Political News

యూట‌ర్న్ పాలిటిక్స్‌.. ఆళ్లదా.. జ‌గ‌న్‌దా?

రాజకీయాల్లో శాశ్వ‌త శ‌త్ర‌వులు, శాశ్వ‌త మిత్రులు ఉండ‌రని అంటారు. అవ‌స‌రం.. అవ‌కాశం అనే రెండు ప‌ట్టాల‌పైనేరాజ‌కీయ రైలు ప‌ర‌గులు పెడుతుంది. అది పార్టీ అయినా.. నాయ‌కులైనా ఫార్ములా అయితే ఒక్క‌టే. ఇప్పుడు ఇదే ఫార్ములా వైసీపీలోనూ క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. తాజాగా మంగ‌ళగిరి ఎమ్మెల్యే, కొన్నాళ్ల కింద‌ట వైసీపీకి రాజీనామా చేసిన ఆళ్ల రామ‌కృష్ణా రెడ్డి తిరిగి వైసీపీ గూటికి చేరుతున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలో ఆళ్ల‌తో హైద‌రాబాద్‌లో …

Read More »

పవన్ కీలక సమావేశం

ఉభయగోదావరి జిల్లాలోని నేతలతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. రాజమండ్రికి చేరుకున్న పవన్ తన అజెండా ప్రకారమే మంగళవారం సమావేశాలు నిర్వహించబోతున్నారు. రెండురోజుల క్రితమే ఉత్తరాంధ్ర జిల్లాల్లోని నేతలతో విశాఖపట్నంలో సమావేశమైన విషయం తెలిసిందే. అదేపద్దతిలో ఇపుడు ఉభయగోదావరి జిల్లాల్లోని నేతలందరినీ రాజమండ్రికి చేరుకోవాలని కబురుచేయటంతో అందరు చేరుకున్నారు. రాబోయే ఎన్నికల్లో పొత్తులో జనసేన ఎన్ని సీట్లకు పోటీచేయబోతోంది, పోటీచేయబోయే నియోజకర్గాలు ఏవన్న విషయాలనే నేతలతో …

Read More »

ఢిల్లీకి కేసీఆర్‌.. బీజేపీతో పొత్తుకేనా? పొలిటిక‌ల్ టాక్‌!

తెలంగాణ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారని పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర్ అనారోగ్యం కారణంగా మూడు నెలలుగా బయటకు రాకుండా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల నల్గొండ సభకు వచ్చారు. నీళ్ల వివాదంపై ఆయ‌న త‌న‌దైన శైలిలో వ్యాఖ్య‌లు గుప్పించారు. తాజాగా కేసీఆర్ ఢిల్లీ పర్యటన ఉంటుందని వార్తలు వస్తుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే …

Read More »

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు సెంట్ర‌ల్ సెక్యూరిటీ

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌త్యేక భ‌ద్ర‌త క‌ల్పించింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న ఎక్క‌డ ప‌ర్య‌టించినా.. రాష్ట్ర పోలీసులు లేదా.. సొంత బౌన్స‌ర్లు మాత్ర‌మే ఆయ‌న‌కు భ‌ద్ర‌త క‌ల్పిస్తున్నారు. అయితే.. గ‌త ఏడాది విశాఖ‌, విజ‌య‌వాడ‌లో పర్య‌టించిన‌ప్పుడు ప‌వ‌న్ వ్య‌వ‌హారంపై ప్ర‌భుత్వం స్పందించ‌లేదు. ఆయ‌న‌కు భ‌ద్ర‌త క‌ల్పించే విష‌యంలోనూ తాత్సారం చేసింది. చంద్ర‌బాబు జైల్లో ఉన్న‌ప్పుడు.. ఆయ‌న‌ను ప‌రామ‌ర్శించాలని భావించిన ప‌వ‌న్ వ‌స్తున్న స‌మ‌యంలో అడ్డుకున్నారు. దీంతో …

Read More »

టీడీపీ-జ‌న‌సేన ఒకే పాట‌.. కార్య‌క‌ర్త‌ల గురించే!

టీడీపీ-జ‌న‌సేన పార్టీలు పొత్తు పెట్టుకుని వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ అయిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఇరు పార్టీల్లోనూ క‌ల‌వ‌ర ప‌రుస్తున్న ఏకైక విష‌యం.. క్షేత్ర‌స్థాయిలో ఈ నాలుగేళ్ల కాలంలో పార్టీని ముందుకు న‌డిపించిన నాయ‌కులు.. టికెట్లు కోరుతుండ‌డం.. ఆమేర‌కు పార్టీల‌కు టికెట్లు ద‌క్కే ఛాన్స్ లేక‌పోవ‌డం. దీంతో రెండు పార్టీలు కూడా.. కార్య‌క‌ర్త‌ల‌ను బుజ్జ‌గించే ప‌నిచేప‌ట్టాయి. గ‌త కొన్ని రోజులుగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. పార్టీ యువ …

Read More »

మాకు 160, మిగతా 15 సీట్ల‌ కోస‌మే కొట్టుకుంటున్నారు – KA పాల్

ప్ర‌జాశాంతి పార్టీ అధ్య‌క్షుడు, పొలిటిక‌ల్ క‌మెడియ‌న్ అని ప్ర‌తిప‌క్ష పార్టీలు, ఇతర నాయ‌కులు పిలుచుకునే కిలారి ఆనంద పాల్ తాజాగా ఏపీ రాజ‌కీయ నేత‌ల‌కు స‌వాల్ రువ్వారు. అది కూడా ఆయ‌న రెండు ప్ర‌ధాన పార్టీల అధ్య‌క్షుల‌కు స‌వాల్ రువ్వ‌డం గ‌మ‌నార్హం. “విజ‌య‌వాడ‌లో పేద్ద అంబేద్కర్ విగ్రహం పెట్టారు క‌దా.. ఆ విగ్ర‌హం సాక్షిగా నాతో చర్చలకు రావాలి“ అని టీడీపీ అధినేత చంద్రబాబు, సీఎం జగన్‌కి సవాల్ విసిరారు. …

Read More »

వైసీపీలో అల‌జ‌డి.. ఐప్యాక్‌తో జ‌గ‌న్ భేటీ!

వైసీపీ రాజ‌కీయ వ్యూహ‌కర్త‌ల బృందం `ఐప్యాక్‌`తో సీఎం జ‌గ‌న్ తాజాగా తాడేప‌ల్లి క్యాంపు కార్యాల‌యంలో భేటీ అయ్యారు. ఈ ప‌రిణామం వైసీపీలో నేత‌ల మ‌ధ్య అల‌జ‌డికి దారితీసింది. ఇప్ప‌టికే చాలా మంది నాయ‌కుల‌ను ఐప్యాక్ స‌ర్వేల ఆధారంగా ప‌క్క‌న పెట్ట‌డం.. బ‌దిలీ చేయ‌డం చేసిన నేప‌థ్యంలో మిగిలిన స్థానాల‌కు సంబంధించి ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారోన‌ని.. నాయకులు హ‌డ‌లి పోతున్నారు. తాజాగా ఐప్యాక్ బృందంతో భేటీ అయిన సీఎం జ‌గ‌న్‌.. వ‌చ్చే …

Read More »

బాల‌య్య వార్నింగ్.. జ‌గ‌న్ రియాక్ష‌న్‌

ఏపీ వైసీపీ ప్ర‌భుత్వంపై టీడీపీ నాయ‌కుడు, హిందూపురం ఎమ్మెల్యే బాల‌కృష్ణ ఫైర్ అయ్యారు. అదేస‌మ‌యంలో మాస్ వార్నింగ్ కూడా ఇచ్చారు. “ఇదేం ప‌ద్ద‌తి. మీరు ఎలానూ ఓడిపోతారు. ఇంకా దాడులు చేయ‌డం ఎందుకు? ఇప్ప‌టికైనా మానుకోండి. లేక పోతే తీవ్ర‌ప‌రిణామాలు ఎదుర్కొనాల్సి ఉంటుంది” అని బాల‌య్య వార్నింగ్ ఇచ్చారు. మ‌రి దీని ప్ర‌భావ‌మో ఏమో.. తెలియ‌దు కానీ.. సీఎం జ‌గ‌న్ రియాక్ట్ అయ్యారు. నిత్యం తాను తిట్టిపోసే ఓ పత్రిక …

Read More »

టీడీపీ కేడ‌ర్‌కి ఇది కస్టమైన పనే..

వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి టీడీపీ అధినేత చంద్ర‌బాబు పార్టీ నాయ‌కుల‌కు మేలిమి సూచ‌న చేశారు. పొత్తులు త‌ప్ప‌వ‌ని ఇప్ప‌టికే సంకేతాలు పంపించిన చంద్ర‌బాబు.. ఈ క్ర‌మంలో సీట్ల‌ను త్యాగాలు చేయాల‌ని చంద్ర‌బాబు తాజాగా పిలుపునిచ్చారు. పార్టీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. అంద‌రికీ ప‌దవులు ద‌క్కుతాయ‌ని హింట్ ఇచ్చారు. ఏకంగా 5 వేల మంది నాయ‌కుల‌తో ఒకేసారి టెలీ కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించిన ఆయ‌న పార్టీలో ఉన్న నాయ‌కుల‌ను బుజ్జ‌గించే ప్ర‌య‌త్నం చేశారు. …

Read More »

కొడాలికి మైండ్ బ్లాంక్‌.. గుడివాడ‌లో కొత్త నేత‌కు టికెట్‌?

వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు, మాజీ మంత్రి కొడాలి నానికి వైసీపీ అధినేత జ‌గ‌న్ భారీ షాక్ ఇవ్వ‌నున్నారా? గుడివాడ ఇలాకాలో నానికి బ‌దులుగా వేరే వారికి అవ‌కాశం ఇస్తున్నారా? వ‌చ్చే ఎన్నిక‌ల్లో కొడాలికి చెక్ పెడుతున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. తాజాగా గుడివాడ వ్యాప్తంగా వెలిసిన ఫ్లెక్సీలు.. సోష‌ల్ మీడియాలో జ‌రుగుతున్న చ‌ర్చ వంటివి గ‌మ‌నిస్తే.. మార్పు దిశ‌గా పార్టీ అడుగులు వేస్తున్న‌ట్టు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. దీంతో …

Read More »

టీడీపీ తో పొత్తు ఇష్టం లేని ఏకైక బీజేపీ నాయకుడు

ఏపీ బీజేపీ నాయ‌కుడు.. విష్ణు వ‌ర్ధ‌న్‌రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో దుమారం రేపుతున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాము ఎవ‌రి ప‌ల్ల‌కీనీ మోయ‌బోమ‌ని.. తాము ఎందుకు మోయాల‌ని.. ఆయ‌న ప్ర‌శ్నించారు. అంతే కాదు.. తాము బ‌లంగా ఉన్నామ‌ని భావిస్తున్నందునే త‌మ వెంట పొత్తు పెట్టుకునేందుకు తిరుగుతున్నార‌ని కూడా ఆయ‌న వ్యాఖ్యానించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీఎం సీటు త‌మ‌కే కావాల‌ని కూడా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య‌ల‌ను పైకి ఆయ‌న సొంత‌మ‌ని.. వాటితో …

Read More »

జ‌గ‌న్‌కు నాగ‌బాబు ‘గ్లాసు’ కౌంట‌ర్‌..

వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్‌కు జ‌న‌సేన ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఫైర్ బ్రాండ్ నాగ‌బాబు భారీ కౌంట‌ర్ ఇచ్చారు. ఆదివారం అనంత‌పురంజిల్లా రాప్తాడు నియోజ‌క‌వ‌ర్గంలో నిర్వ‌హించిన వైసీపీ సిద్ధం స‌భ‌లో సీఎం జ‌గ‌న్ జ‌న‌సేన ఎన్నిక‌ల గుర్తు గాజు గ్లాసుపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఈ వ్యాఖ్య‌ల‌పైనే నాగ‌బాబు కౌంట‌ర్ ఇచ్చారు. దీంతో ఈ రెండు పార్టీల మ‌ధ్య మాట‌ల యుద్ధం మ‌రోసారి ప్రారంభ‌మైంది. ఏం జ‌రిగింది..? రాప్తాడు సిద్ధం జ‌భ‌లో …

Read More »