Political News

బీఆర్ఎస్ ‘హైడ్రా’ బాణం ఫలితాన్నిస్తుందా?

తరాలు మారాయి…రాజకీయాలు మారాయి…ఎన్నికల తీరు మారింది…ఎన్నికలలో నేతల ప్రలోభాలు..ఓటర్ల లాభాల లెక్కలూ మారాయి…అదే విధంగా ఎన్నికల ప్రచారం కూడా కొత్త పుంతలు తొక్కుతోంది. సోషల్ మీడియాను ఓ రేంజ్ లో వాడేస్తున్న రాజకీయ నాయకులు…ప్రత్యర్థులపై విమర్శలు సంధించేందుకు వినూత్న ప్రచారానికి తెర తీస్తున్నారు. ఆ క్రమంలోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వినూత్న ప్రయోగం వైరల్ గా మారింది. మాజీ ఐటీ శాఖా …

Read More »

ప్రతిపక్షం కోసం జగన్ ఉపయోగం లేని పోరాటం

వైసీపీకి ప్రతిపక్ష హోదా కావాల్సిందేనని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మొండిపట్టు పట్టిన సంగతి తెలిసిందే. రాజ్యాంగబద్ధంగా రాని…ప్రజలు ఇవ్వని హోదా కోసం జగన్ ఉపయోగం లేని పోరాటం చేస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతిపక్ష హోదా అవసరం లేదని ఎంతమంది చెబుతున్నా జగన్ మాత్రం వినడం లేదు. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు కాబట్టి తాను అసెంబ్లీకి రావడం లేదని జగన్ అంటున్నారు. కానీ, 151 …

Read More »

ఇలా వెళ్లారు.. అలా 20 వేల కోట్ల పెట్టుబ‌డి తెచ్చారు!

రాష్ట్రానికి పెట్టుబ‌డుల వేటలో ఉన్న సీఎం చంద్ర‌బాబు మ‌రో అద్భుతం సాధించార‌నే చెప్పాలి. ఆయ‌న ప్ర‌స్తుతం లండ‌న్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న విష‌యం తెలిసిందే. ఈ ప‌ర్య‌ట‌న‌లోనూ పెట్టుబ‌డులే కీల‌కంగా ఆయ‌న చ‌క్రం తిప్పుతున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా 20 వేల కోట్ల రూపాయ‌ల పెట్టుబ‌డులను దూసుకొచ్చారు. ఒక్క చిన్న ప్ర‌య‌త్నంతో చంద్ర‌బాబు ఈ విజ‌యం సాధించారు. ఏపీలో రూ.20 వేల కోట్ల పెట్టుబ‌డులు పెట్టేందుకు హిందూజా గ్రూప్ ముందుకు వ‌చ్చింది. …

Read More »

వైసీపీకి మంత్రి లోకేష్ బిగ్ ఆఫర్!

నిజమే! టీడీపీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్ సంచలన ప్రకటన చేశారు. నిరంతరం రాజకీయ యుద్ధం చేసే ప్రతిపక్షం వైసీపీకి ఆయన బిగ్ ఆఫర్ ఇచ్చారు. తాజాగా సోమవారం మీడియాతో మాట్లాడిన లోకేష్ పలు అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన 16 నెలల్లో తొలిసారి ఆయన వైసీపీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు ఇప్పుడు కాదని, ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేసుకుందామని హితవు పలికారు. …

Read More »

జూబ్లీహిల్స్ ‘కుక్కర్’ లో ఓట్లు ఉడుకుతాయా?

