Political News

నాకు ప‌ద‌వులు వ‌ద్దు.. మీరు కూడా.. ఆలోచించాలి: ప‌వ‌న్‌

“ప‌ద‌వుల కోసం నేను రాజ‌కీయాల్లోకి రాలేదు. నాకు ఎలాంటి ప‌ద‌వులు అవ‌స‌రం లేదు. మీరు(జ‌న‌సేన నాయ‌కులు) కూడా ఈ దిశ‌గానే ఆలోచించాలి. ప్ర‌జ‌ల‌కు మేలు చేసే ప‌నులు చేయాలి. ప‌ద‌వుల కోసం ఆరాటం ఎందుకు? ప‌ద‌వులు ఇప్పుడు ఉంటాయి రేపు పోతాయి. క్ష‌ణ‌కాలం ఉండే ప‌ద‌వుల కోసం ఆరాటం ఎందుకు” అని జ‌న‌సేన నాయ‌కుల‌ను ఉద్దేశించి ఆ పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్యాఖ్యానించారు. తాజాగా మంగ‌ళ‌గిరిలోని పార్టీ కేంద్ర …

Read More »

టీడీపీని ఇరుకున పెడుతున్న రెండు నియోజ‌క‌వ‌ర్గాలు..!

ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీకి బ‌లమైన జిల్లాలు చాలానే ఉన్నాయి. ఉభ‌య గోదావ‌రులు, గుంటూరు, శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం, అనంత‌పురం, క‌ర్నూలు, చిత్తూరు, కృష్ణా వంటివి కేడ‌ర్ ప‌రంగా బాగున్న జిల్లాలు. వీటిలో మ‌రీ ముఖ్యంగా సీమ ప‌రిధిలో ఉన్న అనంత‌పురం టీడీపీకి కంచుకోట‌. 2014 ఎన్నిక‌ల్లో ఇక్క‌డి దాదాపు అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ టీడీపీ గెలుచుకుంది. అయితే.. 2019 ఎన్నిక‌ల్లో మాత్రం ఒక్క హిందూపురం, ఉర‌వకొండ నియోజ‌క‌వ‌ర్గాల్లోనే విజ‌యం సాధించింది. అయిన‌ప్ప‌టికీ.. కేడ‌ర్ …

Read More »

చెక్కిన శిల్పంలా రేవంత్‌రెడ్డి.. ఆటుపోట్లు, ఎదురీత‌లు..!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ విజ‌యం ద‌క్కించుకుంటుంద‌ని.. మెజారిటీకి కావాల్సిన మేజిక్ ఫిగ‌ర్ సొంతం చేసుకుంటుంద‌ని అనేక స‌ర్వేలు చెబుతున్నాయి. ఒక‌టి రెండు త‌ప్ప‌.. మిగిలిన స‌ర్వేలు.. పూర్తిస్థాయిలో మెజారిటీ కూడా కాంగ్రెస్ పంపాయించుకుంటుంద‌ని అంచ‌నా వేశాయి. సో.. డిసెంబ‌రు 3నాటి ఫ‌లితం ముందు.. ఇప్పుడు వ‌చ్చిన స‌ర్వేల రిజ‌ల్ట్‌.. స‌హ‌జంగానే కాంగ్రెస్‌లో ఊపు తెచ్చింది. తెలంగాణ ఇచ్చామ‌ని చెబుతున్న కాంగ్రెస్‌.. గ‌త ప‌దేళ్లుగా పోరాటం చేస్తూనే ఉంది. …

Read More »

ఏపీలో వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ ర‌ద్ద‌వుతుందా…?

ఏపీలో వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ మ‌రోసారి చ‌ర్చ‌కు వ‌చ్చింది. అస‌లు ఈ వ్య‌వ‌స్థ ఉంటుందా? ఎన్నిక‌ల స‌మయానికి ర‌ద్ద‌వుతుందా? అదే జ‌రిగితే వైసీపీ నాయ‌కులు ఏం చేయాలి? పార్టీ అధిష్టానం ప్ర‌త్య‌మ్యాయ మార్గాల‌ను అన్వేషిందా? అనేది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. 2019 అక్టోబ‌రులోనే వ‌చ్చిన వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌పై రెండు ర‌కాల చ‌ర్చ‌లు సాగుతున్నాయి. ఒక‌టి దీనిలో పాజిటివ్‌. రెండు నెగిటివ్‌. ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వ ప‌థ‌కాలు చేరువ చేయ‌డం.. పాజిటివ్‌. అంతేకాదు.. నెలనెలా …

Read More »

మంత్రులకు ఓటమి తప్పదా ?

తాజాగా జరిగిన పోలింగ్ సరళని చూసిన తర్వాత బీఆర్ఎస్ ఓటమి తప్పదనే బావన పెరిగిపోతోంది. దీనికి ముఖ్య కారణం ఏమిటంటే ఎగ్జిట్ పోల్స్ జోస్యాలు. ఎగ్జిట్ పోల్స్ సర్వేలను విడుదలచేసిన సుమారు 20 సంస్ధల్లో దాదాపు 17 సంస్ధలు కాంగ్రెస్ విజయం ఖాయమని బల్లగుద్ది చెప్పటమే. ఒకటి రెండు సంస్ధలు బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తుందని చెబితే మరో రెండు సంస్ధలు హంగ్ అసెంబ్లీ వచ్చే అవకాశముందని కూడా జోస్యం …

Read More »

ఓడినా.. గెలిచినా.. కేసీఆర్ చేసేదిదే..!

తెలంగాణ అధికార పార్టీ బీఆర్ ఎస్‌.. క్లారిటీతో ఉందా? ప్ర‌స్తుత తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గెలిచినా.. ఓడినా ఏం చేయాల‌నే అంశంపై సీఎం కేసీఆర్ ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ఉన్నారా? ఆయ‌న వ్యూహం ఆయ‌న‌కు ప్ర‌త్యేకంగా ఉందా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. తాజాగా వ‌చ్చిన ఎగ్జిట్ పోల్స్ కంటే కూడా.. సొంత నిఘా వ‌ర్గాల ద్వారా కూడా కేసీఆర్‌కు ఎప్పుడో రాష్ట్ర ప‌రిస్థితి, ప్ర‌జానాడిపై అవ‌గాహ‌న ఉందని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. …

Read More »

ఎగ్జిట్ పోల్ నిజ‌మైతే.. దేశంలో కొత్త హిస్ట‌రీ..!

దేశంలో ఐదు రాష్ట్రాల‌కు అసెంబ్లీ ఎన్నిక‌లు పూర్త‌య్యాయి. దాదాపు మూడు మాసాల కింద‌ట ప్రారంభమైన అసెంబ్లీ ఎన్నిక‌ల క్ర‌తువు ఫైన‌ల్ స్టేజ్‌కు వ‌చ్చేసింది. డిసెంబ‌రు 3న ఎన్నిక‌ల ఫ‌లితం రానుంది. అయితే.. దీనికి ముందుగా.. ఎగ్జిట్ పోల్స్ వ‌చ్చేశాయి. ఈ ఫలితాలు చాలా డిఫ‌రెంట్‌గా ఉండ‌డం గ‌మ‌నార్హం. అందుకే..చాలా చోట్ల ఈ ఫ‌లితాల‌పై భిన్నాభిప్రాయాలు వ‌చ్చాయి. ఒక‌వేళ అభిప్రాయాల‌ను ప‌క్క‌న పెట్టి అవే క‌నుక నిజ‌మైతే.. దేశంలో కొత్త హిస్ట‌రీ …

Read More »

బీజేపీకి పెద్ద పరీక్షేనా ?

తాజాగా జరిగిన పోలింగులో మిగిలిన పార్టీల సంగతి ఎలాగున్నా బీజేపీకి మాత్రం పెద్ద పరీక్షే ఎదురయ్యింది. అందులోను పోటీచేసిన అభ్యర్ధులందరిలో ఆరుగురి పరిస్ధితి మరీ ప్రత్యేకం. ఇంతకీ విషయం ఏమిటంటే బీజేపీ తరపున పోటీచేసిన ఆరుగురు చాలా ప్రత్యేకం. ఎలాగంటే ఇపుడు పోటీచేసిన వారిలో ముగ్గురు ఎంపీలతో పాటు ముగ్గురు ఎంఎల్ఏలున్నారు. సిట్టింగ్ ఎంఎల్ఏల హోదాలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో కూడా పోటీచేసిన వాళ్ళున్నారు. అయితే బీజేపీ అధికారంలోకి వచ్చేయటం …

Read More »

2018 ఎగ్జిట్ పోల్‌.. కేటీఆర్ కామెంట్స్‌తో వెతికేసిన నెటిజ‌న్లు

తెలంగాణ స‌హా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌ల ఓటింగ్ ప్ర‌క్రియ ముగిసింది. ఈ క్ర‌మంలో ఆయా రాష్ట్రాల్లో ఎవ‌రు గెలుస్తారు? ఎవ‌రు ఓడిపోతారు? అనే విష‌యాల‌పై తాజాగా అనేక సర్వేలు వ‌చ్చాయి. కాంగ్రెస్‌-బీజేపీల మ‌ధ్య మూడు రాష్ట్రాల్లో పోటాపోటీగా ఉంటుంద‌ని స‌ర్వేలు చెప్ప‌గా.. ఒక రాష్ట్రం మిజోరాంలో కాంగ్రెస్‌-అక్క‌డి స్థానిక పార్టీ ఎంఎన్‌పీల మ‌ధ్య పోటీ ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశాయి. అయితే.. తెలంగాణ‌లో కూడా ఇంతే పోటీ ఉంటుంద‌ని చెప్పినా.. …

Read More »

రెండు చోట్ల కుస్తీ.. ఒక్క‌చోటే విజ‌యం.. అగ్ర‌నేతలకు షాక్‌!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో రెండు చోట్ల నుంచి పోటీ చేసిన అగ్ర‌నాయ‌కుల‌కు.. ఓట‌ర్లు షాకిచ్చారు. పార్టీల‌కు అతీతంగా నాయ‌కుల‌ను ఓడించేందుకు రెడీ అయిన‌ట్టు స‌ర్వేలు చెబుతున్నాయి. ఈ పార్టీ.. ఆ పార్టీ అనే తేడా లేకుండా.. ప్ర‌జ‌లు రెండేసి స్థానాల్లో పోటీచేసిన నాయ‌కుల‌ను ఒక్క స్థానానికే ప‌రిమితం చేయ‌డం గ‌మ‌నార్హం. కేసీఆర్‌: రెండు స్థానాల నుంచి పోటీ చేశారు. తెలంగాణ‌కు ముందు.. త‌ర్వాత కూడా.. కేసీఆర్ ఇలా రెండు చోట్ల …

Read More »

ఎగ్జిట్ పోల్ సర్వే తప్పు…70 సీట్లు పక్కా: కేటీఆర్

తెలంగాణ శాసనసభ ఎన్నికల పోలింగ్ పోయడంతో సర్వత్రా ఎగ్జిట్ పోల్స్ సందడి మొదలైంది. జాతీయ స్థాయితోపాటు రాష్ట్ర స్థాయిలో చేపట్టిన సర్వేలలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారని వెల్లడైంది. బీఆర్ఎస్ ప్రతిపక్ష స్థానానికే పరిమితం కావాల్సి వస్తుందని పలు సర్వే సంస్థలు అంచనా వేశాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఎగ్జిట్ పోల్ సర్వేలపై మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ వైపు పోలింగ్ పూర్తవ్వకుండానే ఎగ్జిట్ పోల్ …

Read More »

కామారెడ్డిలో రేవంత్ రెడ్డి సోదరుడిపై దాడి

తెలంగాణ ఎన్నికలలో కొన్ని ప్రాంతాలు మినహా మిగతా ప్రాంతాలలో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. జనగామ, కామారెడ్డి, నాగర్ కర్నూల్, కొత్తగూడెం, పాలేరు, నర్సాపూర్ లో ఘర్షణలు జరిగాయి. మెదక్ జిల్లాలోని నర్సాపూర్ నియోజకవర్గంలో లింగంపల్లి బిట్ల తండాలో బీఆర్ఎస్ అభ్యర్థి సునీత లక్ష్మారెడ్డి కుమారుడి వాహనంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసిన ఘటన సంచలనం రేపింది. కామారెడ్డిలో రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్‌రెడ్డిని బీఆర్‌ఎస్ నేతలు అడ్డుకోవడంతో ఘర్షణ వాతావరణం …

Read More »