ఏ పార్టీ నుంచి పోటీ చేసేందుకు అయినా తాను సిద్ధమేనని తాజాగా వైసీపీ ఎమ్మెల్యే, ఇటీవల టికెట్ దక్కదని తెలిసిన తర్వాత.. తీవ్ర విమర్శలు గుప్పించిన ఉమ్మడి అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆయన వైసీపీలోనే కొనసాగుతున్నారు. అయితే.. తాజాగా మంగళవారం ఆయన ఇదే జిల్లాకు చెందిన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డిని కలిశారు. ఆయన పాదాలపై కూడా పడ్డారు. దీంతో కాపు కాంగ్రెస్ …
Read More »ఈసీటు చాలా హాటుగా మారిపోతోందా ?
రాబోయే ఎన్నికల్లో కొన్ని అసెంబ్లీ సీట్లు లేదా పార్లమెంటు సీట్లు చాలా హాటుగా మారబోతున్నాయి. ఇలాంటి హాట్ సీట్లలో రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కూడా ఒకటి. ఇప్పటికి ఇది టీడీపీ ఖాతాలోనే ఉంది. సీనియర్ తమ్ముడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎంఎల్ఏగా ఉన్నారు. వచ్చేఎన్నికల్లో ఈసీటు ఎలా హాటుగా మారబోతోందంటే ఇదే సీటులో పోటీచేయాలని జనసేన మహా పట్టుదలగా ఉంది. ఇదే సమయంలో వైసీపీ తరపున మంత్రి చెల్లుబోయిన వేటుగోపాలకృష్ణ …
Read More »టికెట్ రాకుంటే 40 కోట్లు మిగిలినట్లే: దగ్గుబాటి
వైసీపీ మాజీ నేత, సీనియర్ పొలిటిషన్ మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు కొద్దిరోజుల క్రితం వైసీపీపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. గత ఎన్నికలలో తాను వైసీపీ నుంచి ఓటమిపాలు కావడమే మంచిదయిందని, లేదంటే తన నియోజకవర్గ ప్రజలు తనను అభివృద్ధి చేయలేదని నిలదీసేవారని దగ్గుబాటి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపాయి. ఆ వ్యాఖ్యల వేడి తగ్గక ముందే తాజాగా ఆయన మరోసారి వైసీపీని పరోక్షంగా …
Read More »చంద్రబాబుకు బంగారు పళ్లెంలో పెట్టి..
టీడీపీ ఫైర్బ్రాండ్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్.. తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని దెందులూరు నియోజకవర్గంపై పేటెంట్ తనదేనని అన్నారు. ఇక్కడ ఎవరికీ స్థానం లేదన్నారు. తానే ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని చెప్పుకొంటానని, ఈ దైర్యం తనకు మాత్రమే ఉందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం గత నాలుగు రోజులుగా ఆయన నియోజకవర్గంలోని వాడ వాడలా తిరుగుతున్నారు. వచ్చే ఎన్నికలకు సంబంధించి క్షేత్రస్థాయిలో రంగం …
Read More »లోకేష్ నన్ను కొట్టించాలని చూశాడు: కేశినేని నాని
విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యవహారం కొద్దిరోజులుగా ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో సంచలనం రేపుతోన్న సంగతి తెలిసిందే. టీడీపీ సీనియర్ నేతగా ఉన్న నాని ఆ పార్టీకి గుడ్ బై చెబుతున్నానని ప్రకటించడం సంచలనం రేపింది. రాబోయే ఎన్నికల్లో నానికి టికెట్ ఇవ్వడం లేదని చంద్రబాబు తేల్చి చెప్పడంతో తన పదవితోపాటు పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయబోతున్నానని నాని ప్రకటించారు. దీంతో నాని వైసీపీలో చేరబోతున్నారని ప్రచారం …
Read More »వైసీపీలో మరో వికెట్..ఎంపీ సంజీవ్ గుడ్ బై
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అధికార పార్టీ వైసీపీలో లుకలుకలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలలో కొందరికి జగన్ స్థానచలనం కల్పిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీలో అసమ్మతి రాగం తీవ్రంగా వినిపిస్తోంది. చాలామంది వైసీపీ నేతలు పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉండగా..మరికొందరు జనసేన, టీడీపీ, కాంగ్రెస్ లో చేరబోతున్నామని ప్రకటించారు. ఈ క్రమంలోనే తాజాగా వైసీపీలో మరో వికెట్ పడింది. వైసీపీకి కర్నూలు ఎంపీ …
Read More »1+1 ఆఫర్.. ఇదీ కేశినేనికి వైసీపీ హామీ!
తాజాగా వైసీపీ కండువా కప్పుకొనేందుకు సిద్ధమైన విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేనికి సీఎం జగన్ 1+1 ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. సుదీర్ఘ రహస్య మంతనాలు.. చర్చలు.. అనేక డిమాండ్ల తర్వాత.. కేశినేని గుట్టు విప్పారు. నేరుగా తాడేపల్లికి వెళ్లి.. సీఎం జగన్ను కలుసుకున్నారు. ఆయనపై పొగడ్తలకు కురిపించలేదు కానీ.. ఫక్తు.. రాజకీయ నాయకుడు అనిపించేశారు. టికెట్ ఇచ్చి, రెండు సార్లు ఎంపీ అయ్యే అవకాశం కల్పించిన టీడీపీపై తనదైన శైలిలో …
Read More »బీజేపీలో కూడా పోటీ పెరుగుతోందా ?
రాబోయే ఎన్నికలకు సంబంధించి బీజేపీలో కూడా పోటీ పెరిగిపోతోంది. వైసీపీ, టీడీపీల్లో సీటుకోసం పోటీ ఉందంటే అర్ధంచేసుకోవచ్చు. ఎందుకంటే రెండూ బలమైన పార్టీలు కాబట్టి సహజంగానే నేతలు ఎక్కువమంది ఉంటారు. కానీ బీజేపీలో కూడా పోటీ ఉందంటేనే ఆశ్చర్యంగా ఉంది. ఇంతకీ విషయం ఏమిటంటే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో విశాఖపట్నం నుండి పోటీచేయాలని బీజేపీ ఆశిస్తోంది. ఇపుడు పార్టీలోనే ముగ్గురు నేతల మధ్య పోటీ పెరిగిపోతోంది. చాలాకాలంగా రాజ్యసభ ఎంపీ …
Read More »బాబుకు మరింత బూస్ట్..3 కేసుల్లో బెయిల్
టీడీపీ జాతీయాధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై ఏపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలతో పలు కేసులు పెట్టిందని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. స్కిల్ డెవలప్మెంట్ స్కాం అంటూ చంద్రబాబుపై మొదటి కేసు నమోదు చేసిన ఏపీ సిఐడి చివరకు మద్యం దుకాణాల కేటాయింపులలో అవకతవకల కేసుతో ఈ కేసుల పర్వానికి కామా పెట్టిందని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఆ తర్వాత స్కిల్ కేసులో చంద్రబాబుకు …
Read More »అమ్మ రాయుడూ.. పాలిటిక్స్ బాగానే ఒంటబట్టాయే!
అంబటి రాయుడు. ఇటీవల కాలంలో రాజకీయాల్లో భారీ ఎత్తున వినిపించిన పేరు. భారత మాజీ క్రికెటర్గా మంచి పేరు, అభిమానులను సంపాయించుకున్న రాయుడు స్వస్థలం ఉమ్మడి గుంటూరు జిల్లా. కొన్నాళ్ల కిందటే క్రికెట్ కు గుడ్ బై చెప్పిన రాయుడు ఇటీవల వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీనికి ముందే ఆయన గుంటూరులోని పలు గ్రామాల్లో పర్యటించారు. అయితే.. ఏమైందో ఏమో.. అనూహ్యంగా పార్టీలో చేరిన ఆరు రోజుల వ్యవధిలోనే ఆయన …
Read More »చంద్రబాబు బీసీ మార్క్
తొందరలో జరగబోతున్న ఎన్నికల్లో పార్లమెంటు అభ్యర్ధుల్లో ఎక్కువగా బీసీ నేతలను ఎంపిక చేయాలని చంద్రబాబునాయుడు ఆలోచిస్తున్నారు. బలమైన బీసీ నేతల కోసం అన్వేషణ తీవ్రమైంది. ఎప్పటినుండో బలమైన అభ్యర్ధుల కోసం చంద్రబాబు వెతుకుతున్నారు. వ్యూహకర్త రాబిన్ శర్మ బృందం కూడా ఇదే పనిలో నిమగ్నమైంది. ఎన్నికలు మహాయితే మరో మూడునెలల్లో జరగబోతోంది. అందుకనే ఇపుడు అభ్యర్ధుల ఎంపికలో చంద్రబాబు స్పీడు పెంచారు. 25 నియోజకవర్గాల్లో జనసేనకు ఎన్ని కేటాయిస్తారన్నది సస్పెన్సుగా …
Read More »కాంగ్రెస్ లోకి ‘కాపు’ ఖాయమా ?
కాంగ్రెస్ పార్టీలోకి వైసీపీ రాయదుర్గం ఎంఎల్ఏ కాపు రామచంద్రారెడ్డి చేరటం దాదాపు ఖాయమనే అనుకోవాలి. పార్టీలో జరుగుతున్న పరిణామాలతో మనస్తాపం చెందిన ఎంఎల్ఏ తొందరలోనే కాంగ్రెస్ లో చేరటానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు అర్ధమవుతోంది. కారణం ఏమిటంటే కాంగ్రెస్ సీనియర్ నేత, సీడబ్య్లూసీ సభ్యుడు నీలకంఠాపురం రఘువీరారెడ్డి యాదవ్ తో భేటీ అవ్వటమే. వీళ్ళిద్దరి మధ్య దాదాపు గంటసేపు భేటీ జరిగింది. వైసీపీలో కాపుకు రాయదుర్గంలో టికెట్ ఇవ్వటంలేదని జగన్మోహన్ రెడ్డి …
Read More »