Political News

నా పాటకు రాజకీయ రంగు పులమొద్దు: సింగర్ మంగ్లీ

ప్రమెుఖ సినీ గాయని మంగ్లీ ఆవేదన వ్యక్తం చేస్తూ శనివారం ఓ బహిరంగ ప్రకటనను విడుదల చేసింది. తన పాటకు రాజకీయ ముద్ర ఆపాదిప్తున్నారని ఆరోపించిన మంగ్లీ… ఆ కారణంగా తనకు అవకాశాలు రావట్లేదని ఆవేదన వ్యక్తం చేసింది. అయినా తాను రాజకీయంగా ఏ ఒక్క పార్టీకో అనుకూలంగా, మరో పార్టీకి వ్యతిరేకంగా ఎందుకు వ్యవహరిస్తానని కూడా ఆమె వాపోయింది. తన వృత్తి పాటలు పాడటమే గానీ… రాజకీయాలు చేయడం …

Read More »

బ్యాక్ టూ డ్యూటీ… పవన్ ధర్మ పరిరక్షణ యాత్ర పూర్తి

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేపట్టిన ధర్మ పరిరక్షణ యాత్ర శనివారం పూర్తి అయ్యింది. మూడు రోజుల పాటు కేరళ, తమిళనాడుల్లో జరిగిన ఈ యాత్రలో పవన్ తన తనయుడు అకీరా నందన్ తో కలిసి సాగారు. తొలుత కేరళకు వెళ్లిన పవన్ అక్కడి నుంచి తన యాత్రను మొదలుపెట్టి… ఆ తర్వాత తమిళనాడు చేరుకున్నారు.. తమిళనాడులోనూ తాను నిర్దేశించుకున్న ఆలయాలను సందర్శించిన పవన్ శనివారం …

Read More »

అంతా చట్టబద్ధంగానే జరుగుతుంది : నారా లోకేష్

వైసీపీ కీలక నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ అరెస్టుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ తొలిసారిగా స్పందించారు. శనివారం విశాఖ వచ్చిన సందర్భంగా మీడియాతో మాట్లాడిన సమయంలో మీడియా ప్రతినిధులు ఈ విషయంపై ఆయన స్పందనను కోరారు. దీంతో వంశీ అరెస్టుపై స్పందించిన లోకేశ్… అంతా చట్టబద్ధంగానే జరుగుతోందని, చట్ట ప్రకారమే తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఇందులో …

Read More »

ఈ సినిమాలని… వైసీపీ వాళ్ళే డిజాస్టర్స్ చేశారట!

సోషల్ మీడియా అన్నది రెండు వైపులా పదునున్న కత్తి. దీని వల్ల సినిమాల ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. సినిమాల రీచ్ పెరుగుతోంది. కానీ అదే సమయంలో సినిమాల మీద ఉద్దేశపూర్వకంగా నెగెటివిటీని స్ప్రెడ్ చేసి దెబ్బ తీసే ప్రయత్నాలూ జరుగుతున్నాయి. కొత్తగా ‘బాయ్‌కాట్’ బ్యాచ్‌లు కొన్ని తయారై.. సినిమాలను టార్గెట్ చేయడం ఫ్యాషన్‌గా మారిపోయింది. బాలీవుడ్లో కొన్ని సినిమాలను ఇలాగే దెబ్బ తీయడమూ తెలిసిందే. కానీ ఒక దశ …

Read More »

రాహుల్ తో రేవంత్ భేటీ… గంటలో ఏం చర్చించారంటే?

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. పార్టీ అధిష్ఠానం పిలుపు మేరకు శుక్రవారం సాయంత్రమే ఢిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డి… శనివారం మధ్యాహ్నం రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాసం 10 .జన్ పథ్ లో సాగిన వీరి భేటీ దాదాపుగా గంటపాటు కొనసాగింది. తెలంగాణకు సంబంధించి పలు కీలక అంశాలపై వీరి మధ్య …

Read More »

మంత్రి చెప్పినా విన‌లేదు.. వైసీపీ ప్రో క్రాంట్రాక్ట‌ర్‌కు కోట్లు ఇచ్చేశారు!

ఏపీలోని కూట‌మి స‌ర్కారులో ఏం జ‌రుగుతోంది? అధికారులు.. మంత్రుల మాట విన‌డం లేద‌ని, వారికి న‌చ్చిన‌ట్టు చేస్తున్నార‌ని.. కొన్ని రోజులుగా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఈ వ్య‌వ‌హారంపై సీఎం చంద్ర‌బాబు కూడా ఒక‌టికి రెండు సార్లు అధికారుల‌ను హెచ్చ‌రించారు. మంత్రుల మాట విన‌క‌పోతే ఎలా? అని కూడా నిల‌దీశారు. ఇక నుంచి ఎలాంటి ఫిర్యాదులు వ‌చ్చినా సీరియ‌స్‌గా ఉంటుంద‌ని చెప్పారు. కానీ, ఎందుకో.. అధికారులు మాత్రం మంత్రులు చెప్పిన మాట‌ను పూచిక …

Read More »

విజయ్ కి వై కేటగిరి భద్రత!.. కండీషన్స్ అప్లై!

కోలీవుడ్ సూపర్ స్టార్ దళపతి విజయ్ రాజకీయాల్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చి ఇంకా ఏడాది కూడా కాలేదు… అప్పుడే ఆయన ఏకంగా కేంద్ర ప్రభుత్వం భద్రత కల్పిస్తున్న వీఐపీల జాబితాలోకి చేరిపోయారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్నాయి. అయితే ఆ ఎన్నికలకు ముందే విజయ్ కి ఈ మాదిరి ఎలివేషన్ వచ్చేసిందంటూ ఆయన ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. తమిళగ వెట్రి కజగమ్ పేరిట గతేడాది ఆగస్టులో రాజకీయ …

Read More »

తెలంగాణకు మీనాక్షి… జార్ఖండ్ కు కొప్పుల రాజు

జాతీయ స్థాయిలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్… శుక్రవారం రాత్రి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశంలోని పలు రాష్ట్రాలకు సంబంధించి… ఇంచార్జీలను నియమిస్తూ ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా తెలుగు నేలకు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కొప్పుల రాజుకు అవకాశం లభించింది. పార్టీలో క్రియాశీలకంగానే ఉన్న రాజు ఇప్పటిదాకా తెర వెనుక ఉండే రాజకీయం చేశారు. అయితే తాజాగా రాహుల్ గాందీ నేతృత్వంలోని పార్టీ …

Read More »

నేను చివరి `రెడ్డి సీఎం` అయినా ఓకే: రేవంత్ మాటలో మర్మమేమిటి?

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో కుల గ‌ణ‌న త‌ర్వాత‌.. ముఖ్య‌మంత్రి స్థానంలో బీసీల కు అవ‌కాశం ద‌క్కుతుంద‌ని.. కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు, ప్ర‌తిప‌క్ష నేత‌లు కొంద‌రు చేస్తున్న అంత‌ర్గ‌త ప్ర‌చారంపై ఆయ‌న ప‌రోక్షంగా స్పందించారు. “నేను ఈ రాష్ట్రానికి… కాంగ్రెస్ త‌ర‌ఫున చిట్ట చివ‌రి ముఖ్య‌మంత్రి అయినా ఫ‌ర్వాలేదు. కానీ, కుల‌గ‌ణ‌న మాత్రం ప్రాధాన్యం పొందితే చాలు. త‌ద్వారా.. బీసీల‌కు కొన్ని ద‌శాబ్దాలుగా ద‌క్క‌ని …

Read More »

పిల్లలను చివరిసారి చూడాలన్న తల్లి తండ్రుల కోరికను నెరవేర్చిన లోకేష్!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దేనిపై అయినా దృష్టి పెడితే… అది పూర్తి అయ్యే దాకా వదిలిపెట్టరు. అది రాజకీయం అయినా కావచ్చు. లేదంటే సంక్షేమ కార్యక్రమం అయినా కావచ్చు. చివరకు ఎవరికైనా చేయూత అందించే విషయం అయినా కావచ్చు. ఈ విషయంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా లోకేశ్ వెనుకంజ వేయరనే చెప్పాలి. అలా సాగుతున్న లోకేశ్ చొరవ కారణంగా ఎక్కడో విదేశాల్లో చనిపోయిన ఏపీకి …

Read More »

అమరావతిలో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్: బాలకృష్ణ

హిందూపురం ఎమ్మెల్యే, టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ ఇటు రాజకీయాలలో..అటు సినిమా షూటింగులలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ కు సంబంధించిన కార్యక్రమాల్లో మాత్రం క్రమం తప్పకుండా పాల్గొంటారు. క్యాన్సర్ బాధితుల కోసం తన తండ్రి నందమూరి తారకరామారావు ప్రారంభించిన ఆ ఆసుపత్రిని బాలకృష్ణ అభివృద్ధి చేశారు. ఒక్కొక్క విభాగాన్ని విస్తరించుకుంటూ అంతర్జాతీయ వైద్య సేవలను పేదలకు, సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు. ఈ …

Read More »

ఆ ఇద్ద‌రు ఎమ్మెల్యేల‌కు బాబు క్లాస్‌… ఏం జ‌రిగింది?

కూట‌మి ప్ర‌భుత్వంలో నాయ‌కులు త‌ప్పు చేయ‌రాద‌ని.. ప్ర‌భుత్వానికి చెడ్డ పేరు తీసుకురారాద‌ని సీఎం చంద్ర‌బాబు ప‌దే ప‌దే చెబుతున్న విష‌యం తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ ఒక‌రిద్ద‌రు ఎమ్మెల్యేలు మాత్రం త‌మ దూకుడు త‌గ్గించుకోవ‌డం లేదు. ప‌దే ప‌దే త‌ప్పులు చేస్తూనే ఉన్నారు. దీంతో అలాంటివారిని చూసీ చూడ‌న‌ట్టు వ‌దిలేసిన వైసీపీ ప్ర‌భుత్వం మాదిరిగా చంద్ర‌బాబు వ‌దిలేయ‌డం లేదు. స్వ‌యంగా వారికి ఫోన్లు చేసి హెచ్చ‌రించే కార్యక్ర‌మానికి శ్రీకారం చుట్టారు. తాజాగా వివాదాల …

Read More »