ఏపీ అసెంబ్లీ సమావేశాలకు వస్తామంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించి… అందరిలో ఆసక్తి రేకెత్తించారు. అయితే మాట చెప్పిన ప్రకారం అసెంబ్లీ సమావేశాలకు తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి వచ్చిన జగన్… పట్టుమని పది నిమిషాలు కూడా సభలో ఉండలేదు. గవర్నర్ అబ్దుల్ నజీర్ తన ప్రసంగంలో గత ప్రభుత్వ హయాంలో విధ్వంసం జరిగిందని చెప్పినంతనే.. నిరసన వ్యక్తం చేసిన వైసీపీ సభ్యులు… కాసేపటికే …
Read More »ఐదేళ్లు వైసీపీకి ప్రతిపక్ష హోదా రాదు : పవన్
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. తొలి రోజు సభలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం సందర్భంగా వైసీపీ సభ్యులు సభలో రసాభాస సృష్టించడంపై విమర్శలు వస్తున్నాయి. రాని ప్రతిపక్ష హోదా కావాలని సభలో పట్టుబట్టడం, వాకౌట్ చేయడం ఏంటని వైసీపీ నేతలను కూటమి నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విమర్శలు గుప్పించారు. గవర్నర్ ప్రసంగం …
Read More »రంగంలోకి దిగితే పవన్ స్టైలే వేరప్పా!
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రంగంలోకి దిగేంతవరకే… ఒక్కసారి ఆయన రంగంలోకి దిగారంటే పరిస్థితే పూర్తిగా మారిపోతుంది. అది సినిమాలు అయినా.. రాజకీయం అయినా.. ప్రజా సేవ అయినా… ఇంకేదైనా పవన్ తనదైన మార్కుతో సాగిపోతూ ఉంటారు. ప్రస్తుతం పవన్ అటు సినిమాలతో పాటు ఇటు రాజకీయంగా.. మరోవైపు ప్రభుత్వ పాలనలో తనదైన శైలి ముద్రతో సాగిపోతూ ఉన్నారు. అందుకు నిదర్శనంగా ఆదివారం రాత్రి ఆయన …
Read More »‘నారా’ను కాస్తా.. ‘నరేంద్ర’ను చేసేశారే!
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం నిర్దేశిత సమయానికే ప్రారంభం అయిపోయాయి. బడ్జెట్ సమావేశాలు కావడం, సమావేశాల ప్రారంభ రోజు కావడం, గవర్నర్ ప్రసంగం ఉండటంతో సోమవారం దాదాపుగా అటు ఎమ్మెల్యేలతో పాటుగా ఇటు ఎమ్మెల్సీలంతా సమావేశాలకు వచ్చారు. అసెంబ్లీ మెయిన్ హాలులో ప్రారంభం అయిన ఈ సమావేశాల్లో ఎమ్మెల్యేలతో పాటుగా ఎమ్మెల్సీలు కూడా కలిసి కూర్చున్నారు. వెరసి సభ నిండుగా కనిపించింది. ఇక రెండు రోజుల క్రితం ప్రకటించినట్లుగానే …
Read More »తొలి రోజు ఓకే!.. మిగిలిన రోజుల పరిస్థితేంటి?
ఏపీ అసెంబ్లీలో గతంలో ఎన్నడూ లేనంత తక్కువ సీట్లను గెలుచుకున్న వైసీపీ పరిస్థితిపై భిన్న రకాల వాదనలు వినిపిస్తున్నాయి. 2024 ఎన్నికలకు ముందు ఏకంగా 151 మంది ఎమ్మెల్యేలతో స్ట్రాంగ్ గా కనిపించిన వైసీపీ… ఎన్నికల తర్వాత ఒక్కసారిగా 11 సీట్లకు పడిపోయింది. ఈ బలంతో వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా రాని పరిస్థితి. అంటే… ఐదేళ్ల పాటు సీఎంగా పనిచేసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ …
Read More »రాష్ట్రాన్ని నాశనం చేశారు: జగన్ ప్రభుత్వంపై గవర్నర్
ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. సోమవారం ఉదయం ప్రారంభం కాగానే.. ఉభయ సభలను ఉద్దేశించి.. గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన.. గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించా రు. లెక్కలేకుండా చేసిన అప్పుల కారణంగా.. రాష్ట్రం ఆర్థిక దుస్థితిలోకి వెళ్లిందన్నారు. కేంద్రం నుంచి ఇచ్చిన నిధులను కూడా దారి మళ్లించారని తెలిపారు. అదేవిధంగా రాష్ట్రానికి వచ్చిన పన్నులను కూడా.. దేనికి ఖర్చు చేశారన్నది లెక్కలేకుండా పోయిందని వ్యాఖ్యానించారు. …
Read More »వీడియో : అసెంబ్లీకి ఇలా వచ్చి అలా వెళ్లిన జగన్
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కావడం విశేషం. అసెంబ్లీకి మాజీ సీఎం జగన్ కూడా హాజరయ్యారు. అయితే, సభలో వైసీపీ సభ్యులు గందరగోళం సృష్టిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ వైసీపీ సభ్యులు నినాదాలు చేస్తున్నారు. గవర్నర్ ప్రసంగానికి వైసీపీ సభ్యులు పదేపదే అడ్డుపడుతున్నారు. తమను ప్రతిపక్షంగా గుర్తించాలంటూ వైసీపీ సభ్యులు నినాదాలు …
Read More »కన్నబాబు భేటీకి దూరంగా ‘త్రి’మూర్తులు!
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు… పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్తగా ఇటీవలే నియమితులైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆదివారం తీరిగ్గా కన్నబాబు ఆ కొత్త బాధ్యతల్లోకి ఒదిగిపోయారు. ఆడంబరాలు, ఆర్భాటాలకు అల్లంత దూరాన ఉండే కన్నబాబు… రీజనల్ కో ఆర్డినేటర్ గా పదవీ బాధ్యతల స్వీకరణను కాస్తా ఉత్తరాంధ్ర జిల్లాల నేతలతో తన తొలి సమావేశంగా మార్చివేశారు. ఈ సమావేశానికి ఉమ్మడి విశాఖ, …
Read More »జగన్‌ను చంద్రబాబు కరుణిస్తారా?
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ను సీఎం చంద్రబాబు కరుణిస్తారా? గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా దయ చూపిస్తారా? ఇదీ.. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లోనే కాదు.. సోషల్ మీడియాలోనూ జరుగుతున్న చర్చ. మరికొన్ని గంటల్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో 2025-26 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశ పెట్టేందుకు కూటమి ప్రభుత్వం రెడీ అయింది. ఈ సమావేశాల్లో అనేక హైలెట్లు ఉన్నప్పటికీ.. అందరి దృష్టీ.. వైసీపీ …
Read More »వైసీపీ వినుకొండలో బయటకు వెళ్లేదెవరు…?
ఏపీలో మొన్నటిదాకా అధికార పార్టీగా కొనసాగి… ఇప్పుడు కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కని వైసీపీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. ఓ వైపు ఓటమి నుంచి పార్టీ అధిష్ఠానం తేరుకోకముందే… కీలక నేతలు వరుసబెట్టి బయటకు వెళ్లిపోయారు. ఇక పార్టీని అంటిపెట్టుకుని సాగుతున్న నేతలను ద్వితీయ శ్రేణి నేతలు మెడబట్టి గెంటేసే యత్నాలు జరుగుతున్నాయి. వాస్తవానికి నేతలంతా బయటకు క్యూ కడుతున్న వేళ… పార్టీని అంటిపెట్టుకుని ఉన్న …
Read More »అసెంబ్లీలో పవన్ బలం వీళ్లే!
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్ధం అయిపోయింది. జనసేన అసెంబ్లీలో తనదైన శైలి 100 శాతం బలంతో అడుగుపెట్టిన తర్వాత సిసలైన అసెంబ్లీ సమావేశాలు ఇవే. ఎందుకంటే.. 2024 ఎన్నికల తర్వాత పలుమార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగినా… విపక్షం అయిన వైసీపీ లేకుండానే సమావేశాలు జరిగాయి. ఈ నేపథ్యంలో సభకు హాజరైన సభ్యులంతా కూటమిలోని మూడు పార్టీలకు చెందినవారే కావడంతో పెద్దగా రచ్చ లేకుండానే ప్రశాంతంగా సభా సమావేశాలు …
Read More »ఎమ్మెల్సీ ఎన్నికలు.. రేవంత్‌కు లిట్మస్ టెస్ట్?
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని రేవంత్‌రెడ్డి పాలన ప్రారంభించి ఏడాది దాటిపోయింది. ఈ నేపథ్యంలో ఒకదఫా పార్లమెంటు ఎన్నికలు వచ్చాయి. ఆ తర్వాత.. ఇప్పుడు కీలకమైన మూడు ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి. వీటికి మరో మూడు రోజుల్లోనే పోలింగ్ జరగనుంది. ఈ నెల 27న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి సర్కారుకు లిట్మస్ టెస్ట్ ప్రారంభమైం దని.. రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates