తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. వెలుగులోకి వచ్చిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయాలను తీవ్రంగా కుదిపేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో అనేక మంది అధికారులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కీలక అధికారులు ప్రస్తుతం జైల్లో ఉండగా.. మరొకరు విదేశాలకు కూడా వెళ్లిపోయారు. ఇక, ఈ కేసులో మాజీ మంత్రి హరీష్‌రావు కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు …
Read More »కేసీఆర్ బాటలో రేవంత్ నడుస్తున్నారా?
ఎవరినైతే తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ రాజకీయంగా ఎదుగుతారో.. సదరు అధినేత తీరును తాను అనుకరించటానికి మించిన తప్పు మరొకటి ఉండదు. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పు చేస్తున్నారా? అన్నదిప్పుడు చర్చగా మారింది. సీఎంగా ఆయన తొలి ఏడాదిని విజయవంతంగా పూర్తి చేసుకుంటున్న వేళ.. పెద్ద ఎత్తున విజయోత్సవాల్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ సందర్భంంలో కాస్త ఇబ్బంది కలిగించినా.. వాస్తవాన్ని వెల్లడించాల్సిన అవసరం ఉంది. …
Read More »హైదరాబాద్ ట్రాఫిక్ నియంత్రణ.. హిజ్రాల చేతిలోకి..!
హైదరాబాద్.. ఎంత సుందర నగరమో.. అంతే కష్టాలకు కూడా కేంద్రం. చిన్నపాటి వర్షానికే మునిగిపోవడం.. ఎటు చూసినా ట్రాఫిక్‌తో కొట్టుమిట్టాడే సగటు జీవి.. మనకు ఇక్కడే కనిపిస్తాడు. ఉదయం 8-10, సాయంత్రం 4-8 అడుగు తీసి బయట పెట్టాలం టే ఆపశోపాలు పడాల్సిందే. కిలో మీటరు దూరం ప్రయాణించేందుకు నానా కష్టాలు పడాల్సిందే. దీనికి కారణం భారీగా పెరిగిపో యి వాహనాలు.. ప్రజలు! దీంతో ట్రాఫిక్ కష్టాలు ఇంతింత కదయా! …
Read More »డిప్యూటీ సీఎం పదవికి ఓకే చెప్పిన షిండే!
మహారాష్ట్రకు మరోసారి ముఖ్యమంత్రి కావాలని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే భావించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చివరి వరకు షిండే సీఎం పీఠం కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు. అయితే, ఫడ్నవీస్ ను ముఖ్యమంత్రిగా చేయాలని బిజెపి పెద్దలు భావించడంతో షిండే డిప్యూటీ సీఎం పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే రేపు షిండే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. షిండే తో పాటు అజిత్ పవర్ కూడా రేపు …
Read More »లోకేశ్ కి రుణపడ్డానంటోన్న డ్రైవర్ లోవరాజు!
ఐటీ శాఖా మంత్రిగా నారా లోకేశ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ప్రజా దర్బార్ నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. అది కాకుండా, ఎక్స్ లో, మీడియాలో, తన కార్యాలయం ద్వారా తన దృష్టికి వచ్చిన సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ప్రజా నాయకుడు అనిపించుకుంటున్నారు లోకేశ్. ఎన్నికలై పోయాయి…జనంతో ఏం పని అనుకోకుండా జనంతోనే మనం అన్న రీతిలో లోకేశ్ ప్రజలతో మమేకమవుతూ వారి కష్టసుఖాలలో అండగా నిలుస్తున్నారు. …
Read More »ప్రభుత్వంపై పోరుబాటకు జగన్ పిలుపు
ఏపీలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. సూపర్ సిక్స్ హామీలను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమలు చేయడం లేదని విమర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి చంద్రబాబు ప్రభుత్వం పై జగన్ విమర్శలకు దిగారు. ఆరు నెలలలోనే ఇంత ప్రజా వ్యతిరేకత తెచ్చుకున్న ప్రభుత్వాన్ని తాను ఎప్పుడూ చూడలేదని జగన్ అన్నారు. సూపర్ సిక్స్ లేదు సూపర్ …
Read More »ఆ మంత్రి పై బాబు కు మళ్ళీ కోపమొచ్చింది
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మంత్రి సుభాష్‌పై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారా? మంత్రి వ్యవహార శైలిపై సీఎం ఆగ్రహంతో ఉన్నారా? ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన మంత్రి వర్గ సమా వేశం అనంతరం.. సుభాష్‌తో ప్రత్యేకంగా మాట్లాడారా? ఆయనకు 20 నిమిషాల పాటు క్లాస్ తీసుకున్నారా? అంటే.. ఔననే అంటున్నారు టీడీపీ నాయకులు. తాజాగా జరిగిన కాకినాడ పోర్టు వ్యవహారంలో మంత్రి వ్యవహరించిన తీరు విమర్శలకు …
Read More »‘మత శిక్ష’ అనుభవిస్తున్న మాజీ డిప్యూటీ సీఎంపై కాల్పులు!!
