విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం మృతి

మహారాష్ట్రలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి చెందారు. పుణెలోని బారామతిలోని మినీ ఎయిర్ పోర్ట్ లో అజిత్ పవార్ ప్రయాణిస్తున్న చార్టెడ్ ఫ్లైట్ ల్యాండ్ అవుతున్న సమయంలో పైలట్ విమానంపై అదుపు కోల్పోయాడని తెలుస్తోంది.

విమానం క్రాష్ ల్యాండ్ అయి రన్ వే పై కుప్పకూలింది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్ తో పాటు మరో ఇద్దరు మృతి చెందినట్లుగా నిర్ధారించారు‌.

అయితే, మరో ముగ్గురు ఈ విమానంలో ప్రయాణిస్తున్నట్లుగా తెలుస్తోంది. వారికి సంబంధించిన సమాచారం తెలియాల్సి ఉంది. అయితే ప్రమాద తీవ్రతను బట్టి ఆ ముగ్గురు కూడా బతికే అవకాశం లేదని డిజీసిఏ అధికారులు భావిస్తున్నారు.

ప్రమాద ఘటన తెలుసుకున్న వెంటనే సహాయక బృందాలు హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. ఎన్నికల ప్రచారం చేసేందుకు అజిత్ పవర్ వచ్చారు.