చాపకింద నీరులా జనసేన విస్తరిస్తుంది. అధికారం కోసం అర్రులు చాచకుండా ఒక ప్రణాళిక ప్రకారం పునాదులు వేసుకుంటూ వస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో బలమైన కేడర్, లీడర్ కలిగిన టీడీపీతో పొత్తు పెట్టుకొని వ్యూహాత్మకంగా అధికారం వైపు అడుగులు వేసింది. అత్యాశకు పోకుండా 21 సీట్లలో పోటీ చేయడమే కాకుండా 100 శాతం స్ట్రెయిక్ రేట్ సాధించి రికార్డ్ బద్దలు కొట్టింది. ఆంధ్ర ప్రదేశ్ లో లక్ష్యం సాధించిన తర్వాత తెలంగాణాపై …
Read More »కొడాలి నానిపై గుడివాడలో గుస గుస
ఉమ్మడి కృష్ణా జిల్లాలోని గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గాన్ని రెండు దశాబ్దాలకుపైగా తన కనుసన్నలతో శాసించిన మాజీ ఎమ్మెల్యే కొడాలి శ్రీవేంకటేశ్వరరావు.. ఉరఫ్ నానీ.. గత 2024 ఎన్నికల్లో తొలిసారి ఓడిపోయారు. ఆ తర్వాత.. ఆయన నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు. అయితే.. రెండు సంవత్సరాల తర్వాత.. ఇటీవల కొంత మేరకు యాక్టివ్ అయ్యారు. గత ఎన్నికల ప్రచారంలోనే నాని ఇవే తనకు చివరి ఎన్నికలు అని చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు వచ్చే …
Read More »బాబు చుట్టూ బీసీలు.. జగన్ చుట్టూ ఎవరు… ?
మార్పు మంచిదే. కానీ, ఆ మార్పు దిశగా అడుగులు వేయడం కీలకం. ముఖ్యంగా రాష్ట్ర జనాభాలో 50.2 శాతం మేరకు బీసీలు ఉన్నట్టు స్పష్టమైంది. రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది నియమించిన రాజీవ్ రంజన్ డెడికేటెడ్ కమిటీ.. రాష్ట్రంలో ఎంత మంది బీసీలు ఉన్నారన్నది లెక్క తేల్చింది. మొత్తం 50.2 శాతానికి పైగానే బీసీలు ఉన్నారని.. వారికి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని కూడా కమిటీ పేర్కొంది. ఇది ప్రభుత్వ …
Read More »30 ఏళ్ల వెలిగొండ కల సాకారమయ్యే వేళ
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 30 ఏళ్ళ క్రితం ఏ ముఖ్యమంత్రి అయితే వెలిగొండ ప్రాజెక్టుకు శంఖుస్థాపన చేశారో అదే ముఖ్యమంత్రి ప్రారంభహోత్సవం చేయడం ఒక చరిత్ర. ఇలాంటి గొప్ప అవకాశం ఒక్క చంద్రబాబుకు మాత్రమే దక్కింది. 1996 మార్చి 5వ తేదీన నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టుకు శంఖుస్థాపన చేశారు. మధ్యలో నలుగురు ముఖ్యమంత్రులు వచ్చారు.. పోయారు. కానీ వెలిగొండ ప్రాజెక్టును మాత్రం పూర్తి చేయలేక …
Read More »ఏకగ్రీవాలందు జగన్ ఏకగ్రీవాలు వేరయా!
త్వరలో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగబోతోంది. ఈ లోకల్ వార్ లో ఫైట్ కు ఇటు కూటమి పార్టీలు..అటు వైసీపీ రెడీ అవుతున్నాయి. అయితే, ఏకగ్రీవాలు జరిగిన నియోజకవర్గంలో అక్కడి వైసీపీ ఇంఛార్జ్ కు రాబోయే ఎన్నికల్లో టికెట్ ఇచ్చే ప్రసక్తే లేదని వైసీపీ అధినేత జగన్ తేల్చి చెప్పారు. ఆ వ్యాఖ్యల నేపథ్యంలో జగన్ పై సొంత పార్టీలో సైతం విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే …
Read More »మెగా డీఎస్సీ.. వైసీపీకే వాత పడేలా వుందే…
డీఎస్సీ నియామకాలలో అక్రమాలు జరిగాయని, స్పోర్ట్స్ కోటా పేరుతో పరీక్షలు లేకుండానే 350 మందికి ఉద్యోగాలు ఇచ్చారని, పరీక్షా పేపర్లు లీకయ్యాయంటూ వైసీపీ అధినేత జగన్ రచ్చ చేస్తున్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా జెన్ జీ ట్యాగ్ పెట్టి డీఎస్సీ అక్రమాల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, నిరసనలు చేయడం, ప్రెస్ మీట్లు పెట్టి సొంత మీడియాలో ప్రచారం చేస్తున్నా జనం స్పందించక పోవడంతో వైసీపీ నాయకులు దిక్కు …
Read More »నాపై హత్యాయత్నం కేసు పెట్టండి… సాయిరెడ్డికి సజ్జల సలహా
చాలా ఏళ్ల పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతల్లో ఒకరిగా ఉండి.. అనివార్య కారణాలతో రెండేళ్ల కిందటే ఆ పార్టీ నుంచి బయటికి వచ్చేశారు విజయ సాయిరెడ్డి. వైసీపీకి గుడ్ బై చెప్పేశాక ఇక రాజకీయాలకు దూరం అని ప్రకటించిన ఆయన.. ఇటీవల యుటర్న్ తీసుకున్నారు. కొత్త పార్టీకి సిద్ధమయ్యారు. ఇదే సమయంలో జగన్ మతమార్పిడులను ప్రోత్సహించాచారనే ఆరోపణలు చేయడంతో వైసీపీ వైపు నుంచి ఆయనపై ఎదురుదాడి తప్పలేదు. దీంతో సాయిరెడ్డి మరింత దూకుడు పెంచారు. జగన్‌కు …
Read More »సాయి రెడ్డికి సజ్జల కౌంటర్… జగనే నెంబర్ 1
వైసీపీ అధినేత జగన్ పేదల పక్షపాతి అని.. ప్రజలకు ఎంతో మేలు చేశారని.. ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. అయితే.. కొందరు.. ఇప్పుడు ఆయనను టార్గెట్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. అందుకే వ్యక్తిత్వ హనానికి పాల్పడుతున్నారని తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన.. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. వైసీపీ మాజీ నాయకుడు వి. విజయసాయిరెడ్డి శనివారం సోషల్ మీడియా వేదికగా …
Read More »సీఎం రేవంత్ టీంకు ఢిల్లీ నుంచి పిలుపు
అంతా ఊహించినట్టే ఢిల్లీ కాంగ్రెస్ స్పందించింది. ఇన్నాళ్లు తెలంగాణా కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలను మౌనంగా గమనిస్తూ వచ్చిన అధిష్టానం ఎట్టకేలకు జోక్యం చేసుకుంది. ఇకనైనా నాయకులను గాడిలో పెట్టక పోతే దాని ప్రభావం ప్రభుత్వం మీద ఉంటుందని, చేజేతులా దక్షిణాదిలోని అత్యంత కీలకమైన తెలంగాణాను చేజార్చుకున్నట్లవుతుంది అధినాయకత్వం అవగతం చేసుకుంది. సెప్టెంబర్ 7 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో దానికి నాలుగు రోజుల ముందే ముఖ్యమంత్రి …
Read More »వైసీపీ పరిస్థితి దారుణం… పోటీకి నేతలు ఉన్నారా?
స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని వైసీపీ అధినేత జగన్ కోరుకుంటున్నారు. తద్వారా.. గత 2024 సాధారణ ఎన్నికల్లో ఎదురైన పరాభవం నుంచి బయట పడాలన్నది ఆయన ప్లాన్. దీనికి సంబంధించి.. పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు, నాయకులకు దిశానిర్దేశం చేశారు. చేస్తున్నారు. అయితే.. ఆయనే ఒక కీలక విషయాన్ని వెల్లడించడం గమనార్హం. పార్టీ తరఫున పోటీ చేసేందుకు సరైన నాయకులు లేకపోతే.. నియోజకవర్గం సమన్వయ కర్తల కుటుంబాలను రంగంలోకి దింపాలని …
Read More »వైసీపీ టాప్ లీడర్‌కు జగన్ చెక్…?
ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని కోవూరు నియోజకవర్గ వైసీపీ రాజకీయంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ప్రస్తుత వైసీపీ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిని ఆ పదవి నుంచి తప్పించేందుకు పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇటీవల కాలంలో ప్రసన్నకుమార్‌రెడ్డి తీరుపై వైఎస్ జగన్‌కు పలు ఫిర్యాదులు వెళ్లడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. నియోజకవర్గంలో బలంగా పాతుకుపోయిన టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని ఢీకొట్టాలంటే ప్రసన్న సరైన నాయకుడు …
Read More »తెలంగాణా ప్రభుత్వంలో కొత్త రక్తం అవసరం
తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తుంది. మరో రెండేళ్లలో ఎన్నికలకు సమాయాత్తం కావల్సి ఉంటుంది. ఈ మూడేళ్లలో సాధించిన విజయాలు, ఎదుర్కొన్న సమస్యలను మధనం చేసుకొని పార్టీని, కేడర్ ను సంసిద్ధం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ నేపథ్యంలో సీనియర్ నాయకుడు, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణా రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. ఆయన మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates