Political News

ఎన్నికకు టీడీపీ దూరమేనా ?

తొందరలో జరగబోయే రాజ్యసభ ఎన్నికలకు తెలుగుదేశంపార్టీ దూరంగా ఉండాలని నిర్ణయించిందా ? పార్టీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఒకపుడు టీడీపీ తరపున ఎస్సీ సీనియర్ నేత వర్ల రామయ్యను పోటీలోకి దింపనున్నట్లు ప్రచారం జరిగింది. తర్వాత వర్ల కాదు కంభంపాటి రామ్మోహన్ రావు పోటీలో ఉంటారనే ప్రచారం జరిగింది. ఇపుడేమో అసలు టీడీపీ వైపు నుంచి ఎలాంటి హడావుడి కనబడటం లేదు. నామినేషన్ల దాఖలకు 15వ …

Read More »

కేసీయార్ ప్లాన్ రివర్సయ్యిందా ?

తెలంగాణాలో మంగళవారం రెండు మేజర్ డెవలప్మెంట్లు జరగబోతున్నాయి. ఒకటేమో కేసీయార్ హయాంలో నిర్మించిన  మేడిగడ్డ బ్యారేజిలో అవినీతి, నాసిరకం నిర్మాణాలను ఎండగట్టేందుకు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో బ్యారేజీ సందర్శన. ఇదే సమయంలో తెలంగాణాలోని గోదావరి నదీ జలాల యాజమాన్య అధికారాలను  కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు(కేఆర్ఎంబీ)కు అప్పగిస్తు తెలంగాణా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా కేసీయార్ బహిరంగసభ. రేవంత్ ఆధ్వర్యంలో సందర్శన మంగళవారం ఉదయం ప్రారంభమై సాయంత్రానికి ముగుస్తుంది. ఇక …

Read More »

బాబు సీఎం కాకూడదని కేసీఆర్ ప్లాన్ చేసి ఓడించారు – జూపల్లి

తెలంగాణ కాంగ్రెస్ నేత‌, ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. 2019లో జ‌రిగిన ఏపీ ఎన్నిక‌ల్లో వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు బీఆర్ ఎస్ అధినేత‌, అప్ప‌టి ముఖ్య‌మంత్రి కేసీఆర్ సంపూర్ణంగా స‌హ‌క‌రించార‌ని తెలిపారు. టీడీపీ అధినేత‌, అప్ప‌టి ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌రోసారి ముఖ్య‌మంత్రి కాకూడ‌ద‌న్న ఉద్దేశంతోనే కేసీఆర్ ఇలా స‌హ‌క‌రించార‌ని తెలిపారు. “కేసీఆర్‌కు చంద్రబాబుకు రాజకీయంగా సరిపడదు. ఆయన రెండోసారి సీఎం కాకూడదని కేసీఆర్‌ భావించారు. …

Read More »

 ఆచంట వైసీపీలో మంట‌లు..

ఉమ్మ‌డి ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలోని ఆచంట నియోజ‌క‌వ‌ర్గంలో అధికార పార్టీ నాయ‌కులు గ్రూపులుగా విడిపో యారు. టికెట్ వ్య‌వ‌హారంపై ఎవ‌రికి వారు త‌మ‌దైన శైలిలో రాజ‌కీయాలు చేస్తున్నారు. మాజీ మంత్రి ప్ర‌స్తుత ఎమ్మెల్యే శ్రీరంగ నాథ‌రాజుకు వ్య‌తిరేకంగా ఓ వ‌ర్గం బ‌ల‌మైన గ‌ళం వినిపిస్తోంది. ఈ సారి ఆయ‌న‌కు టికెట్ ఇస్తే.. తామే ఓడిస్తామ‌ని నాయ‌కులు వ్యాఖ్యానించారు. త‌మ‌ను వాడుకుని వ‌దిలేశార‌ని నాయ‌కులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తాజాగా నియోజ‌క‌వ‌ర్గంలోని పెనుగొండ …

Read More »

కాంగ్రెస్ టార్గెట్ కేటీయార్ ?

మొన్న హెచ్ఎండీఏ డైరెక్టర్ శివ బాలకృష్ణ అరెస్టు. నేడు సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్ కు ఏసీబీ నోటీసులు. విచారణ తర్వాత అరెస్టుచేసే అవకాశముందనే ప్రచారం. వీళ్ళిద్దరు అవినీతి కేసుల్లో బాగా కూరుకుపోయారు. ప్రభుత్వం గట్టిగ  కన్నెర్రచేస్తే గిలగిల్లాడిపోవాల్సిందే. వీళ్ళిద్దరిపై ప్రభుత్వం పట్టు బగిస్తుంటే ప్రతిపక్ష బీఆర్ఎస్ లో టెన్షన్ పెరిగిపోతోంది.  ఎందుకంటే ప్రభుత్వం చాలా వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది కాబట్టే. ఇపుడు తగులుకున్న వీళ్ళిద్దరు మాజీమంత్రి కేటీయార్ కు …

Read More »

కేసీఆర్, రేవంత్ టీడీపీ ప్రొడక్ట్ లే: లోకేష్

టీడీపీ నుంచి బయటకు వచ్చి టీఆర్ఎస్ పెట్టిన కేసీఆర్, ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రత్యేక పరిస్థితుల్లో టీడీపీని వీడి కాంగ్రెస్ లో చేరిన రేవంత్ సీఎంలు అయ్యారని, వారిద్దరూ చంద్రబాబు శిష్యులేనని టాక్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో జరిగిన శంఖారావం సభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఇద్దరు ముఖ్యమంత్రులు టీడీపీ ప్రొడక్టులేనంటూ …

Read More »

మ‌న దేశ ఉత్త‌మ ప్ర‌ధాని ఆయ‌నేన‌ట‌!

భార‌త దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చిన నాటి నుంచి ఇప్పటి వ‌ర‌కు అనేక మంది నాయ‌కులు దేశాన్ని పాలించారు. అనేక సంస్క‌ర‌ణ‌లు తీసుకువ‌చ్చారు. పేద‌రికాన్ని రూపు మాపేందుకు అనేక ప్ర‌య‌త్నాలు చేశారు. ప‌థ‌కాలు కూడా తీసుకువ‌చ్చారు. అందుకే వారిలో చాలా మందిని దేశం భార‌త‌రత్న వంటి స‌మున్న‌త స‌త్కారాలు అందించి.. గౌర‌వించింది. అయితే.. వీరంద‌రినీ తోసిరాజ‌ని.. ఇప్పుడు.. దేశ ఉత్త‌మ ప్ర‌ధానిగా ప్ర‌స్తుత పీఎం న‌రేంద్ర మోడీ నిలిచార‌ట‌. ఈ మేర‌కు …

Read More »

కేసీఆర్ సీటును ప‌ద్మారావుకు ఇవ్వండి: రేవంత్

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అసెంబ్లీలో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడి బాధ్య‌త‌ల‌ను, హోదాను కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప‌ద్మారావుకు ఇవ్వాల‌ని వ్యాఖ్యానించారు. సోమ‌వారం అసెంబ్లీలో కృష్ణాన‌ది జ‌ల అంశంపై ప్ర‌ధాన చ‌ర్చ‌సాగింది. ఈ క్ర‌మంలో మంత్రి ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ చేశారు. న‌ది ప‌రివాహ‌క ప్రాంతం స‌హా.. ఏయే ప్రాజెక్టులు ఉన్నాయి? ఎంత మందికి ప్ర‌యోజ‌నం చేకూరుతోంది? కేంద్రం ఎందుకు ఈ ప్రాజెక్టుల‌ను త‌మ‌కు అప్ప‌గించాల‌ని కోరుతోంది? …

Read More »

చెప్పులు-త‌రిమికొట్ట‌డాలు-ఫామ్ హౌస్‌..

తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాల్లో అధికార పార్టీ కాంగ్రెస్ నేత‌ల‌కు, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ నాయ‌కుల‌కు మ‌ధ్య మాట‌ల యుద్దం చోటు చేసుకుంది. వారి వారి ప్ర‌సంగాల్లో చెప్పులు-త‌రిమికొట్ట‌డాలు-ఫామ్ హౌస్ వంటి వ్యాఖ్య‌లు ప‌దే ప‌దే చోటు చేసుకున్నాయి. కృష్ణా న‌దీ జ‌లాల‌ పై జ‌రుగుతున్న చ‌ర్చ సంద‌ర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ను క‌రీంన‌గ‌ర్‌ ప్ర‌జ‌లు త‌రిమి కొట్టార‌ని, దీంతో ఆయ‌న మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌కు వ‌చ్చార‌ని వ్యాఖ్యానించారు. అయినా.. …

Read More »

‘జ‌గ‌న్ త‌న‌ను తాను ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకున్నా ఓట‌మి ఖాయం’

“జ‌గ‌న్ కొత్త‌గా ఒక ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తున్నాడు. త‌న పార్టీ ఎమ్మెల్యేల‌ను ఒక చోట నుంచి మ‌రో చోట‌కు మారుస్తున్నాడు. అంటే.. ఒక చోట ప‌నికిరాని నాయ‌కుడు, ఓడిపోయే నాయ‌కుడు.. మ‌రొక‌చోట గెలుస్తాడ‌ని ఆయ‌న అనుకుంటున్నాడు. పక్కింటి చెత్త మ‌న‌కు ప‌నికి వ‌స్తుందా? ఇది కూడా అంతే.. జ‌గ‌నే స్వ‌యంగా త‌న సీటు మార్చుకుని బ‌దిలీ అయి.. వేరే చోట నుంచి పోటీ చేసినా వైసీపీ ప‌రాజ‌యాన్ని ఎవ‌రూ ఆపలేరు. …

Read More »

బీఆర్ఎస్ పై మైండ్ గేమ్ పెరిగిపోతోందా ?

ఓడలు బండ్లు..బండ్లు ఓడలు అవుతాయనటానికి తెలంగాణా రాజకీయాలే ఉదాహరణ. రాబోయే పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రతిపక్ష బీఆర్ఎస్ పై మరో ప్రతిపక్షం బీజేపీ మైండ్ గేమ్ మొదలుపెట్టింది. రాబోయే ఎన్నికల్లో పోటీ ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ మధ్యే అంటు కమలనాథులు ఊదరగొడుతున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ అసలు పోటీలోనే ఉండదని పదేపదే ప్రకటనలు చేస్తున్నారు. ఈ ప్రచారాన్ని గట్టిగా బీఆర్ఎస్ నేతలు తిప్పికొట్టలేకపోతుండటమే విచిత్రంగా ఉంది. మొన్నటి అసెంబ్లీ …

Read More »

ఈసారి కడప జిల్లా రాజకీయమే వేరు

రాబోయే ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లోను త్రిముఖ పోటీ తప్పదు. అయితే కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం పోటీ రసవత్తరంగా ఉండబోతోంది. అలాంటి నియోజకవర్గాలు కడప జిల్లాలోనే ఎక్కువగా ఉండబోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే కడప జిల్లా అంటేనే వైఎస్ కుటుంబంది అని ముద్రపడిపోయింది. ఇలాంటి కుటుంబంలో అన్న జగన్మోహన్ రెడ్డి చెల్లెలు షర్మల మధ్య రాజకీయ పోరు నడుస్తోంది. కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల బాధ్యతలు తీసుకోగానే కడప …

Read More »