సాంకేతికతకు.. సీఎం చంద్రబాబుకు మధ్య సయామీ కవలల వంటి సంబంధం ఉన్న విషయం తెలిసిం దే. ఆయన ఏం చేసినాదానిలో సింహ భాగం.. సాంకేతికతకు పెద్దపీట వేస్తారు. ఎన్నికల సమయం నుంచి పాలన వరకు ఆయన టెక్నాలజీని వాడేస్తారు. అంతేకాదు.. ప్రజలకు కూడా టెక్నాలజీని చేరువ చేయ డంలోనూ.. విద్యార్థుల టెక్నికల్ ఆశలను విజయవంతం చేయడంలోనూ బాబుకు తగ్గ నాయకుడు బాబే అనడంలో సందేహం లేదు. తాజాగా ఏపీని టెక్నాలజీలో …
Read More »జనసేన-టీడీపీలో చిచ్చు సాయిరెడ్డి చెత్త లాజిక్
వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు వేణుంబాక్కం విజయసాయిరెడ్డి వ్యవహార శైలి రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. మరీ ముఖ్యంగా వైసీపీలో ఆయన వ్యవహరిస్తున్నతీరు.. పార్టీ అధినేత జగన్కు తిక్కరేపుతోందని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు. “ఇదేంటి ఈ వ్యాఖ్యలు..?”అంటూ ఓ సీనియర్ నాయకుడు మీడియా మిత్రుల ముందు చెప్పుకొని రావడం చర్చకు దారితీసింది. నిన్న మొన్నటి వరకు పవన్ను ఆడిపోసుకున్న సాయిరెడ్డి యూటర్న్ తీసుకోవడంపై విస్మయం …
Read More »డిప్యూటీ స్పీకర్ రఘురామకు.. మరో గౌరవం!
ఏపీ డిప్యూటీ స్పీకర్గా ఉన్న కనుమూరి రఘురామకృష్ణరాజుకు తాజాగా మరో గౌరవం దక్కింది. ప్రస్తుతం ఉప సభాపతిగా ఉన్న రఘురామకు కేబినెట్ హోదా కల్పిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ లెజిస్లేచర్ చట్టంలోని ఆర్టికల్ 15 మేరకు ఆయనకు కేబినెట్ హోదాను ఇస్తున్నట్టు పేర్కొం ది. రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్ గా ఆ పదవిలో ఉన్నంత కాలం.. ఈ హోదా ఆయనకు వర్తిస్తుం దని తెలిపింది. కేబినెట్ హోదా …
Read More »వల్లభనేని వంశీకి బిగిస్తున్న ఉచ్చు.. పీఏ అరెస్టు?
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యక్తిగత కార్యదర్శి(పీఏ) రాజాను పోలీసులు అరెస్టు చేశారు. ఆయనతోపాటు 11 మంది అనుచరులను కూడా అదుపులోకి తీసుకుని గన్నవరం మండలం బాపులపాడు పోలీసు స్టేషన్లో విచారిస్తున్నారు. దీంతో ఒక్కసారిగా గన్నవరం రాజకీయాలు వేడెక్కినట్టు అయింది. నిన్న మొన్నటి వరకు పీఎ రాజా తప్పించుకుని తిరుగుతున్న విషయం తెలిసిందే. దీనిపై పోలీసులు ఇప్పటికి రెండు సార్లు వార్నింగులు కూడా ఇచ్చారు. ఏంటీ కేసు? గన్నవరం …
Read More »75 ఏళ్ల ముసలాయన.. బాబుపై నోరు చేసుకున్న సాయిరెడ్డి
ఏపీ సీఎం చంద్రబాబుపై గత రెండు రోజులుగా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న వైసీపీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి మరోసారి తన అక్కసు ప్రదర్శించారు. కాకినాడ పోర్టు వ్యవహారంపై తనకు లుక్ ఔట్ నోటీసులు జారీ చేయడంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న సాయిరెడ్డి గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ‘బతికి ఉంటే.. అరెస్టు తప్పదు’ అంటూ.. ఎవరూ సహించని భాషను ప్రయోగించారు. అంతేకాదు.. చంద్రబాబు దుర్మార్గుడు, దుష్టుడు, నీచుడు …
Read More »రాజ్యసభలో నోట్ల కట్టలు.. తెరపైకి మరో వివాదం!
పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అదానీ, మణిపూర్, యూపీలో సంభాల్ వివాదం వంటివాటిపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో సభలు సజావుగా సాగడం లేదు. ఇక, ఇప్పుడు రాజ్యసభలో నోట్ల కట్టల వివాదం తెరమీదికి వచ్చింది. ఓ సీటు వద్ద రూ.500, రూ.100 నోట్ల కట్టలు లభించడం వివాదానికి, అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. ఈ నోట్ల కట్టలు లభించడంపై …
Read More »కేతిరెడ్డికి చెక్ పెడుతున్నారు.. !
అనంపురం జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు, ఫైర్ బ్రాండ్.. కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి గురించి అందరికీ తెలిసిందే. ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో రోజూ ప్రజలకు చేరువయ్యారు. అదేవిధంగా స్థానికంగా ఉన్న కొన్ని సమస్యలను కూడా పరిష్కరించారని అంటారు. అయితే.. ధర్మవరంలో బీజేపీ గెలిచిన తర్వాత.. ముఖ్యంగా బీజేపీ ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ మంత్రి అయ్యాక ఇక్కడ సీన్ మారిపోయిందని చెబుతున్నారు. వెంకట్రామిరెడ్డి …
Read More »‘పీఠాలు’ కదులుతున్నాయి.. జగనే పట్టించుకోలేదు!
ఏపీ రాజధాని అమరావతి విషయంలో వైసీపీ అధినేత జగన్ లైట్ తీసుకున్నారే కానీ.. ఇతర వర్గాలు.. ముఖ్యంగా ప్రజలు మాత్రం చాలా సీరియస్గానే తీసుకున్నారు. ఒక్కసారి రాజధానిని ఫిక్స్ చేయడం.. అక్కడి రైతుల నుంచి భూములు తీసుకుని కొంత మేరకు ప్లాన్లు కూడా రెడీ చేసుకోవడం, సచివాలయం, హైకోర్టు, శాసన సభ, మండలి వంటివాటిని నిర్మించడం.. వంటివి ప్రజలు సీరియస్గానే తీసుకున్నారన్న విషయం.. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో స్పష్టంగా …
Read More »డీఎస్సీ నుంచే రిజర్వేషన్ ఫలాలు.. బాబు షాకింగ్ నిర్ణయం
ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ ఫలాలు ఎప్పుడు అందుతాయనే ప్రశ్నకు ఏపీ సీఎం చంద్రబాబు సమాధానం చెప్పారు. త్వరలోనే ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ఫలాలను ఆయా సామాజిక వర్గాలకు అందించనున్నట్టు తెలిపారు. ముఖ్యంగా కూటమి సర్కారు వచ్చిన తర్వాత.. చేసినతొలి సంతకం.. 16 వేల టీచర్ ఉద్యోగాల భర్తీపైనే. దీనికి సంబంధించి డీఎస్సీ ప్రకటన కూడా విడుదలైంది. అయితే.. ఆరు మాసాలైనా డీఎస్సీ ఎప్పుడు నిర్వహిస్తారనే విషయంపై సందిగ్థత కొనసాగుతోంది. దీనిపై …
Read More »గగ్గోలు పెట్టిన సాయిరెడ్డి!
వైసీపీ కీలక నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి గగ్గోలు పెట్టారు. కాకినాడ పోర్టు విషయంలో కోనేరు వెంకటే శ్వరరావు(కేవీ రావు)ను బెదిరించారన్న కేసులో సాయిరెడ్డిపై ఏపీ సీఐడీ అధికారులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా స్పందించిన సాయిరెడ్డి గగ్గోలు పెట్టారు. తానేమైనా దొంగనా? దేశం విడిచిపారిపోతానా? అని ప్రశ్నించారు. తాను బాధ్యతాయుతమైన రాజ్యసభ సభ్యుడినని.. అనేక అంశాలపై సభలో ప్రజల తరఫున …
Read More »గ్రామీణ స్థాయిలో వైసీపీకి భరతం.. రేపటి నుంచే!
ప్రస్తుతం ఏపీలో ఉన్న కూటమి సర్కారు గత వైసీపీ సర్కారు తప్పులను లెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇసుక సహా.. అనేక వ్వవస్థలను బాగు చేస్తున్నారు. తాజాగా ఇప్పుడు గ్రామీణ స్థాయిలో వైసీపీ నేతలు చేసిన తప్పులను వెలికి తీసేందుకు ప్రభుత్వం వినూత్న కార్యక్రమాన్ని చేపడుతుండడం గమనార్హం. ఈ క్రమంలో శుక్రవారం(డిసెంబరు 6) నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 40 రోజలు పాటు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారు. ఈ సదస్సుల్లో …
Read More »జగన్ జైలుకు వెళ్లడం ఖాయం.. ఏసీబీ ఆఫీస్ వద్ద షర్మిల!
ప్రముఖ పారిశ్రామిక వేత్త అదానీ నుంచి రూ.1750 కోట్ల మేరకు లంచాలు తీసుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సీఎం జగన్పై ఆయన సోదరి పీసీసీ చీఫ్ షర్మిల నిరసన బాట పట్టారు. బుధవారం ఆమె ప్రకటించినట్టుగానే గురువారం ఉదయం.. జగన్పై ఏపీ ఏసీబీకి ఫిర్యాదు చేసేందుకు వచ్చారు. అయితే.. దీనికి ముందే.. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అదానీ – జగన్ రూ.1750 కోట్ల ముడుపుల పై వెంటనే దర్యాప్తు జరిపించాలని …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates