ఏపీ సీఎం చంద్రబాబు.. నిరుద్యోగులకు భారీ జాక్ పాట్ ప్రకటించారు. ఇప్పటి వరకు అనేక ఉద్యమాలు, నిరసనలు, ఆందోళనలు చేస్తే తప్ప.. కరుణించని ప్రభుత్వాల తీరు నిరుద్యోగులకు తెలుసు. అయితే.. ఎలాంటి నిరసనలు లేకుండానే కేవలం చిన్న అభ్యర్థన.. గతంలో తాను రా.. కదలిరా..! సభల్లో పాల్గొన్నప్పుడు అనేక మంది నిరుద్యోగులు వెల్లడించిన అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇది భవిష్యత్తులో నిరుద్యోగులకు ఎంతో …
Read More »పెన్షన్ డబ్బుతో సచివాలయ ఉద్యోగి బెట్టింగ్.. లోకేష్ ఏమన్నారంటే..
పల్నాడు జిల్లా దాచేపల్లిలో చోటుచేసుకున్న ఓ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. గ్రామ సచివాలయం-3 వెల్ఫేర్ అసిస్టెంట్ సంపతి లక్ష్మీప్రసాద్ ప్రజలకు పంపిణీ చేయాల్సిన పెన్షన్ డబ్బుతో పరారయ్యాడు. ఈ నెల 1న పింఛన్ తీసుకోవాల్సిన, లబ్ధిదారులకు డబ్బు అందకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అధికారులు అతని ఆచూకీ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే, తాజాగా లక్ష్మీప్రసాద్ ఒక సెల్ఫీ వీడియో విడుదల చేయడంతో ఈ వ్యవహారం మరింత హాట్ టాపిక్ …
Read More »అక్కడేమో మాధవి రెడ్డి… ఇక్కడేమో సుధా రెడ్డి
ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇద్దరు మహిళా నేతలు అనూహ్యంగా లైమ్ లైట్ లోకి వచ్చారు. మొన్నటిదాకా తమ భర్తలు రాజకీయాలు చేస్తుంటే.. ఈ ఇద్దరు మహిళలు అలా చూస్తూ ఉండిపోయారు. ఇప్పుడు ఈ ఇద్దరు మహిళలు బయటకొచ్చి సత్తా చాటుతున్నారు. సత్తా చాటడమంటే ఏదో సాదాసీదా రాజకీయాలు చేస్తున్నారని అనుకోవడానికి లేదు. ఎందుకంటే… వీరిలో ఒకరు వైసీపీ అధినే వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ముచ్చెమటలు పట్టిస్తూ …
Read More »కిరణ్ రాయల్ వివాదం క్లోజ్… కేసులూ క్లోజ్
జనసేన తిరుపతి నేత కిరణ్ రాయల్ పై రేగిన వివాదం ఎట్టకేలకు సమసిపోయింది. రోజుల తరబడి ఏపీలో హాట్ టాపిక్ గా మారగా.. రోజుకో వీడియో చొప్పున బయటకు వచ్చి కిరణ్ రాయల్ ను రాజకీయంగా ఓ రేంజిలో సతమతం చేసింది. పార్టీ కార్యకలాపాలకు కొంతకాలం పాటు దూరంగా ఉండాలంటూ రాయల్ ను జనసేన ఆదేశించింది. ఈ ఆదేశాలు విడుదల అయిన తర్వాత ఈ వివాదం సద్దుమణిగినట్టే కనిపించినా… లక్ష్మి …
Read More »రాజంపేట నుంచి గుంటూరు… గుంటూరు నుంచి ఆదోని
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్, జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లతో పాటుగా వారి కుటుంబాలపైనా అసభ్య పదజాలంతో కూడిన దూషణలకు దిగిన కేసులో ప్రముఖ సినీ నటుడు, వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణ మురళి…ఈ కేసుల్లో భాగంగా ఏపీ మొత్తం తిరిగేలానే ఉన్నారని చెప్పక తప్పదు. తొలుత హైదరాబాద్ లోని ఆయన ఇంటికి వెళ్లిన అన్నమయ్య …
Read More »అసెంబ్లీలో పాన్ మసాలాతో ఉమ్మేసిన ఎమ్మెల్యే.. అప్పుడే పట్టేసిన స్పీకర్
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మంగళవారం ఓ అవాంఛిత సంఘటన చోటుచేసుకుంది. సభలో సభ్యులు చర్చలు జరుపుతుండగా, ఒక ఎమ్మెల్యే పాన్ మసాలా నమిలి హాల్లోనే ఉమ్మేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. అసెంబ్లీ వంటి గౌరవప్రదమైన వేదికలో ఇలాంటి ఘటనలు జరగడం అంగీకారయోగ్యం కాదని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న అసెంబ్లీ స్పీకర్ సతీష్ మహానా వెంటనే స్పందించి, సంబంధిత ప్రాంతాన్ని స్వయంగా …
Read More »అడ్డంకులు ఆలపాటిని ఆపలేకపోయాయి!
ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను అందరూ ముద్దుగా ఆలపాటి రాజా అని పిలుచుకుంటారు. ఈ పేరు వింటేనే టీడీపీ శ్రేణుల్లో ఓ ప్రత్యేక వైబ్రేసన్ ఉవ్వెత్తున ఎగసి పడుతుంది. టీడీపీకి నమ్మిన బంటు. అదే టీడీపీకి ఆయన ఓ బలం కూడా. పార్టీ హైకమాండ్ మాటే తన మాట. పార్టీ ఏది చెబితే.. ముందూ వెనుకా చూడకుండా రంగంలోకి దిగిపోయే తత్వమున్న అతి కొద్ది మంది నేతల్లో ఆలపాటి అందరి …
Read More »లోకేశ్ స్టైల్ వాళ్లకి భలేగా నచ్చిందబ్బా!
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ మీడియా సమావేశాల్లో వైరి వర్గాలకు చుక్కలు చూపిస్తున్నారు కదా. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబం ఆధ్వర్యంలో నడుస్తున్న సాక్షి మీడియాను పిలిచి.. సదరు మీడియా ప్రతినిధిని చూసి మరీ తన ప్రసంగాన్ని మొదలుపెడుతున్నారు. ఈ తరహా పద్ధతితో లోకేశ్ మీడియా సమావేశాలకు హాజరు కావాలంటేనే సాక్షి, ఎన్టీవీ సంస్థలకు చెందిన జర్నలిస్టులు జడుసుకుంటున్నారు. ఎవరైనా …
Read More »ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెలలోనే డీఎస్సీ: లోకేశ్
ఏపీలో ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి ఉద్దేశించిన డీఎస్సీని ఈ నెలలోనే జరిపి తీరతామని కూటమి సర్కారు మరోమారు స్పష్టం చేసింది. ఈ మేరకు మంగళవారం నాటి శాసనసభ సమావేశాల్లో భాగంగా శాసనమండలిలో వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు లోకేశ్ విస్పష్ట ప్రకటన చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెల (మార్చి)లోనే డీఎస్సీ ప్రకటనను విడుదల చేస్తామని లోకేశ్ స్పష్టం చేశారు. అంతేకాకుండా 2025-26 విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోగా కొత్త ఉపాధ్యాయులు …
Read More »విడదల రజనీ జైలుకు వెళ్లక తప్పదా..?
వైసీపీ మహిళా నేత, మాజీ మంత్రి విడదల రజినీ అతి త్వరలోనే జైలుకు వెళ్లక తప్పదన్న వాదనలు అంతకంతకూ బలపడున్నాయి. ఈ మేరకు పోలీసులు ఇప్పటికే మొత్తం రంగం సిద్ధం చేయగా… కేవలం కొన్ని అనుమతులు రావాల్సి ఉన్న నేపథ్యంలోనే ఆమె అరెస్టుకు మరికాస్త సమయం పట్టవచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి. 2019లో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రజనీ… జగన్ సెకండ్ కేబినెట్ లో మంత్రి పదవిని దక్కించుకున్నారు. …
Read More »ఏపీలో ఎప్పుడు ఎన్నికలొచ్చినా అజెండా ఇదే…!
ఏపీలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. పథకాలు, సంక్షేమం, మేనిఫెస్టో .. అనే మాటలు వినిపించడం కుదరదు. ఈ విషయంలో కూటమి పార్టీలు ఒక నిర్ణయానికి వచ్చేశాయి. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో జగన్.. అధికారంలో ఉండి.. కేవలం ఈ మూడు అంశాలనే ప్రాతిపదికగా చేసుకుని ముందుకు సాగారు. అయితే.. పథకాలు అందరికీ అందే అవకాశం లేదు. ఎంత ఖర్చు చేసినా.. ప్రజల్లో అసంతృప్తి గూడుకట్టుకునే ఉంటుంది. ఇక, సంక్షేమం మాటా …
Read More »అన్ని దారులు లోకేష్ వైపే
కొన్నికొన్ని విషయాలు ఆసక్తిగా ఉంటాయి. ఇలాంటి ఘటనే టీడీపీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్ విషయంలో జరుగుతోంది. “లోకేష్ సర్ ఇప్పట్లో ఎవరినీ కలవరు.. ప్లీజ్ ఒక నెల ఆగి ట్రై చేయండి”- ఇదీ.. ఇప్పుడు లోకేష్ చాంబర్లోను.. ఆయన నివాసంలోనూ పనిచేస్తున్న పీఏలు, సెక్రటరీలు చెబుతున్న మాట. అది కూడా.. టీడీపీ సీనియర్లకే చెబుతున్న మాట. ఇదేమీ చిత్రమైన విషయం కాదు. చాలా సీరియస్ ఇష్యూనే. మరి …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates