నందమూరి నట సింహం బాలకృష్ణ ఇప్పుడు ఫుల్ ఖుషీగా ఉన్నారని చెప్పాలి. బాలయ్య నటించిన సినిమాలన్నీ వరుసబెట్టి హిట్ల మీద హిట్లు కొడుతున్నాయి. అంతేకాకుండా 50 ఏళ్లుగా సినిమా రంగంలో విశేష సేవలందించినందుకు గాను ఆయనను కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్ పురస్కారంతో సత్కరించింది. దీంతో బాలయ్యతో పాటుగా బాలయ్య ఫ్యాన్స్ ఆనంద డోలికల్లో తేలియాడుతున్నారు. ఎంత సంతోషంలో మునిగిపోయినా… బాలయ్యలోని స్పాంటేనిటీ మాత్రం నిత్యం ఆన్ లోనే ఉంటుందని …
Read More »గవర్నర్ ‘ఏట్ హోం’ లో బాబు, పవన్, లోకేష్
రాజకీయ నేతలు నిత్యం బిజీ షెడ్యూల్ తో సాగిపోతూ ఉంటారు. ఇక అధికారంలో ఉన్న పార్టీల నేతలైతే.. క్షణం తీరిక లేకుండా ఉరుకులు పరుగులు పెడుతూ ఉంటారు. ఇందుకు ఏ ఒక్క పార్టీల నేతలు మినహాయింపు కాదు. అయితే రిపబ్లిక్ డేను పురస్కరించుకుని అటు కేంద్రంలో రాష్ట్రపతి, ఇటు రాష్ట్రాల్లో గవర్నర్లు ఏర్పాటు చేసే తేనీటి విందు మాత్రంలో నేతల హడావిడి అస్సలు కనిపించదు. ఎప్పుడూ టెన్షన్ గా కనిపించే …
Read More »బాబు విజన్ కు కట్టుబడదాం : మంత్రి మనోహర్
భారత గణతంత్ర దినోత్సవం నాడు ఆదివారం మంగళగిరిలోని జనసేన పార్టీ నేతల ఓ కీలక సమావేశం జరిగింది. పార్టీలో క్రియాశీలక సభ్యత్వం కలిగి…పలు ప్రమాదాల్లో మరణించిన వారి కుటుంబాలకు బీమా సొమ్మును అందించేందుకు ఉద్దేశించిన ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి పార్టీ అదినేత పవన్ కల్యాణ్ హాజరు కాకున్నా… పార్టీ కీలక నేత, మంత్రి నాదెండ్ల మనోహర్ హాజరై… బాదిత కుటుంబాలకు పరిహారం …
Read More »రఘురామ గుండెలపై కూర్చున్న వ్యక్తి దొరికేశాడట!
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజుపై సీఐడీ కస్టడీలో థర్డ్ డిగ్రీ ప్రయోగించిన కేసుల్లో ఆదివారం కీలక పరిణామం చోటుచేసుకుంది. నాడు వైసీపీ తరఫున నరసాపురం ఎంపీగా గెలిచిన రఘురామ… ఆ తర్వాత వైసీపీకి దూరంగా జరిగారు. అంతేకాకుండా ఆ పార్టీ ప్రభుత్వం తీసుకుంటున్న పలు కీలక నిర్ణయాలపై ఆయన బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో ఆయనపై కేసు నమోదు చేసిన సీఐడీ అధికారులు… ఆయనను అరెస్ట్ …
Read More »2034 వరకు తెలంగాణకు నేనే సీఎం: రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారత గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం హైదరాబాద్ లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వర్సిటీ ప్రాంగణంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత విద్యార్థులు, విద్యావేత్తలను ఉద్దేశించి సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఈ ప్రసంగంలో పలు కీలక అంశాలను ఆయన ప్రస్తావించారు. 2034 వరకు తెలంగాణకు తానే ముఖ్యమంత్రిగా …
Read More »గిఫ్ట్ కార్డుల మోసాలపై పవన్ స్ట్రాంగ్ రియాక్షన్
అమెజాన్ లాంటి సంస్థలు జారీ చేస్తున్న గిఫ్ట్ కార్డుల్లో లెక్కలేనన్ని మోసాలు జరుగుతున్నాయి. ముందుగానే రుసుము చెల్లించి గిఫ్ట్ కార్డులు తీసుకుంటే… ఏదో కారణం చేత నిర్ణీత గడువలోగా సదరు కార్డులను వినియోగించుకోలేకపోతే… అందులోని మన డబ్బు మాయమైపోయినట్టే. ఈ విషయంపై మనం అడిగితే తప్పించి… ఆయా సంస్థలు మనకు సమాధానం చెప్పవు. ఒకవేళ అడిగినా… అన్ని సంస్థలూ సరైన సమాధానాలు ఇస్తాయన్న గ్యారెంటీ లేదు. వెరసి చాలా మంది వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. ఈ తరహా మోసాలపై జనసేన అధినేత, ఏపీ …
Read More »‘నల్లారి’ వారు రాజ్యసభ రేసులోకి వచ్చారా…?
ఏపీలో వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనాామా గోల ఇక ముగిసినట్టే. సాయిరెడ్డి సన్యాసాన్ని వైసీపీ కూడా గౌరవించింది. వెరసి తన ఖాతాలోని ఓ రాజ్యసభ సీటును ఆ పార్టీ.. కూటమి పార్టీలకు ధారాదత్తం చేసేసింది. ఈ క్రమంలో అసలు ఆట ఇప్పుడే మొదలైందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే…ఈ ఒక్కగానొక్క సీటును దక్కించుకునేందుకు కూటమిలోని మూడు పార్టీలకు చెందిన నేతలు తమ వంతు యత్నాలు …
Read More »మోడీ-పద్మాలు: ఉద్యమాలకు ఊపిరా.. ఉద్యమ ఓట్లకు ఊపిరా?!
‘పద్మ శ్రీ’ వంటి ప్రతిష్టాత్మక పౌర సన్మానాలు అందరికీ దక్కవు. దీనికి ఎంతో పెట్టిపుట్టి ఉండాలన్న చర్చ నుంచి నేడు .. పీపుల్స్ పద్మ పేరుతో మట్టిలో మాణిక్యాలను ప్రజలే ఎంపిక చేసుకుని పురస్కారాలు కట్ట బెట్టే దిశగా కేంద్రానికి సిఫారసు చేసే పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలోనే తాజాగా పలువురు ప్రముఖులు పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యారు. వీరిలో ప్రముఖ ఉద్యమకారుడు.. మాదిగ సామాజిక వర్గం హక్కుల కోసం.. పోరాటం …
Read More »టెక్నాలజీ వాడకంలో బాబును మించినోడే లేడబ్బా
ఓ సీఎం ప్రెస్ మీట్ అంటే.. లెక్కలేనన్ని టీవీ, యూట్యూబ్ ఛానెళ్లు, వెబ్ సైట్లు, ప్రింట్ మీడియా… ఆయా సంస్థలకు చెందిన జర్నలిస్టులతో పాటు వీడియో, ఫొటో జర్నలిస్టులను లెక్కలోకి తీసుకుంటే.. వందల మందే ఉంటారు. జర్నలిస్టులను అలా పక్కనపెడితే వీడియో, ఫొటో జర్నలిస్టుల సందడి గోలను తరలిస్తుంది. అయితే నిన్న ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నిర్వహించిన ప్రెస్ మీట్ లో అసలు ఆ గోలే కనిపించలేదు. అంతేకాదండోయ్.. …
Read More »చంద్రబాబును చిక్కుల్లో పడేసిన సాయిరెడ్డి
నిజమే… వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిని భలే ఇరకాటంలో పడేశారు. అసలే కూటమి… ఆపై మూడు పార్టీల నేతలూ అవకాశాల కోసం ఆశగా ఎదురు చూస్తున్న వేళ…కేవలం ఒకే ఒక్క సీటు భర్తీ చేయాల్సి రావడం చంద్రబాబుకు ఇబ్బందే కదా. మరి ఈ ఇబ్బందికరమైన పరిస్తితిని చంద్రబాబు ఎలా నెగ్గుకు వస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఎలాంటి పరిస్థితులను అయినా ఇట్టే …
Read More »తెలుగోళ్లు ట్రెండ్ సెట్టర్స్: చంద్రబాబు
ఏపీలో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్న సంగతి తెలిసిందే. ఆ సదస్సులో చంద్రబాబుతోపాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాము ఏపీతో కాదు చైనాతో పోటీపడుతున్నామని, ఏపీకి హైదరాబాద్ వంటి నగరం లేదని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు షాకింగ్ గా మారాయి. తాజాగా ఆ …
Read More »జగన్ ప్లాన్ తో విజయసాయి రాజీనామా: షర్మిల
వైసీపీ నేత విజయసాయిరెడ్డి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన వైనం ఇరు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన రాజీనామాపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయసాయి రెడ్డి వంటి నాయకులే జగన్ ను వదిలేస్తున్నారంటే వైసీపీలో పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చని షాకింగ్ కామెంట్లు చేశారు. నాయకుడిగా జగన్ ఓడిపోయారని, విశ్వసనీయతను కోల్పోయిన …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates