Political News

వైసీపీ దౌర్జన్యాలపై లోకేష్ క్షణం కూడా ఆగట్లేదు!

మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ 151 సీట్ల నుంచి ఒక్కసారిగా 11 సీట్లకు పడిపోయింది. ఈ తరహా ఫలితాలు ఆ పార్టీకి చెంపపెట్టేనని చెప్పక తప్పదు. అధికారంలో ఉండగా ఆ పార్టీకి చెందిన శ్రేణులు రాష్ట్రంలో దారుణాలు, దౌర్జన్యాలకు పాల్పడ్డారని టీడీపీ, జనసేనలు ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే… ఇప్పుడు వైసీపీ ఓడిపోయినా కూడా ఆ పార్టీ శ్రేణుల దౌర్జన్యాలు ఆగట్లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ మాట నిజమేనన్నట్టుగా ప్రకాశం …

Read More »

ఏపీలో జూన్ లోగా విధుల్లోకి కొత్త టీచర్లు!

ఏపీలో నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీకి సర్వం సిద్ధం అయిపోయింది. మెగా డీఎస్సీఫై ఇప్పటికే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్య శాఖా మంత్రి నారా లోకేష్ స్పష్టమైన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. వచ్చే విద్యా సంవత్సరం మొదలు అయ్యేలోగానే డీఎస్సీ నియామకాలను భర్తీ చేస్తామని ఆయన చెప్పిన సంగతీ తెలిసిందే. లోకేష్ ప్రకటనకు అనుగుణంగానే పాఠశాల విద్య శాఖ మెగా డీఎస్సీకి సంబంధించి స్పష్టమైన …

Read More »

అన్నీ ఓకే.. మరి సమన్వయం మాటేమిటి?

అసలే అక్కడ విపక్ష పార్టీకి చెందిన బడా నేతలు సందు దొరికితే చాలు.. దూరేద్దామని చూస్తున్నారు. అలాంటి చోట అధికార పార్టీలో నేతల మధ్య సమన్వయం లేకపోతే ఎలా? పార్టీ క్రమంగా బలహీనపడుతుంది కదా. ఆ మాత్రం తెలియకుండా ఎవరికీ వారే అన్న రీతిన నేతలు వ్యవహరిస్తే ఎలా? ఇకపై అలాంటి పరిస్థితిని ఉపేక్షిందేది లేదు అంటూ టీడీపీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పార్టీకి చెందిన కీలక నేతలను …

Read More »

పవన్ కల్యాణ్ ధర్మ పరిరక్షణ యాత్ర షురూ!

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హైందవ ధర్మ పరిరక్షణ యాత్ర బుధవారం మొదలై పోయింది. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న పవన్.. ఇప్పటికే ఈ యాత్రను ఓ మారు వాయిదా వేసుకున్నారు. అయితే అనారోగ్యం కారణంగా మరోమారు యాత్రను వాయిదా వేసుకునేందుకు ఆయన ససేమిరా అన్నారు. ఈ క్రమంలో బుధవారం ఇదివరకే నిర్దేశించుకున్నట్టుగా ధర్మ పరిరక్షణ యాత్రకు పవన్ శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా హైదరాబాద్ …

Read More »

ఆప‌రేష‌న్ ‘పులివెందుల’ స‌క్సెస్‌?

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌కు పొలిటిక‌ల్ హార్ట్ వంటి పులివెందులపై టీడీపీ నాయ‌కులు క‌న్నేశారు. ఆయ‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీకి షాకిచ్చే ప‌రిణామాల‌ను తెర‌మీదికి తెచ్చారు. రాష్ట్రంలో 12 మునిసిపాలిటీల‌ను కైవ‌సం చేసుకున్న టీడీపీ కూట‌మి.. ఇప్పుడు కీల‌క‌మైన పులివెందుల‌పైనా దృష్టి పెట్ట‌డం గ‌మ‌నార్హం. పులివెందుల అంటేనే వైసీపీకి, వైఎస్ కుటుంబానికి కూడా అత్యంత కీల‌క‌మ‌న్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఎక్క‌డ ఓడిపోయినా.. పార్టీ ఇక్క‌డ విజ‌యం …

Read More »

బాబును చూసి బిత్తరపోయిన మంత్రులు, అధికారులు

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మంగళవారం అన్ని శాఖల మంత్రులు, కార్యదర్శులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. అమరావతిలోని సచివాలయం వేదికగా జరిగిన ఈ సమావేశంలో ఆయా శాఖలపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఆయా శాఖల్లోని సమస్యలు, వాటి పరిష్కారాలపైనా చంద్రబాబు ద్రుష్టి సారించారు. గతంలోకంటే కాస్తంత భిన్నంగా సాగిన ఈ సమావేశంలో… ఆయా శాఖలకు చంద్రబాబు నిర్దేశిత లక్ష్యాలను కూడా సూచించారు. దాదాపుగా అన్ని శాఖల …

Read More »

ఉప ఎన్నికలు రావడం ఖాయం.. కేసీఆర్ ధీమా

తెలంగాణాలో ఉప ఎన్నికలకు దాదాపుగా రంగం సిద్ధం అయినట్టుగానే కనిపిస్తోంది. ఎక్కడైనా.. ఉప ఎన్నికలంటే… అధికార పార్టీలు రంకెలు వేయడం రివాజు. అయితే అందుకు విరుద్దంగా తెలంగాణాలో విపక్ష పార్టీగా ఉన్న బీఆర్ఎస్ ఉప ఉన్నికలకు ఉవ్విళ్లూరుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తనకు ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవాలని చూస్తున్న బీఆర్ఎస్ ఉప ఎన్నికలను అందుకు వినియోగించుకోవాలని చూస్తోంది. అంతేకాకుండా ఎన్నికలు ముగియగానే తనకు షాక్ ఇచ్చిన 10 మంది …

Read More »

“నా ఆశయాలు పవన్ నెరవేర్చుతాడు” : రాజకీయాలపై చిరు!

గత కొంత కాలంగా చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చే సూచనలు ఉన్నాయంటూ పలు మీడియా కథనాలు బాగానే చక్కర్లు కొట్టాయి. రాజ్యసభ సీట్ ఇస్తారని ఒకరు, జనసేన కోసం బీజేపీతో చేతులు కలుపుతారని మరొకరు ఏవేవో అల్లేశారు. ఇప్పటిదాకా దాని గురించి ఎక్కడా స్పందించని మెగాస్టార్ ఇవాళ జరిగిన బ్రహ్మ ఆనందం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పూర్తి క్లారిటీ ఇచ్చేశారు. పాలిటిక్స్ కి ఇకపై దూరంగా ఉంటానని, కేవలం …

Read More »

చంద్ర‌బాబుకు ష‌ర్మిల విన్న‌పం.. విష‌యం ఏంటంటే!

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల ఆస‌క్తిక‌ర విన్న‌పం చేశారు. త‌ర‌చుగా కేం ద్రంపై విమ‌ర్శ‌లు గుప్పిస్తూ.. చంద్రబాబుకు విన‌తులు స‌మ‌ర్పించే ష‌ర్మిల‌.. ఈ సారి కూడా.. ఇలాంటి ప్ర‌తిపాద‌నే తెర‌మీదికి తెచ్చారు. విజ‌య‌వాడ ప‌శ్చిమ ప్రాంతంలో నిర్మాణం పూర్త‌వుతున్న జాతీయ ర‌హ దారి విష‌యాన్ని ఆమె ప్ర‌స్తావించారు. ఈ ర‌హ‌దారిని వాయు వేగంతో పూర్తి చేస్తున్న సీఎం చంద్ర‌బాబుకు ష‌ర్మిల కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. …

Read More »

నెక్స్ట్ సుబ్బారెడ్డి, ధర్మారెడ్డిల వంతు!

తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలపై జరగుతున్న దర్యాప్తు సంచలన పరిణామాలకు దారి తీయనుంది. అసలు తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడనే లేదు అంటూ వైసీపీ నేతలు చెబుతున్నా… సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఇటీవలే నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసింది. ఈ నలుగురు కూడా మాములు వ్యక్తులు కాదు. తిరుమలకు నెయ్యి సరఫరా చేస్తున్న సంస్థల యజమానులు. ప్రస్తుతం వీరి లింకులపై …

Read More »

లోక్ సభలో లిక్కర్ గోల.. ఏపీ ఎంపీల సిగపట్లు

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఏపీకి సంబంధించిన సమస్యలు వరుసగా ప్రస్తావనకు వస్తున్నాయి. అందులో భాగంగా మంగళవారం నాటి లోక్ సభ సమావేశాల్లో బీజేపీ ఎంపీ సీఎం రమేష్, వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం నెలకొంది. వైసీపీ పాలనపై రమేష్ విసుర్లు సాధిస్తే… రమేష్ వ్యాఖ్యలను ఖండించే క్రమంలో మిథున్ రెడ్డి వ్యక్తిగత విమర్శలు చేసి సంచలనం రేపారు. లోక్ సభ జీరో …

Read More »

జగన్ తెగింపుపై చంద్రబాబు కామెంట్స్

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, కల్తీ జరగలేదని వైసీపీ నేతలు బల్లగుద్ది మరీ చెబుతూ వస్తున్నారు. కానీ, కల్తీ జరిగిందని ఆధారాలతో సహా నిరూపిస్తామని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ వ్యవహారంలో నలుగురిని సీబీఐ అధికారులు అరెస్టు చేయడంతో వైసీపీ నేతలకు షాక్ తగిలింది. ఈ క్రమంలోనే ఆ …

Read More »