, అర్బన్ …
Read More »వైసీపీకి కన్నబాబు గుడ్ బై.. పొలిటికల్ రచ్చ!
కాపు నాయకుడు, మాజీ జర్నలిస్టు, మాజీ మంత్రి కురసాల కన్నబాబు వైసీపీకి గుడ్ బై చెప్పనున్నారా? త్వరలోనే ఆయన జాతీయ పార్టీ బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారా? ఈ క్రమంలో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన బీజేపీ ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ చీఫ్ తో ఆయన చర్చలు కూడా పూర్తి చేసుకున్నారా? అంటే.. ఔననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. వైసీపీ హయాంలో రాజకీయంగా దూకుడు పెంచిన కన్నబాబుకు జగన్ మంత్రి …
Read More »బడ్జెట్‌పైనే గురి.. కూటమి ప్రభుత్వ లక్ష్యం ఇదీ!
ఏపీలో కూటమి ప్రభుత్వంపై అనేక ఆశలు, ఆకాంక్షలు కూడా మెండుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అనేక అంశాలను కూటమి ప్రభుత్వం పరిష్కరించాల్సి ఉంది. ప్రాజెక్టుల నిర్మాణంతోపాటు.. ఉపాధి, ఉద్యోగ కల్పన, పారిశ్రామికంగా రాష్ట్రాన్ని ముందుకు నడిపించడం వంటివి కీలకంగా మారాయి. దీనికితోడు వైసీపీ హయాంలో చేసిన అప్పులు, పారిశ్రామిక వేత్తలకు సరైన సౌకర్యాలు కల్పించకుండా చేసిన వేధింపులు వంటివాటిని దూరం చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఈ నేపథ్యంలో అన్నింటికీ …
Read More »విడదల రజనీ ఇన్.. ఎమ్మెల్సీ ఔట్?
ఏపీ ప్రతిపక్షం వైసీపీ నుంచి పలువురు ఎమ్మెల్సీలు ఇటీవల కాలంలో బయటకు వచ్చిన విషయం తెలి సిందే. పోతుల సునీత, డొక్కా మాణిక్య వరప్రసాదరావు, సి. రామచంద్రయ్య వంటి వారు ఎన్నికలకు ముందు, తర్వాత.. పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇక, ఈ పరంపరలో మరో పేరు రాజకీయ వర్గాల్లో హల్చల్ చేస్తోంది. ఆయనే కమ్మ సామాజిక వర్గానికి చెందిన మర్రి రాజశేఖర్. ఈయన వైసీపీ నుంచి బయటకు వచ్చేందుకు …
Read More »బుద్ధొచ్చింది.. క్షమించండి: శ్రీరెడ్డి కాళ్లబేరం
వివాదాస్ప వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో హల్చల్ చేసే.. నటి శ్రీరెడ్డి కాళ్లబేరానికి వచ్చారు. వైసీపీసానుభూతి పరురాలిగా మారి.. టీడీపీ, జనసేనలపై ఆమె చేసిన వ్యాఖ్యలు.. అత్యంత వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. ఎంత నోటికి అంత మాట అనేయడం.. కూడా మహిళగా ఆమెకే చెల్లింది. చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కల్యాణ్‌లనే కాకుండా.. వారి కుటుం బాలను కూడా రోడ్డుకు ఈడ్చి.. మహిళలను కూడా ఇష్టానుసారం నోరు చేసుకున్న శ్రీరెడ్డి …
Read More »బుల్డోజర్కు అడ్డొస్తే… తొక్కించేస్తాం: రేవంత్ రెడ్డి వార్నింగ్
మూసీ నది ప్రక్షాళన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మూసీ నదిని సుందరీకరించి తీరుతామని చెప్పారు. ఈ క్రమంలో కొందరు బుల్డోజర్లకు అడ్డంగా వస్తామని, అడ్డుకుంటామని ప్రకటిస్తున్నారని.. ఇలాంటివారిని అదే బుల్డోజర్తో తొక్కించేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ‘మూసీ పునరుజ్జీవ యాత్ర’ పేరిట కాంగ్రెస్ నాయకులు యాత్ర చేపట్టారు. అనంతరం.. నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. మూసీ ప్రక్షాళనను తమాషా అనుకుంటున్నారని, దీనిని చేపట్టడం చేతకాని వారు.. …
Read More »జిల్లాకో విధంగా రిజర్వేషన్: బాబు స్ట్రాటజీ సక్సెస్?
ఎస్సీ వర్గీకరణకు సంబంధించి టీడీపీ కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు ను అనుసరించి.. దేశవ్యాప్తంగా ఎస్సీల రిజర్వేషన్‌కు సంబంధించి వర్గీకరణ చేయాల్సి ఉంది. ఇప్పటికే తెలంగాణలో ఈ వర్గీకరణను ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. దీనికి సంబంధించి కమిటీ కూడా వేశారు. ఇక, ఏపీ విషయానికి వస్తే.. అనేక కోణాల్లో దీనిపై చర్చలు చేస్తూనే ఉన్నారు. తెలంగాణకు, ఏపీకి మధ్య కొన్ని వ్యత్యాసాలు ఉండడంతో ఇది సంక్లిష్టంగా మారింది. …
Read More »కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి బిగుస్తున్న ఉచ్చు
ధర్మవరం పట్టణంలోని చిక్క వడియార్ చెరువును వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆక్రమించారని గతంలో ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అధికారాన్ని అడ్డుపెట్టుకొని చెరువును కేతిరెడ్డి కబ్జా చేశారని ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు, గూగుల్ మ్యాప్స్ లో కూడా చెరువు ఆక్రమణకు గురైనట్లు స్పష్టంగా ఉందని గతంలో టీడీపీ నేతలు ఆరోపించారు. ఈ క్రమంలోనే తాజాగా ఆ చెరువు కబ్జా వ్యవహారంలో కేతిరెడ్డికి నీటిపారుదల శాఖ అధికారులు నోటీసులు …
Read More »జగన్ ధైర్యం గురించి ప్రశ్నించిన షర్మిల
అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టేందుకు పులివెందుల ఎమ్మెల్యే జగన్ కుంటిసాకులు వెతుకుతున్నారని ఎన్డీఏ కూటమి పార్టీల నేతలు విమర్శిస్తోన్న సంగతి తెలిసిందే. అసెంబ్లీకి వచ్చి అధికార పక్షాన్ని ప్రశ్నించాల్సిన జగన్…మైక్ ఇవ్వడం లేదంటూ కారణాలు చెప్పి మీడియా ముందు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాను అని చెప్పడంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేగా జగన్ జీతం తీసుకోవడం దండగ అని, పులివెందుల ఎమ్మెల్యే పదవికి జగన్ రాజీనామా చేయాలని …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates