వచ్చే ఎన్నికల నాటికి.. రాష్ట్రంలో రాజకీయాలు మారుతాయా? బీజేపీ-జనసేన- టీడీపీ కూటమి మాదిరిగా మరో కూటమి ఆవిర్భవించే అవకాశం ఉందా? అంటే.. ఔననే అంటున్నారు కొందరు పరిశీలకులు. చిన్నా చితకా పార్టీలను కలుపుకొని.. మరో మహాకూటమి ఏర్పాటయ్యే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అయితే.. ఈ కూటమి విషయంపై అనేక చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ వైపు కొన్ని పార్టీలు చూస్తున్నాయన్నది వాస్తవమని చెబుతున్నారు. ప్రస్తుతం వైసీపీతో చేతులు కలిపేందుకు కాదు.. …
Read More »ఫ్లైట్ లేకపోతే ఏం… కారు ఉందిగా జగన్
ఏపీలో మొంథా తుఫాను ప్రభావం భారీ ఉంటుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం అలెర్టయింది. సీఎం చంద్రబాబు తన వయసును పక్కన పెట్టి.. 24 గంటలూ గత రెండు రోజులుగా సమీక్షిస్తున్నారు. ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు నష్టం కలిగించకుండా క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టారు. తుఫాను ప్రభావం ఏ రేంజ్లో ఉన్నప్పటికీ.. ప్రజలకు నష్టం కలగకూ డదన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. ఇక, డిప్యూటీసీఎం పవన్ …
Read More »విపత్తులతోనూ చలికాచుకుంటున్నారు: చంద్రబాబు
వైసీపీ నేతలపై సీఎం చంద్రబాబు పరోక్షంగా స్పందించారు. రాష్ట్రంలో మొంథా తుఫాను ప్రభావం కనిపిస్తున్న నేపథ్యంలో ఆయన అమరావతిలోని సచివాలయంలోనే తిష్ఠ వేశారు. అధికారులు, మంత్రులతో సమీక్షలు చేస్తున్నారు. ఏ జిల్లాలో ఎక్కడ ఎలాంటి పరిస్థితి నెలకొందో తెలుసుకుని రెమెడీ సూచిస్తున్నారు. ముఖ్యంగా ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి కూడా సమాచారం సేకరించేందుకు సచివాలయంలో ప్రత్యేకంగా సీనియర్ ఐఏఎస్ ఆధ్వర్యంలో ఓ వింగ్ను ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు వారిని కూడా …
Read More »20 శాతం సొమ్ము వారికి ఇస్తామంటేనే టికెట్ ధరలు పెంచుకోండి: సీఎం రేవంత్
సినీ రంగానికి సంబంధించిన కీలక అంశం కొత్త సినిమాలు ఎప్పుడు విడుదలైనా టికెట్ ధరలు పెంచుకునే విషయం. ఇది ఎప్పటికప్పుడు సినీ రంగానికి కొంత ఇబ్బందికరంగానే ఉంది. టికెట్ ధరల పెంపు కోరడం, ప్రభుత్వాల నుంచి ఒక్కోసారి అనుకూలంగా, కొన్ని సార్లు వ్యతిరేకంగా నిర్ణయాలు రావడం తెలిసిందే. ఈ విషయంలో ఏపీలో అయితే వైసీపీ హయాంలో సినీ రంగ ప్రముఖులు సర్కారును బ్రతిమాలుకునే పరిస్థితి ఏర్పడింది. ఇక ఇప్పుడు కూటమి …
Read More »హుద్ హుద్ ప్లాన్ను అప్లయ్ చేస్తున్న చంద్రబాబు!
హుద్ హుద్ తుఫాను గుర్తుందా? విశాఖను ఈ తుఫాను అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే కదా! 2015లో వచ్చిన హుద్ హుద్ తుఫాను తీవ్రస్థాయిలో విశాఖ సహా ఉత్తరాంధ్ర జిల్లాలను దెబ్బతీసింది. ముఖ్యంగా విశాఖను చాలా తీవ్రంగా దెబ్బతీసింది. అయితే ఆ సమయంలో సీఎంగా ఉన్న చంద్రబాబు ప్రజల ప్రాణాలకు రక్షణగా ఉండేలా ప్రత్యేక స్ట్రాటజీ అనుసరించారు. దీంతో తీవ్రస్థాయిలో గాలులు, తుఫాను వర్షాలు వచ్చినా ఒక్క ప్రాణం కూడా …
Read More »జగన్ పార్ట్ టైం – బాబు ఫుల్ టైమ్
ముఖ్యమంత్రి అంటే ఒక రాష్ట్రానికి రాజ్యాంగపరమైన కీలక నాయకుడు. బాధ్యుడు కూడా. అయినప్పటికీ .. వారికి కూడా విశ్రాంతి, కుటుంబం వంటివి ఉంటాయి. దీంతో నిర్దిష్ట సమయం వరకు పనిచేసిన తర్వాత.. ఇంటికి వెళ్లిపోవడం.. అనేది ముఖ్యమంత్రుల విషయంలో కామనే. గతంలో వైసీపీ అధినేత, అప్పటి ముఖ్యమంత్రి జగన్.. టైం బౌండ్ పెట్టుకుని పనిచేశారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు పనిచేశారన్న వాదన బలంగా వినిపించింది. మధ్యలో …
Read More »మూడు రాష్ట్రాలకు కునుకు కరువు: ఏంటీ `మొంథా`?
మూడు రాష్ట్రాలకు కంటిపై కునుకు లేకుండా చేస్తున్న తుఫాను.. మొంథా!. ఏపీ, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల్లోని ప్రభుత్వం అలెర్ట్ అయ్యాయి. ఆదివారం రాత్రి నుంచే ప్రభుత్వాలు అవిశ్రాంతంగా పనిచేస్తున్నాయి. ఇక, సోమవారం.. ఉదయం నుంచి మరింతగా అలెర్ట్ అయ్యాయి. తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పటికే తమిళనాడులోని చెన్నై తీర ప్రాంతంలో వేలాది మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇక, ఏపీలోనూ తీర ప్రాంత జిల్లాలకు చెందిన వేల …
Read More »శబరి – మాధవి… టీడీపీలో టాప్ లేపేస్తున్నారుగా…!
టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి, అదే పార్టీ ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవి ఇద్దరూ ఫైర్ బ్రాండ్ నాయకులే. పైగా ఉన్నత విద్యను అభ్యసించిన వారే. ప్రస్తుతం వారు నియోజకవర్గాలపై మంచి పట్టుపెంచుకున్నారు. వైసీపీకి కౌంటర్ ఇస్తూ పార్టీని కాపాడుకునే ప్రయత్నంలోనూ నిరంతరం పనిచేస్తున్నారు. ఏ చిన్న సమస్య వచ్చినా ‘మేమున్నాం’ అంటూ ముందుకు వస్తున్నారు. అర్థరాత్రి, పట్టపగలు అనే తేడా లేకుండా వారు పనిచేస్తున్నారు. దీనిలో సందేహం లేదు. అయితే …
Read More »ఇక్కడ ప్రతిపక్షం తరఫున నోరు విప్పే నాయకుడే లేరు
రాజకీయాల్లో పోటీ లేకుండా ఎక్కడా ఉండదు. చిన్నచితకా పార్టీలైనా పోటీ ఇస్తుంటాయి. ఇక ప్రధాన పార్టీల మధ్య పోరు, పోటీ ఎలానూ ఉంటుంది. కానీ చిత్రంగా రాష్ట్రంలోని విజయవాడ, గుంటూరు పార్లమెంటు నియోజకవర్గాల్లో టిడిపికి పోటీ లేకుండాపోయింది. అంతేకాదు, ఈ రెండు నియోజకవర్గాల్లో ప్రధాన ప్రతిపక్షం తరఫున నోరు విప్పే నాయకుడు కూడా లేరు. దీంతో అధికార పార్టీ తరఫున చేసుకునేందుకు చాలా అవకాశం ఉంది. మరి ఏం జరుగుతోంది? …
Read More »మొన్న అమితాబ్ కాంత్.. నేడు గార్గ్.. బాబుపై ఎందుకీ వ్యాఖ్యలు!
రాజకీయాలు వారు కడుదూరం. అభివృద్ధికి, ఆలోచనలకు మాత్రమే చేరువ. వారే.. కేంద్రం స్థాయిలో ఉన్న స్థానాల్లో పనిచేసిన అధికారులు. అంతేకాదు..దేశాన్ని మేలు మలుపు తిప్పిన విభాగాలకు అధినాయకులుగా పనిచేశారు. అలాంటివారు..ఇప్పుడు రాజకీయాలకు అతీతంగా సీఎం చంద్రబాబుపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇది మేధావివర్గాల్లోనే కాదు.. పారిశ్రామిక, ఐటీ రంగాల లబ్ధ ప్రతిష్ఠులను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇంతకీ.. ఆ అధికారులు ఒకరు.. నీతి ఆయోగ్ మాజీ సీఈవో అమితాబ్ కాంత్. …
Read More »ఒక్కొక్క కుటుంబానికీ 3 వేలు.. మరోసారి బాబు పెద్ద మనసు!
సీఎం చంద్రబాబు మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. ప్రస్తుతం దోబూచులాడుతున్న మొంథా తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో ముఖ్యంగా తీర ప్రాంత గ్రామాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు చేర్చారు. నిజానికి తుఫాను ఎఫెక్ట్ ఉంటుందని భావిస్తున్నా.. సోమవారం అర్ధరాత్రి తర్వాత.. తేలిపోయే అవకాశం కూడా ఉంటుందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. అయినప్పటికీ.. వందలాది గ్రామాల్లోని తీర ప్రాంత ప్రజలను కొంత దూరంగా ఉన్న షెల్టర్లలోకి తీసుకువచ్చారు. వీరికి సకల …
Read More »తెలంగాణ దీదీ…కవిత కొత్త లుక్
దేశ రాజకీయాల్లో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న మహిళా నేతలలో ఇందిరా గాంధీ మొదలు వైఎస్ షర్మిల వరకు ఎందరో ఉన్నారు. అయితే, తన సింప్లిసిటీతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఫైర్ బ్రాండ్ నేతలు కొందరే ఉన్నారు. వారిలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ముందుంటారు. సాధారణ మధ్యతరగతి మహిళ మాదిరిగా చీరను ధరించే మమతను బెంగాళీ మహిళలు తమలో ఒకరిగా తమ దీదీగా భావిస్తుంటారు. మధ్యతరగతి మహిళల్లో …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates