తిరుమల శ్రీవారి పవిత్ర లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యిని వినియోగించిన కేసు వ్యవహారంపై అప్పటి టీటీడీ బోర్డు చైర్మన్, వైసీపీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి పిల్లిమొగ్గలు వేస్తున్నారు. గతంలో ఈ కేసు వ్యవహారం తెరమీదికి వచ్చినప్పుడు.. “అబ్బే.. అంతా రాజకీయం. చంద్రబాబు కావాలనే మాపై నిందలు వేస్తున్నారు“ అని బుకాయించారు. అంతేకాదు.. అసలు కల్తీ ఎక్కడ జరిగిందో నిరూపించాలని సవాల్ చేశారు. ఇదేసమయంలో వైవీ సుప్రీంకోర్టును ఆశ్రయించి.. …
Read More »ప్లాస్టిక్ రోడ్లు వచ్చేశాయ్: హైదరాబాద్ లో ఎక్కడో తెలుసా?
హైదరాబాద్ రోడ్లపై కొత్త లుక్ రాబోతోంది. ప్లాస్టిక్ వ్యర్థాలతో తయారు చేసిన అందమైన ఫుట్‌పాత్‌లు ఇప్పుడు ఫిల్మ్‌నగర్‌లో దర్శనమివ్వబోతున్నాయి. GHMC – గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రూ. 1.68 కోట్లతో ఒక వినూత్న ప్రాజెక్ట్‌ను చేపట్టింది. రామానాయుడు స్టూడియో నుంచి రోడ్ నంబర్ 79/82 జంక్షన్ మీదుగా భారతీయ విద్యా భవన్ వరకు 1.5 కిలోమీటర్ల మేర ఈ మోడల్ ఫుట్‌పాత్ ను నిర్మిస్తున్నారు. దీని స్పెషాలిటీ ఏంటంటే, …
Read More »స్పీడు పెంచితే వాహనం సీజ్
ఏపీలో రోడ్డు ప్రమాదాల లెక్కలు టెర్రర్ పుట్టిస్తున్నాయి.. ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ 15,462 రహదారి ప్రమాదాల్లో 6,433 మంది మృతి చెందారు. ఈ వివరాలు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు. ఇందులో మూడో వంతు ప్రమాదాలు ద్విచక్ర వాహనాల వల్ల జరిగినవే. 53 శాతం మేర ప్రమాదాలు కార్లు, ద్విచక్ర వాహనదారుల సెల్ఫ్ యాక్సిడెంట్లు ఉన్నాయి. రహదారి ప్రమాదాల్లో ఏపీ దేశంలో 8వ స్థానంలో ఉంది. నెల్లూరు, తిరుపతి, పలనాడు, …
Read More »జమ్మలమడుగులో ఏం జరుగుతోంది.. టిడిపి ఆరా..!
ఉమ్మడి కడప జిల్లాలోని జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం మారుతుంది. ముఖ్యంగా ప్రతిపక్షం వైసిపి ఇక్కడ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో అసలు నియోజకవర్గంలో ఏం జరుగుతోంది.. నాయకుల మధ్య సమన్వయం ఏ విధంగా ఉంది అనే అంశాలపై తెలుగుదేశం పార్టీ దృష్టి పెట్టింది. వాస్తవానికి జమ్మలమడుగు నియోజకవర్గంలో స్థిరమైన ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ ఏ పార్టీ కూడా వరుసగా నికరమైన విజయాన్ని దక్కించుకోలేకపోయింది. 2014 19 …
Read More »స్థానికంపై తర్జన – భర్జన.. నిధుల కోసమైనా ..!
స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వంలో ఇబ్బందికర అంశంగా మారింది. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి స్థానిక సంస్థలు ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేయాలి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి నోటు పంపించాలి. దానిని కేంద్ర ప్రభుత్వానికి పంపించాలి. లేకపోతే 15వ ఆర్థిక సంఘానికి సంబంధించిన దాదాపు 4 వేల కోట్ల రూపాయలకు పైగా గ్రామపంచాయతీ నిధులు కోల్పోయే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో చంద్రబాబు …
Read More »గంభీర్ కు మద్దతు తెలిపిన లెజెండరీ క్రికెటర్
సౌతాఫ్రికా చేతిలో టీమిండియా 0-2తో వైట్‌వాష్ అవ్వడం, గువాహటి టెస్టులో 408 పరుగుల ఘోర పరాభవం చవిచూడటంతో ఫ్యాన్స్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. స్టేడియంలోనే గంభీర్ పై రకరకాల నినాదాలు చేసే స్థాయికి పరిస్థితి వెళ్లిపోయింది. గౌతమ్ గంభీర్‌ను కోచ్‌గా తీసేయాలనే డిమాండ్స్ వినిపిస్తున్న వేళ, లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మాత్రం గంభీర్‌కు గట్టి మద్దతుగా నిలిచారు. విమర్శకులకు తనదైన శైలిలో చురకలు అంటించారు. గవాస్కర్ విమర్శకులను సూటిగా …
Read More »పవన్ వి పిచ్చిమాటలు అంటున్న బీఆర్ఎస్ మాజీ మంత్రి
గోదావరి జిల్లాల పచ్చదనం వల్లనే రాష్ట్రం విడిపోయిందేమో అనిపిస్తుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నవ్వుతూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తెలంగాణ నాయకుల దిష్టి తగిలి గోదావరి జిల్లాల్లో కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయని పవన్ చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. ప్రస్తుతం కోనసీమలో తలలు లేని మొండెం మాదిరి కొబ్బరి చెట్లు కనిపిస్తున్నాయని పవన్ అన్నారు. ఈ క్రమంలోనే పవన్ కామెంట్లపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే …
Read More »మరోసారి `పెద్దన్న`కు రేవంత్ పెద్దపీట
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. తన పెద్దన్నగా పేర్కొనే ఏకైక నాయకుడు ప్రధాని నరేంద్ర మోడీ. గత 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. వాస్తవానికి కాంగ్రెస్‌కు.. మోడీకి మధ్య ఉన్న రాజకీయ వివాదాలు, విభేదాల గురించి అందరికీ తెలిసిందే. నిరంతరం విమర్శించుకోవడం, ఎద్దేవా చేసుకోవడం కామనే. అయితే.. ఆ విభేదాల జోలికి పోకుండా.. ప్రధానిని మచ్చిక చేసుకునే క్రమంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా …
Read More »సోషల్ మీడియాపై సుప్రీమ్ కోర్టు సంచనల నిర్ణయం
యూట్యూబ్ ఛానెల్ పెట్టి ఏది పడితే అది మాట్లాడతాం, ఏ వీడియో పడితే అది అప్లోడ్ చేస్తాం అంటే ఇక కుదరదు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసే కంటెంట్‌పై ఒక కన్నేసి ఉంచేందుకు కొత్త చట్టాలు రాబోతున్నాయి. యూజర్ జనరేటెడ్ కంటెంట్‌పై నియంత్రణ లేకపోవడంతో జరుగుతున్న అనర్థాలపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. “ఎవరో ఒకరు బాధ్యత వహించాల్సిందే” అంటూ కేంద్రానికి గట్టి వార్నింగ్ ఇచ్చింది. 4 వారాల్లోగా దీనికి సంబంధించిన …
Read More »శ్రీవారికి అప్రతిష్ట తెచ్చే పనులు చేయను… ఎవరినీ చేయనివ్వను: సీఎం
శ్రీవెంకటేశ్వరస్వామి పాదాల చెంత పుట్టిపెరిగా.. స్వామివారికి అప్రతిష్ట తెచ్చే ఏ పని నేను చేయను.. ఎవరినీ చేయనివ్వను.. అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాజధానిలోని వెంకటపాలెంలో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణ పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రెండు దశల్లో రూ.260 కోట్లతో చేపట్టనున్న పనులకు శంకుస్థాపన చేశారు. ఒక పవిత్ర దేవాలయమైన వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణ పనులకు సంకల్పించాం అన్నారు. ఈ ప్రాంత రైతులను ఈ …
Read More »పెట్టుబడి ఏదైనా… విశాఖ మాత్రం తగ్గేదె లే..!
ఏపీ ఐటీ రాజధాని.. పెట్టుబడులకు గమ్యస్థానంగా మారుతున్న విశాఖకు తాజాగా మరో లక్ష కోట్ల రూపాయల మేరకు పెట్టుబడులు రానున్నాయి. ఇప్పటికే గూగుల్ డేటా కేంద్రం రాకతో.. అనేక పెట్టుబడులు విశాఖను వెతుక్కుంటూ వస్తున్నాయి. ఇటీవల ఇక్కడ జరిగిన పెట్టుబడుల సదస్సులో 13 లక్షల కోట్ల రూపాయల వరకు ఒప్పందాలు జరిగాయి. వీటిలో ప్రతిష్టాత్మక కంపెనీల నుంచి దేశ విదేశీ పెట్టుబడి దారులు ఉన్నారు. మౌలిక సదుపాయాలు, రియల్ ఎస్టేట్, …
Read More »ఎవరైనా తగ్గేదే లే అంటున్న చంద్రబాబు, రేవంత్ కి పెద్ద సవాలే!
రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా.. పొరుగున ఉన్న కర్ణాటకతోనూ.. వివాదంగా మారిన నదీ జలాల సమ స్యపై ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పటి వరకు మౌనంగా ఉన్నారు. అప్పుడప్పుడు మాత్రమే ఆయన స్పందిస్తున్నా.. ఆయా నదుల విషయంలో మిగులు జలాలుగా ఉన్న.. ముఖ్యంగా సముద్రంలో వృథాగా కలుస్తున్న నీటిని వడిసి పట్టుకుని `అందరం` సద్వినియోగం చేసుకుందామని చెబుతున్నారు. కానీ, ఈ విషయంలో తెలంగాణ, కర్ణాటకలు.. తమ వాదనకే పరిమితం అవుతున్నాయి. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates