Political News

కొడాలి నాని ఎక్కడ?… ఫోన్లూ స్విచ్చాఫ్ అయ్యాయా?

మొన్నటి సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సందర్భంగా తుది ఫలితం వెలువడక ముందే కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోతున్న గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి శ్రీవేంకటేశ్వరరావు అలియాస్ నాని దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఆ తర్వాత ఆయన కనిపించిన దాఖలానే లేదని చెప్పాలి. గడచిన 8 నెలలుగా గుడివాడకు దూరంగానే ఉంటున్న నాని… ఎప్పుడన్నా అవసరం అయితే తప్పించి గుడివాడకు రాలేదు. అలా వచ్చిన సందర్భాల్లోనూ చడీచప్పుడు లేకుండా వచ్చిన …

Read More »

అన్ని రాష్ట్రాల రాజధానుల్లో వెంకన్న ఆలయాలు: చంద్రబాబు

కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి పాదాల చెంత తిరుపతి నగరం సోమవారం మహా కుంభ ఆప్ టెంపుల్స్ పేరిట ప్రారంభమైన సదస్సుతో ప్రత్యేక శోభను సంతరిచుకుంది. ఈ సభా వేదికగా టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఓ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల్లో తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయాలను ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. అంతేకాకుండా తెలుగు ప్రజలు ఎక్కువగా నివసించే ఇతర …

Read More »

ఎనిమిది నెల‌లు.. ఎనిమిది విజ‌యాలు: బాబు ఏమ‌న్నారంటే!

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం పాల‌న ప్రారంభించి.. 8 నెల‌లు పూర్త‌యింది. వాస్త‌వానికి ఎనిమిది నెల‌లు పెద్ద ఎక్కువ కాలం కాక‌పోయినా.. సీనియ‌ర్ సీఎం, 14 ఏళ్ల అనుభ‌వం ఉన్న నాయ‌కుడు కావ‌డంతో స‌హ‌జంగానే చంద్ర‌బాబుపై ఆస‌క్తి ఉంటుంది. అదే ప్ర‌జ‌ల్లోనూ నెల‌కొంది. అభివృద్ది బాట‌లో న‌డిపించాల‌ని ఏపీని తిరిగి గాడిలో పెట్టాల‌ని భావించిన ప్ర‌జ‌లు.. చంద్ర‌బాబు నేతృత్వంలోని కూట‌మికి ప‌ట్టం క‌ట్టారు. ఈ నేప‌థ్యంలో తాజాగా జ‌రిగిన టెలీకాన్ఫ‌రెన్స్‌లో ఆయా …

Read More »

ఆ ‘ఒక్క‌టీ’ ఏమైంది? మంత్రుల‌కు బాబు క్లాస్‌!

ఏపీలో అందుబాటులో ఉన్న మంత్రుల‌తో సీఎం చంద్ర‌బాబు తాజాగా టెలికాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. కొంద‌రు మంత్రులు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుపై ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఆ ఒక్క‌టి ఏమైంది? అంటూ.. ఉభ‌య గోదావ‌రి జిల్లాల‌కు చెందిన మంత్రులు, నాయ‌కుల‌ను ఉద్దేశించి.. చంద్ర‌బాబు ప్ర‌శ్నించిన‌ట్టు స‌మాచారం. ప్ర‌స్తుతం ఎమ్మెల్సీ ఎన్నిక‌ల పోలింగుకు స‌మ‌యం చేరువ అవుతుండ‌డం.. నేత‌లు ఎంత చెప్పినా.. స్పందించ‌క‌పోవ‌డంతో చంద్ర‌బాబు ఫైరైన‌ట్టు తెలిసింది. “ఐక్యంగా ఉండాల‌ని.. …

Read More »

మ‌హిళ‌పై దాడి.. కోర్టులో లొంగిపోయిన వైసీపీ మాజీ ఎంపీ

వైసీపీ కీల‌క నాయ‌కుల‌ను కేసులు వెంటాడుతున్నాయి. ఒక కేసు నుంచి బ‌య‌ట ప‌డ్డామ‌ని అనుకుంటే… వారు చేసిన త‌ప్పు లు మ‌రిన్ని కేసుల రూపంలో నాయ‌కుల‌ను వెంటాడుతున్నాయి. ఇటీవ‌లి వ‌ర‌కు జైల్లో ఉండి.. కొన్నాళ్ల కింద‌టే బెయిల్‌పై బ‌య‌ట‌కు వ‌చ్చిన బాప‌ట్ల మాజీ ఎంపీ.. ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన నందిగం సురేష్ తాజాగా మ‌రో కేసులో చిక్కుకున్నారు. ఈ నేప‌థ్యంలో తానే స్వ‌యంగా గుంటూరు జిల్లా స‌త్తెన‌ప‌ల్లిలోని జూనియ‌ర్ …

Read More »

వైసీపీ సీనియర్ నోట ‘శభాస్ లోకేశ్’ మాట!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ రాజకీయాల్లో రాటుదేలి పోతున్నారు. ఇటు రాజకీయాల్లోనే కాకుండా అటు ప్రజా పాలనలోనూ లోకేశ్ దూసుకుపోతున్నారు. 23 ఎమ్మెల్యే, 3 ఎంపీ సీట్లకు పరిమితమైపోయిన టీడీపీ యువగళం పేరిట చేపట్టిన తన పాదయాత్రతో ఏకంగా 135 ఎమ్మెల్యే, 18 ఎంపీ సీట్లు కలిగిన పార్టీగా లోకేశ్ మార్చడంలో సఫలీకృతం అయ్యారు. లోకేశ్ లో కనిపించిన ఈ ట్రాన్స్ ఫార్మేషన్ ను …

Read More »

పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభ

ప్రజల తరఫున ప్రశ్నించేందుకు జనసేన పార్టీని 11 సంవత్సరాల క్రితం జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్థాపించారు. పార్టీ పెట్టిన తర్వాత ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ప్రతికూల పరిస్థితులను తట్టుకొని నిలబడ్డారు పవన్. టీడీపీ, బీజేపీలతో కలిసి గత ఎన్నికల్లో అఖండ విజయం సాధించారు. 100 శాతం స్ట్రైక్ రేట్ తో తన పార్టీ తరఫున అందరినీ గెలిపించుకున్న పవన్ కల్యాణ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా తన వంతు పాత్రను …

Read More »

మోడీకి `ప‌రువు` ప్ర‌శ్న‌.. ప్ర‌పంచ దేశాల కామెంట్‌!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీకి ప్ర‌పంచ దేశాల్లో భారీ ఎత్తున ప్ర‌చారం ఉన్న విష‌యం తెలిసిందే. ఆయనను అనేక దేశాలు మెచ్చుకోవ‌డం.. అనేక దేశాలు ఫాలో అవ‌డం కూడా ఇటీవ‌ల కాలంలో తెర‌మీదికి వ‌స్తున్నాయి. అలాంటి మోడీకి ఇప్పుడు పరువు ప్ర‌శ్న‌గా మారింది. ప్ర‌పంచ దేశాల నుంచే ఈ సెగ ఉత్ప న్నం కావ‌డం గ‌మ‌నార్హం. రెండు కీల‌క విష‌యాల్లో ప్ర‌ధాని ప్ర‌ధానంగా ఇబ్బందుల పాలవుతున్నారు. అగ్ర‌రాజ్యం అమెరికా అధ్య‌క్షుడు …

Read More »

“ఈ 5 ఏళ్లు రేవంత్ గారు సిఎం, వచ్చేరోజుల్లో బీసీలే సిఎం” : మహేష్

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పదవిపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఏర్పాటు చేసిన సమావేశం వేదికగా రేవంత్ సీఎం పదవితో పాటుగా భవిష్యత్తులో బీసీలకు దక్కనున్న ప్రాధాన్యతపై కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఐధేళ్లు రేవంతే సీఎంగా కొనసాగుతారని వ్యాఖ్యానించిన మహేశ్… ఈ ఐదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తే… …

Read More »

“కేసీఆరే మళ్లీ రావాలి, సీఎం కావాలి” : కేటీఆర్!

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు 71వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ కు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు తదితరులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలోనే తెలంగాణ భవన్‌లో నిర్వహించిన కేసీఆర్ జన్మదిన వేడుకలలో పాల్గొన్న కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. …

Read More »

జ‌గ‌న్ చేసిన పాపాల‌కు 25 వేల కోట్లు క‌ట్టాం: లోకేష్‌

వైసీపీ అధినేత, మాజీ సీఎం జ‌గ‌న్‌పై మంత్రి నారా లోకేష్ విమ‌ర్శ‌లు గుప్పించారు. జ‌గ‌న్ అధికారంలో ఉన్న‌ప్పుడు చేసిన అప్పుల పాపాల‌కు ప‌రిహారంగా వ‌డ్డీ రూపంలో త‌మ ప్ర‌భుత్వం సుమారు 25 వేల కోట్ల‌రూపాయ‌ల‌ను చెల్లించింద‌ని ఆయ‌న పేర్కొన్నారు. అదే ఆయ‌న అప్పులు చేయ‌క‌పోయి ఉంటే.. ఈ సొమ్మును ప్ర‌జ‌ల‌కు పంచేవారి మ‌ని కూడా నారా లోకే పేర్కొన్నారు. ఒక్క ఛాన్స్ పేరుతో ఐదేళ్ల పాల‌న చేసిన జ‌గ‌న్ రాష్ట్రాన్ని …

Read More »

సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన కూటమి సర్కారు

టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు అధికారంలోకి వచ్చినంతనే… వైసీపీ హయాంలో ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ తొలగిస్తారంటూ ప్రచారం సాగింది. సచివాలయాలకు అనుబంధంగా పనిచేస్తున్న వాలంటీర్ వ్యవస్థను తొలగించినట్లుగానే సచివాలయ ఉద్యోగులను కూడా ఇంటికి పంపుతారంటూ జోరుగా ప్రచారం సాగింది. ఈ క్రమంలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు తీవ్ర ఆందోళనలో కూరుకుపోయారు. వాలంటీర్ల మాదిరిగా తామేమీ వైసీపీ నేతలు ఎంపిక చేసిన వారం కాదని, …

Read More »