అగ్గిపుల్ల..సబ్బు బిళ్ల..కుక్క పిల్ల..కాదేదీ కవితకనర్హం అన్నారు మహా కవి శ్రీ శ్రీ…అయితే, మిక్సీలు, కుక్కర్లు, గ్రైండర్లు, బ్యాగులు…ఇలా కావేవీ ఓటర్లకు పంచేందుకు అనర్హం అంటున్నారు రాజకీయ నాయకులు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటర్లును ఆకట్టుకునేందుకు అభ్యర్థులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరికి కుక్కర్లు..మరికొందరికి మిక్సీలు..తాయిలాలుగా ఇచ్చి ఓట్లు రాబట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. ఇలా గృహోపకరణ వస్తువులతో మహిళా ఓటర్లకు గాలం వేసేందుకు సిద్ధమయ్యారట. ఇందుకోసం షాపుల నుంచి దాదాపు 50 …

Read More »

జగన్ మెప్పు కోసం భజనలు చేయకండి

రాజకీయాల్లో పొగడ్తలంటే ఎవరికి ఇష్టముండవు? తమ గురించి అనుచరులు, అనుయాయులు భజన చేస్తుంటే చాలామంది నేతాశ్రీలకు వినసొంపుగా ఉంటుంది. నేతల మెప్పు పొందేందుకు భజన చేసే అనుచరులకు అడ్డూ అదుపే లేదు. ఏపీ మాజీ సీఎం జగన్ అనుచరుల్లో కొంతమంది కూడా ఆ కోవలోకే వస్తారని మాజీ ఎంపీ , వైసీపీ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి అంటున్నారు. జగన్ మెప్పు కోసం భజనలు చేయవద్దని వైసీపీ నేతలకు ఆయన …

Read More »

రేవంత్ ప‌ట్టుబ‌డితే అంతే.. ప్లాన్ మామూలుగా లేదుగా!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప‌ట్టుబ‌డితే.. అనుకున్న‌ది సాధించి తీరాల్సిందే. గ‌త 2023 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువ‌చ్చేందుకు ఆయ‌న ప‌డిన ప్ర‌యాస అంద‌రికీ గుర్తుండే ఉంటుంది. క‌నీసం.. నిద్రాహారాలు కూడా ఆయ‌న మ‌రిచిపోయి ఆనాడు ప‌నిచేశారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ రూపంలో మ‌రో ఎన్నిక వ‌చ్చింది. వాస్త‌వానికి ఇది ఉప ఎన్నికే. దీనిని పెద్ద‌గా సీరియ‌స్ గా తీసుకోవాల్సిన అవ‌స‌రం లేదు. కానీ.. బీఆర్ఎస్ నేత‌లు చేసిన వ్యాఖ్య‌ల‌తో …

Read More »

ప్రశ్న ఏదైనా జోగి సమాధానం ఒక్కటే!

కల్తీ మద్యం కేసులో వైసీపీ నేత, మాజీ మత్రి జోగి రమేష్ ను సిట్ అధికారులు నిన్న ఉదయం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కూటమి ప్రభుత్వంపై బురదజల్లేందుకు జోగి రమేష్ ఈ కల్తీ మద్యం వ్యాపారానికి తెర తీశారని జనార్ధన రావు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పోలీసులు జోగిని అరెస్టు చేశారు. ఆ తర్వాత దాదాపు 11 గంటలపాటు జోగి రమేష్ తో పాటు ఆయన సోదరుడు రామును …

Read More »

ఓట్ల వేట‌: రూటు మార్చేసిన పార్టీలు!

“మీరు ఏం చేస్తారో.. మాకు అన‌వ‌స‌రం.. మ‌నం గెల‌వాల్సిందే!” ఇదీ.. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక లో ప్ర‌ధాన పార్టీల అధినేత‌లు.. అధిష్టానాలు క్షేత్ర‌స్థాయి నాయ‌కుల‌కు పెట్టిన కీల‌క డెడ్‌లైన్‌. దీనికి తోడు.. దాదాపు 20 మాసాల‌త‌ర్వాత‌.. వ‌చ్చిన ఉప ఎన్నిక కూడా కావ‌డంతో అధికార కాంగ్రెస్‌, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్‌, అదేవిధంగా మ‌రోప్ర‌తిప‌క్షం బీజేపీలు కూడా కీల‌కంగా తీసుకున్నాయి. దీంతో ఎవ‌రికి వారు.. ప్ర‌జ‌ల‌ను క‌లుసుకునేందుకు వినూత్న పంథాల‌ను …

Read More »

తెల్ల‌వారు జాము వ‌ర‌కు వాద‌న‌లు.. చివ‌ర‌కు జోగి రిమాండ్‌!

వైసీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి జోగి ర‌మేష్‌ను ఏపీ ఎక్సైజ్ పోలీసులు ఆదివారం ఉద‌యం 7 గంట‌లకు ఆయ‌న ఇంటి నుంచి అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. ఆయ‌న‌తో పాటు ఆయ‌న సోద‌రుడు జోగి రామును అరెస్టు చేశారు. అనంత‌రం.. ఎక్సైజ్ పోలీసు స్టేష‌న్‌కు త‌ర‌లించి రాత్రి 10.30 గంట‌ల వ‌ర‌కు విచారించారు. అనేక అంశాల‌పై వారిని వేర్వేరుగా ప్ర‌శ్నించారు. న‌కిలీ మ‌ద్యం త‌యారీలో వారి పాత్ర స‌హా.. …

Read More »

అర్ధ‌రాత్రి వ‌ర‌కు దేశానికి నిద్ర లేదు.. ప్ర‌ధాని నుంచి సీఎంల వ‌ర‌కు!

ఔను.. నిజం.. ఆదివారం అర్ధ‌రాత్రి(తెల్ల‌వారితే సోమ‌వారం) వ‌ర‌కు ప్ర‌ముఖుల నుంచి పిల్ల‌ల వ‌ర‌కు అంద రికీ కంటిపై కునుకులేదంటే ఆశ్చ‌ర్యం వేస్తుంది. దీనికి కార‌ణం.. న‌వీముంబై వేదిగా.. జ‌రిగిన ఉమెన్‌.. వ‌న్ డే ప్ర‌పంచ క్రికెట్‌!. నిజానికి ఇప్ప‌టి వ‌ర‌కు పురుషుల క్రికెట్‌కు ఉన్న క్రేజ్‌తో పోలిస్తే.. మ‌హిళా క్రికెటర్ల‌కు పెద్ద‌గా ప్రాధాన్యం లేదు. ఒక‌ప్పుడు అస‌లు చ‌ర్చ కూడా ఉండేది కాదు. కానీ, గ‌త రెండుసార్లు.. మ‌న హైద‌రాబాదీ …

Read More »

అనుకోని విప‌త్తులు: ఏపీకి ఊపిరి స‌ల‌ప‌నివ్వ‌ట్లేదుగా!

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం ఏర్పడిన త‌ర్వాత‌.. సుప‌రిపాల‌న అందించేందుకు.. గ‌త ప్ర‌భుత్వం చేసిన త‌ప్పుల‌ను స‌రిదిద్దుకుని, ఆర్థికంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లాల‌న్న విధానంతో ప్ర‌భుత్వం ముందుకు సాగుతోంది. అయితే.. స‌ర్కారుకు ఊపిరి స‌ల‌ప‌నివ్వ‌ని విధంగా ప్ర‌కృతి విప‌త్తులు, మాన‌వ త‌ప్పిదాలు జ‌రుగుతున్నాయి. దీంతో ఇటు ప్ర‌జ‌ల‌కు.. అటు స‌ర్కారుకు కూడా ఇబ్బందిక‌ర ప‌రిస్థితి ఏర్ప‌డుతోంద‌న్న‌ది వాస్త‌వం. వ‌ర‌ద‌లు.. వ‌ర్షాలు.. తుఫాన్లు వంటివి కామ‌న్‌గా వ‌స్తాయి. వీటిని అడ్డుకునే ప్ర‌య‌త్నం ఎవ‌రూ …

Read More »