Political News

నేత‌ల‌ను కాపాడుకోవ‌డ‌మే జ‌గ‌న్‌కు భారీ టాస్క్ ..!

వైసిపి అధినేత జగన్ కి ఇప్పుడు పార్టీ నాయకులను కాపాడుకోవడమే పెద్ద టాస్క్ గా మారింది. ముఖ్యంగా గత ఎన్నికల్లో ఓడిపోయినా అనేక నియోజకవర్గాల్లో నాయకులు సమన్వయం లేకపోవడంతో పాటు పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొనకుండా వ్యవహరిస్తున్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది. దీనిపై ఇప్పటికే పార్టీ అధినేత దృష్టి పెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో 130 స్థానాలకు సంబంధించి నివేదికలు తెప్పించుకున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయా నియోజకవర్గాల్లో ఓడిపోయిన స్థానాలే …

Read More »

ఈసారి పెద్దిరెడ్డికి కష్టమే

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పుంగనూరు నియోజకవర్గం అంటేనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పెట్టని కోటగా ఉన్న విషయం తెలిసిందే. అయితే రాజకీయాల్లో పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. నాయకుల వ్యవహారశైలి పట్ల ప్రజల్లోనూ అసంతృప్తి పెరుగుతూ ఉంటుంది. దీనిని ఎప్పటికప్పుడు తగ్గించుకుంటూ ప్రజల నాడిని పట్టుకునే దిశగా నాయకులు అడుగులు వేయాలి. అయితే ఇప్పుడు ఎన్నికలు జరిగి 17 మాసాలైనా ఎమ్మెల్యేగా గెలిచిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రజల మధ్యకు రాలేకపోతున్నారు. కనీసం …

Read More »

కోట్లు ఇచ్చి 45 కోట్లు తీసుకున్నారా కేటీఆర్?

KTR formula e race

తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను విచారించేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇచ్చారు. దీంతో అసలు కేసీఆర్‌పై నమోదైన కేసు ఏంటి? ఆయనపై వచ్చిన అభియోగాలు ఏంటనే విషయం ఆసక్తిగా మారింది. ఇదే సమయంలో గవర్నర్ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఏసీబీ ఆయనను అరెస్టు చేసే అవకాశం కూడా ఉందని చర్చ నడుస్తోంది. మరోవైపు గతంలో లొట్టపీసు కేసు అంటూ కేటీఆర్ లైట్ తీసుకున్నా …

Read More »

జూబ్లీ ఎఫెక్ట్: తెలంగాణ బీజేపీలో చీలిక?

ఒక ఉప ఎన్నిక అనేక మార్పులకు దారి తీస్తోంది. పార్టీలు ఏవైనా, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత కాంగ్రెస్‌లో అసమ్మతి స్వరాలు తగ్గాయి. సీఎం రేవంత్ సహా పార్టీ అధిష్ఠానంపై ఉన్న అసంతృప్తి కూడా తగ్గుముఖం పట్టింది. మరోవైపు బీఆర్‌ఎస్‌లోనూ మార్పులు కనిపిస్తున్నాయి. పార్టీ వ్యూహాలు మార్చుకోవాలన్న వాదన బలంగా వినిపిస్తోంది. బీఆర్‌ఎస్‌ను మరింత పటిష్ఠంగా ముందుకు తీసుకువెళ్లాలంటే వ్యూహాత్మకంగా ఆలోచించాల్సిందే అన్న చర్చ జరుగుతోంది. ఇదిలావుంటే, ఇదే జూబ్లీహిల్స్ …

Read More »

జ‌గ‌న్ కోర్టు యాత్ర‌లు చేసుకుంటే బెట‌ర్ : టీడీపీ

త‌న‌పై ఉన్న వేల కోట్ల రూపాయ‌ల అక్ర‌మాస్తుల కేసుల‌కు సంబంధించి వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. తాజాగా హైద‌రాబాద్‌లోని ఏసీబీ కోర్టుకు హాజ‌ర‌య్యారు. సుదీర్ఘ విరామం త‌ర్వాత‌.. ఆయ‌న కోర్టు మెట్లు ఎక్కారు. 2020లో ఒకే ఒక్క‌సారి ఆయ‌న ముఖ్య‌మంత్రి హోదాలో కోర్టు ఆదేశాల మేర‌కు నాంప‌ల్లికి వ‌చ్చి.. కోర్టు విచార‌ణకు హాజ‌ర‌య్యారు. ఆ త‌ర్వాత తాను ముఖ్య‌మంత్రిన‌ని… తాను బ‌య‌ట‌కు వ‌స్తే.. భారీ భ‌ద్ర‌త క‌ల్పించాల్సి  ఉంటుంద‌ని, పైగా తాను …

Read More »

భారత్ అమ్ములపొదిలో అమెరికన్ ‘అస్త్రాలు’

భారత రక్షణ రంగానికి అదిరిపోయే గుడ్ న్యూస్. మన సైనిక శక్తిని అమాంతం పెంచేందుకు అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాదాపు 93 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 800 కోట్లు) విలువైన భారీ ఆయుధ ఒప్పందానికి అమెరికా ఆమోదం తెలిపింది. ఇందులో ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన ‘జావెలిన్’ యాంటీ ట్యాంక్ మిసైల్స్‌తో పాటు, శత్రువులను పిన్ పాయింట్ అక్యురసీతో కొట్టే ‘ఎక్స్‌కాలిబర్’ ఆర్టిలరీ మందుగుండు సామగ్రి కూడా ఉంది. …

Read More »

ఈ టైంలోనా… మీ ‘రప్పా.. రప్పా..’?

తమ నాయకుడు వెళుతుంది కోర్టుకు..! అక్రమ ఆస్తుల కేసులో జైలు శిక్ష అనుభవించి, బెయిలుపై వచ్చి.. దాదాపు ఆరేళ్ల తర్వాత కోర్టుకు హాజరయ్యారు మాజీ సీఎం వైఎస్ జగన్. ఈ సమయంలో హైదరాబాదులో బేగంపేట నుంచి నాంపల్లి కోర్టు వరకు జగన్ అభిమానులు హంగామా సృష్టించారు. బేగంపేట్ నుంచి కోర్టు వ‌ర‌కు భారీ ర్యాలీ చేప‌ట్టిన అభిమానులు.. ర్యాలీలో మ‌హేష్ బాబు – జ‌గ‌న్ – కేటీఆర్ ఫ్లెక్సీలతో హల్చల్ …

Read More »

ట్రంప్ కొత్త ‘డప్పు’!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తనదైన శైలిలో ‘డప్పు’ కొట్టుకున్నారు. భారత్, పాకిస్థాన్ మధ్య మే నెలలో జరిగిన ఉద్రిక్తతలను తానే స్వయంగా ఆపానని, లేకపోతే అది అణు యుద్ధానికి దారితీసేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికి దాదాపు 50 సార్లు ఇదే మాట చెప్పిన ట్రంప్, ఈసారి న్యూయార్క్‌లో జరిగిన సౌదీ ఇన్వెస్ట్‌మెంట్ ఫోరమ్‌లో మరిన్ని కొత్త కథలు జోడించారు. “నేను జోక్యం చేసుకోకపోతే అణు బాంబుల …

Read More »

అసమర్థుడు: రాహుల్ పై దండయాత్ర

జాతీయ స్థాయిలో వచ్చిన విశ్లేషణలు నిజమయ్యాయి. కేంద్ర ఎన్నికల సంఘంపై విరుచుకుపడుతున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై మేధావుల దండయాత్ర ప్రారంభమవుతుంది అని రెండు రోజుల క్రితం ఓ జాతీయ మీడియాలో వచ్చిన వార్తలు తాజాగా నిజమయ్యాయి. ఏకంగా 272 మంది మేధావులు రాహుల్ గాంధీపై విమర్శల వర్షం కురిపించారు. అంతేకాదు ఆన్ లైన్ లో నిర్వహించిన సర్వేలో సంతకాలు కూడా చేశారు. మరో లేఖపైనా వారు సంతకాలు చేయడం …

Read More »

ఈ రెండు ఫొటోలు చాలు.. కూట‌మి బ‌లం చెప్ప‌డానికి!

“ఏపీలో కూట‌మి బ‌లం ఏ విధంగా ఉందో చెప్ప‌డానికి ఈ రెండు ఫొటోలు చాలు!“ ఈ మాట అన్న‌ది ఎవ‌రో టీడీపీ నాయ‌కులో.. బీజేపీ నేత‌లో కాదు.. త‌ట‌స్థులు, రాజ‌కీయ విశ్లేష‌కులు!!. అంతేకాదు.. నెటిజ‌న్లు కూడా ఫిదా అవుతున్న ఈ రెండు ఫొటోలు సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అవుతున్నాయి. అవే.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ క‌లిసి ఉన్న ఫొటో. దీనిలో …

Read More »

నిద్ర లేదు.. ఆహారం తినాలని లేదు: పీకే ఆవేదన

ఆయన అనేక మంది నాయకులను చూశారు. అనేక పార్టీల గెలుపు ఓటములను కూడా దగ్గరగా పరిశీలించారు. అంతేకాదు ఒక పార్టీ గెలుపుకోసం పనిచేసి మరో పార్టీని ఓడించారు. ఇలా గత 10 సంవత్సరాలకు పైగా ప్రత్యక్ష రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన రాజకీయ వ్యూహకర్త ప్రసాంత్ కిషోర్ ఉరఫ్ పీకే. అయితే ఆ అనుభవం తన దాకా వస్తే కానీ ఓటమిలో ఉన్న ఆవేదన ఆయనకు అర్థం కాలేదు. …

Read More »

ఏపీ కొత్త ఎమ్మెల్యేలు: ఒక్కొక్క‌రు ఒక్కోలా …!

రాష్ట్రంలో కొత్త ఎమ్మెల్యేల ప‌నితీరు ఎలా ఉంది? వారు.. ప్ర‌జ‌ల‌కు ఏమేర‌కు చేరువ అవుతున్నారు? .. ఈ ప్ర‌శ్న‌లు ఎవ‌రో.. ప్ర‌త్య‌ర్థులు అడుగున్న‌వి కాదు. సాక్షాత్తూ వారికి టికెట్ ఇచ్చి.. వారు గెలిచేలా ప్రోత్స‌హించి, ప్ర‌చారం చేసిన టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు వ‌స్తున్న డౌట్లు. ఈ క్ర‌మంలోనే కొత్త‌వారిని దారిలో పెట్టాల్సిన బాధ్య‌త‌ను వారిని స‌రైన విధంగా ప్ర‌జ‌ల‌కు చేరువ చేయాల్సిన బాధ్య‌త‌ను కూడా ఇంచార్జ్ మంత్రుల‌కు అప్ప‌గించారు. అయితే.. …

Read More »