అధికార కూటమిలోని కీలక భాగస్వామి టీడీపీకి ఇది ఊహించని పరిణామమేనని చెప్పాలి. ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఇటీవలే పదవీ బాధ్యతలు చేపట్టిన జీవీ రెడ్డి సోమవారం తన పదవులకు రాజీనామా చేశారు. ఫైబర్ నెట్ చైర్మన్ పదవితో పాటుగా టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేయడం గమనార్హం. ఫైబర్ నెట్ లో వరుసగా చోటుచేసుకున్న పరిణామాలే జీవీ రెడ్డి రాజీనామాకు దారి తీసినట్లుగా సమాచారం. …
Read More »మహిళలకు పండగే.. ఆ రెండు పథకాలు ఖాయం!
ఏపీలోని కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల పరంపర మరోసారి తెరమీదికి వచ్చింది. ఆయా హామీల్లో కీలకమైన వాటిని ఎప్పుడు అమలు చేస్తారంటూ . ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో తరచుగా సీఎం చంద్రబాబు, మంత్రులు కూడా ఆయా పథకాలను అమలు చేస్తా మని చెబుతున్నారు. తాజాగా ఇదే విషయాన్ని గవర్నర్ అబ్దుల్ నజీర్ తన ప్రసంగంలోనూ ప్రస్తావించారు. తాజాగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. …
Read More »11 నిమిషాల కోసం 11 మంది వచ్చారా?: వైఎస్ షర్మిల
ఏ చిన్న అవకాశం దొరికినా… తన సోదరుడు, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీసీసీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల సెటైరిక్ విమర్శలతో విరుచుకుపడుతున్నారు. తాజాగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వచ్చి… గవర్నర్ ప్రసంగం కూడా పూర్తి కాకుండానే సభ నుంచి వాకౌట్ చేసిన జగన్ తీరుపైనా ఆమె వ్యంగ్యాస్త్రాలను సంధించారు. 11 మంది ఎమ్మెల్యేలతో కలిసి 11 నిమిషాలు ఉండటానికా అసెంబ్లీకి వచ్చింది? అని ఆమె జగన్ …
Read More »జగన్ ప్లాన్ బూమరాంగ్ అయ్యిందా?
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలి రోజు శాసన సభకు హాజరై… తన శాసనసభ సభ్యత్వంపై వేలాడుతున్న వేటును తప్పించుకుందామని భావించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యూహం బెడిసికొట్టిందా? అన్న దిశగా ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి. అటు అసెంబ్లీకి అయినా… ఇటు శాసన మండలికి అయినా సభ్యులుగా ఎన్నికైన వారు వరుసగా 60 రోజుల పాటు సభా సమావేశాలకు హాజరు కాకుంటే వారిపై అనర్హత వేటు …
Read More »బీఆర్ఎస్ కు ఇచ్చి పడేసిన రేవంత్
తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తాయంటూ సాగుతున్న ఉహాగానాలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా రాని ఉప ఎన్నికలు ఇప్పుడెందుకు వస్తాయంటూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు నాటి బీఆర్ఎస్ హయాంలో జరిగిన పార్టీ ఫిరాయింపులను ప్రస్తావిస్తూ రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్లపై ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిలో ఆ తర్వాత …
Read More »వల్లభనేని వంశీకి 3 రోజుల పోలీసు కస్టడీ
గన్నవరం టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేస్తున్న సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం విజయవాడ జైల్లో రిమాండ్ లో ఉన్న వంశీ రిమాండ్ రేపటితో ముగియనుంది. అయితే, ఈ కేసులో విచారణ కోసం వంశీని 10 రోజుల కస్టడీ కోరారు పోలీసులు. ఈ క్రమంలోనే తాజాగా వంశీకి విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టు షాకిచ్చింది. …
Read More »ఇక రాను.. తేల్చిచెప్పేసిన జగన్
ఏపీ అసెంబ్లీలో అధికార కూటమి ప్రచారం చేస్తున్నట్లుగా విపక్షం వైసీపీ సింగిల్ డే షోకే పరిమితం అయిపోయింది. సభలో తాము అడిగినట్టుగా ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని ఆరోపించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇకపై అసెంబ్లీ సమావేశాలకు హాజరు కారాదని నిర్ణయించారు. సోమవారం ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగా… ఈ సమావేశాలకు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి హాజరైన జగన్.. గవర్నర్ …
Read More »సీనియర్లంటే.. టిష్యూ పేపర్లలా కనిపిస్తున్నారా?
రాజకీయాల్లో ఇటీవలి కాలంలో ఏనాడూ విననన్ని సంచలన వ్యాఖ్యలు, వింత వ్యాఖ్యలు, వినూత్న పోలికలు వింటున్నాం. రాజకీయ రంగమైనా… ఇంకే రంగమైనా కూడా పాత నీరు పోతూ ఉంటే… కొత్త నీరు వస్తూనే ఉంటుంది కదా. అలాగని పాత తరం నేతలను కొత్త తరం నేతలు మరీ చులకనగా చూడకూడదు కదా. అదే సమయంలో తాము ఇంకా బరిలోనే ఉండగా… ఈ కొత్త నేతలు అవసరమా? అని పాత తరం …
Read More »అసెంబ్లీకి వచ్చినా… బీఏసీకి డుమ్మా కొట్టిన వైసీపీ
ఏపీ అసెంబ్లీ సమావేశాలకు వస్తామంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించి… అందరిలో ఆసక్తి రేకెత్తించారు. అయితే మాట చెప్పిన ప్రకారం అసెంబ్లీ సమావేశాలకు తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి వచ్చిన జగన్… పట్టుమని పది నిమిషాలు కూడా సభలో ఉండలేదు. గవర్నర్ అబ్దుల్ నజీర్ తన ప్రసంగంలో గత ప్రభుత్వ హయాంలో విధ్వంసం జరిగిందని చెప్పినంతనే.. నిరసన వ్యక్తం చేసిన వైసీపీ సభ్యులు… కాసేపటికే …
Read More »ఐదేళ్లు వైసీపీకి ప్రతిపక్ష హోదా రాదు : పవన్
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. తొలి రోజు సభలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం సందర్భంగా వైసీపీ సభ్యులు సభలో రసాభాస సృష్టించడంపై విమర్శలు వస్తున్నాయి. రాని ప్రతిపక్ష హోదా కావాలని సభలో పట్టుబట్టడం, వాకౌట్ చేయడం ఏంటని వైసీపీ నేతలను కూటమి నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విమర్శలు గుప్పించారు. గవర్నర్ ప్రసంగం …
Read More »రంగంలోకి దిగితే పవన్ స్టైలే వేరప్పా!
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రంగంలోకి దిగేంతవరకే… ఒక్కసారి ఆయన రంగంలోకి దిగారంటే పరిస్థితే పూర్తిగా మారిపోతుంది. అది సినిమాలు అయినా.. రాజకీయం అయినా.. ప్రజా సేవ అయినా… ఇంకేదైనా పవన్ తనదైన మార్కుతో సాగిపోతూ ఉంటారు. ప్రస్తుతం పవన్ అటు సినిమాలతో పాటు ఇటు రాజకీయంగా.. మరోవైపు ప్రభుత్వ పాలనలో తనదైన శైలి ముద్రతో సాగిపోతూ ఉన్నారు. అందుకు నిదర్శనంగా ఆదివారం రాత్రి ఆయన …
Read More »‘నారా’ను కాస్తా.. ‘నరేంద్ర’ను చేసేశారే!
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం నిర్దేశిత సమయానికే ప్రారంభం అయిపోయాయి. బడ్జెట్ సమావేశాలు కావడం, సమావేశాల ప్రారంభ రోజు కావడం, గవర్నర్ ప్రసంగం ఉండటంతో సోమవారం దాదాపుగా అటు ఎమ్మెల్యేలతో పాటుగా ఇటు ఎమ్మెల్సీలంతా సమావేశాలకు వచ్చారు. అసెంబ్లీ మెయిన్ హాలులో ప్రారంభం అయిన ఈ సమావేశాల్లో ఎమ్మెల్యేలతో పాటుగా ఎమ్మెల్సీలు కూడా కలిసి కూర్చున్నారు. వెరసి సభ నిండుగా కనిపించింది. ఇక రెండు రోజుల క్రితం ప్రకటించినట్లుగానే …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates