తిరుమల తొక్కిసలాట ఘటనపై శుక్రవారం సాయంత్రం టీటీడీ అత్యవసరంగా భేటీ అయి సమీక్షించింది. ఈ సమావేశంలో భాగంగా మృతుల కుటుంబాలకు సీఎం చంద్రబాబు ప్రకటించిన పరిహారం అందజేతకు బోర్డు సూత్రప్రాయంగా ఆమోద ముద్ర వేసింది. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తొక్కిసలాటలో చనిపోయిన వారి పేర్లను ప్రకటించిన నాయుడు…వారి కుటుంబాలకు రూ.25లక్షల చొప్పున పరిహారం అందిస్తాని తెలిపారు. …
Read More »జగనన్న కాలనీలు కాదు… మరేంటి!
ఏపీలోని కూటమి సర్కారు సంక్రాంతి సంబరాల ముంగిట ఓ కీలక నిర్ణయం తీసుకుంది. గత వైసీపీ పాలనలో రాష్ట్రంలోని దాదాపుగా అన్ని గ్రామాల్లో నూతనంగా వెలసిన వైఎస్సార్ జగనన్న కాలనీల పేరును మారుస్తూ శుక్రవారం సంచలన నిర్ణయం తీసుకుంది. జగనన్న కాలనీలుగా జనాల్లో బాగానే ప్రచారం పొందిన ఈ కాలనీలను ఇకపై పీఏంఏవైై ఎన్టీఆర్ నగర్ లుగా పరిగణించాలని తీర్మానించింది. ఈ మేరకు జగనన్న కాలనీలను ఎన్టీఆర్ నగర్ లుగా …
Read More »రఘురామను హింసించిన వ్యక్తికి టీడీపీ ఎమ్మెల్యే పరామర్శ?
ఏపీలో ఇప్పుడు కామేపల్లి తులసి బాబుపై హాట్ హాట్ చర్చ నడుస్తోంది. వైసీపీ అదికారంలో ఉండగా… సీఐడీ ఛీఫ్ గా కొనసాగిన సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ కు సన్నిహితుడిగా పేరున్న తులసి బాబు ఇటీవల ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చారు. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా కొనసాగుతున్న కనుమూరి రఘురామకృష్ణరాజును గతంలో అరెస్ట్ చేసిన సీఐడీ అధికారులు… తమ కస్టడీలో ఆయన …
Read More »తిరుమల తొక్కిసలాటకు రీజన్ ఇదేనట
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని వైకుంఠ ద్వార దర్శనం చేసుకునేందుకు వచ్చిన భక్తులు టోకెన్ల కోసం ఎగబడటం, ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు చనిపోవడం, 40 మంది దాకా భక్తులు గాయపడిన సంగతి తెలిసిందే. తిరుపతి నగరంలోని బైరాగిపట్టెడ ప్రాంతంలో ఏర్పాటు చేసిన టోకెన్ల జారీ కేంద్రం వద్ద జరిగిన ఈ ఘటనకు దారి తీసిన కారణాలేమిటన్న దానిపై ఇప్పటిదాకా స్పష్టత లేదు. అయితే దేవదాయ శాఖ మంత్రి …
Read More »కాంగ్రెస్ ఒంటరి.. రాహుల్ సక్సెస్పై ఎఫెక్ట్!
జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీ మరోసారి ఒంటరి ప్రయాణాన్ని తప్పించుకునేలా కనిపించడం లేదు. ఏడాదిన్నర కిందటి వరకు కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే ఉంది. మోడీ ప్రభావం, బీజేపీ దూకుడుతో పార్టీ అనేక రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోయింది. ఇక, అధికారం చేరువ అవుతుందన్న రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీ కుదేలైన పరిస్థితి కనిపించింది. దక్షిణాదిలో కర్ణాటక, తెలంగాణలో మాత్రమే అతి కష్టం మీద విజయం దక్కించుకుని పాలన సాగిస్తోంది. ఈ క్రమంలోనే మోడీపై యుద్ధానికి …
Read More »పిఠాపురంలో పవన్ పర్యటన… రీజనేంటి?
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో ఆకస్మికం గా పర్యటించారు. వాస్తవానికి గురువారం రాత్రి వరకు ఆయన తిరుపతిలోనే ఉన్నారు. అక్కడ తొక్కిసలా ట ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన శుక్రవారం ఉదయాన్నే.. పిఠాపురం పర్యటనకు వెళ్లడం గమనార్హం. ఈ పర్యటనలో ఆయన కీలకమైన రహదారి నిర్మాణ పనులను పరిశీలించారు. వచ్చే సంక్రాంతి సమయానికి గ్రామీణ …
Read More »టీటీడీ చైర్మన్, ఈవో కూడా సారీ చెప్పాలన్న పవన్
తిరుమలలో వైకుంఠ ఏకాదశి సర్వదర్శన టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు చనిపోయిన ఘటన సంచలనం రేపింది. ఆ ఘటనలో దాదాపు 40 మంది గాయపడ్డారు. ఈ ఘటనకు ప్రభుత్వం తరఫున తాను క్షమాపణలు చెబుతున్నానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిన్న అన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ రోజు ఆ ఘటనకు బాధ్యత వహిస్తూ టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణలు …
Read More »విపత్తుల్లోనూ విజన్.. తగ్గేదే లేదు అంటున్న చంద్రబాబు!
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే విజన్కు పరాకాష్ఠ. ఆయన దూరదృష్టి.. భవిష్యత్తును ముందుగానే ఊహించడం.. దానికి తగిన ప్రణాళికలు వేసుకుని ముందుకు సాగడం తెలిసిందే. ఆయన వేసిన బాటలు.. ఇప్పుడు మనకు కనిపించకపోవచ్చు.. కానీ, ఓ పదేళ్ల తర్వాత వాటి తాలూకు ఫలాలు, ఫలితాలు.. ప్రజలకు చేరువ అవుతాయనడంలో సందేహం లేదు. ఈ విషయంలో సైబరాబాద్, హైదరాబాద్లే ప్రధాన ఉదాహరణ. అప్పట్లో ఆయన వేసిన అడుగులు ఇప్పటికీ.. ప్రజలకు మేలు …
Read More »`సారీ`కి సిద్ధం.. పవన్ మాట నెరవేర్చుతున్న టీటీడీ సభ్యులు!
తిరుపతిలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. అదేవిధంగా 38 మంది గాయపడ్డారు. వీరిలో మరో ఏడుగురు తీవ్రంగా 31 మంది స్వల్పంగా గాయపడ్డారు. అయితే.. ఈ ఘటనకు నిర్లక్ష్యమే కారణమని పేర్కొన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ప్రభుత్వం తరఫున బహిరంగ క్షమాపణలు కోరారు. అదేవిధంగా టీటీడీ అధికారులు కూడా క్షమాపణలు చెప్పాలన్నారు. ఇక, టీటీడీ బోర్డు సభ్యులు.. బాధితుల కుటుంబాల వద్దకు వెళ్లి.. …
Read More »ఏరికోరి తెచ్చుకున్న సుబ్బారాయుడికి దిమ్మ తిరిగే షాకిచ్చిన బాబు
ఏం జరిగినా.. ఎంత జరుగుతున్నా.. కొన్ని కఠిన నిర్ణయాల విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరించే తీరు.. ఆయన్ను అమితంగా అభిమానించే వారికి సైతం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. నిన్నటివరకు ఆయన మంచితనం చేతకానితనంగా… పెద్దరికం… చాదస్తంగా మారిపోయింది అనే భిన్నాభిప్రాయాలను వ్యక్తపరిచారు కొందరు. చర్యల కత్తి ఝుళిపిస్తే తప్పించి మాట వినని వ్యవస్థలను గాడిలోకి పెట్టాలంటే.. అందుకు తగ్గట్లే వ్యవహరించాలే తప్పించి.. చూసిచూడనట్లుగా వ్యవహరిస్తే మొదటికే మోసం వస్తుందన్న నిజాన్ని …
Read More »బీజేపీతో జగన్ ది అక్రమ బంధం: వైఎస్ షర్మిల
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శుక్రవారం విశాఖ వేదికగా మౌన దీక్షకు దిగారు. పార్లమెంటులో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ను కించపరిచేలా మాట్లాడిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వైఖరికి నిరసనగా ఆమె ఈ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాతను అవమానపరిచేలా వ్యాఖ్యలు చేసిన అమిత్ షా తక్షణమే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. అమిత్ …
Read More »బీరు కరువు తప్పేలా లేదు
తెలంగాణలో మందుబాబులు బీరు దొరకక ఇబ్బంది పడటం ఖాయంగానే కనిపిస్తోంది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా కింగ్ ఫిషర్ బీర్ల సరఫరా నిలిచిపోయింది. గడచిన రెండు రోజులుగా ఈ బీర్ల తయారీ సంస్థ యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ నుంచి తెలంగాణ బ్రూవరీస్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీబీసీఎల్)కు బీర్ల సరఫరా జరగడం లేదు. మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగితే… తెలంగాణలో ఎక్కడ కూడా కింగ్ ఫిషర్ బీర్లు దొరికే …
Read More »