సిక్కు మత పెద్దలు విధించిన శిక్షను శిరసావహిస్తూ.. పంజాబ్‌లోని స్వర్ణ దేవాలయం ప్రధాన ద్వారం వద్ద.. ద్వారపాలకుడిగా కూర్చున్న మాజీ డిప్యూటీ సీఎం సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై హత్యా యత్నం జరిగింది. నడవలేని స్థితిలో ఉన్న మాజీ సీఎం.. వీల్ చైర్‌లోనే కూర్చుని ఈ శిక్షను అనుభవిస్తున్నారు. పక్కన ఆయన అనుచరులు మాత్రమే ఉన్నారు. గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు వివాదాస్పద డేరా బాబాకు సహకరించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ …
Read More »మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి 10 రోజులు దాటినా ముఖ్యమంత్రి పీఠంపై మాత్రం పీటముడి వీడలేదు. ఆపద్ధర్మ సీఎం షిండే తనకు మరో చాన్స్ వస్తుందేమోనని ఆశించారు. అయితే, ఈ సారి బీజేపీ ఎక్కువ సీట్లు గెలుచుకోవడంతో ఫడ్నవీస్ ను సీఎం చేయాలని బీజేపీ పెద్దలు భావించారు. ఈ క్రమంలోనే సీఎం సీటుపై హైడ్రామాకు నేటితో తెరపడింది. మహారాష్ట్రకు కాబోయే ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ పేరు ఖరారైంది. ఫడ్నవీస్ పేరును …
Read More »మాఫియాకు పవన్ చెక్‌మేట్.. పోర్టుపై ప్రత్యేక నిఘా
కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై కూటమి సర్కారు ఉక్కుపాదం మోపుతోంది. ప్రత్యేక భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేస్తూ, రేషన్ బియ్యం మాఫియాకు చెక్ పెట్టే వ్యూహాలను రూపొందిస్తోంది. ఈ చర్యల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కలిసి దిశానిర్ధేశం చేశారు. ప్రత్యేక భద్రతా అధికారి (సీఎస్ఓ) పర్యవేక్షణలో 24 గంటల నిఘా ఉండేలా వ్యూహం అమలు చేస్తున్నారు. కాకినాడ పోర్టులో ఇప్పటికే సీజ్ …
Read More »వెలగపూడిలోనే చంద్రబాబు సొంత ఇల్లు : ఎన్ని ఎకరాలో తెలుసా…
ప్రతిపక్ష వైసీపీ నాయకులు తరచుగా సీఎం చంద్రబాబుపై చేస్తున్న విమర్శలకు ఇప్పుడు ఆయన చెక్ పెట్టనున్నారు. రాజధానిలో చంద్రబాబుకు సొంత ఇల్లు లేదని.. ఆయన రాజధానిని కడతానని చెబుతు న్నారంటూ వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున విమర్శలు చేసిన విషయం తెలిసిందే. దీనికి కారణం.. ప్రస్తుతం ఉండవల్లిలోని లింగమనేని ఎస్టేట్స్‌కు చెందిన ఇంట్లో చంద్రబాబు అద్దెకు ఉంటున్నారు. ఈ కారణంగానే చంద్రబాబుపై అనేక విమర్శలు వచ్చాయి. అయితే.. ఇప్పుడు చంద్రబాబు …
Read More »జగన్ చేసిన పనులతో తలెత్తుకోలేక పోతున్నాం.. : మంత్రి
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌పై ఏపీ మంత్రి పొంగూరు నారాయణ నిప్పులు చెరిగారు. అధికారంలో ఉండగా జగన్ చేసిన పనులతో తాము ఇప్పుడు తలెత్తుకోలేక పోతున్నామని ఆయన మండిపడ్డారు. తాజాగా సీఎం చంద్రబాబు నేతృత్వంలో జరిగిన కేబినెట్ భేటీ అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. అధికారంలో ఉండీ.. ఆయన తిప్పలు పెట్టాడు. ఇప్పుడు అధికారం పోయాక కూడా తిప్పలు పెడుతున్నాడు. ఆయన వల్ల మేం తలెత్తుకోలేక పోతున్నాం. ప్రజలకు …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates