ఏ పార్టీకైనా.. నాయకుడికైనా నాయకులు ముఖ్యమే..వారిని ఊరడించాల్సిందే.. బుజ్జగించాల్సిందే.. కష్టంలో ఉంటే.. కాపాడుకోవాల్సిందే. ఏ పార్టీ అయినా చేసేది ఇదే. అయితే.. వీరితోపాటు.. నాయకులకు.. పార్టీలకు కావాల్సింది.. ప్రజలు. వారు ఓటేస్తేనే… ఏ పార్టీ అయినా ఎన్నికల్లో విజయం దక్కించుకుంటుంది. అధికారం దక్కించుకుంటుంది. ఈ విషయంలో వైసీపీ అధినేత జగన్ పదిమాసాలు పూర్తయినా.. ప్రజల కోసం పనిచేస్తున్నట్టు కనిపించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.
నాయకుల కోసం బయటకు వస్తున్న జగన్.. ప్రజల సమస్యలపైనా.. వారితరఫున వాదన వినిపించే విషయంలోనూ బయటకు రాకపోవడాన్ని అన్ని వర్గాలు చర్చిస్తున్నాయి. ఇది ఒకరకంగా.. ఆయన కూటమి సర్కారుకు మంచి మార్కులు వేస్తున్నట్టుగానే భావిస్తున్నాయి. సాధారణంగా.. ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు ప్రజల మధ్యకు వచ్చాయంటేనే.. ప్రభుత్వంలో లోపాలు ఉన్నాయని గ్రహించాలి. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ప్రజలకు వ్యతిరేకంగా ఉంటేనే ప్రతిపక్షాలు.. బయటకు వస్తాయి.
ఇది సాధారణంగా ప్రజాస్వామ్యంలో ఉన్న కీలక సూత్రం. ఇలా చూసుకుంటే.. జగన్ బయటకు రావడమే లేదు. కనీసం.. ప్రభుత్వాన్ని ప్రశ్నించడమూ లేదు. సో.. ఈ పరిణామాలను బట్టి.. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం బాగానే పనిచేస్తోందన్న భావన వ్యక్తమవుతోంది. జగన్ వంటి ప్రతిపక్ష నాయకులు సైతం మౌనంగా ఉన్నారని అంటే.. కూటమి సర్కారుకు మంచి మార్కులు వేసినట్టే కదా? అనే చర్చ కూడా జరుగుతోంది. గతంలో వైసీపీ పాలనను తప్పుబడుతు.. టీడీపీ అధినేత చంద్రబాబు మూడు మాసాలకే బయటకు వచ్చారు.
కానీ, ఇప్పుడు మాత్రం 10 మాసాలు అయిపోయినా.. జగన్ బయటకు రాలేదు. పైగా.. ఎక్కడా ప్రజల కోసం ఆయన రోడ్డెక్కడం లేదు. పార్టీ నాయకులను సరిదిద్దుకునే క్రమంలోనే ఉన్నారు. కాబట్టి.. ఈ పరిణామం కూటమి ప్రభుత్వానికి కలిసి వచ్చిన అంశంగా పేర్కొంటున్నారు. అన్నిరూపాల్లోనూప్రజలకు కూటమి ప్రభుత్వం మంచి చేస్తోందన్న భావన కూడా వ్యక్తమవుతోంది. అందుకే జగన్ మౌనంగా ఉంటున్నారా? అని మేధావులు ప్రశ్నిస్తుండడం గమనార్హం. ఏదేమైనా.. ప్రస్తుతం కూటమి సర్కారుకు ఎదురు లేకుండా పోయిందన్నది చర్చ.
Gulte Telugu Telugu Political and Movie News Updates