ఒక ఘటన ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకునేలా చేసింది. అదే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే, బీఆర్ ఎస్ నాయకురాలు లాస్య నందిత ఘోర రోడ్డు ప్రమాద ఘటన. పటాన్చెరు ఓఆర్ ఆర్ రోడ్డుపై జరిగిన దుర్ఘటనలో లాస్య నందిత అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేసింది. ఈ ప్రమాదానికి ప్రధాన కారణం.. డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడని.. అతి వేగమే కారణమని పోలీసులు నిర్ధారించారు. ఏదేమైనా.. ఎమ్మెల్యేగా …
Read More »పంపకాలు కొలిక్కి.. ప్రచారానికి సై!
టీడీపీ-జనసేన పార్టీల మధ్య సీట్ల పంపకాలు దాదాపు ఒక కొలిక్కి రావడంతో ఇక, ఎన్నికల ప్రచారానికి ఈ రెండు పార్టీలూ సర్వ సన్నద్ధం అవుతున్నాయి. ఈ క్రమంలో ఈ నెల 28న ఉమ్మడి పశ్చిమ గోదావరి నుంచి ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరిం చేందుకు సిద్ధమయ్యారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెంలో నిర్వహించే తొలి ఉమ్మడి ఎన్నికల ప్రచార సభను గ్రాండ్గా నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. ఇక్కడ నుంచి …
Read More »మిత్రపక్షం ‘మహిళా కోటా’ ఇదీ..!
రాజకీయాల్లో మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్న పార్టీలు తగ్గిపోతున్నాయి. కానీ… పైకి మాత్రం 33 శాతం రిజర్వేషన్ అమలు కావాల్సిందేనని మాటల తూటాలు పేల్చుతున్నాయి. క్షేత్రస్థాయిలో కార్యాచరణకు వచ్చే సరికి మాత్రం.. ఇది సాధ్యం కాని పరిస్థితి నెలకొంది. సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉండడమో.. లేక.. మహిళలకు ఇస్తే.. పురుష అభ్యర్థులకు కోపం వస్తుందనో.. కారణం ఏదైనా కూడా.. టికెట్ల విషయానికి వచ్చే సరికి మాత్రం చేతులు ఎత్తేస్తున్నారు. తాజాగా టీడీపీ-జనసేన …
Read More »ఎస్సీ నియోజకవర్గాల్లో తడబాటు సెలక్షన్!
ఎస్సీ నియోజకవర్గంలో లైన్ క్లియర్ అయినట్టు కనిపిస్తోంది. తాజాగా ప్రకటించిన టీడీపీ-జనసేన జాబితాను చూసిన తర్వాత.. ఎవరైనా ఇదే అనుకుంటారు. ఎందుకంటే.. టీడీపీ పలు నియోజకవర్గాల్లో సామాజిక సమీకరణలు మార్చేసింది. అదేసమయంలో యువతకు ప్రాధాన్యం ఇచ్చింది. దీంతో ఆయా నేతలు.. సామాజిక వర్గాలను బలంగా ఎదుర్కొనేలా టీడీపీ-జనసేనలు పెద్ద ఎత్తున కసరత్తు చేస్తాయని అందరూ అనుకున్నారు. ఉదాహరణకు సింగమనల ఎస్సీ నియోజకవర్గంలో ఆరోపణలు వచ్చాయనే వాదనలో సిట్టింగ్ ఎమ్మెల్యే జొన్నలగడ్డ …
Read More »వైసీపీ జంపింగుల్లో ఒక్కరికే చోటు!
వైసీపీ నుంచి బయటకు వచ్చి.. టీడీపీలో చేరిన వారిలో కేవలం ఒక్కరికి మాత్రమే తాజాగా ప్రకటించిన టీడీపీ జాబితాలో చోటు దక్కడం గమనార్హం. వైసీపీ నుంచి గత ఏడాది నలుగురు ఎమ్మెల్యేలు రెబల్స్గా మారి.. టీడీపీ చెంతకు చేరుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగుకు పాల్పడ్డారని పేర్కొంటూ.. వైసీపీ వారిపై సస్పెన్షన్ వేటు వేసింది. వీరిలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఇదే జిల్లాకు చెందిన వెంకటగిరి …
Read More »కీలక నియోజకవర్గాల్లో పంక్చర్లు తప్పవా?
తాజాగా ప్రకటించిన టీడీపీ-జనసేన అభ్యర్థుల జాబితాల విషయంలో రచ్చ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. కొన్ని కొన్ని స్థానాలను ఆశావహులకే కేటాయించినా.. మరికొన్ని కీలక నియోజకవర్గాల్లో మాత్రం ముఖ్య నేతలకు మొండి చేయి చూపించారు. దీంతో ఆయా స్థానాల్లో అసమ్మతి తెరమీదికి రావడం ఖాయమనే వాదన వినిపిస్తోంది. ఉదాహరణకు, తెనాలి, రాజమండ్రి రూరల్, కళ్యాణదుర్గం వంటి నియోజకవర్గాల్లో టీడీపీ నేతల పరిస్థితి డోలాయమానంలో పడింది. తెనాలి నియోజకవర్గంలో మాజీ మంత్రి ఆలపాటి …
Read More »పవన్ కే షాకిచ్చారా ?
జనసేన నేతలు అధినేత పవన్ కల్యాణ్ కే షాకిచ్చారా ? అవుననే అంటున్నాయి పార్టీవర్గాలు. విషయం ఏమిటంటే మూడురోజుల క్రితం విశాఖపట్నంలో భీమిలి, యలమంచిలి, పెందుర్తి, గాజువాక నియోజకవర్గాలకు సమన్వయకర్తలను పవన్ ప్రకటించినట్లు విపరీతంగా ప్రచారం జరిగింది. ఆ ప్రచారాన్నే నిజమని నమ్మిన మీడియా కూడా విస్తృతంగా ప్రచారం కల్పించింది. మీడియాలో వచ్చిన వార్తలు చూసి పవన్ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారట. కారణం ఏమిటంటే పవన్ అసలు ఎవరినీ …
Read More »ఫస్ట్ లిస్ట్ పై చంద్రబాబు ఫస్ట్ కామెంట్
టీడీపీ-జనసేన కూటమి అభ్యర్థుల తొలి జాబితాను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంయుక్తంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల జాబితా ప్రకటించిన తర్వాత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో అభ్యర్థుల జాబితాపై ఎన్నడూ చేయనంత కసరత్తు చేశామని, వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా ఈ జాబితాను రూపొందించామని చంద్రబాబు అన్నారు. జగన్ వల్ల ఏపీ బ్రాండ్ …
Read More »టీడీపీ-జనసేన తొలి జాబితా.. వైసీపీ రియాక్షన్ విన్నారా?
తాజాగా టీడీపీ-జనసేన తొలిజాబితా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రత్యర్థి పక్షం వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుంది? ఏ విధంగా స్పందిస్తుంది? ఏ కామెంట్లు చేస్తుంది? అనేది సర్వత్రా ఉత్కంఠ.. ఆసక్తి కూడా. మరి వైసీపీ ఏమందో చదివేయండి! తాజాగా వైసీపీ కీలక నాయకుడు, ప్రభుత్వ సలహాదారు.. సజ్జల రామకృష్ణారెడ్డి తాజాగా ప్రకటించిన జాబితాపై రియాక్ట్ అయ్యారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ను చూస్తే జాలేస్తోంది. జనసేన అభ్యర్థుల …
Read More »24 అని 5 సీట్లనే ప్రకటించి.. జనసేన తప్పు చేసిందా?
తప్పు.. ఎక్కడ చేసినా పర్వాలేదు. సరిదిద్దుకోవచ్చు. కానీ, బలమైన ప్రత్యర్థి పార్టీ వైసీపీ ఉండగా.. తప్పు లు చేస్తే.. అవి కాస్తా ప్రజల్లోకి వెళ్తే.. కొంపే మునుగుతుంది. మరి ఈ విషయం ఆలోచించారో లేదో తెలియదు కానీ.. జనసేన ఇప్పుడు పెద్ద తప్పేచేసిందని అంటున్నారు పరిశీలకులు. వచ్చే ఎన్నికలకు సంబంధించి టీడీపీ-జనసేన కూటమని.. తాజాగా అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో 24 చోట్ల జనసేన పోటీ …
Read More »10 గెలిపించుంటే 60 సీట్లు అడగొచ్చు: పవన్
రాబోయే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమి తరఫున పోటీ చేయబోతోన్న అభ్యర్థుల జాబితాను ఈరోజు ప్రకటించిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల జాబితా ప్రకటన తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సిద్ధం అని జగన్ అంటున్నారని, తాయు యుద్ధానికి సంసిద్ధం అయ్యామని పవన్ అన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండేందుకే తాము పోరాడుతున్నామని పవన్ చెప్పారు. 60 నుంచి 70 సీట్లలో పోటీ చేయాలని తనతో చాలామంది పెద్దలు …
Read More »మాజీ మంత్రి గంటా ఎక్కడ?
తాజాగా ప్రకటించిన టీడీపీ తొలి అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పేరు కనిపించలేదు. విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన.. పేరు..తాజా జాబితాలో లేకపోవడంతో ఆయనకు ఎక్కడ టికెట్ ఇస్తారనే చర్చ జోరుగా సాగుతోంది. నిజానికి ఆయన విశాఖ పరిధిలోని భీమిలి లేదా పెందుర్తి నుంచి టికెట్ కావాలని కోరుతున్నారు. అయితే.. రెండు రోజుల నుంచి ఆయన పేరు విజయనగరం జిల్లా చీపురుపల్లి …
Read More »