తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే, జనసేన అరవ శ్రీధర్ పై సంచలన ఆరోపణలు వస్తున్నాయి. అరవ శ్రీధర్ ఓ మహిళతో నగ్నంగా వీడియో కాల్ చేశారంటూ ఆరోపణలు వస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఓ మహిళను ఏడాదిన్నరగా బెదిరిస్తున్న శ్రీధర్ ఆమెను బలవంతంగా లోబర్చుకున్నాడనని, ఆమె గర్భవతి కావడంతో ఆమెకు అబార్షన్ చేయించాడని ఓ మీడియా ఛానెల్ లో కథనం వచ్చింది. అంతేకాదు, ఉద్యోగం చేస్తున్న ఆమె భర్తకు విడాకులు ఇవ్వాలని కూడా అరవ శ్రీధర్ బెదిరించారని ఆ కథనంలో ఆరోపించారు.
సదరు మహిళను పెళ్లి చేసుకుంటానని బలవంతం చేయగా…అందుకు ఆ మహిళ ఒప్పుకోలేదని ఆరోపణలు వచ్చాయి. దీంతో, ఆమె భర్తకు ఫోన్ చేసి అరవ శ్రీధర్ బెదిరించారని, ఆ క్రమంలో ఆ మహిళకు తన భర్తతో విభేదాలు వచ్చాయట.
భర్తకు విడాకులివ్వకుంటే మూడేళ్ల కుమారుడిని చంపేస్తానని శ్రీధర్ బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఏడాదిన్నర కాలంగా ఆ టార్చర్ భరించిన సదరు మహిళ ఇక తట్టుకోలేక శ్రీధర్ తో వాట్సాప్ వీడియో కాల్స్, వాట్సాప్ చాట్ హిస్టరీ బయటపెట్టారని తెలుస్తోంది. అయితే, ఈ వ్యవహారంపై అరవ శ్రీధర్, జనసేన నేతలు అధికారికంగా స్పందించాల్సి ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates