కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిలపై వైసీపీ నాయకులు ఆ చివరి నుంచి ఈ చివరి వరకు అన్నట్టుగా ఆదివారం ఉదయం నుంచి విరుచుకుపడ్డారు. ఉదయాన్నే.. విశాఖలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర విమర్శలు చేయగా.. అనంతరం.. హైదరాబాద్లో వైసీపీ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయి రెడ్డి విమర్శలు గుప్పించారు. చంద్రబాబు మోచేతి నీళ్లు షర్మిలే తాగుతోందని చెప్పుకొచ్చారు. ఇక, తిరుపతి లో మీడియా ముందుకు వచ్చిన భూమన …
Read More »ఏపీ పట్టభద్రుల ఓట్లు.. కూటమికి పదిలంగా.. !
రాష్ట్రంలో పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. వచ్చే నెలలో ఈ ఎన్నికల పోలింగ్ ప్రత్యక్షంగా జరగనుంది. ఈ ఎన్నికల్లో కూటమి పార్టీల తరఫున ఇద్దరూ టీడీపీ నాయకులకే అవకాశం చిక్కింది. దీంతో వీరిని గెలిపించుకోవడం ద్వారా టీడీపీ తన హవాను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో పట్టభద్రుల ఓట్లు పదిలింగా టీడీపీకి పడాలన్న లక్ష్యంతో ఉండడం గమనార్హం. కూటమి పార్టీలైన జనసేన, బీజేపీల …
Read More »ఇది చక్కదిద్దాలంటే YSR దిగి రావాలి
వైఎస్ రాజశేఖరరెడ్డి జీవించి ఉన్న సమయంలో గడప దాటి ఎరుగని కుటుంబ సభ్యులు ఇప్పుడు ఏకంగా రోడ్డునే పడ్డారు. ఎవరు బయటకు లాగారు? ఎవరు రోడ్డెక్కించారన్నది పక్కన పెడితే.. మొత్తంగా నాలుగు మాసాల కిందట రాజకీయంగా వీధిన పడితే.. ఇప్పుడు ఆస్తుల పరంగా వీధి పోరాటాలకు దిగారు. ఈ తరహా పరిస్థితిని బహుశ రాజశేఖరరెడ్డి ఎప్పుడూ ఊహించి ఉండరు. ఎందుకంటే.. ఆయన జీవితంలో అనేక మంది వివాదాలను సెటిల్ చేశారనే …
Read More »కేటీఆర్ బావమరిది ఫాంహౌస్ లో ఏం జరిగింది?
తీవ్ర రాజకీయ కలకలం చోటు చేసుకునే పరిణామం ఒకటి చోటు చేసుకుంది. వీకెండ్ వేళ.. నగర శివారులోని ఒక ఫామ్ హౌస్ లో పార్టీ జరగటం.. ఈ సమాచారం అందుకున్న సైబరాబాద్ ఎస్ వోటీ పోలీసులు రంగంలోకి దిగి.. పార్టీని భగ్నం చేయటంతో పాటు.. ఒకరు డ్రగ్స్ తీసుకున్నట్లుగా గుర్తించినట్లుగా తెలుస్తోంది. అయితే.. ఈ ఫామ్ హౌస్ మాజీ మంత్రి కేటీఆర్ బావమరిది రాజ్ కు చెందింది కావటం ఇప్పుడు …
Read More »మధ్యవర్తులుగా చాలానే చేశాం.. సాయిరెడ్డి
మీడియా మీటింగ్ పెట్టి.. మీడియాపైనే రుసరుసలాడిన ఘనత వైసీపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు సాయిరెడ్డికే దక్కుతుంది. తాజాగా ఆయన హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 62 నిమిషాల పాటు ఆయన పాత సంగతులు తవ్వి తీశారు. వైఎస్ ఎంత ఆస్తులు పంచారు. అసలు వైఎస్ ఫ్యామిలీ ఏయే ఆస్తులు పంచుకుంది.. అని మొదలు పెట్టి.. అనేక విషయాలు చెప్పుకొచ్చారు. అనంతరం.. …
Read More »హైడ్రా కలకలం: తిరుపతి వెళ్లి వచ్చేలోగా ఇళ్లు కూల్చివేత
అక్రమం, సక్రమం అనే సంగతి, చర్చ అలా ఉంచితే, సగటు జీవికి ఇల్లు ఓ కల. జీవిత కాల స్వప్నం. అలాంటి స్వప్నం విషయంలో ఎన్నో మోసాలు. ఇంకెన్నో అక్రమాలు మధ్య తరగతి మనుషులను పలకరిస్తుంటాయి, కలవరపాటుకు గురిచేస్తాయి, కన్నీళ్లు పెట్టిస్తాయి. కానీ… ఈ జాబితాలో ప్రభుత్వమే కర్కశంగా ప్రవర్తిస్తే… ఆ కుటుంబం పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహకు అందనిది! ఆపద మొక్కుల వాడని ఏడుకొండల వెంకన్న సన్నిదికి …
Read More »బాబు పెద్ద మనసు.. తెలంగాణ డిమాండ్ కు ఓకే
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓ కీలక నిర్ణయం తీసుకొని తెలంగాణకు తీపి కబురు చెప్పారు. ఆది నుంచీ… తెలుగు వారి సంక్షేమం తన ప్రాధాన్యత అని పేర్కొంటున్న చంద్రబాబు ఈ మేరకు ఓ కీలక, సుదీర్గ డిమాండ్ కు ఎస్ చెప్పేశారు. అదే తిరుమల వెంకన్న దర్శనంలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సులు ఆమోదించడం. సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్న ఈ ప్రతిపాదనకు తాజాగా కీలక ప్రకటన వెలువడింది. …
Read More »నెల రోజుల బాబు ఫ్యూచర్ ప్లాన్ ఇదే..!
ప్లాన్ లేనిదే.. ఏ పని కూడా చేయని టీడీపీ అధినేత చంద్రబాబు.. ఇప్పుడు ఫ్యూచర్ ప్లాన్ వేసుకుని ముందుకు సాగుతున్నారు. ఇటు పార్టీ పరంగా.. అటు ప్రభుత్వం పరంగా కూడా.. చంద్రబాబు చాలా వ్యూహాత్మకంగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు. దీనిలో భాగంగా వచ్చే మూడు నెలలకు ఇటు ప్రభుత్వం, అటు పార్టీకి సంబంధించిన ఫ్యూచర్ ప్లాన్ను చంద్రబాబు రెడీ చేసుకున్నారు. దీని ప్రకారమే ఆయన అడుగులు వేయాలని భావిస్తున్నారు పార్టీ …
Read More »జగన్ కోసం.. జగన్ చేత… రచ్చ చేసిన సాయిరెడ్డి!
వైసీపీ రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి మీడియా ముందుకు వచ్చారు. గత వారం రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. దేశవ్యాప్తంగా కూడా .. తీవ్ర చర్చనీయాంశంగా మారిన షర్మిల-జగన్ ఆస్తుల విషయంపై మీడియా సమావేశం పెట్టారు. దీనికి 20 గంటల ముందే.. ఆయన పీఏ.. పెద్ద ఎత్తున మీడియా వర్గాల్లో ప్రచారం కూడా చేశారు. ఇక, శనివారం షర్మిల మీడియా ముందుకు వచ్చి.. కన్నీరు పెట్టుకున్న తర్వాత వెంటనే …
Read More »సాయిరెడ్డి చురుకుతో జగన్ బతికి పోయారా..!
వైసీపీ అధినేత జగన్, కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిల మధ్య ఒక్కసారిగా పేలిన సరస్వతీ పవర్ షేర్ బాంబు ఘటన దేశవ్యాప్తంగా అన్ని మీడియాల్లోనూ ప్రముఖంగా రావడం గమనార్హం. అది ఇది అనికూడా లేదు. చివరకు ఈశాన్య రాష్ట్రాల్లోని స్తానిక మీడియా కూడా.. ఫస్ట్ పేజీ ఇండికేషన్లు ఇచ్చేంత ప్రాధాన్యం ఏర్పడింది. ఇక, జాతీయ మీడియా అయితే.. పుంఖాను పుంఖానులుగా వార్తలు వండి వార్చింది. ఇక, ఈ విషయంలో ఎవరూ …
Read More »విధిలేక.. వైసీపీలో..!!
వైసీపీలో ఒక్కొక్క నేతది కాదు.. గుంపులుగానే అందరిదీ ఒక్కటే బాధ! నిజంగానే అందరి నోటా ఇదే మాట వినిపిస్తోంది. జగన్ ఒంటెత్తు పోకడలను కొందరు నాయకులు ఇప్పటికీ జీర్ణించుకోలేక పోతున్నా రు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నుంచి బర్త్ సర్టిఫికెట్, డెత్ సర్టిఫికెట్ వరకు.. అన్నింటిపై ఆయన ఫొటోలు వేసుకోవడాన్ని అనేక మంది నాయకులు తిరస్కరించారు. ఈ విషయం అధికారం కోల్పోయాక చెప్పుకొచ్చారు. ఇది పాలన పరంగా జరిగిన వ్యవహారం. …
Read More »కల నెరవేర్చుకునేందుకు రేవంత్ సంచలన నిర్ణయం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న సంచలన నిర్ణయాల్లో హైడ్రా, మూసి రివర్ ఫ్రంట్ వంటి వాటితో పాటు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కూడా ఒకటి అని చెప్పుకోవచ్చు. యువతలో నైపుణ్యాలు పెంపొందించేందుకు నూతనంగా అందుబాటులోకి వస్తున్న అవకాశాలను ప్రవేశం చేసుకునేందుకు యంగ్ ఇండియా స్కేల్ యూనివర్సిటీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. అలాంటి స్కిల్ యూనివర్సిటీకి తాజాగా ఒకనాడు తను విమర్శలు గుప్పించిన …
Read More »