Political News

కేటినెట్ భేటీని వాయిదా వేసి ఢిల్లీకి చంద్రబాబు

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు గురువారం దేశ రాజధాని ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారు. ఢిల్లీలో గురువారం జరిగే ఓ కీలక కార్యక్రమంలో పాలుపంచుకునేందుకే ఆయన ఈ పర్యటనకు వెళుతున్నారు. అందుకోసం గురువారం జరగాల్సి రాష్ట్ర మంత్రి మండలి సమావేశాన్ని కూడా ఆయన వాయిదా వేశారు. ఢిల్లీ నుంచి తిరిగి రాగానే… కేబినెట్ భేటీని రీషెడ్యూల్ చేస్తారని సమాచారం. అయినా కేబినెట్ భేటీని వాయిదా వేసుకుని మరీ చంద్రబాబు …

Read More »

కేంద్రం నుంచి ఏదొచ్చినా… ఏపీదే అగ్ర తాంబూలం

కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు నుంచి విడుదలయ్యే నిధులు ఏవైనా కూడా… వాటిలో ఏపీకి అగ్ర తాంబూలం లభిస్తోంది. మొన్నటికి మొన్న కేంద్ర సాధారణ బడ్జెట్ లో అయినా… ఆ తర్వాత వచ్చిన రైల్వే బడ్జెట్ లో అయినా ఏపీకి భారీ కేటాయింపులు దక్కాయి. ఈ కేటాయింపుల్లో ఏ ఇతర రాష్ట్రంతో పోల్చినా కూడా.. ఏపీకే భారీ కేటాయింపులు లభించాయి. ఏపీకి దక్కుతున్న ప్రత్యేక కేటాయింపులను పక్కనపెట్టినా కూడా ఆయా శాఖల …

Read More »

కేసీఆర్ ఎంట్రీతో బీఆర్ఎస్ రాత మారేనా?

తెలంగాణలో ఇక రాజకీయం రసవత్తరంగా మారనుందా? విపక్ష బీఆర్ఎస్ మరింతగా చెలరేగిపోనుందా? అధికార కాంగ్రెస్ దూకుడుకు చెక్ పడిపోతుందా? క్రమంగా పుంజుకుంటున్న బీజేపీకి ఇక కష్టకాలమే రానుందా?… ఈ అన్ని ప్రశ్నలకు త్వరలోనే సమాధానం లభించనుంది. ఇందుకు కొంత సమయం పట్టినా… తెలంగాణ రాజకీయాల్లో ఓ స్పష్టమైన మార్పు అయితే కనిపించనుందని చెప్పక తప్పదు. ఎందుకంటే… 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర పెద్దగా బయటకు వచ్చిందే లేదు. …

Read More »

కులాన్ని వెలివేసి ప్రతిభకు బాబు పట్టం!

ఏపీలో గడచిన ఐదేళ్ల కాలంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన వారికి పదవులు దక్కాయి. ఇతర సామాజిక వర్గాల వారికి నిరాదరణ కరువైంది. ప్రతిభను పట్టించుకున్న నాథుడే రాష్ట్రంలో కరువయ్యాడు. ఇదేమని ప్రశ్నిస్తే.. కేసులు, అరెస్టులు స్వాగతం పలికేవి. ఈ తరహా పాలనకు విద్యకు ఆలయాలుగా ఉన్న విశ్వవిద్యాలయాలు కూడా బలి అయిపోయాయి. రాష్ట్రంలోని చాలా యూనివర్సిటీలకు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారే వైస్ ఛాన్సలర్లుగా నియమితులయ్యారు. ఫలితంగా …

Read More »

నాకు పోలీసు భద్రత కల్పించలేదు: జగన్

మీర్చికి గిట్టుబాటు ధర లేదని రైతులు వాపోతున్నారని, ఈ క్రమంలోనే గుంటూరు మార్కెట్ యార్డులో మిర్చి రైతులను పరామర్శించేందుకు పులివెందుల ఎమ్మెల్యే జగన్ పర్యటిస్తారని వైసీపీ నేతలు చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉందని, జగన్ పర్యటనకు అనుమతి లేదని పోలీసులు చెప్పారు. జగన్ సభ, ర్యాలీ చేయబోరని, కేవలం మిర్చి రైతులతో మాట్లాడారని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఎప్పటిలాగే పోలీసుల …

Read More »

మోడీ నెత్తిన ట్రంప్‌… కుంప‌టి??

గ‌త ఏడాది అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌లు జ‌రుగుతున్న స‌మ‌యం అది. ఆ స‌మ‌యంలో భార‌త విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంక‌ర్‌.. అంత‌ర్జాతీయ మీడియాకు ఇంట‌ర్వ్యూలు ఇచ్చారు. ఇవి వ‌రుస‌గా సాగాయి. ఆ ఇంట‌ర్వ్యూల్లో ప్ర‌ధానంగా అమెరికా ఎన్నిక‌ల‌పైనే ఫోక‌స్ చేశారు. “ట్రంప్ లాంటి బ‌ల‌మైన వ్య‌క్తి అధ్య‌క్షుడు అయితే.. మేలు జ‌రుగుతుంది.. అని మేం భావిస్తున్నాం.“ అని ఓ సంద‌ర్భంగా చెప్పారు. “ట్రంప్‌కే అధ్య‌క్ష ప‌గ్గాలు చేప‌ట్టే స‌త్తా.. అమెరికాను …

Read More »

ఎన్నికల్లో పోటీ చేయకుంటే ‘కోడ్’ వర్తించదా…?

రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. రెండు రాష్ట్రాల్లో ఈ ఎన్నికలు జరిగే జిల్లాల పరిధిలో ఎన్నికల కోడ్ ఎప్పుడో అమలులోకి వచ్చేసింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందు పలు కార్యక్రమాలకు హాజరు కావాలని నిర్ణయించుకున్న ముఖ్యమంత్రులు సైతం… కోడ్ అమల్లోకి రాగానే తమ షెడ్యూల్డ్ ప్రోగ్రామ్ లను సర్దబాటు చేసుకున్నారు. కొన్ని కార్యక్రమాలను అయితే ఏకంగా రద్దు చేసుకున్నారు కూడా. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందంటే… …

Read More »

జ‌గ‌న్‌కు ఇచ్చిప‌డేసిన పోలీసులు.. హాట్ కామెంట్స్‌!

వైసీపీ అధినేత జ‌గ‌న్ వివాదాల సుడిలో మునిగిపోయారు. మాజీ ఎమ్మెల్యే, కుట్ర‌, కిడ్నాప్ కేసుల్లో నిందితుడిగా జైల్లో ఉన్న వ‌ల్ల‌భ‌నేని వంశీని ప‌రామ‌ర్శించేందుకు విజ‌య‌వాడ వ‌చ్చిన జ‌గ‌న్‌.. రాజ‌కీయ వ్యాఖ్య‌ల‌తోపాటు.. పోలీసుల‌ను కేంద్రంగా చేసుకుని తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇప్పుడు వైసీపీ నేత‌ల‌పై వేదింపుల‌కు పాల్ప‌డే పోలీసుల‌ను స‌ప్త స‌ముద్రాల అవ‌త‌ల ఉన్నా.. ప‌ట్టుకుని తీసుకువ‌చ్చి బ‌ట్ట‌లూడ‌దీసి నిల‌బెడ‌తామ‌ని జ‌గ‌న్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. అంతేకాదు.. రిటైర్ అయినా.. వ‌దిలి …

Read More »

అప్పుడు టిక్కెట్టు పొందిన నాయకులు ఇప్పుడు ఎక్కడ?

వైసీపీ అధినేత జ‌గ‌న్ గ‌త ఎన్నిక‌ల‌కు ముందు.. చేసిన ప్ర‌యోగాలు విక‌టించాయి. ఎమ్మెల్యేల‌ను, ఎంపీ ల‌ను మార్పు చేయ‌డంతోపాటు.. తాను ఏరికోరి ఎంపిక చేసిన వారికి ఇచ్చిన టికెట్ల స్థానాల్లోనూ పార్టీ ఘోర ప‌రాజ‌యం పాలైంది. స‌రే.. ప్ర‌జాస్వామ్యంలో గెలుపు, ఓటములు కామ‌నే.. అనుకున్నా.. త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాలు కూడా వైసీపీకి ఏమాత్రం క‌లిసి రావ‌డం లేదు. దీంతో ప్ర‌యోగాలే కాదు.. నాయ‌కులు కూడా కొర‌గాకుండా పోయార‌న్న చ‌ర్చ అయితే …

Read More »

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఆశా జ్యోతి.. ప‌వ‌న్ క‌ల్యాణ్‌: ఉండ‌వ‌ల్లి మెరుపులు

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ మెరుపులు మెరిపించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ `ఆశాజ్యోతి` అంటూ కీర్తించారు. ప్ర‌స్తుతం ఉన్న రాజ‌కీయ నేత‌ల్లో ప‌వ‌న్ క‌ల్యాణ్ చాలా డిఫ‌రెంట్ నాయ‌కుడ‌ని చెప్పుకొచ్చారు. ఉన్న‌ది ఉన్న‌ట్టు మాట్లాడితే రాజ‌కీయాల్లో మ‌న‌లేమ‌న్న విష‌యం త‌న‌కు తెలుసున‌ని, కానీ, ప‌వ‌న్ క‌ల్యాణ్ ఉన్న‌ది ఉన్న‌ట్టు మాట్లాడి అంద‌రినీ మెప్పిస్తున్నార‌ని వ్యాఖ్యానిస్తున్నారు. తిరుప‌తి తొక్కిస‌లాట ఘ‌ట‌న‌పై ప‌ట్టుబ‌ట్టి.. మ‌రీ …

Read More »

జ‌గ‌న్ `ఇమేజ్‌` పైనా డౌటే..!

“నావ‌ల్లే మీరంతా గెలిచారు. న‌న్ను చూసే ప్ర‌జ‌లు మీకు ఓట్లేశారు“ అంటూ.. 2019 ఎన్నిక‌ల‌కు ముందు.. త‌ర్వాత కూడా వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌లు మార్లు వ్యాఖ్యానించారు. అంతేకాదు.. త‌న పాల‌న స‌మ‌యంలో నూ.. ఇదే త‌ర‌హాలో వ్య‌వ‌హ‌రించారు. త‌నను చూసే.. ప్ర‌జ‌లు వైసీపీ నేత‌ల‌ను ఆద‌రిస్థున్నార‌ని కూడా చెప్పుకొచ్చారు. దీంతో సీనియ‌ర్లు.. సీనియ‌ర్ మోస్టులు ఒకింత ఆవేద‌న చెందారు. అయినా.. జ‌గ‌న్ మాత్రం త‌న పంథాను మార్చుకోలేక పోయారు. …

Read More »

ఫేక్‌-రియ‌ల్‌ : ఒరిజినల్ వీడియోతో జ‌గ‌న్‌కు లోకేష్ కౌంటర్

వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. జైల్లో ఉన్న వ‌ల్ల‌భ‌నేని వంశీని ప‌రామ‌ర్శించారు. గ‌న్న‌వ‌రంలోని టీడీపీ కార్యాల‌యంపై జ‌రిగిన దాడిపై కేసు పెట్టి స‌త్య‌వ‌ర్థ‌న్ అనే వ్య‌క్తిని బెదిరించి, కిడ్నాప్ చేసి.. కేసును వెన‌క్కి తీసుకునేలా చేశార‌న్న అభియోగంపై ఆయ‌న‌ను పోలీసులు అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో రిమాండ్ ఖైదీగా విజ‌య‌వాడ జైల్లో వంశీ ఉన్నారు. వంశీని ప‌రామ‌ర్శించిన అనంత‌రం.. జ‌గ‌న్ మాట్లాడుతూ.. అస‌లు ఆ టీడీపీ కార్యాల‌యం కేసుకు, …

Read More »