Political News

ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో ఇంత దోపిడీ జరిగిందా ?

సమీక్షలు జరిగేకొద్దీ ఇరిగేషన్ శాఖలో జరిగిన దోపిడి బయటపడుతోందా ? తాజా సమాచారం ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. శాఖల వారీగా, ప్రాజెక్టుల వారీగా బయటపడుతున్న దోపిడీని చూసి మంత్రులే ఆశ్చర్యపోతున్నారు. తాజాగా ఖమ్మం జిల్లాలో రెండు ప్రాజెక్టులు దుమ్ముగూడెం లిఫ్ట్ ఇరిగేషన్, సీతారామ ప్రాజెక్టుపై మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సమీక్షలో ఉన్నతాదికారులు చెప్పిన …

Read More »

రేవంత్ ప్రభుత్వానికి ‘కోటి’ కష్టాలు

రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కోటి కష్టాలు తప్పదులాగుంది. ఎన్నికల సమయంలో అధికారంలోకి రావటమే టార్గెట్ గా సిక్స్ గ్యారెంటీస్ పదేపదే ప్రచారం చేసింది. కాంగ్రెస్ అధికారంలోకి రావటంలో సిక్స్ గ్యారెంటీస్ కూడా కీలకమనే చెప్పాలి. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే సిక్స్ గ్యారెంటీస్ అమలుచేస్తామని ఇచ్చిన హామీలే ఇపుడు పార్టీ కొంపముంచేట్లుగా ఉంది. వందరోజుల్లోనే అమలు చేయాలంటే సాధ్యంకావటంలేదు. అలాగని అమలుచేయలేకపోతే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కష్టాలు తప్పవు. అందుకనే …

Read More »

అయోధ్యలో హోటల్ రూం జస్ట్ రూ.లక్షేనట

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 500 ఏళ్ల నాటి కల. ఇప్పుడు సాకారం అవుతున్న వేళ.. యావత్ దేశం ఒకలాంటి భావోద్వేగంతో నిండి ఉంది. అయోధ్యలో రామాలయ స్వప్నం తీరటం.. బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకువీలుగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు సాగుతున్న సంగతి తెలిసిందే. మరికొద్ది గంటల్లో బాలరాముడు భక్త జనానికి దర్శనం ఇవ్వనున్నారు. ఈ వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. …

Read More »

బీజేపీ కూడా రెడీ అవుతోందా ?

రాబోయే ఎన్నికలకు ఏపీ బీజేపీ కూడా రెడీ అయిపోతోంది. పార్టీ తరపున పోటీ చేయాలని అనుకుంటున్న ఆశావహుల జాబితాలను సిద్ధం చేయాలని జాతీయ నాయకత్వం నుండి పార్టీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరికి ఆదేశాలు అందాయి. వచ్చిన ఆదేశాలతో హడావుడిగా పురందేశ్వరి కమిటీలను వేశారట. ప్రతి పార్లమెంటు జిల్లాకు ముగ్గురు సీనియర్ నేతలతో కమిటీలు వేశారు. ఈ కమిటీలే తమకు బాధ్యతలు అప్పగించిన జిల్లాల్లో విస్తృతంగా తిరుగుతాయి. అన్నీ నియోజకవర్గాల్లోని నేతలను …

Read More »

గుంటూరు వైసీపీలో సెగ స్టార్ట్ చేశారుగా…!

ఉమ్మ‌డి గుంటూరు జిల్లాలోని ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీకి సెగ త‌గులుతోంది. ఇదేదో రాజ‌ధాని అమ‌రా వ‌తి అనుకూల వ‌ర్గం నుంచి ఎదుర‌వుతున్న సెగ కాదు. సొంత పార్టీలో సొంత నేత‌ల నుంచే వ‌స్తున్న అస‌మ్మ‌తి. సిట్టింగు ఎమ్మెల్యేల‌పై ఒక‌టి రెండు చోట్ల‌… కొత్త‌గా ప్ర‌క‌టించిన అభ్య‌ర్థులపై మ‌రోచోట‌.. ఇలా.. పార్టీలో అస‌మ్మ‌తి భారీ ఎత్తున కొన‌సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. స‌త్తెన‌ప‌ల్లిలో మంత్రి అంబ‌టి రాంబాబు కు టికెట్ ఇవ్వొద్దంటూ.. సొంత నేత‌లే …

Read More »

నరసాపురం ఎంపీ బరిలో కృష్ణంరాజు సతీమణి

దివంగత నటుడు, మాజీ ఎంపీ కృష్ణంరాజు సినీ నటుడిగానే కాకుండా..రాజకీయ నాయకుడిగా కూడా ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితులే. బీజేపీ తరఫున ఎంపీగా కూడా రెబల్ స్టార్ పనిచేశారు. దీంతో, ఆయన చనిపోయిన తర్వాత ఆయన రాజకీయ వారసత్వాన్ని ఆయన భార్య శ్యామలాదేవి కొనసాగిస్తారని చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే వైసీపీ తరఫున 2024 ఎన్నికలలో నరసాపురం లోక్ సభ స్థానం నుంచి శ్యామలా దేవీ పోటీ …

Read More »

జనసేనలోకి పాత కాపులు

కాంగ్రెస్ పాతకాపులు జనసేన వైపు చూస్తున్నారా ? రాబోయే ఎన్నికల్లో జనసేన అభ్యర్ధులుగా పోటీచేయబోతున్నారా ? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రెండు రోజుల్లో ఇద్దరు సీనియర్ నేతలు వల్లభనేని బాలశౌరి, కొణతాల రామకృష్ణ జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు. బహుశా వీళ్ళిద్దరు రాబోయే ఎన్నికల్లో పార్లమెంటుకు పోటీచేయవచ్చు. విషయం ఏమిటంటే బాలశౌరి ఇపుడు మచిలీపట్నం వైసీపీ ఎంపీ. అయితే వైసీపీలోకి రాకముందు కాంగ్రెస్ లో …

Read More »

టీఎస్పీఎస్సీకి ఇంత డిమాండా

కేసీయార్ పదేళ్ళ పాలనలో బాగా పాపులరైన టీఎస్పీఎస్సీకి ఫుల్ డిమాండ్ వచ్చేసింది. గ్రూప్ పరీక్షలను నిర్వహించి, అభ్యర్ధులకు ఇంటర్వ్యూలు కండక్ట్ చేసి, ఉద్యోగాలు ఇచ్చేందుకు ఉద్దేశించిందే టీఎస్పీఎస్సీ. గడచిన పదేళ్ళల్లో తన లక్ష్యాలను చేరుకోకపోయినా నిత్యం బాగా వార్తల్లో అయితే నిలిచింది. కారణాలు ఏమిటంటే ఇంతటి వివాదాస్పదమైన బోర్డు మరోటి లేదు కాబట్టే. పరీక్షల కోసం టీఎస్సపీస్సీ బోర్డు నోటిపికేషన్లు జారీచేయటం, పరీక్షల పేపర్లు లీకవ్వటంతో నిరుద్యోగులు, విద్యార్ధిసంఘాలు, ప్రతిపక్షాలు, …

Read More »

ఈ ఐఏఎస్ అడ్డంగా బుక్కయిపోయాడా ?

సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ గట్టిగా తగులుకున్నట్లేనా ? గ్రౌండ్ లెవల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. కారణం ఏమిటంటే కేసీయార్ పాలనలో ఒక మంత్రి నోటిమాటతోనే అర్వింద్ రు. 55 కోట్లు ఖర్చులు పెట్టిన విషయం బయటపడింది. 55 కోట్ల రూపాయలు ఖర్చలంటే మామూలు విషయంకాదు. అందుకనే అర్వింద్ మీద సీరియస్ యాక్షన్ తీసుకునేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. ఇందులో భాగంగానే అడ్వకేట్ జనరల్ తో …

Read More »

కృష్ణాలో ఆ మూడు ట‌ఫ్ ఫైట్‌.. వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ..!

ఉమ్మ‌డి కృష్ణా జిల్లాలోని మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో భారీ ఎత్తున ఎన్నిక‌ల యుద్ధం జ‌ర‌గ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే ఈ మూడు చోట్ల అభ్య‌ర్థులు ఎవ‌ర‌నేది తేలిపోయింది. వైసీపీ ప్ర‌క‌టించిన జాబితా ప్ర‌కారం.. ఈ మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ అభ్య‌ర్థులు దాదాపు ఖ‌రార‌య్యారు. ఇక‌, టీడీపీ ఇప్ప‌టికీ జాబితా ప్ర‌క‌టించక‌పోయినా.. దాదాపు ఇప్పుడున్న ఇంచార్జ్‌లే అభ్య‌ర్థులు కానున్నార‌నే అంచ‌నాలు వున్నాయి. పైగా ఈ మూడు కూడా.. అత్యంత కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గాలు. మ‌రీ ముఖ్యంగా …

Read More »

దావోస్ పర్యటన సక్సెస్ అయినట్లేనా ?

మూడు రోజుల రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన పూర్తయ్యింది. అంతర్జాతీయ పెట్టుబడుల సమావేశాలు ప్రతి ఏడాది స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరుగుతాయని అందరికీ తెలిసిందే. ఆ సమావేశాలకే రేవంత్ తన బృందంతో హాజరయ్యారు. ప్రభుత్వ వర్గాల ప్రకారం తన పర్యటనలో ప్రభుత్వం తరపున రేవంత్ రు. 40,232 కోట్ల విలువైన ఎంవోయూలు చేసుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఇపుడు జరిగిన ఎంవోయూలే అత్యధిక ఒప్పందాలని చెప్పుకోవాలి. పదేళ్ళల్లో తెలంగాణా …

Read More »

జంగా కూడా జంపేనా..!

బీసీ నాయ‌కుడు, సీఎం జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితుడిగా పేరు తెచ్చుకున్న జంగా కృష్ణ‌మూర్తి కూడా.. జంపైపోతున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు రాజ‌కీయ ప‌రిశీల‌కులు. సుదీర్ఘ కాలం రాజ‌కీయాల్లో ఉన్న జంగా.. గ‌తంలో గుర‌జాల నుంచి కాంగ్రెస్ టికెట్‌పై రెండుసార్లు(1999, 2004) విజ‌యం ద‌క్కించు కున్నారు. త‌ర్వాత‌.. అనూహ్య ప‌రిణామాలతో ఆయ‌న ఎదురీదుతున్నారు. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత‌.. వైసీపీకి జై కొట్టిన జంగా.. గ‌త ఎన్నిక‌ల్లోనే గుర‌జాల టికెట్‌ను ఆశించారు. అయితే, …

Read More »