Political News

గురు శిష్యుల మ‌ధ్య జ‌ల జ‌గ‌డం.. రేవంత్ దూకుడు.. !

మ‌రో రెండు మాసాల్లో(మే నుంచి) వేసవి కాలం ప్రారంభం కానుంది. ఈ నేప‌థ్యంలో నీటి అవ‌స‌రం ఎంత ఉంటుందో అంద‌రికీ తెలిసిందే. మ‌రీ ముఖ్యంగా క‌రువు ప్రాంతాల్లో సాగు, తాగు నీటికి ఎద్ద‌డి మ‌రింత పెరుగుతుంది. ఈ నేప‌థ్యాన్ని పుర‌స్క‌రించుకుని రెండు తెలుగు రాష్ట్రాలు ముందుగానే అలర్టు కావ‌డం తెలిసిందే. తాజాగా ఈ విష‌యంలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి మ‌రింత దూకుడుగా ఉన్నారు. అవ‌స‌రమైతే.. ఏపీతో అమీ తుమీ తేల్చుకునేందుకు …

Read More »

`ఉండ‌వ‌ల్లి`కి ఛాన్స్ లేదా…?

రాజ‌కీయాల్లోకి రావ‌డం.. పోవడం.. అనేది నాయ‌కుల ఇష్టం. అయితే.. మారుతున్న కాలంలో.. నాయ‌కుల ఇష్టాల‌తో పాటు పార్టీల‌కు అవ‌స‌రాలు కూడా ముఖ్యంగా మారాయి. పార్టీల అవ‌స‌రం ఉంటేనే.. నాయ‌కుల‌కు ఎంట్రీ ఉంటోంది. రాజ‌కీయ‌, సామాజిక, ఆర్థిక ప‌రంగా పార్టీల‌కు ద‌న్నుగా మారుతున్న వారిని పార్టీలు ఎప్పుడూ వ‌దులుకునే ప‌రిస్థితిలేదు. ఉదాహ‌ర‌ణ‌కు ఏలూరులో వైసీపీనాయ‌కుడు ఆళ్ల నాని చేరిక విష‌యంలో టీడీపీలో త‌ర్జ‌న భ‌ర్జ‌న జ‌రిగింది. నిజానికి స్థానిక నాయ‌కులు పెద్ద‌గా …

Read More »

అందరికీ వందనాలు… ‘మనవాళ్లిద్దరికే’ మోదీ షేక్ హ్యాండ్

దేశ రాజధాని ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో ఢిల్లీ నూతన సీఎంగా బీజేపీ నేత రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం సందర్భంగా ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఈ కార్యక్రమానికి కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ మిత్రపక్షాలకు చెందిన కీలక నేతలను బీజేపీ ఆహ్వానించింది. బీజేపీ ఆహ్వానాలతో ఎన్డీఏ మిత్రపక్షాల అధినేతలు అంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారందరికీ వేదికపై వరుసగా కుర్చీలు వేశారు. సరిగ్గా 12.15 గంటలకు ప్రధాన …

Read More »

సజ్జల గట్ల ‘గుట్టు’ నిర్ధారణ షురూ

వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త, ఏపీ ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తన సొంత జిల్లా కడపలో సర్కారీ, అటవీ భూములను దురాక్రమించినట్లు ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. సజ్జల దురాక్రమణలపై ఫిర్యాదులు అందుకున్న జిల్లా అధికార యంత్రాంగం ఈ వ్యవహారంపై సర్వే చేపట్టగా…అందులో వాస్తవం ఉందంటూ తేలింది. అయితే తాను గానీ, తన కుటుంబ సభ్యులు గానీ ఎలాంటి భూ దురాక్రమణలకు పాల్పడలేదని చెబుతూ సజ్జల నేరుగా హైకోర్టునే …

Read More »

సీఎం రేవంత్ తాజా నిర్ణయంతో కాసుల కళకళ..

కీలక నిర్ణయాన్ని ప్రకటించారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నిధుల కొరతతో ఇబ్బంది పడుతున్న బొక్కసాన్ని కాసులతో కళకళలాడే నిర్ణయాన్ని వెల్లడించారు. సరైన సమయంలో.. సరైన రీతిలో తీసుకున్న ఈ నిర్ణయం రియల్ రంగానికి కొత్త ఊపును తేవటమేకాదు.. నాలుగేళ్లుగా పెండింగ్ లో ఉన్న వేలాది ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేసుకునే వీలు కలుగుతుంది. దీంతో.. ఓవైపు ఎల్ ఆర్ ఎస్ డబ్బులు.. మరోవైపు రిజిస్ట్రేషన్ ఆదాయం భారీగా పెరగటం …

Read More »

బాబుకు తోడుగా పవన్… నేరుగా రంగంలోకి జనసేనాని

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు బుధవారం రాత్రే దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యేందుకు చంద్రబాబు ఢిల్లీ వెళ్లగా… ఎన్డీఏలో మరో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన అధినేత హోదాలో పవన్ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఈ కార్యక్రమం కోసం ఇప్పటికే ఢిల్లీ చేరిన పవన్… రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి నేరుగా కార్యరంగంలోకి దిగిపోయారు. …

Read More »

ఆ రెడ్డిగారి చూపు.. జ‌నసేన వైపు…?

రాజ‌కీయాల్లో మార్పులు స‌హజం. ఏ ఎండ‌కు ఆ గొడుగు.. రాజ‌కీయాల్లోనే సాధ్యం. కాబ‌ట్టి.. ఎంత అభిమానం ఉంద‌ని చెప్పినా.. పార్టీ జెండాతో చొక్క‌కుట్టించుకున్నామ‌ని తిరిగినా.. అవ‌కాశం-అవ‌స‌రం అనే రెండు ప‌ట్టాల‌పైనే రాజ‌కీయ నేత‌ల జీవితాలు న‌డుస్తాయి. ఇప్ప‌టి వ‌ర‌కు వైసీపీ నుంచి బ‌య‌ట‌కు వెళ్లిన వారిలో `రెడ్డి` నాయ‌కులు ఎవ‌రూ పెద్ద‌గా లేరు. ఒక‌వేళ ఉన్నా వారికి నియోజ‌క‌వ‌ర్గాల్లో పెద్ద‌గా ప్రాధాన్యం లేదు. అయితే.. తాజాగా అటు త‌న నియోజ‌క‌వ‌ర్గంలోనూ.. …

Read More »

స్వామి కార్యంతో పాటు స్వకార్యం కూడా.. !

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు బుధవారం రాత్రి దేశ రాజధాని ఢిల్లీ చేరుకున్నారు. గురువారం మధ్యాహ్నం ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆ పార్టీ ఎమ్మెల్యే రేఖా గుప్తా చేయనున్న ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన హాజరు కానున్నారు. ఈ మేరకు బీజేపీ అధిష్ఠానం నుంచి ప్రత్యేక ఆహ్వానం అందుకున్న చంద్రబాబు… రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్నివాయిదా వేసుకుని మరీ హస్తిన వెళ్లారు. ఎన్డీఏలో బీజేపీ తర్వాత అత్యధిక సంఖ్యలో ఎంపీలున్న పార్టీగా …

Read More »

బ్రేకింగ్: జగన్ పై పోలీస్ కేసు!

మన దేశంలో నివసిస్తున్న పౌరులు ఎవరైనా సరే భారత రాజ్యాంగాన్ని గౌరవించాల్సిందే. భారత దేశంలో అమలవుతున్న చట్టాలను, నియమనిబంధనలను ప్రధాని మొదలు సామాన్యుడి వరకు అందరూ పాటించాల్సిందే. అయితే, ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత, ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్న జగన్ మాత్రం ఈ చట్టాలు తనకు వర్తించవు అన్నరీతిలో వ్యవహరిస్తున్న వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో జగన్ …

Read More »

అదికారంపై కేసీఆర్, కేటీఆర్ ఏమన్నారంటే…!

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌, ఆ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ల మాట‌ల్లో తేడా రావ‌డం.. పార్టీ నేత ల‌ను అయోమ‌యానికి గురి చేసింది. “ఆరు నూరైనా అధికారం మ‌న‌దే. త్వ‌ర‌లోనే బై పోల్స్ రానున్నాయి“ అని మాజీ సీఎం కేసీఆర్ గ‌ట్టిగా చెప్పారు. అంతేకాదు.. పార్టీ త‌ర‌ఫున ప్ర‌జ‌ల మ‌ద్య‌కు కూడా వెళ్లాల‌ని చెప్పారు. పార్టీ సిద్ధాంతాల‌ను, తెలంగాణ ఉద్య‌మాన్ని, అస్తిత్వాన్ని కూడా ప్ర‌జ‌ల‌కు …

Read More »

కేసీఆర్ అమెరికా టూర్ పక్కా… ఎన్నెన్ని విశేషాలో..?

బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు త్వరలోనే అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ మేరకు కేసీఆర్ ఆమెరికా పర్యటనపై బుధవారం ఓ క్లారిటీ అయితే వచ్చింది. విదేశీ పర్యటనలు అంటే అంతగా ఆసక్తి చూపని కేసీఆర్.. తన మనవడు, మనవరాళ్ల కోసం ఇప్పుడు అమెరికా ఫ్లైట్ ఎక్కబోతున్నారు. కేటీఆర్ కుమార్తె అలేఖ్యకు ఇటీవలే అమెరికాలో చదివేందుకు సీటు వచ్చిందట. ఆమెను కళాశాలలో చేర్పించేందుకు కేసీఆర్ అమెరికా వెళుతున్నట్లు …

Read More »

ఇకపై ఎక్కడికెళ్లినా… ముందు కేడర్ తోనే లోకేశ్ భేటీ

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ బుధవారం ఓ కీలక అంశాన్ని ప్రస్తావించారు. ఇకపై తాను నియోజకవర్గాల పర్యటనకు వస్తే… ముందుగా ఆయా నియోజకవర్గాల కార్యకర్తలు, నేతలతో సమన్వయ సమావేశం నిర్వహిస్తానని ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమం పూర్తి అయిన తర్వాతే మిగిలిన కార్యక్రమాలు ఉంటాయన్న లోకేశ్… ఆ తర్వాతి కార్యక్రమాలు ఎంత ప్రాధాన్యత కలిగినవైనా కూడా ముందుగా మాత్రం కేడర్ తోనే భేటీ ఉంటుందని …

Read More »