ఏసీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసన మండలిలో మంత్రి అచ్చెన్నాయుడు వర్సెస్ మాజీ మంత్రి బొత్స అన్న రీతిలో మాటల యుద్ధం జరిగింది. వైసీపీ నేతలు గాలికి వచ్చారంటూ అచ్చెన్న చేసిన వ్యాఖ్యలపై బొత్స తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వ్యక్తిగతంగా తాను ఎవరిపై విమర్శలు చేయలేదని, ఈ వ్యాఖ్యలను అచ్చెన్న వెనక్కి తీసుకోవాలని బొత్స అన్నారు. ఇక, పథకాలపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ కాదని, …
Read More »పవన్ వ్యూహంతో ‘ఏటికొప్పాక’కు మరో గౌరవం
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రజా సేవలో తనదైన ముద్రతో సాగిపోతున్నారు. పల్లె ప్రగతి కోసం పవన్ అనుసరిస్తున్న వ్యూహాలు లెక్కలేనన్ని లాభాలను ఆర్జించి పెడుతున్నాయి. పవన్ కల్యాణ్ అనుసరిస్తున్న వ్యూహాల ఫలితంగా ఉత్తరాంధ్రకు చెందిన ఏటికొప్పాక బొమ్మలకు ఇప్పుడు జాతీయ స్థాయిలో ఓ అరుదైన గుర్తింపు దక్కింది. భారత ప్రథమ పౌరుడు రాష్ట్రపతి అధికారిక నివాసంగా కొనసాగుతున్న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ఏటికొప్పాక …
Read More »దేశ ద్రోహులు, స్మగ్లర్లు హీరోలా?: వెంకయ్యనాయుడు
భారతీయ చలన చిత్రాల్లో హీరోల పాత్రల తీరుపై బీజేపీ సీనియర్ మోస్ట్ నేత, మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే మృతి చెందిన తెలుగు అలనాటి నటి, నిర్మాత కృష్ణవేణి సంస్మరణ సభ ఆదివారం హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా మాట్లాడిన వెంకయ్య… ప్రస్తుతం వస్తున్న సినిమాల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సినిమాల్లో హీరోల పాత్రల తీరుపై దర్శకులు …
Read More »పీఏ ఇంట శుభకార్యానికి సతీసమేతంగా లోకేశ్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ జనంలోకి చొచ్చుకుని వెళుతున్నారు. ఎక్కడో అమెరికాలోని స్టాన్ ఫోర్ట్ వర్సిటీలో ఉన్నత చదువులు చదివిన లోకేశ్.. ఆ హైఫై కల్చర్ ను ఎప్పుడో పక్కనపెట్టేశారని చెప్పాలి. ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చారో… ప్రజా సేవే లక్ష్యంగా ఆయన సాగుతున్నారు. తొలుత టీడీపీలో పార్టీ సమన్వయకర్త హోదాతో రాజకీయ అడుగులు ప్రారంభించిన లోకేశ్.. పార్టీ కార్యకర్తలకు బీమా సౌకర్యంతో తొలి అడుగే …
Read More »ఇక పల్నాడు పోలీసుల వంతు… పోసాని
వైసీపీ మాజీ నేత, ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి మరిన్ని చిక్కులు మొదలైనట్లేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. గత వారం అన్నమయ్య జిల్లా పోలీసులు హైదరాబాద్ వెళ్లి మరీ పోసానిని అరెస్టు చేసి ఓబులవారిపల్లెకు తీసుకుని వచ్చారు. సుదీర్ఘ విచారణ అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరు పరచిన పోలీసులు… కోర్టు ఆదేశాలతో పోసానిని రాజంపేట సబ్ జైలుకు తరలించారు. సోమవారం ఉదయం దాకా రాజంపేట సబ్ జైలులోనే ఉన్న …
Read More »టీపీసీసీ పదవులు: సంప్రదాయానికి భిన్నంగా నటరాజన్ అడుగులు!
రాజకీయాల్లో సాధారణంగా.. విధేయులకు వీరతాళ్లు వేస్తారు. నాయకులను మెచ్చుకునేవారిని.. పొగిడే వారికి.. వారికి అన్ని విధాలా సహకరించేవారికి రాజకీయాల్లో పదవులు దక్కడం కామనే. పైగా.. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలంగా ఇదే సంప్రదాయం కొనసాగుతోంది. దీంతో నచ్చిన నాయకుడుకి మెచ్చి మరీ విధేయులుగా ఉండడం కామన్ అయిపోయింది. దీంతో పదవులు దండిగా వచ్చి వాలడం కూడా.. కామన్గా మారింది. ఈ సంప్రదాయం ప్రకారమే.. ఇటీవల తెలంగాణలో పీసీసీ పదవులు రెడీ అయ్యారు. …
Read More »బాబు టైలరింగ్ ఐడియా అదిరింది
ఏపీలో కూటమి అధికారం చేపట్టిన తర్వాత ఈ నెల 8న తొలి మహిళా దినోత్సవం జరుగుతోంది. మహిళల అభ్యున్నతి కోసం నిత్యం ఏదో ఒక కొత్త పథకానికి రూపకల్పన చేస్తున్న టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు… ఈ దఫా సరిగ్గా ప్రపంచ మహిళా దినోత్సవం నాడే… వారికి ఓ అదిరిపోయే గిఫ్ట్ ను అందించేందుకు సిద్ధపడ్డారు. ఈ మేరకు ఇప్పటికే చంద్రబాబు నుంచి ఆదేశాలు జారీ కాగా… …
Read More »అరెరే… వీహెచ్ ప్లాన్ రివర్స్ కొట్టేసిందే
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హన్మంతరావు తన సామాజిక వర్గం మున్నూరు కాపు నేతలతో శనివారం తన ఇంటిలో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ హయాంలో మున్నూరు కాపులకు సరైన ప్రాధాన్యం దక్కడం లేదని భావిస్తున్న ఆయన… పరిస్థితిని చక్కదిద్దే క్రమంలోనే ఈ భేటీని నిర్వహించినట్లుగా సమాచారం. అయితే ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటుగా బీఆర్ఎస్, బీజేపీల్లో ఉన్న మున్నూరు కాపు …
Read More »హరీశ్ రావుపై రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి… బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావుపై ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంకు కెనాల్ (ఎస్ఎల్బీసీ) సొరంగంలో జరిగిన ప్రమాద స్థలిని పరిశీలించేందుకు ఆదివారం దోమలపెంట వెళ్లిన రేవంత్… ప్రమాదం జరిగిన సొరంగంలోకి వెళ్లి అక్కడి పరిస్థితిని పరిశీలించారు. అనంతరం అక్కడే అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా ఈ ప్రమాదం జరిగి …
Read More »మోదీ ని మెచ్చుకుని కిషన్ రెడ్డిని టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆదివారం వనపర్తిలో పర్యటించారు. ఈ సందర్భంగా పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకున్న రేవంత్ అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ ఇద్దరు బీజేపీ నేతలకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ ప్రస్తావించిన ఆ ఇద్దరు బీజేపీ నేతల్లో ఒకరు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కాగా… మరొకరు మోదీ కేబినెట్ లో మంత్రిగా …
Read More »సడన్ గా విజయసాయిరెడ్డి దర్శనమిచారు
భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ కడ్ సెలవు రోజు ఆదివారం తెలంగాణ రాజధాని హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. సతీసమేతంగా భాగ్యనగరికి వచ్చిన ధన్ కడ్ కు తెలంగాణ ప్రభుత్వం ఘనంగా స్వాగతం పలికింది. హైదరాబాద్ టూర్ లో భాగంగా సంగారెడ్డి సమీపంలోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ని సందర్శించారు. ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులతో ఆయన ముఖాముఖీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముగించుకుని ఆయన తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. …
Read More »ఆ 8 మంది ప్రాణాలతో ఉన్నట్టేనా? : రేవంత్ ఏం చెప్పారు
తెలంగాణ పరిధిలోని శ్రీశైలం ప్రాజెక్టులో చేపట్టిన శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్(ఎస్ ఎల్ బీసీ) టన్నెల్లో ఈ నెల 22న జరిగిన ప్రమాదంలో ఇద్దరు ఇంజనీర్లు సహా 8 మంది కార్మికులు కూరుకుపోయారు. పై నుంచి మట్టి పెళ్లలు విరిగి పడడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే.. ఇప్పటి వరకు ఎన్ని చర్యలు చేపట్టినా.. హుటాహుటిన రంగంలోకి దిగి.. అధునాతన యంత్రాలను ప్రయోగించినా.. బాధితులకు మాత్రం సాంత్వన చేకూర్చలేక …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates