తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పాలన ఖాయమని ఎగ్జిట్ పోల్స్ సర్వేలు చాటుతున్నాయి. గత 2018 కంటే కూడా.. ఇప్పుడు మరింత ఎక్కువ మంది ప్రజలను కలిశామని.. తమ సర్వేలపై అనుమానం అవసరం లేదని కూడా.. సర్వే సంస్థలు చెబుతుండడం గమనార్హం. ఇక, తమకు అనుకూలంగా వచ్చిన సర్వేలపై కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేయడం.. ఇదేసమయంలో తమకు వ్యతిరేకంగా ఉన్న సర్వేలపై బీఆర్ ఎస్ పెదవి విరచడం కనిపించిందే. ఇదిలావుంటే.. కాంగ్రెస్ …
Read More »పాలేరు దంగల్.. బెట్టింగ్ రాయుళ్లు ఖుషీ!!
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం పాలేరుపై ఎన్నికల ముందు నుంచి ఆసక్తి నెలకొంది. ఇక్కడ ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడతారనే విషయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దీనికి కారణం.. కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇక్కడ నుంచి పోటీ చేయడమే. ఇక, బీఆర్ఎస్ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి బరిలో ఉన్నారు. ఇక, మరోవైపు.. కమ్యూనిస్టు అగ్రనాయకుడు, తమ్మినేని వీరభద్రం కూడా ఈ …
Read More »బైబై కేసీఆర్.. కేసీఆర్‌కు షర్మిల గిఫ్ట్..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నిల్లో కాంగ్రెస్ పార్టీ ఓడించడం తమకు చిటికెలో పని అని.. అత్యంత సులువు అని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే.. కేసీఆర్‌ను ఓడించేందుకు.. బీఆర్ఎస్ను గద్దె దించేందుకు కంకణం కట్టుకున్న నేపథ్యంలో తాము కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చామని షర్మిల చెప్పుకొచ్చారు. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడారు. “కాంగ్రెస్ పార్టీని ఈ ఎన్నికల్లో ఓడించడం.. అత్యంత సులభం. కానీ, …
Read More »కేసీఆర్ మా వాళ్లతో మాట్లాడుతున్నారు: డీకే
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చేందుకు మరో 24 గంటల గడువే ఉండడంతో కాంగ్రెస్ పార్టీ నేతలను తమవైపు తిప్పుకొనేందుకు అధికార పార్టీ బీఆర్ ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారంటూ.. కాంగ్రెస్ పార్టీ కర్నాటక పీసీసీ చీఫ్, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు అందిన సమాచారం మేరకు… దాదాపు 40 మంది నేతలతో కేసీఆర్ ఫోన్లో మాట్లాడినట్టు డీకే వెల్లడించారు. కేసీఆర్ ఓడిపోతున్నారు. …
Read More »పాలమూరులో రేవంత్‌రెడ్డి చెప్పిందే జరుగుతుందా?
ఏ పార్టీలో అయినా అగ్రనాయకులుగా ఉన్నవారు.. వారి వారి సొంత జిల్లాలపై పట్టుంటుంది. అంతేకాదు.. తాము అంచనా వేస్తే.. ఇక, జరిగి తీరుతుందనే నమ్మకం కూడా వారికి ఉంటుంది. ఇలా.. తెలంగాణ పీసీ సీ చీఫ్ రేవంత్‌రెడ్డి కూడా తన సొంత జిల్లాపై అనేక అంచనాలు వేసుకున్నారు. తాను చెప్పిందే జరు గుతుందనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ సొంత జిల్లా పాలమూరురంగారెడ్డి జిల్లా. ఇక్కడ 14 అసెంబ్లీ నియోజకవర్గాలు …
Read More »పెరిగిపోతున్న బెట్టింగుల హోరు
ఓట్ల లెక్కింపు సమయం దగ్గర పడే కొద్దీ బెట్టింగుల హోరు, జోరు పెరిగిపోతోంది. నవంబర్ 30వ తేదీన జరిగిన పోలింగ్ కు డిసెంబర్ 3వ తేదీ అంటే ఆదివారం నాడు కౌంటింగ్ జరగబోతోందని తెలిసిందే. పోలింగుకు ముందే మొదలైన బెట్టింగ్ రాయళ్ళ హడావుడి ఎగ్జిట్ పోల్స్ జోస్యాలతో బాగా ఊపందుకున్నది. బెట్టింగంతా ముఖ్యంగా రెండు పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్ కేంద్రంగానే జరుగుతోంది. అందుబాటులోని సమాచారం ప్రకారం బెట్టింగ్ మొత్తం సుమారు …
Read More »కమలం కుదేలైపోయిందా ?
పోలింగ్ ముగిసి ఎగ్జిట్ పోల్స్ జోస్యాలు వచ్చేయడంతో బాగా డీలా పడిపోయిన పార్టీ ఏదన్నా ఉందంటే అది బీజేపీ మాత్రమే. పోలింగ్ ముందు వరకు కూడా అధికారంలోకి రాబోయేది తామే అని ఆకాశమే హద్దుగా రెచ్చిపోయిన కమలనాదులు ఇపుడు ఎక్కడా చప్పుడు చేయటంలేదు. మొదటినుండి కూడా బీజేపీయేతర పార్టీల్లో కమలం పార్టీ గెలుచుకోబోయే నియోజకవర్గాల విషయంలో ఒక క్లారిటీ ఉంది. మిగిలిన పార్టీలన్నీ బీజేపీకి పట్టుమని పది సీట్లు కూడా …
Read More »రేవంత్ ఇంటికి భద్రత పెంపు.. ఈ సంకేతాలు దేనికోసం?
తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఇంటి దగ్గర పోలీసులు భారీ భద్రత కల్పించారు. ఎన్నికల పోలింగ్ అనంతరం.. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల తర్వాత జరిగిన ఈ పరిణామం.. ముఖ్యంగా శుక్రవారం మధ్యాహ్నం నుంచి మారిన సీన్.. రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. సుమారు 30 మంది పోలీసులు రేవంత్ ఇంటి చుట్టుపక్కల భద్రతకు కేటాయించడం గమనార్హం. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్‌లో కాంగ్రెస్ పార్టీదే అధికారం అని తెలవడంతో రేవంత్‌రెడ్డి ఇంటి వద్ద …
Read More »సీఎంగా రేవంత్ రెడ్డి.. ఎంత మంది జై కొట్టారంటే!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దక్కించుకుంటుందనే భావనతో ఉన్న కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి ఎవరు అవుతారు? అధికార పీఠం ఎవర దక్కించుకుంటారనే చర్చ సాగుతోంది. ఇప్పటికే పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి స్వయంగా ఈ సీటు కోసం 12 మంది నాయకులు పోటీ పడుతున్నారని వెల్లడించి బాంబు పేల్చారు. ఈ ఏడాది కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినా.. అక్కడ ఇద్దరు మాత్రమే సీఎం సీటుకోసం పోట్లాడుకున్నారు. కానీ, దాదాపు పదేళ్ల …
Read More »‘చే’ జారకుండా జాగ్రత్తలు.. క్యాంపు రాజకీయాలు షురూ!
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరొ 24 గంటల్లో ఫలితం కూడా రానుంది. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ఫలితాల వెల్లడి ప్రారంభం కానుంది. దీంతో కాంగ్రెస్ పార్టీ జాగ్రత్తలు తీసుకుంటోంది. ముఖ్యంగా ఐదు రాష్ట్రాల్లో కీలకైన నాలుగు రాష్ట్రాలు.. మధ్యప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్(మరోసారి), ఛత్తీస్‌గఢ్‌ల(మరోసారి)లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాల నేపథ్యంలో ప్రత్యర్థులకు తన అభ్యర్థులు చిక్కకుండా ముందస్తు జాగ్రత్తలకు …
Read More »తెలంగాణ ఎన్నికలపై ఇండియా టుడే హాట్ న్యూస్ ఇదే!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి.. పోలింగ్ పూర్తయిన అరగంట తర్వాత.. అనేక సర్వేలు వచ్చాయి. ఈ సర్వేలన్నీ కూడా అధికార బీఆర్ ఎస్‌కు ప్రమాద హెచ్చరికలనే హెచ్చరించాయి. తన మన అనే తేడా లేకుండా సాగిన ఈ ఎగ్జిట్ పోల్ సర్వేలన్నీ.. బీఆర్ ఎస్‌కు అధికారం దక్కడం కష్టమనే విషయాన్ని చాటి చెప్పాయి. అయితే.. ఒకింత ఆలస్యంగా తన ఎగ్జిట్ పోల్ సర్వేను వెల్లడించిన ‘ఇండియా టుడే’ కూడా.. ఇదే …
Read More »వైసీపీ అరాచకాలను పార్లమెంటులో లేవనెత్తండి: చంద్రబాబు
ఏపీ అధికార పార్టీ వైసీపీ అరాచకాలను పార్లమెంటులోనూ లేవనెత్తాలని టీడీపీ ఎంపీలకు.. ఆ పార్టీ అధినేత చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అదేసమయంలో రాష్ట్రంలోనూ యుద్ధం ప్రకటించాలని అన్నారు. ప్రతి ఒక్కరూ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. డిసెంబరు 4 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలుప్రారంభం కానున్న నేపథ్యంలో ఆ పార్టీ ఎంపీలతో చంద్రబాబు ఉండవల్లిలోని పార్టీ కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంటులో వైసీపీ అరాచకాలు.. …
Read More »