ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? అనే విషయాలు పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చేపట్టిన విద్యార్థుల ఆందోళనలకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో అన్ని రాష్ట్రాల్లోనూ నిరసనలు చేపట్టారు. గవర్నర్ బంగళాలను(లోక్‌భవన్) ముట్టడించే కార్యక్రమాలు చేపట్టారు. తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక సహా.. అన్ని దక్షిణాది రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఉద్యమించింది. మరి …
Read More »మోడీ పై ఆర్ ఎస్ ఎస్ గుస్సా…?
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌కు మధ్య అవినాభావ సంబంధం ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా జరుగుతున్న విద్యార్థుల ఆందోళనపై ఆర్ ఎస్ ఎస్ అంతర్మథనం చెందుతున్నట్టు తెలుస్తోంది. ఆర్ ఎస్ ఎస్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి మురళీ మనోహర్ జోషి.. విద్యార్థులకు మద్దతుగా స్పందించడంతో ఈ వ్యవహారం బీజేపీలోనూ తీవ్ర చర్చకు దారితీసింది. వాస్తవానికి.. బీజేపీ విధానపరమైన నిర్ణయాల వెనుక ఆర్ …
Read More »అన్ని దారులు `ధర్మేంద్ర` వైపే..!
కేంద్ర ప్రభుత్వం ఎన్ని రూపాల్లో ప్రయత్నించినా.. విద్యార్థుల ఆందోళనలను నిలువరించలేకపోతోంది. ఇప్పటికే బల ప్రయోగం చేయడంతో ఇది తీవ్ర వివాదానికి దారి తీసింది. ప్రపంచ దేశాలు ఏ సమస్య వచ్చినా చర్చల ద్వారా పరిష్కారం చూడాలని హితవు పలికే ప్రధాని మోడీ ఈ విషయంలో ఏం చేస్తారన్న అంశంపై ప్రపంచ దేశాలు కూడా ఆసక్తిగా ఎదురు చూశాయి. ఈ క్రమంలో అతికష్టం మీద కేంద్ర ప్రభుత్వం విద్యార్థి నేతలతో చర్చలకు …
Read More »36 వేల దరఖాస్తులు… పవన్‌కు పెద్ద టాస్కే!
ఉప ముఖ్యమంత్రి పవన్ కు ఇది పెద్ద పరీక్షే. జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణంలో కీలక ముందడుగు వేస్తున్న ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ముందున్న పెద్ద సవాల్ 36 వేలకుపైగా వచ్చిన దరఖాస్తుల పరిశీలనే. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కమిటీల్లో వివిధ స్థాయిల్లో బాధ్యతలు చేపట్టేందుకు ఆసక్తి వ్యక్తం చేసిన జనసైనికులు, వీరమహిళలు, నాయకుల నుంచి అందిన దరఖాస్తుల పరిశీలన, ఎంపిక ప్రక్రియను పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని పార్టీ …
Read More »కోమటి బ్రదర్స్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫైర్
తెలంగాణలో అధికార పార్టీగా కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీలో తరచూ అంతర్గత విభేదాలు రాజుకుంటున్నాయి. ఎనుముల రేవంత్ రెడ్డి సీఎంగా పదవీ ప్రమాణం చేసిన తర్వాత అధికార పార్టీలో ఈ తరహా విభేదాలు చాలా సార్లే కనిపించినా… తాజా వివాదం మాత్రం ఓ రేంజికి ఎగసిందని చెప్పాలి. అంతేకాకుండా గతంలో మాదిరిగా కాకుండా… ఈ దఫా ఎగసిన వివాదం బహిరంగంగా పెచ్చరిల్లింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీగా ఉన్న ఆయన సోదరుడు కోమటిరెడ్డి …
Read More »వివేకా హత్య… సునీత గోడు అరణ్య రోదన!
వైసీపీ అధినేత జగన్ బాబాయి, మాజీ మంత్రి వివేకా నందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి ఆయన కుమార్తె, డాక్టర్ నర్రెడ్డి సునీత దాఖలు చేసిన పిటిషన్‌ను నాంపల్లిలోని సీబీఐ కోర్టు కొట్టివేసింది. “ఇంకా సాగదీయడం సరికాదు. ఇక చాలు.“ అని కోర్టు వ్యాఖ్యానించినట్టు సీబీఐ తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు. అయితే.. తన తండ్రి హత్యకు సంబంధించి న్యాయం జరిగే వరకు తన పోరు ఆగదని సునీత స్పష్టం చేశారు. ఈ …
Read More »తూచ్.. మల్లారెడ్డి పార్టీ మారట్లేదు!
పాలమ్మీ, పూలమ్మీ ఎదిగానంటూ తనదైన శైలి వ్యాఖ్యలతో అందరినీ ఆకట్టుకున్న తెలంగాణ మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఇటీవలి కాలంలో విమర్శల సుడిలో చిక్కుకుంటున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ లో కొనసాగుతున్న మల్లారెడ్డి త్వరలోనే పార్టీ మారతారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ తరహా ప్రచారంపై ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇస్తూనే వస్తున్న మల్లారెడ్డి… తాజాగా శుక్రవారం కూడా అదే తరహా కౌంటర్ తో మీడియా ముందుకు వచ్చారు. ఎప్పటిమాదిరిగానే… ఈసారి …
Read More »`మేకిన్` ఇండియా అడిగితే.. `లీకిన్` ఇండియా ఇచ్చారు
కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. దేశ ప్రజలు మేకిన్ ఇండియా కావాలని కోరుకుంటే.. మోడీ మాత్రం లీకిన్ ఇండియాను ఇచ్చారని వ్యాఖ్యానించారు. గత 25 రోజులుగా ఢిల్లీలో పోరాటం చేస్తున్న విద్యార్థులకు తాము ఆది నుంచి అండగా ఉన్నామని.. కానీ, కొందరు ఈ విషయాన్ని గమనించలేక తమపై నిందలు వేస్తున్నారని.. పరోక్షంగా సీఎం రేవంత్ పై విమర్శలు గుప్పించారు. …
Read More »మన్యానికి కుంకీలను పంపిన పవన్ కల్యాణ్
పార్వతీపురం మన్యం జిల్లాలోని రైతులు గత కొన్ని రోజులుగా ఏనుగుల బెడదను ఎదుర్కొంటున్నారు. స్థానిక గ్రామాల్లోకి ఏనుగులు చొరబడి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అలాగే.. పంట పొలాలను కూడా ధ్వంసం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. రెండు కుంకీ ఏనుగులను పార్వతీపురం మన్యం జిల్లాకు పంపించారు. పలమనేరు నుంచి పార్వతీపురం మన్యం జిల్లాకు తరలిస్తున్న కుంకీ ఏనుగులకు మార్గమధ్యంలో మంగళగిరి క్యాంపు కార్యాలయం …
Read More »స్థానికంపై జగన్ సీరియస్ గానే ఉన్నారా?
ఏపీలో సార్వత్రిక ఎన్నికల తర్వాత మరో కీలక ఎన్నికలకు తెర లేవనుంది. రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించే దిశగా కూటమి సర్కారు ప్రణాళికలు సిద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా… వాటిని ఎదుర్కోవడంతో పాటు ఎన్నికల్లో సత్తా చాటే దిశగా వైసీపీ కూడా సమాయత్తం అవుతోంది. అందులో భాగంగానే… గురువారం వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి పార్టీ …
Read More »ఓటు లేకపోతే… పథకాలు కట్: రేవంత్ సంచలన ప్రకటన!!
రాష్ట్రంలో ఓటు లేని వారికి ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలను ఎలా అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఎవరి ఓటును వారు భద్రంగా చూసుకోవాలని ఆయన సూచించారు. ఓటు పోకుండా ఎవరికి వారు జాగ్రత్త వహించాలన్నారు. ఓటరు జాబితాలో పేరు లేని వారికి సంక్షేమం ఇచ్చే విషయంలో ప్రభుత్వం పునరాలోచిస్తుందని ఆయన సంచలన ప్రకటన చేశారు. ఈ విషయంలో కేంద్రం కూడా అలానే ఉందని తెలిపారు. ఇప్పటికే కొన్ని …
Read More »బండ్ల గణేష్‌కు అక్కడా షాకే
ప్రముఖ తెలుగు నిర్మాత, నటుడు బండ్ల గణేష్‌కు సంబంధించిన ఆస్తి వివాదం ఇటీవల వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. గణేష్‌కు చెందిన పరమేశ్వర పౌల్ట్రీ ఫామ్‌కు చెందిన 500 గజాల స్థలాన్ని యూనియన్ బ్యాంకు వేలం వేయడం చర్చనీయాంశం అయింది. బ్యాంకు నుంచి రుణం తీసుకునేందుకు ఈ ఆస్తిని గణేష్ కుటుంబం తనఖా పెట్టగా.. సమయానికి రుణం చెల్లించకపోవడంతో ఆ స్థలాన్ని వేలం వేసి డబ్బులు జమ చేసుకున్నారు యూనియన్ బ్యాంకు …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates