Political News

జ‌గ‌న్ ఇంటికి కూత‌వేటు దూరంలో… జెండా పీకేసిన‌ట్టేనా?

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో చెప్ప‌డం క‌ష్టం. నిన్న‌టి వ‌ర‌కు జేజేలు కొట్టి.. జ్యోతులు ప‌ట్టిన చేతులే.. నేడు క‌నుమ‌రుగు కావొచ్చు. నిన్న‌టి వ‌ర‌కు తిరుగులేద‌ని భావించిన నాయ‌కులే నేడు తెర మ‌రుగు కావొచ్చు. ఏదైనా.. హ‌వా.. రాజ‌కీయ సంద‌డి ప్రాధాన్యం. అదే స‌మ‌యంలో నేడు అధికారం- అవ‌కాశం ఈ రెండే నేత‌ల ప్రామాణికాలు. ఇప్పుడు వైసీపీకి ఈ దుర్గ‌తే ప‌ట్టింది. కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ జెండా మోసే నాథుడు …

Read More »

నారా కుటుంబాన్ని రోడ్డెక్కించిన 2024 రాజ‌కీయం..!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు కుటుంబం మొత్తం ఎప్పుడూ రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన ప‌రిస్థితి లేదు. ఆయ‌న కుమారుడు, ఆయ‌న కోడ‌లు బ్రాహ్మ‌ణి మాత్ర‌మే ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌చారం చేసిన ప‌రిస్థితి ఉండేది. మ‌హా అయితే.. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆయన స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రి కుప్పంలో ఒక‌టి రెండు రోజులు ప‌ర్య‌టించిన ప‌రిస్థితి ఉంది. కానీ.. రాజ‌కీయాల్లో తొలిసారి 2024లో నారా కుటుంబం యావ‌త్తు తొలి ఐదు మాసాలు.. రోడ్డెక్కిన ప‌రిస్థితి స్ప‌ష్టంగా క‌నిపించింది. …

Read More »

పేర్నినానిపై కేసు.. ప‌రారీలో నేత‌?

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి పేర్ని నానిపై పోలీసులు కేసు న‌మోదు చేశారు. రేష‌న్ బియ్యం అక్ర‌మాల‌కు సంబంధించి ఉమ్మ‌డి కృష్నాజిల్లా మ‌చిలీప‌ట్నం పోలీసులు నానిపై తాజాగా కేసు న‌మోదు చేశారు. ఇప్ప‌టికే ఈ వ్య‌వ‌హారంపై నాని స‌తీమ‌ణి జ‌య‌సుధ‌పై కేసులు పెట్ట‌డం తెలిసిందే. దీంతో ఆమె స్థానిక కోర్టును ఆశ్ర‌యించి బెయిల్ తెచ్చుకున్నారు. ఆ మ‌ర్నాడే.. నానిపై కేసు న‌మోదు కావ‌డం గ‌మ‌నార్హం. ఈ కేసులో నానిని …

Read More »

అసోంలో కొడాలి నాని ప్రధాన అనుచరుడు అరెస్టు

మాజీ మంత్రి కొడాలి నాని ప్రధాన అనుచరుడు కాళీ అరెస్టు అయ్యారు. అది కూడా తెలుగు రాష్ట్రాల్లో కాదు. ఏపీకి సంబంధం లేని సదూర రాష్ట్రమైన అసోంలో ఆయన్ను ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్రిష్ణా జిల్లా వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడైన కాళీ కోసం పోలీసులు తీవ్రంగా వెతుకుతున్నారు. ఆయన ఆచూకీ లభించని పరిస్థితి. తాజాగా అసోంలో ఉన్నట్లుగా సమాచారం అందటంతో అక్కడకు వెళ్లి మరీ అరెస్టు చేశారు. …

Read More »

2024: జ‌గ‌న్‌కు కౌకు దెబ్బ‌లు

అది 2023, సెప్టెంబ‌రు 2వ తేదీ. దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి జ‌యంతి. ఊరూవాడా ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని అప్ప‌టి ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత జ‌గ‌న్ పిలుపునిచ్చారు. తాడేప‌ల్లిలోని ఆయ‌న నివాసంలో కూడా అంగ‌రంగ వైభ‌వంగా కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మంత్రులు, నేత‌ల‌ను ఉద్దేశించి జ‌గ‌న్ ప్ర‌సంగిస్తూ.. “2024లో మ‌న‌కు తిరుగుండ‌దు.. మ‌ళ్లీ మ‌న‌దే అధికారం” అని గ‌ట్టిగానే చెప్పారు. ప్ర‌తి ఇల్లూ తిర‌గాల‌ని.. జ‌గ‌నే మ‌న న‌మ్మ‌కం అనే …

Read More »

2024: టీడీపీకే కాదు.. చంద్ర‌బాబుకూ మైలురాయి!

“ఈ ఒక్క ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబును అడ్డుకుంటే చాలు. ఇక‌, 30 ఏళ్ల‌పాటు మ‌న‌కు తిరుగు ఉండ‌దు” – అని వైసీపీ అధినేత జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న చేసిన‌ప్పుడు.. స‌హ‌జంగానే టీడీపీలో ఒక విధ‌మైన నిర్వేదం పెల్లుబికింది. అప్ప‌టికి ఏ పార్టీతోనూ పొత్తు లేదు. పైగా.. త‌మ్ముళ్ల‌పై కేసులు పెట్టారు. అరెస్టులు చేశారు. కొంద‌రు నాయ‌కులు వీటికి భ‌య‌ప‌డి బ‌య‌ట‌కు కూడా రాలేని ప‌రిస్తితి ఏర్ప‌డింది. మ‌రో ఆరేడు మాసాల్లోనే ఎన్నిక‌లు ఉన్నాయి. …

Read More »

జ‌గ‌న్‌కు బిగ్ షాట్లు.. ఉరుములు లేని పిడుగులు!

వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు 2024 భారీ షాకేన‌ని చెప్పాలి. పార్టీ ఓట‌మి, కీల‌క నాయ‌కుల జంపింగుల‌తో ఆయ‌న ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీంతో ఆ ప‌రిణామాల నుంచి కోలుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నా.. ఫ‌లించ‌డం లేదు. పైగా.. 2024 పోతూ పోతూ కూడా.. భారీ షాట్లే కొట్టింది. సోమ‌వారం సాయంత్రం ఉరుములు లేని పిడుగుల మాదిరిగా ఇద్ద‌రు కీల‌క నాయ‌కులు జ‌న‌సేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ పార్టీ అధినేత‌, డిప్యూటీ సీఎం …

Read More »

దేశంలోని ముఖ్య‌మంత్రుల్లో చంద్ర‌బాబు మ‌రో ఘ‌న‌త‌!

దేశంలో 31 మంది ముఖ్య‌మంత్రులు ఉన్నారు. వీరిలో కేంద్ర పాలిత ప్రాంతాలైన ఢిల్లీ స‌హా.. ఇత‌ర రాష్ట్రాల‌కు చెందిన వారు ఉన్నారు. వీరంద‌రిలోనూ ఏపీ సీఎం చంద్ర‌బాబు స‌రికొత్త ఘ‌న‌త న‌మోదు చేసుకున్నారు. పాల‌న‌లో విజ‌న్‌తో దూసుకుపోతున్న ఆయ‌న‌.. ఇప్పుడు ఆదాయంలోనూ త‌న‌కు తిరుగులేద‌ని నిరూపించారు. దేశంలోని ముఖ్య‌మంత్రుల్లో అత్య‌ధిక ధ‌న‌వంతుడైన ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబు నిలిచారు. ఆయ‌న నిక‌ర ఆదాయం 931 కోట్ల‌రూపాయ‌లుగా ఏడీఆర్‌(అసోసియేష‌న్ ఫ‌ర్ డెమొక్ర‌టిక్స్ రిఫార్మ్స్‌) సంస్థ …

Read More »

2024: జ‌న‌సేన చ‌రిత్ర‌ను తిర‌గ‌రాసిన సంవ‌త్స‌రం!

జ‌న‌సేన పార్టీ 2014లో ఆవిర్భ‌వించినా.. ఆ త‌ర్వాత జ‌రిగిన రెండు సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఆ పార్టీకి పెద్ద‌గా ప్రాధాన్యం లేకుండా పోయింది. అస‌లు 2014లో పార్టీ పోటీలోనే లేకుండా పోయింది. 2019లో రాష్ట్ర వ్యాప్తం గా పోటీ చేసినా.. ఆ పార్టీకిఒక్క‌రే గెలిచారు. ఆయ‌న కూడా పొరుగు పార్టీలోకి జంప్ చేశారు. ఆ త‌ర్వాత‌.. సుదీర్ఘ నిరీక్ష‌ణ అనంత‌రం వ‌చ్చిన 2024 ఎన్నిక‌లు మాత్రం జ‌న‌సేన చ‌రిత్ర‌ను తిర‌గ‌రాసింద‌నే చెప్పాలి. …

Read More »

ర‌ఘురామ‌ను టెన్ష‌న్ పెట్టిన 2024… !

రాజ‌కీయాల్లో ఉన్న‌వారికి టెన్ష‌న్‌.. ప్ర‌జ‌ర్ వంటివి కొత్త‌కాదు. రాజ‌కీయాలు అంటేనే టెన్ష‌న్‌తో ముడిప‌డిన ప్రెజ‌ర్‌తో కూడిన అంశా లు. వీటికి ఎవ‌రూ అతీతులు కారు. జైల్లో ఉన్న‌ప్పుడు… త‌న‌కు చుట్టూ గోడ‌లే క‌నిపించాయ‌న్న చంద్ర‌బాబు ఎంత టెన్ష‌న్ ప‌డ్డారో తెలిసిందే. అలాంటి ఆయ‌న‌కు జ‌న‌సేన అధినేత ఆగ‌మ‌నంతో కొత్త దారి ఏర్ప‌డింది.. వెలుగు రేఖ‌లు ప్ర‌స‌రించేలా చేసింది. అధికారం అందించింది. ఇదీ.. 2024కు ఉన్న ప్ర‌త్యేకం. అలానే.. ప్ర‌స్తుతం డిప్యూటీ …

Read More »

ఉగాది నాటికి ఉచిత బ‌స్సు…. చంద్ర‌బాబు దిశానిర్దేశం

ఏపీలో మ‌హిళ‌ల‌కు ఉచితంగా ఆర్టీసీ బ‌స్సు ప్ర‌యాణాలు అందుబాటులోకి రానున్నాయి. అయితే.. దీనికి తాజాగా సీఎం చంద్ర బాబు ప్రాథ‌మిక ముహూర్తం పెట్టారు. వ‌చ్చే ఏడాది ఉగాది(ఏప్రిల్‌) నాటికి ఉచిత ఆర్టీసీ బ‌స్సు ప్ర‌యాణం క‌ల్పించే దిశ‌గా అడుగులు వ‌డివ‌డిగా వేయాల‌ని ఆయ‌న అధికారుల‌ను ఆదేశించారు. సోమ‌వారం సాయంత్రం అమ‌రావ‌తిలోని స‌చివాల‌యంలో నిర్వ‌హించిన స‌మీక్ష‌లో రాష్ట్ర ర‌వాణా శాఖ మంత్రి మండ‌ప‌ల్లి రాంప్ర‌సాద‌రెడ్డి, ఆర్టీసీ ఎండీ ద్వార‌కా తిరుమ‌ల రావు …

Read More »

“ఇవ‌న్నీ జ‌రుగుతుంటాయండీ.. పోలీసులంతే”… అన్నారు: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

ఏపీ పోలీసుల ప‌నితీరుపై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పోలీసు అధికారుల తీరు స‌రిగాలేద‌ని చెప్పారు. వారి స్పంద‌న బాగుంటే.. మెరుగైన ఫ‌లితం రాబ‌ట్టుకోవ‌చ్చ‌న్నారు. కానీ, అలా లేద‌ని చెప్పారు. ఈ మేర‌కు సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. ప‌లు విష‌యాల‌ను ప్ర‌స్తావించారు. ప్ర‌ధానంగా పోలీసుల ప‌నితీరు, ఉద్యోగుల అవినీతి, వారి సెల‌వులు వంటి విష‌యాల‌పై త‌న మ‌న‌సులో మాట‌ను మీడియాకు చెప్పుకొచ్చారు. ఈ …

Read More »