మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ నేతృత్వంలోని గేట్స్ అండ్ మిలిండా ఫౌండేషన్ ఏపీకి వివిధ రంగాల్లో సహకారం అందించేందుకు ఇప్పటికే ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. అలా ఒప్పందాలపై సంతకాలు కాగానే… ఇలా సహకారం అందించేందుకు గేట్స్ ఫౌండేషన్ సిద్ధమైపోయింది. అదే సమయంలో గట్స్ ఫౌండేషన్ నుంచి ఎప్పుడెప్పుడు సహకారం లభిస్తుందా?అని ఎదురు చూసిన ఏపీలోని కూటమి ప్రభుత్వం కూడా…ఆ సంస్థ నుంచి సహకారం అందుకునేందుకు సంసిద్ధతను వ్యక్తం చేసింది. …
Read More »నీచ రాజకీయాలకు దూరం… లేదంటే వారు జైల్లో ఉండేవారు: రేవంత్
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబంపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మరోమారు విరుచుకుపడ్డారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గురువారం నాటి సమావేశాల్లో బాగంగా కాంగ్రెస్ సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా జోక్యం చేసుకున్న రేవంత్.. కేసీఆర్ పాలనపై విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ పాలనలో తనను ఎన్నో ఇబ్బందులు పెట్టిన వైనాన్ని రేవంత్ గుర్తు …
Read More »జనసేన సత్తా.. కాకినాడ రూరల్ ఎంపీపీ కైవసం
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటింది. వైసీపీకి గట్టి పట్టున్న కాకినాడ రూరల్ మండల ప్రజా పరిషత్ (ఎంపీపీ) పదవిని జనసేన కైవసం చేసుకుంది. అది కూడా ఈ ఎన్నిక ఏకగ్రీవంగా ముగిసేలా వ్యూహం రచించి పక్కాగా అమలు చేసి సత్తా చాటింది. ఫలితంగా కాకినాడ రూరల్ ఎంపీపీగా జనసేనకు చెందిన అనంత లక్ష్మీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జనసేన దెబ్బకు …
Read More »పవన్ ‘హిందూ ధర్మం’పై జగన్ ఘాటు విమర్శలు
జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీరును తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ వైసీపీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం సంచలన ఆరోపణలు చేశారు. పవన్ కు అసలు హిందూ ధర్మంపైనా, ఆలయాల పరిరక్షణపైనా మాట్లాడే అర్హత ఉందా? అంటూ జగన్ ఫైరైపోయారు. కడప జిల్లా బద్వేలు నియోజకవర్గ పరిధిలోని కాశినాయన ఆశ్రమం కూల్చివేతలకు సంబంధించిన అంశాన్ని ఆసరా చేసుకుని జగన్ చేసిన విమర్శలు ఇఫ్పుడు …
Read More »ఈ ఎంపీపీ ఎన్నిక చాలా కాస్ట్లీ గురూ!
ఏపీలో గురువారం వివిధ జిల్లాల్లో ఖాళీగా ఉన్న జిల్లా పరిషత్, మండల పరిషత్ చైర్మన్లు, సర్పంచ్ లు, ఉప సర్పంచ్ ల ఎన్నికలు జరుగుతున్నాయి. ఇతర జిల్లాల పరిస్థితి ఎలా ఉన్నా… తిరుపతి జిల్లా పరిధిలోని తిరుపతి రూరల్ ఎంపీపీ ఎన్నిక అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఎందుకంటే…ఈ ఎంపీపీ గతంలో వైసీపీకి దక్కగా… దానిని నిలబెట్టుకునేందుకు వైసీపీ నేతలు నేల విడిచి సాము చేస్తున్నారని చెప్పాలి. మెజారిటీ వైసీపీకే ఉండగా..ఎక్కడ …
Read More »విశాఖలో లులూ మాల్… 14 ఎకరాల భూమి కేటాయింపు
టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి రావడంతో ఏపీకి మహార్దశ పట్టిందనే చెప్పాలి. ఇప్పటికే గడచిన 9 నెలల కూటమి పాలనలోనే ఏపీకి ఏకంగా రూ.7 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. వీటిలో కొన్ని గ్రౌండ్ కాగా.. మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా కంపెనీలు రాష్ట్రానికి వస్తుండగా… అప్పటికే వచ్చి…వైసీపీ దౌర్జన్య కాండ కారణంగా ఏపీకి వదిలి పారిపోయిన కంపెనీలు కూడా తిరిగి వస్తున్నాయి. …
Read More »రాజు తలచుకుంటే… పదవులకు కొదవా?
రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా? అన్నది పెద్దల సామెత. ఇప్పుడు వైసీపీని చూస్తుంటే… ఆ సామెత కాస్తా… రాజు తలచుకుంటే పదవులకు కొదవా? అని చెప్పుకోవాల్సిందే. అసలే మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయిన వైసీపీ కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోలేదు. పార్టీ ఘోర పరాజయాన్ని ముందే ఊహించిన కొందరు ఎన్నికలకు ముందే పార్టీని వీడితే…ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక చాలా మంది …
Read More »వైరల్ గా హోం మినిస్టర్ వీడియో… ఏముందంటే?
ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత సోషల్ మీడియాలో బుధవారం సాయంత్రం ఓ వీడియో పోస్ట్ చేశారు. సదరు వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. అంతేనా దానిని చూసిన వారంతా ఏపీ పోలీసు శాఖ తీరును అభినందించకుండా ఉండలేకపోతున్నారు. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అందుబాటులోకి తీసుకువచ్చిన డ్రోన్ టెక్నాలజీని పోలీసు శాఖ ఇంత బాగా వినియోగించుకుంటుందా? అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఫలితంగా …
Read More »సీతక్కకు ఉర్దూ రాదు… నాకు తెలుగు రాదు: అక్బరుద్దీన్ ఓవైసీ
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడీవేడీగా జరుగుతున్నాయి. ప్రభుత్వ వాదనలకు విపక్షాల నుంచి కూడా అదే స్థాయిలో కౌంటర్లు పడుతున్నాయి. ఆ కౌంటర్లకు అధికార పక్షం నుంచి కూడా రీ కౌంటర్లు పడిపోతున్నాయి. చర్చలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం నాటి సమావేశాల్లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. అది కూడా భాషా సంబంధిత అంశం కావడం గమనార్హం. మంత్రి సీతక్క, మజ్లిస్ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీల …
Read More »జగన్ పెద్దమ్మ సుశీలమ్మ మృతి
వైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇంట మరో విషాదం చోటుచేసుకుంది. అనారోగ్య కారణాల రీత్యా జగన్ పెద్దమ్మ సుశీలమ్మ బుధవారం రాత్రి తుది శ్వాస విడిచారు. 85 ఏళ్ల వయసున్న సుశీలమ్మ వయసురీత్యా వచ్చిన అనారోగ్య సమస్యలతో గత కొంతకాలంగా సతమతమవుతున్నారు. చాలా కాలంగా ఆమె పులివెందులలోని ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో రెండు నెలల క్రితమే సుశీలమ్మను పరామర్శించే నిమిత్తం …
Read More »నిరంజన్ రెడ్డి సేవలు వైసీపీలో కొందరికే పరిమితం
ఏపీలో విపక్షం వైసీపీకి చెందిన కీలక నేతలపై వరుసగా కేసులు నమోదు అవుతున్నాయి. వైసీపీ అధికారంలో ఉండగా.. చోటుచేసుకున్న పరిణామాలే ఈ కేసులకు కారణమని కూడా చెప్పక తప్పదు. అయితే అధికార కూటమి అక్రమంగా కేసులు నమోదు చేస్తోందని ఆరోపిస్తున్న వైసీపీ అదిష్ఠానం…కేసులకు భయపడవద్దని, పార్టీ లీగల్ టీం అండగా ఉంటుందని పార్టీ శ్రేణులకు భరోసా ఇస్తోంది. అయితే ఈ భరోసాలో ఒక్కో నేతకు ఒక్కో మాదిరి అన్నట్టుగా న్యాయ …
Read More »వంశీ ముక్కుపై గాయం… ఏం జరిగింది?
వైసీపీలో అందగాళ్లంతా కూటమి సర్కారుకు టార్గెట్ గా మారుతున్నారంటూ ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మొన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ ను విజయవాడ జైలులో పరామర్శించిన తర్వాత జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. జగన్ వ్యాఖ్యల మాటేమిటో గానీ…దళిత యువకుడు కిడ్నాప్, బెదిరింపుల కేసులో అరెస్టై జైలులో కాలం వెళ్లదీస్తున్న వంశీ… నెల తిరక్కుండానే …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates