టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు బుధవారం రాత్రి దేశ రాజధాని ఢిల్లీ చేరుకున్నారు. గురువారం మధ్యాహ్నం ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆ పార్టీ ఎమ్మెల్యే రేఖా గుప్తా చేయనున్న ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన హాజరు కానున్నారు. ఈ మేరకు బీజేపీ అధిష్ఠానం నుంచి ప్రత్యేక ఆహ్వానం అందుకున్న చంద్రబాబు… రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్నివాయిదా వేసుకుని మరీ హస్తిన వెళ్లారు. ఎన్డీఏలో బీజేపీ తర్వాత అత్యధిక సంఖ్యలో ఎంపీలున్న పార్టీగా …
Read More »బ్రేకింగ్: జగన్ పై పోలీస్ కేసు!
మన దేశంలో నివసిస్తున్న పౌరులు ఎవరైనా సరే భారత రాజ్యాంగాన్ని గౌరవించాల్సిందే. భారత దేశంలో అమలవుతున్న చట్టాలను, నియమనిబంధనలను ప్రధాని మొదలు సామాన్యుడి వరకు అందరూ పాటించాల్సిందే. అయితే, ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత, ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్న జగన్ మాత్రం ఈ చట్టాలు తనకు వర్తించవు అన్నరీతిలో వ్యవహరిస్తున్న వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో జగన్ …
Read More »అదికారంపై కేసీఆర్, కేటీఆర్ ఏమన్నారంటే…!
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ల మాటల్లో తేడా రావడం.. పార్టీ నేత లను అయోమయానికి గురి చేసింది. “ఆరు నూరైనా అధికారం మనదే. త్వరలోనే బై పోల్స్ రానున్నాయి“ అని మాజీ సీఎం కేసీఆర్ గట్టిగా చెప్పారు. అంతేకాదు.. పార్టీ తరఫున ప్రజల మద్యకు కూడా వెళ్లాలని చెప్పారు. పార్టీ సిద్ధాంతాలను, తెలంగాణ ఉద్యమాన్ని, అస్తిత్వాన్ని కూడా ప్రజలకు …
Read More »కేసీఆర్ అమెరికా టూర్ పక్కా… ఎన్నెన్ని విశేషాలో..?
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు త్వరలోనే అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ మేరకు కేసీఆర్ ఆమెరికా పర్యటనపై బుధవారం ఓ క్లారిటీ అయితే వచ్చింది. విదేశీ పర్యటనలు అంటే అంతగా ఆసక్తి చూపని కేసీఆర్.. తన మనవడు, మనవరాళ్ల కోసం ఇప్పుడు అమెరికా ఫ్లైట్ ఎక్కబోతున్నారు. కేటీఆర్ కుమార్తె అలేఖ్యకు ఇటీవలే అమెరికాలో చదివేందుకు సీటు వచ్చిందట. ఆమెను కళాశాలలో చేర్పించేందుకు కేసీఆర్ అమెరికా వెళుతున్నట్లు …
Read More »ఇకపై ఎక్కడికెళ్లినా… ముందు కేడర్ తోనే లోకేశ్ భేటీ
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ బుధవారం ఓ కీలక అంశాన్ని ప్రస్తావించారు. ఇకపై తాను నియోజకవర్గాల పర్యటనకు వస్తే… ముందుగా ఆయా నియోజకవర్గాల కార్యకర్తలు, నేతలతో సమన్వయ సమావేశం నిర్వహిస్తానని ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమం పూర్తి అయిన తర్వాతే మిగిలిన కార్యక్రమాలు ఉంటాయన్న లోకేశ్… ఆ తర్వాతి కార్యక్రమాలు ఎంత ప్రాధాన్యత కలిగినవైనా కూడా ముందుగా మాత్రం కేడర్ తోనే భేటీ ఉంటుందని …
Read More »కుల గణన ఎఫెక్ట్… రేవంత్ గ్రాఫ్ పెరిగినట్టేనా?
దక్షిణాది రాష్ట్రాల్లో కులగణనను పూర్తి చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రెండు రాష్ట్రాల్లో కర్ణాటక ముందున్నా.. అక్కడ పూర్తిస్థాయిలో కులగణన పూర్తి కాలేదు. కానీ, తెలంగాణలో మాత్రం.. దీనిని పట్టుబట్టి ముందుకు నడిపించారు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి మంచిమార్కులే పడ్డాయి. పడుతున్నాయి. కేంద్రంలోని బీజేపీ దీనికి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ.. రేవంత్ రెడ్డి దూకుడుగానే ముందుకు సాగారు. అనుకున్న విధంగా ఆఘమేఘాలపై కుల గణన …
Read More »ప్రెస్‌మీట్‌లు పెట్టి పురాణాలెందుకు? దమ్ముంటే..: షర్మిల
వైసీపీ అధినేత, తన సోదరుడు జగన్‌పై కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. తాజాగా జగన్.. జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పరామర్శించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కూటమి సర్కారుపైనా.. చంద్రబాబుపైనా విమర్శలు గుప్పించారు. దీనిని ఉటంకిస్తూ.. షర్మిల విమర్శలు చేశారు. ప్రజల సమస్యలను ప్రస్తావించేందుకు అసెంబ్లీ కి వెళ్లే తీరిక లేని జగన్.. అండ్ కో.. జైలుకు వెళ్లి జైలు …
Read More »పోలీసు కస్టడీ అంటే ‘థర్డ్ డిగ్రీ’నేనా..?
ఏదైనా కేసులో నిందితుడు నిజాలు చెప్పకుంటే… వారి నుంచి నిజాలు రాబట్టేందుకు వారిని తమ కస్టడీకి అప్పగించాలంటూ పోలీసులు కోర్టులను కోరుతూ ఉంటారు. ఇలాంటి కొన్ని సందర్భాల్లో నిందితులను పోలీసు కస్టడీకి అనుమతిస్తూ కోర్టులు తీర్చులు చెబుతూ ఉంటాయి. మరికొన్ని కేసుల్లో కస్టడీ అవసరం లేదని కూడా కోర్టులే చెబుతుంటాయి. అయితే పోలీసు కస్టడీ అంటే…నిందితులను పోలీసులు కొట్టి మరీ నిజాలు రాబడతారన్న వాదనలు ఇటీవలి కాలంలో ఎక్కువైపోయాయి. అది …
Read More »ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా డిప్యూటీగా పర్వేశ్…
దేశమంతా ఆసక్తి రేకెత్తించిన ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరన్న ఉత్కంఠను తెర పడిపోయింది. ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ఎంపికయ్యారు. ఈ మేరకు బుధవారం రాత్రి సమవేశమైన బీజేఎల్పీ భేటీలో ఇటీవలి ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలిచిన వారంతా ఏకగ్రీవంగా రేఖా గుప్తాను సీఎంగా ఎన్నుకున్నారు. మొన్నటి ఎన్నికల్లో ఢిల్లీలోని షాలిమార్ భాగ్ నియోజకవర్గం నుంచి గుప్తా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దాదాపుగా 15 రోజుల సుదీర్ఘ కసరత్తు తర్వాత రేఖాను బీజేపీ …
Read More »నేతలకు టార్గెట్లు : కేసీఆర్ పొలిటికల్ స్ట్రాటజీ!
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్.. మరోసారి సెంటిమెంటునే నమ్ముకుంటున్నారు. తెలంగాణ ఉద్యమం.. నాటి పరిస్థితులు.. తెలంగాణ వారికి జరిగిన అవమానాలను ఆయన మరోసారి తెరమీదికి తీసుకురావడం ద్వారా.. ప్రజలను తనవైపు తిప్పుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా జరిగిన బీఆర్ ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు.. పార్టీ నాయకులకు చేసిన దిశానిర్దేశం వంటివి పక్కాగా సెంటిమెంటు దిశగానే మాజీ సీఎం అడుగులు …
Read More »తెలుగు రాష్ట్రాలకు నిధులు… మాపై వివక్ష: తెలంగాణ!
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం విపత్తుల సహాయ నిధులు విడుదల చేసింది. ఏపీ, తెలం గాణ సహా మొత్తం ఐదు రాష్ట్రాల(త్రిపుర, ఒడిశా, నాగాలాండ్)కు ఈ నిధులను విడుదల చేసింది. ఏపీకి 606 కోట్ల రూపాయలను విడు దల చేసిన కేంద్రం.. తెలంగాణకు మాత్రం 231 కోట్ల రూపాయలను మాత్రమే ఇచ్చింది. ఈ నిధులను విపత్తుల నిర్వహణ, ప్రజల పునరావాసానికి మాత్రమేకేటాయించాలని తేల్చి చెప్పింది. అంతేకాదు.. ఈ నిధులను …
Read More »ఫిట్ గురూ : విద్యార్థులతో షటిల్ ఆడిన లోకేష్!
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి , ఏపీ మంత్రి నారా లోకేశ్ రాజకీయంగా, పాలనా పరంగా సత్తా చాటుతున్నారు. 42 ఏళ్ల వయసుకే పార్టీకి రికార్టు విక్టరీ అందించిన లోకేశ్.. గతంలో ఎన్నడూ లేనంత మెజారిటీని చేజిక్కించుకున్నారు. తనతో కలిసి బరిలోకి దిగిన జనసేన, బీజేపీలకు కూడా రికార్డు విజయాలను అందించి అన్ని పార్టీల దృష్టిని ఆకర్షించారు. పాలనలో సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టిన లోకేశ్.. తనదైన మార్కును చూపుతున్నారు. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates