Political News

‘గేమ్ ఛేంజ‌ర్’ కానున్న విశాఖ స‌మ్మిట్‌ !

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల‌ల‌ను విశాఖ‌లో నిర్వ‌హించ‌నున్న పెట్టుబ‌డుల స‌ద‌స్సు సాకారం చేయ‌నుందా? అంటే.. అవున‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. పెట్టుబ‌డుల వేట‌లో సుదీర్ఘంగా శ్ర‌మిస్తున్న సీఎం చంద్రబాబు, ఆయ‌న త‌న‌యుడు మంత్రి నారా లోకేష్‌లు ఇప్ప‌టికే దుబాయ్‌, ఆస్ట్రేలియా, స్విట్జ‌ర్లాండ్‌, లండ‌న్ స‌హా ప‌లు దేశాల్లో ప‌ర్య‌టించారు. మొత్తంగా పెట్టుబ‌డుల సాధ‌నే లక్ష్యంగా రేయింబ‌వ‌ళ్లు ప‌నిచేస్తున్నారు. ఈ క్ర‌మంలో గ‌డిచిన 16 మాసాల్లో మొత్తం 10 ల‌క్ష‌ల కోట్ల మేర‌కు …

Read More »

పాపం షర్మిల.. గ్రాఫ్ పెరగట్లేదట..!

కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల ఈ పదవిని చేపట్టి 20 మాసాలు పూర్తయ్యాయి. గత ఏడాది ఫిబ్రవరిలో కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన షర్మిల ఇప్పటి వరకు సాధించిందేంటి అని చూస్తే పెద్దగా ఏమీ కనిపించడం లేదని సొంత పార్టీ సీనియర్లు వ్యాఖ్యలు చేస్తున్నారు. మరోవైపు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నానన్న షర్మిలకు గ్రాఫ్ పెరగకపోవడం మరో ఇబ్బందిగా మారింది. మొత్తంగా ఈ పరిణామాలు షర్మిల …

Read More »

చెత్త‌-స‌త్తా.. తేల్చుకుందాం: కేటీఆర్‌

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్‌కు మ‌రో ఐదు రోజుల స‌మ‌య‌మే ఉన్న నేప‌థ్యంలో ప్ర‌ధాన పార్టీల మ‌ధ్య రాజ‌కీయ వేడి మ‌రింత పెరిగింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఇంటింటి ప్ర‌చారం, ప్ర‌సంగాలు చేసుకున్న నాయ‌కులు.. తాజాగా ప్ర‌జ‌ల‌ను మ‌రింత‌గా త‌మ‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నంలో స‌వాళ్లు-ప్ర‌తిస‌వాళ్లు రువ్వుకుంటున్నారు. ఇదేస‌మ‌యంలో జూబ్లీహిల్స్ అభివృద్ధిపైనా ప్ర‌త్య‌క చ‌ర్చ‌కు దిగుతున్నారు. తాజాగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయ‌కుడు కేటీఆర్‌.. సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి స‌వాల్ రువ్వారు. …

Read More »

“కేసులు పెట్టారా.. డిజిట‌ల్ బుక్కు ఉందిగా”

వైసీపీ నేత‌ల‌పై తాజాగా కృష్ణాజిల్లా పోలీసులు కేసులు న‌మోదు చేశారు. మంగ‌ళ‌వారం వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌.. రైతుల ప‌రామ‌ర్శ‌కు వెళ్లిన విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల వ‌చ్చిన మొంథా తుఫాను కార‌ణంగా.. ప‌లు జిల్లాల్లో భారీ వ‌ర్షాలు కురిశాయి. దీంతో పంట పొలాలు తీవ్రంగా దెబ్బ‌తిన్నాయి. ఈ క్ర‌మంలో న‌ష్ట‌పోయిన రైతుల‌ను ప‌రామ‌ర్శించేందుకు జ‌గ‌న్ మంగ‌ళ‌వారం.. కృష్ణాజిల్లాలో ప‌ర్య‌టించారు. అయితే.. ఈ సంద‌ర్భంగా వైసీపీ నాయ‌కులు నానా హంగామా …

Read More »

కేటీఆర్‌ను అరెస్టు చేద్దామంటే.. : రేవంత్ రెడ్డి

బీఆర్ఎస్ నాయ‌కుడు, మాజీ మంత్రి కేటీఆర్‌ను అరెస్టు చేద్దామంటే గ‌వ‌ర్న‌ర్ అనుమ‌తి ఇవ్వ‌డంలేద‌ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అదేవిధంగా అవినీతి మ‌య‌మైన కాళేశ్వ‌రం ప్రాజెక్టుపై సీబీఐ వేయాల‌ని నిర్ణ‌యం తీసుకుని.. దీనిని సీబీఐకి కూడా అప్ప‌గించామ‌న్నారు. కానీ, మూడు మాసాలైనా ఇప్ప‌టి వ‌ర‌కు సీబీఐ రంగంలోకి దిగ‌లేద‌ని తెలిపారు. ఈ ప‌రిణామాల‌ను చూస్తే.. బీఆర్ఎస్‌ను బీజేపీ కాపాడుతోంద‌న్న విష‌యం స్ప‌ష్టంగా తెలుస్తోంద‌ని ఆరోపించారు. బీజేపీ, …

Read More »

ఢిల్లీకి స్టూడెంట్స్.. సింగపూర్కు టీచర్లు.. వాహ్ లోకేష్

ఏపీ లోని ఉత్తమ ఉపాధ్యాయులకు రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ గుడ్న్యూస్ చెప్పారు. అధునాతన విద్యావిధానాలపై అధ్యయనానికి రాష్ట్రంలో 78మంది బెస్ట్ టీచర్ అవార్డు గ్రహీతలను ఈనెల 27వతేదీన సింగపూర్ పంపేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో విద్యాశాఖపై మంత్రి లోకేష్ బుధవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… ఈనెల 27నుంచి డిసెంబర్ …

Read More »

కౌలు రైతులకు కూడా న్యాయం చెయ్యాలి: పవన్

అవనిగడ్డ నియోజకవర్గం పరిధిలోని తీర ప్రాంతంలో కాలువలను సముద్రానికి అనుసంధానిస్తూ నిర్మించిన అవుట్ ఫాల్ స్లూయిజ్ లు పని చేయకపోవడం కారణంగా నాగాయలంక, కోడూరు మండలాల పరిధిలో సుమారు 5 వేల ఎకరాలు ముంపుకు గురవుతున్నాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల నేడు అవుట్ ఫాల్ స్లూయిజ్ లను పునరుద్ధరించేందుకు రూ.50 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోందన్నారు. ఈరోజు ఉదయం మంగళగిరిలోని క్యాంపు …

Read More »

పవన్ వచ్చే… అడవిలో ఉన్న గూడెం కి కరెంట్ తెచ్చే

ప్రపంచానికి దూరంగా విసిరేసినట్టు అడవిలో ఉండే ‘గూడెం’ అనే గ్రామం అది. ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా, అనంతగిరి మండలం, రొంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉంది. మండల కేంద్రానికి 50 కిలోమీటర్ల దూరంలో 17 ఇళ్లతో ఉంది ఆ గ్రామం. గూడెం గ్రామ ప్రజల ఇళ్ళలో నేటి వరకూ విద్యుత్ వెలుగులు లేవు. స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలైనా వారు పడుతున్న కష్టాలు బాహ్య ప్రపంచానికి తెలియవు. గతంలో ఎన్నోమార్లు అధికారులకు …

Read More »

‘లిక్కర్ స్కాం ద్వారా భారతికి జగన్ 400 కేజీల బంగారం చేయించారు’

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పై జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో జగన్ ముద్దాయి కాబోతున్నారని ఆయన జోస్యం చెప్పారు. 60 రోజుల్లోపు జగన్ కు సూపర్ చెక్ పడుతుందని అన్నారు. జగన్ ఏం చేసినా పప్పులు ఉడకవని, జగన్ బతుకు ఘోరం కాబోతోందని, పలు కేసుల్లో ఇరుక్కోబోతున్నాడని చెప్పారు. మద్యం కేసులో జోగి రమేష్ ను సిట్ 2 …

Read More »

సర్ప్రైజ్ – వెండితెరపై రోజా పునఃప్రవేశం

సీనియర్ హీరోయిన్, నటి రోజా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సినిమాలు బాగా తగ్గించేయడం చూశాం. మొదట తెలుగుదేశం, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యే, మంత్రిగా పదవులు నిర్వహించిన రోజా కేవలం బుల్లితెరపై మాత్రమే కనిపించేవారు. జబర్దస్త్ కామెడీ షో జడ్జ్ గా అక్కడ సుదీర్ఘ కాలం కెరీర్ చవి చూశారు. అధికార పార్టీలో ఉన్నప్పటికీ ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం పట్ల విమర్శలు రావడంతో మానేశారు. గత …

Read More »

ఈసీ పై మరోసారి విరుచుకుపడ్డ రాహుల్ గాంధీ

ఎన్నికల కమిషన్ పై కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. హరియాణాలో ప్రతి 8 ఓట్లలో ఒకటి నకిలీ ఓటు ఉందంటూ రాహుల్ తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ను సర్దార్జీగా అభివర్ణించారు. ఆయన పచ్చి అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై ఎన్నికల కమీషన్ వేగంగా స్పందించింది. ఆయన చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని తెలిపింది. …

Read More »

ఏపీలో 120 చోట్ల ఏసీబీ దాడులు.. డబ్బును బయటకు విసిరేశారు!

ఏపీలోని 120 ప్రాంతాల్లో ఏసీబీ ఏకకాలంలో మెరుపు దాడులు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఏసీబీ తనిఖీలు చేస్తోంది. అధికారుల సోదాలతో అప్రమత్తం అయిన డాక్యుమెంట్ రైటర్లు తమ షాపులకు తాళం వేసుకొని పరారయ్యారు. ఒంగోలు సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసుపై ఏసీబీ దాడులు చేసిన సమయంలో కార్యాలయ సిబ్బంది భయంతో డబ్బులను బయటకు విసిరి వేసినట్టు సమాచారం. సిబ్బంది విసిరేసిన సుమారు రూ.30 వేలు ఏసీబీ అధికారులు స్వాధీనం …

Read More »